458.txt 2.2 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18
మత్స్యాసనం

https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%82

మత్స్యాసనం (సంస్కృతం: मत्स्यसन) యోగాలో ఒక విధమైన ఆసనం.
నీటిలో ఈదే చేపను పోలి ఉండటం వల్ల దీనికి మత్స్యాసనమని పేరు వచ్చింది.
ముందు పద్మాసనం వెయ్యాలి.
పద్మాసనంలో ఉండగానే వెల్లకిలా పడుకొని తల నేలపై ఆనించి వీపును పైకి లేపాలి.
రెండు చేతులతో కాలి బొటనవ్రేల్లను పట్టుకొని మోచేతులను నేలపై ఆనించాలి.
కొంతసేపు శ్వాసను ఊపిరితిత్తులలో ఆపి వుంచాలి.
తరువాత చేతులపై బరువుంచి మెల్లగా పైకి లేచి, పద్మాసనంలో కొంతసేపు కూర్చొవాలి.
ఈ ఆసనం వల్ల మెడకు, ఊపిరితిత్తులకు, పొట్టలోని అవయవాలకు చాలా మేలు కలుగుతుంది.
ఛాతీ పరిమాణం పెరుగుతుంది.
ఊపిరితిత్తులు తాజా ప్రాణవాయువును పీల్చు ఉంచుకునేలా తమ సామర్థ్యతను పెంచుకుంటాయి.
మీ వెన్ను, మెడ ప్రాంతాలు విస్తరించడం వల్ల మరింత అనుకూల స్థితిలో ఉంటాయి.
వెన్నెముక బలిష్టంగా తయారవుతుంది.
సరైన స్థితిలో కూర్చోకపోవడం అనే అలవాటునుంచి వెన్ను వంపు భాగాలు సరిదిద్దబడతాయి.