485.txt 5.24 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32
సిగరెట్

https://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%97%E0%B0%B0%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D

సిగరెట్ అనేది పొగ త్రాగే కడ్డీ.
చిన్నగా తురమబడిన పొగాకును కాగితము ద్వారా తయారుచేయబడిన గొట్టంలో కూరి వీటిని తయారుచేస్తారు.
సిగరెట్లు తాగే అలవాటు ఒక వ్యసనం అని నిరూపించబడింది.
పొగాకులో ఉండే ప్రధానమైన నికోటిన్ అనే రసాయన పదార్థం వ్యసనానికి కారణమైన ఉత్ప్రేరకం.
ఈ అలవాటువల్ల చాలా రకాల కాన్సర్లు, హృద్రోగాలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కలుగుతాయి.
గర్భవతులైన వారు పొగ త్రాగితే పుట్టే సంతానం లోపాలతో ఉండడం వంటి సమస్యలు కలుగుతాయి.. సిగరెట్టు, చుట్ట - రెండూ పుగాకుతో చేసినవే.
కాని చుట్టకంటే సిగరెట్టు ఇంకా చిన్నది.
పుగాకు పొడిని కాగితంలో చుట్టి సిగరెట్లు తయారు చేస్తారు.
చుట్టలు పూర్తి ఆకును చుట్టి చేస్తారు.
తాజా పరిశోధనల్లో సిగరెట్ వల్ల నపుంసకత్వం సంభవిస్తుందని, ఈ నపుంసకత్వం తరతరాలకు సంక్రమించే అవకాశం ఉందని ఫలితాలను వెల్లడించారు.
మధ్య అమెరికాలో 9వ శతాబ్దం నాటికే పొగ త్రాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తుంది.
మాయ నాగరికతలోను, అజ్టెక్ నాగరికతలోను మత సంబంధమైన కార్యక్రమలలో పొగాకు త్రాగేవారు.
కరిబియన్, మెక్సికో, దక్షిణ అమెరికా ప్రాంతాలలో బాగా ముందుకాలంనుండి పొగ త్రాగే అలవాటు ఉండేది.
క్రిమియా యుద్ధం కాలంలో బ్రిటిష్ సైనికులు ఒట్టొమన్ టర్క్ సైనికులను అనుకరించి పొగ త్రాగడం మొదలుపెట్టారు.
తరువాత పొగ త్రాగే అలవాటు ఐరోపాలోను, ఇతర ఖండాలలోను విస్తరించింది.
మార్కెట్‌లో లభించే సిగరెట్లలో చూడడానికి కనిపించేవి - పుగాకు బ్లెండ్, చుట్టే సిగరెట్ పేపర్, ఆ పేపరును అతికించే పాలివినైల్ అసిటేట్ (PVA) జిగురు, చాలావాటిలో సెల్లులోజ్ అసిటేట్ ఆధారంగా తయారైన ఫిల్టర్.. అయితే సిగరెట్టులో వాడే పుగాకు బ్లెండుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు.
కొన్ని కంపెనీల బ్లెండులలో 100పైగా పదార్ధాలు ఉండవచ్చును.
రోజుకొక సిగరెట్టే కాలుస్తున్నా రక్తనాళాలకు హాని చేస్తుందని తేలింది.
ఒక్క సిగరెట్‌ తాగినా, అది రక్తనాళాలను గట్టి పడేలా చేసి గుండె జబ్బులకు గురి చేస్తుంది.
రక్తనాళాలు గట్టిపడడం వలన గుండె జబ్బులొచ్చే ప్రమాదం పెరుగుతుంది.
పొగ తాగే వారికన్నా, పొగాకును నమిలే వారిలో రక్తనాళాల గట్టిదనం తక్కువగా ఉన్నా, మొత్తానికి పొగాకు అలవాటు లేని వారికంటే ఎక్కువేనని తేలింది.
(ఆంధ్రజ్యోతి 28.10.2009) 
పొగాకు
చుట్ట
బీడీ
వ్యసనంMortality in relation to smoking: 50 years' observations on male British doctors
US Center for Disease Control - Smoking and Health Database
INGCAT - International Non Governmental Coalition Against Tobacco Archived 2019-05-06 at the Wayback Machine