వ్యాయామంhttps://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AE%E0%B0%82|నీటిలో పరుగెత్తుతున్న అమెరికా సైనికుడు.వ్యాయామం అనేది శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం చేసే శారీరక ప్రక్రియ.వ్యాయామం ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి, అధిక బరువు తగ్గించుకోవడానికి, మానసిక ఉల్లాసం కొరకు చేస్తారు.క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వలన మన శరీరపు వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది, గుండెకు సంబంధించిన వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.కొన్ని రకాల మానసిక వ్యాధుల వారికి ఇది తోడ్పడుతుంది.శారీరక అందాన్ని పెంపొందించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని కలుగచేస్తుంది.తద్వారా మానసిక ఒత్తిడుల నుంచి కూడా దూరం చేస్తుంది.బాల్యంలోనే వచ్చే ఊబకాయం లాంటి సమస్యలకు వ్యాయామం చక్కటి పరిష్కారం.వ్యాయామాన్ని మూడు రకాలుగా విభజించవచ్చును.కండరాలు, కీళ్ళు కదలికలు సులభంగా జరిగేందుకు ఉపకరించే వ్యాయామం.వాయుసహిత వ్యాయామాలు: సైక్లింగ్, నడవడం, పరుగెత్తడం మొదలైనవి.వాయురహిత వ్యాయామాలు: కసరత్తులు, బరువుతగ్గడానికి యంత్రాల సహాయంతో చేసే వ్యాయామాలు.వ్యాయామం సంపూర్ణ ఆరోగ్యానికి చాల అవసరం.మన శరీరపు బరువును నియంత్రించడానికి, కండరాలను దృఢంగా శక్తివంతంగా ఉంచడానికి, ఎముకలను బలంగా చేయడానికి, వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది.దైనందిక వ్యాయామం వలన అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక రోగాల వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారించవచ్చును.టీనేజిలో ఉన్న అమ్మాయిలు ప్రతిరోజూ కాస్తంత వ్యాయామం చేస్తే.. వాళ్లకు సైన్సులో మంచి మార్కులు వచ్చే అవకాశం పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది.వ్యాయామం ఎంత ఎక్కువగా చేస్తే, వాళ్ల పరీక్ష ఫలితాల్లో అంత ఎక్కువ ప్రభావం ఉంటోందని పరిశోధకులు తెలిపారు.5వేల మంది పిల్లల మీద పరిశోధన చేసిన తర్వాత ఈ విషయాన్ని నిర్ధరించుకున్నారు.1991 నుంచి 1992 వరకు ఇంగ్లండ్ లో పుట్టిన 14వేల మంది పిల్లల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని గమనించి మరీ ఈ విషయాన్ని తేల్చారు.యాక్సెలరోమీటర్ అనే పరికరాన్ని వారికి అమర్చి మూడునుంచి ఎనిమిది రోజుల వరకు వారి వ్యాయామాల తీరును లెక్కించారు.ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు సబ్జెక్టులలో వారికి వచ్చిన మార్కులు చూడగా.. సైన్సు మార్కులలో మంచి మెరుగుదల కనిపించింది.అందులోనూ అమ్మాయిలకు ఈ మార్కుల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది.యోగాఆసనాలు