వక్రాసనంhttps://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%82వక్రాసనం యోగాలో ఒక విధమైన ఆసనం.నేలమీద నిటారుగా కూర్చుని కాళ్ళు తిన్నగా చాపండి.ఒక కాలిని మడిచి పక్కకి తీసి దాని పాదం మరో మోకాలి పక్కన వచ్చేలా పెట్టాలి.ఏ కాలైతే వంచామో దానికి వ్యతిరేకంగా ఉన్న చేతిని కాలిమీదుగా పెట్టి పాదాన్ని పట్టుకోవాలి.వీలైనంత వరకు నడుమును అటువైపుగా తిప్పాలి,ఇదే మాదిరిగా రెండవ కాలిని మడిచి మరల అదే విధంగా చేయిని, నడుమును తిప్పాలి,ఇలా కనీసం మూడు సార్లు కుడి వైపు, మూడు సార్లు ఎడమ వైపు తిప్పాలి.వక్రాసనం వేయడం వలన, అర్ధ మత్స్యేంద్రాసనం సులభంగా వేయగలుగుతారు.ఈ ఆసనం వేయడం మూలంగా కాలేయం, ప్లీహం, చిన్న ప్రేగుల పనితీరును బాగుచేస్తుంది.మెడ, భుజాలకు సంబంధించిన కండరాల నొప్పులు, ఇతర సమస్యలు పోతాయి.నడుం దగ్గర కొవ్వు కరుగుతుంది.