సూర్య నమస్కారాలుhttps://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF_%E0%B0%A8%E0%B0%AE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారములు.బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి.వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది.రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను బోధిస్తారు.ఈ శ్లోకాలను వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో పఠించ వచ్చు.సూర్య నమస్కారాలలో 12 మంత్రాలు ఉన్నాయి.సూర్యోదయం వేళలో సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారాలు చెయ్యాలి.సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుంది.నడుము సన్నబడుతుంది.ఛాతీ వికసిస్తుంది.వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి.శ్వాస పై ధ్యాస,వేదాత్మక ప్రార్థనలు వంటి వాటితో ఈ ప్రక్రియలను జోడించాలి.శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను సహజ సిద్ధంగా తొలగించగల ప్రక్రియలివి "ఆర్కైవ్ నకలు".