493.txt 4.09 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి

https://te.wikipedia.org/wiki/%E0%B0%96%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%82_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5_%E0%B0%86%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి, తెలంగాణలోని ఖమ్మంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి.
ఈ ఆసుపత్రికి తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది.
ఈ ఆసుపత్రిలో 520 పడకలు ఉన్నాయి.
2022, జనవరి 28న రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి టి.
హరీష్ రావు ఖమ్మం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ క్యాథ్‌ల్యాబ్‌ (రూ.
7.50 కోట్లతో అత్యాధునిక స్టంట్ మిషన్, మరో రూ.12.50 కోట్లతో యాంజియోగ్రామ్, ఐసీయూ, ల్యాబొరేటరీ, 12 బెడ్ల వసతి కలిగిన గదులు), రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం వైద్యసేవలు అందించేందుకు 100 బెడ్లతో ట్రామా కేర్‌ సెంటర్‌ను, మదర్‌మిల్క్‌ బ్యాంకును ప్రారంభించాడు.
ఈ క్యాథ్‌ల్యాబ్‌ సహాయంలో యాంజియోగ్రామ్‌, యాంజియోప్లాస్టీ, పేస్‌మేకర్ల అమరిక, గుండె సంబంధిత లోపాలను గుర్తించడం, స్టంట్ల అమరిక, కవాటాల మార్పిడి, రక్తం పంపిణీలో లోపాలను సవరించడం వంటి చికిత్సలు ప్రజలకు ఉచితంగా చేయబడుతాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర వైద్య, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, రాములునాయక్, ఎమ్మెల్సీ తాతా మధు, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేటింగ్‌లో ఈ ఆసుపత్రికి 'ఏ' గ్రేడ్‌ లభించడంతోపాటు ఉత్తమ వైద్య సేవలకుగానూ పలుమార్లు అవార్డులు కూడా లభించాయి.
2020 జూలై 31న కోవిడ్‌-19 ట్రూనాట్‌, కరోనా నిర్ధారణ కేంద్రం, కార్డియాలజిస్ట్‌, యూరాలజిస్ట్‌ విభాగంలో 20 ఐసీయూ బెడ్ల వార్డులు ప్రారంభించబడ్డాయి.
భారతదేశంలో విద్య
భారత వైద్య మండలి
తెలంగాణ వైద్య విధాన పరిషత్తు