సర్వాంగాసనముhttps://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81సర్వాంగాసనము (సంస్కృతం: सर्वाङ्गसन) యోగాలో ఒక విధమైన ఆసనము.శరీరంలోని అన్ని అంగాలకు ఉపయోగపడే ఆసనం కాబట్టి దీనికి సర్వాంగాసనమని పేరు వచ్చింది.మొదట శవాసనం వేయాలి.తరువాత హలాసనంలో వలె కాళ్ళను మెల్లమెల్లగా తలవైపు వంచాలి.నడుమును చక్కగా చేసి రెండు చేతులతో పట్టుకోవాలి.ఆ తరువాత కాళ్ళను మెల్లగా పైకి ఎత్తి నిటారుగా ఉంచాలి.పాదాలు, పిక్కలు, తొడలు, నడుము అన్నీ చక్కగా నిటారుగా ఉండేటట్లు జాగ్రత్త వహించాలి.కళ్ళు మూసుకొని కొద్ది క్షణాలు శ్వాసను మెల్లగా పీల్చి, మెల్లగా వదులుతూ ఉండాలి.మెల్లమెల్లగా కాళ్ళు తలవైపు ఉంచి, నడుమును ముందుగా నేలపై ఆనించిన తర్వాత కాళ్ళు ఆనించాలి.కొద్దిసేపు శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.సర్వాంగాసనం మెడలోని అవటు గ్రంధిని ఉత్తేజపరచి రక్తప్రసారం పెంచుతుంది.ఈ ఆసనం మూలవ్యాధి, వరిబీజము వంటి వ్యాధులను నివారిస్తుంది.ఇది జననేంద్రియాల స్వస్థతను పెంచుతుమ్ది.స్త్రీలలో ఋతుచక్రంలోని దోషాలను తొలగిస్తుంది.పురుషులలో నపుంసకత్వాన్ని తొలగిస్తుంది.ఇది ఊపిరితిత్తులకు రక్తప్రసారం సక్రమంగా జరగడం వలన వాటి సామర్థ్యం పెరుగుతుంది.అధిక రక్తపోటు, వెన్నెముక సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, గుండె జబ్బులు కలవారు సర్వాంగాసనం వేయరాదు.