హలాసనముhttps://te.wikipedia.org/wiki/%E0%B0%B9%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81హలాసనము (సంస్కృతం: हलसन) యోగాలో ఒక విధమైన ఆసనము.నాగలి రూపంలో ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని హలాసనమంటారు.కర్ణపీడాసనం, సప్తకోణాసనం ఈ ఆసనానికి వైవిధ్య రూపాలు.ఈ పేరు సంస్కృత శబ్దం హాల నుడ్ంఇ వచ్చింది.హాల అంటే " నాగలి " అని అర్థం.ఈ భంగిమను 19 వ శతాబ్దంలో శ్రీతత్వనిధిలో లాంగలాసనం అని వర్ణించారు.దీనిక్కూడా సంస్కృతంలో నాగలి అనే అర్థం.మధ్యయుగం నాటి హఠ యోగ గ్రంథాలలో కర్ణాపీడాసనం కనిపించదు.శివానంద యోగ సంప్రదాయంలో స్వామి విష్ణుదేవానంద యొక్క 1960 కంప్లీట్ ఇల్లస్ట్రేటెడ్ బుక్ ఆఫ్ యోగా లోను, BKS అయ్యంగార్ 1966 లోరాసిన లైట్ ఆన్ యోగా లోనూ విడివిడిగా దీన్ని వివరించారు.కాబట్టి, దీనికి ప్రాచీన మూలాలు ఉండి ఉండవచ్చని భావించవచ్చు.ఈ పేరు కర్ణ అంటే "చెవులు" అని అర్ధం పీడా అంటే "పిండి" అని అర్ధం.హలాసనం సెర్వికల్ వెన్నెముకపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తుంది, మామూలు పరిస్థితుల్లో ఈ భాగంపై ఈ రకమైన ఒత్తిడి ఉండదు.సరిగా చేయకపోతే గాయం కలిగిస్తుంది.మొదట శవాసనం వేయాలి.తరువాత కాళ్ళు రెండూ కలిపి మెల్లమెల్లగా తలవైపుగా నేలపై ఆనించాలి.చేతులు నేలమీద చాపి గాని, తలవైపు మడచిగాని ఉంచాలి.ఆసనంలో ఉన్నంతసేపూ శ్వాసను బయటనే ఆపాలి.పొట్టను లోపలికి పీల్చి ఉంచితే ఈ ఆసనం సులువుగా వేయవచ్చును.హలాసనం వలన వెన్నెముక సంబంధిత కండరాలకు, నరాలకు బలం హెచ్చుతుంది.వెన్నెముక మృదువుగా ఉంటుంది.మెడకు రక్తప్రసారం చక్కగా జరుగుతుంది.నడుము సన్నబడుతుంది.బాణపొట్ట తగ్గుతుంది.