నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రిhttps://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%81_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5_%E0%B0%86%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BFనిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి తెలంగాణలోని నిజామాబాదులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి.ఈ ఆసుపత్రికి తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది.రాష్ట్రంలోని అతిపెద్ద ఆసుపత్రులలో ఇది ఒకటి.ప్రస్తుతం నిజామాబాదు ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్న ప్రదేశంలో 1995లో ఈ నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభించబడింది.2010 సంవత్సరంలో, నిజామాబాదు నగరంలో వైద్య కళాశాలని ప్రారంభించాలని భారత వైద్య మండలి నుండి నోటీసు వచ్చిన తరువాత, ఖలీల్వాడి మైదానంలో కొత్త ప్రభుత్వ ఆసుపత్రి భవనం నిర్మాణం ప్రారంభమైంది, దీనికోసం ఖలీల్వాడి మైదానంలో కొత్తగా నిర్మించిన 3.5 కోట్ల రూపాయలతో నిర్మించిన స్టేడియం కూల్చివేయాల్సి వచ్చింది.కొత్త ఆసుపత్రి భవనాల నిర్మాణంకోసం భూమిని కూడా కేటాయించగా, 2012లో 8 అంతస్తుల భవనం పూర్తయింది.2012 చివరి నాటికి, పాత ప్రభుత్వ ఆసుపత్రిని కొత్తగా నిర్మించిన భవనానికి మార్చగా, పాత ఆసుపత్రి ప్రాంగణాన్ని కొత్త వైద్య కళాశాల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పునరుద్ధరించాయి.మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) నుండి ఆమోదం పొందిన తరువాత 2013లో ఆసుపత్రి ప్రారంభమవ్వగా, కళాశాల విద్యా సంవత్సరం కూడా ప్రారంభించింది.90 కోట్ల రూపాయలతో అన్ని సౌకర్యాలతో కూడిన రెండు 8-అంతస్తుల భవనాలతో కలిపి మొత్తం ఆరు భవనాలు నిర్మించబడ్డాయి.కొత్త ఆసుపత్రి, వైద్య కళాశాల ప్రాంగణం 20 ఎకరాలలో ఒకదానికొకటి ఎదురుగా ఉన్నందున వాటిని కలపడంకోసం ఒక అడుగు వెడల్పుతో వంతెనను ఏర్పాటుచేశారు.భారతదేశంలో విద్యభారత వైద్య మండలితెలంగాణ వైద్య విధాన పరిషత్తు