495.txt 3.85 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18
నిజామియా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్

https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5_%E0%B0%9C%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B2%E0%B1%8D_%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8D

నిజామియా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (ప్రభుత్వ యునాని హాస్పిటల్‌) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న ఒక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్.
జనరల్ మెడిసిన్, యునానీ మెడిసిన్ ఈ హాస్పిటల్ ప్రత్యేకత.
నిజాం కాలంలో స్థాపించబడిన ఈ హాస్పిటిల్ చారిత్రాత్మక చార్మినార్ సమీపంలో ఉంది.
ఈ ప్రాంగణంలో ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల కూడా ఉంది.
హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
హైదరాబాదు రాజ్య చివరి (7వ) నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1926లో ఈ నిజామియా జనరల్ హాస్పిటల్ ను నిర్మించాడు.
ఈ హాస్పిటల్ లో గైనకాలజీ, శస్త్ర చికిత్స, డెంటిస్ట్రీ, నేత్ర వైద్యం, పాథాలజీ మొదలైన విభాగాలు ఉన్నాయి.
పక్షవాతం, ఫంక్షనల్ న్యూరోలాజికల్ డిజార్డర్స్, వైరల్ హెపటైటిస్ మూత్రపిండ కాలిక్యులి, నెఫ్రిటిస్, పైలోనెఫ్రిటిస్, మధుమేహం, డయాబెటిక్ అల్సర్స్, సైనసైటిస్, ఉబ్బసం, స్థూలకాయం, మొలలు, ఫిస్టులా-ఇన్-అనో, క్రానిక్ నాన్-స్పెసిఫిక్ అల్సర్స్, లైంగిక సమస్యలు, వ్యాధులు, వంశ రుగ్మతలకు చెందినవాటిలో ఈ హాస్పిటల్ యునానీ ఔషధ సేవలను అందిస్తుంది.
ఇందులో మొత్తం 180 పడకలు ఉన్నాయి.
హౌస్ సర్జన్‌షిప్ పూర్తి చేయడానికి 50 హాస్పిటల్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు ఉన్నాయి.
63మంది ఆసుపత్రి వైద్య సిబ్బంది ఉన్నారు.
104మంది మినిస్టీరియల్, పారా మెడికల్, 4వ తరగతి సిబ్బంది ఉన్నారు.
రోజుకు సగటు 600-700మంది ఔట్ పేషెంట్స్, 120-130మంది ఇన్ పేషెంట్ ఉంటుంది.కరోనా వ్యాధి వచ్చిన సమయంలో ఈ వ్యాధి సోకిన వారిని ఈ హాస్పిటల్ చేర్చుకొని చికిత్స అందజేశారు.
ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల