ఉస్మానియా జనరల్ హాస్పిటల్https://te.wikipedia.org/wiki/%E0%B0%89%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE_%E0%B0%9C%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B2%E0%B1%8D_%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8Dఉస్మానియా జనరల్ హాస్పిటల్ (Osmania General Hospital) భారత దేశంలో పేరు గాంచిన ఆసుపత్రి.ఈ ఆసుపత్రి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అఫ్జల్ గంజ్ ప్రాంతంలో ఉంది.భారత దేశంలో కల పురాతనమైన ఆసుపత్రిలలో ఇది ఒకటి.ఆఖరు నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మించబడి తర్వాత అతని పేరు మీద ప్రసిద్ధికెక్కింది.ప్రసుతము ఈ ఆసుపత్రి తెలంగాణా ప్రభుత్వము ద్వారా నడుపబడుతున్నది.2022, మే 12న రోగుల సహాయకులకు మూడు పూటలా రూ.5 కే భోజన కార్యక్రమం ప్రారంభించబడింది.హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.ఉస్మానియా ఆసుపత్రిని పేదలకు ఉచితంగా వైద్య సహాయం అందించడానికై స్థాపించడం జరిగింది.ఈ ఆసుపత్రిలో ఉన్న 1168 పడకలలో 363 పడకలు సూపర్ స్పెషాలిటీ, 160 ఎమర్జన్సీ, 685 సాధారణ పడకలు.ఈ ఆసుపత్రిలో 250 మంది వైద్యులు, అందులో 60 మంది ప్రొఫెసర్లు, 190 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు.530 కంటే ఎక్కువ నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు.800లకు పైగా నాన్-గజిటెట్ ఉద్యోగులు, క్లాస్-IV ఉద్యోగులు ఉన్నారు.300 మంది హౌస్ సర్జన్లు, 240 నర్సింగ్ విద్యార్థులు ఉన్నారు.ఉస్మానియా ఆస్పత్రిలో 7 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన సీటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్, అగ్నిమాపక యంత్రం, ఆక్సిజన్ ప్లాంట్ లను 2021, డిసెంబరు 14న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రారంభించాడు.ఓపీ స్లిప్పుల జారీ కేంద్రం పనులకు శంకుస్థాపన చేశాడు.ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీలు పాల్గొన్నారు.జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు మూడు పూటలా రూ.5 కే భోజనాన్ని భోజనం అందించే కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా 2022 మే 12న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఉస్మానియా ఆస్పత్రిలో రూ.5 కే భోజన కార్యక్రమాన్ని ప్రారంభించాడు.రోగుల సహాయకులతో కలిసి హరీశ్‌రావు, హోంమంత్రి మహముద్ అలీ, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తోపాటు పలువురు అధికారులు భోజనం చేశారు.ఉస్మానియా ఆస్పత్రిలో కొత్తగా మంజూరైన 75 ఐసీయూ పడకల్లో 40 ఐసీయూ పడకలను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించాడు.2014-15 బడ్జెటులో ఈ ఆసుపత్రికి 100 కోట్ల రూపాయలు కేటాయించబడింది.ఉస్మానియా ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు, నేషనల్ ఆక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ నామ్స్ ప్రకారం ఆస్పత్రిలోని పలు విభాగాలతో పాటు ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం 10 కోట్ల 14 లక్షల 67 వేల 437 రూపాలయను మంజూరు చేసింది.ఈ నిధుల నుంచి 6 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకానికి, 4 కోట్ల 14 లక్షల 67 వేల 437 రూపాయలు దవాఖానను కార్పోరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు వినియోగించనున్నారు.