469.txt 3.79 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21
శీర్షాసనము

https://te.wikipedia.org/wiki/%E0%B0%B6%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81

శీర్షాసనము (సంస్కృతం: शीर्षसन) యోగాలో ఒక విధమైన ఆసనము.
తలక్రిందులుగా అంటే తలను నేలపై ఆనించి కాళ్ళను పైకెత్తి చేసే ఆసనం కాబట్టి దీనికి శీర్షాసనమని పేరు వచ్చింది.
ఆసనాలలోకెల్ల ఉత్తమమైనది కనుక 'రాజాసనం' అని కూడా పిలుస్తారు.
నేలపై పలుచని దూది పరుపును గాని, మెత్తని తువ్వాలును నాలుగు మడతలుగా పరచి రెండు చేతులపై బరువు మోపి తల భాగాన్ని నేలపైన ఆనించాలి.
రెండు కాళ్లను కలిపి మెల్లగా పైకి ఎత్తాలి.
నడుము చక్కగా వచ్చేవరకు కాళ్ళను నేలపైనే ఉంచి చేతులపై బరువుంచి కాళ్ళను పైకి ఎత్తాలి.
పిక్కలు, తొడలు, నడుము, వీపు చక్కగా ఉండేటట్లు జాగ్రత్తపడాలి.
కొద్దికాలం తరువాత మెల్లగా కాళ్ళు క్రిందికి దించాలి.
ఈ ఆసనం తర్వాత పద్మాసనంలో విధిగా విశ్రాంతి తీసుకోవాలి.తలలో ఉన్న పియూష గ్రంధి, పీనియల్ గ్రంధులను ఉత్తేజపరచి, మిగతా గ్రంధుల సామర్ధ్యాన్ని పెంచడం వల్ల దేహంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
తలలోని జ్ఞానేంద్రియా లన్నింటికి రక్తప్రసారం తగిన మోతాదులో లభించడం వలన అవన్నీ సక్రమంగా పనిచేస్తాయి.
ఊపిరితిత్తులకు, గుండెకు రక్తప్రసారం సక్రమంగా జరుగడం వల్ల అవి ఆరోగ్యవంతంగా ఉంటాయి.మొదట కళ్ళు ముసుకొని శీర్షాసనం అభ్యాసం చేయాలి.
కళ్ళకు రక్తప్రసారం అధికంగా ఉండటం వలన అవి ఎర్రబడటానికి అవకాశం ఉంది.
శరీరము యొక్క బరువు తలమీద తక్కువగా, చేతులమీద ఎక్కువగా పడేటట్లు జాగ్రత్త పడాలి.
నేలపై మాడు ఆనకూడదు, నుదురు భాగం ఆనాలి.
మొదట అర నిముషం మాత్రమే శీర్షాసనం వేయాలి.
వారానికి అర నిమిషం చొప్పున పెంచుతూ నాలుగు వారాల తర్వాత రెండు నిముషాలు అభ్యాసం చేయవచ్చును.
అలవాటు అయ్యేవరకు ఇతరుల సాయంతో గాని, గోడ ఆధారంతో గాని శీర్షాసనం వేయవచ్చును.