464.txt 2.62 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23
వజ్రాసనము

https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%9C%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81

వజ్రాసనము (సంస్కృతం: वज्रासन) యోగాలో ఒక విధమైన ఆసనము.
సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్థం.
వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు.
తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది.
పద్మాసనం రానివారికి ఈ ఆసనం ధ్యానానికి ఉపయోగపడుతుంది.
క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది.
తొలుత సుఖాసన స్థితిని పొందాలి
నిటారుగా కూర్చోవాలి.
రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి.
ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి లాక్కోవాలి.
వాటిని ఆసనానికి ఇరువైపులా చేర్చాలి.
పాదం కింది భాగం (అరికాలు) పైకి కనపడేలా ఉంచుకోవాలి.
మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి.
పైకి కనపడేలా పెట్టుకున్న పాదం కింది భాగంపై ఆసనాన్ని ఉంచాలి.
వెనుకభాగం వైపున్న రెండు కాలి వేళ్ల మొనలు సరిసమానంగా ఉండాలి.
అలాగే రెండు మోకాళ్లు ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి.
రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచాలి.
తలపైకెత్తి సూటిగా ముందుకు చూడాలి.
వజ్రాసనంలో ఉన్నంతసేపూ నిటారుగా ఉండాలి.