ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ వైద్యశాలhttps://te.wikipedia.org/wiki/%E0%B0%8E%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B0%E0%B0%97%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5_%E0%B0%9B%E0%B0%BE%E0%B0%A4%E0%B1%80_%E0%B0%B5%E0%B1%88%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ వైద్యశాల, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్న క్షయవ్యాధి వైద్యశాల.ఎర్రగడ్డ సమీపంలో 65 ఎకరాల్లో 670 పడకలతో ఈ ఆసుపత్రి ఉంది.నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో స్థాపించబడిన పురాతన ఆరోగ్య సంస్థల్లో ఇదీ ఒకటి.తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని కాళోజీ నారాయణరావు పరిధిలో నిర్వహించబడుతున్న ఈ ఆసుపత్రి, రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే క్షయవ్యాధి, ఛాతీ రోగులకు సేవలు అందిస్తోంది.1888లో ఆరవ నిజాం కాలంలో నిజాముద్దీన్ ఫక్రుల్ ముల్క్ చేత ఈ భవనం నిర్మించబడింది.దీనిని ఇర్రానుమా ప్యాలెస్ గా పిలిచేవారు.అయితే, 1920లో హైదరాబాదులో టీబీ వ్యాధి విజృంభించినప్పుడు చికిత్సకోసం వికారాబాద్ సమీపంలోని అనంతగిరి టీబీ కేంద్రానికి వెళ్ళేవారు.అక్కడికి వెళ్ళలేక చాలామంది చనిపోయేవారు.ఈ సంఘటనను గమనించిన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1937లో ఇర్రంనుమా ప్యాలెస్‌ను స్వాధీనం చేసుకుని, అందులో ఛాతీ ఆసుపత్రిని ఏర్పాటు చేశాడు.2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా అనంతగిరికి తరలించి, ఈ భవనాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకున్నాడు.కానీ, ఇతర కారణాల వల్ల ఆ ప్రతిపాదనను విరమించుకున్నాడు.ఈ ఛాతీ ఆస్పత్రిలో 17 ఎకరాల్లో జీ ప్లస్ 14 అంతస్తుల్లో 1000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి 2022 ఏప్రిల్ 26న మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భూమిపూజ చేశాడు.882 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వెయ్యి పడకలను (300 ఐసీయూ బెడ్స్), 16 ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయనున్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు టి.హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.ఎక్కువమంది బాధితులు ఎలర్జీతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వపరంగా ఎలర్జీ క్లీనిక్‌లను ఏర్పాటుచేయాలన్న ఉద్యేశ్యంతో ఏర్పాటుచేసిన ఎలర్జీ క్లీనిక్‌ను 2021 అక్టోబరు 6న రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ కె.రమేష్ రెడ్డి, ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్ ప్రారంభించారు.రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటుచేసిన ఎలర్జీ క్లీనిక్ ఇది.2.15 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన సిటీ స్కాన్ ను 2022 జూన్ 6న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించాడు.