474.txt 1.47 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
సిద్ధాసనము

https://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81

సిద్ధాసనము (సంస్కృతం: सिद्धसन) యోగాలో ఒక విధమైన ఆసనం.
ఇది సిద్ధుల వలె ధ్యానం చేయడానికి సరిపడేది కాబట్టి సిద్ధాసనం అన్నారు.
ఇది సుమారు పద్మాసనం లాగానే ఉంటుంది.
ఎడమకాలి మడమను జననేంద్రియాలకు, గుదభాగానికి మధ్యగా అదిమి ఉంచాలి.
కుడికాలి మడమను జననేందియాలపై ఉంచాలి.
పద్మాసనం లో వలె రెండు మోకాళ్లను నేలకు ఆనించి కూర్చోవాలి.
ఈ ఆసనం వేసే సమయంలో భ్రూమధ్యదృష్టి గాని, నాసాగ్రదృష్టి గాని ఉండాలి.
సిద్ధాసనం లో మనస్సు యొక్క చంచల స్వభావం తొలగి ఏకాగ్రత కుదురుతుంది.
పద్మాసనం వలన కలిగే లాభాలన్నీ సిద్ధాసనం వలన కలుగుతాయి.