479.txt 2.07 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
హాస్య యోగా

https://te.wikipedia.org/wiki/%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF_%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97%E0%B0%BE

జోక్, కామెడీ, సంతోషకరమైన స్థితి వంటివి లేకుండా శారీరక కదలికల ద్వారా నవ్వడం అనే ప్రక్రియే హాస్య యోగా.
ఈ ప్రక్రియ మానసిక ఒత్తిడి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
సహజంగా కానీ, కృత్రిమంగా కానీ, నటించడం ద్వారా కానీ - ఏ విధంగా నవ్వినా మానవ మెదడు తేడా పసిగట్టదు, ఎలా నవ్వినా మెదడు ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది.
ఈ ఎండార్ఫిన్లు ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ కలిగిస్తాయి.
ఈ పరిశోధన ఫలితాల ఆధారంగా 1995లో ముంబైకి చెందిన వైద్యుడు మదన్ కటారియా హాస్య యోగా ప్రక్రియను రూపొందించారు.
వాణిజ్యపరమైన ప్రచారం లేకుండానే 100 దేశాలకు పైగా ఈ ప్రక్రియ విస్తరించింది.
లాఫింగ్ క్లబ్ లు, హాస్య యోగా శిక్షకులు హాస్య యోగాను మరింత ప్రాచుర్యంలోకి తీసుకువస్తున్నారు.
 హాస్య యోగా చేయి బాగా - సాక్షి పత్రిక వ్యాసం
కటారియా, మదన్ (2002).
లాఫ్ ఫర్ నో రీజన్ (in ఆంగ్లం).
ముంబై: మాధురీ ఇంటర్నేషనల్.