497.txt 2.9 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21
గైనకాలజీ

https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B1%88%E0%B0%A8%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B0%9C%E0%B1%80

గైనకాలజీ (Gynaecology or Gynecology)  వైద్యశాస్త్రంలో స్త్రీ జననేంద్రియ వ్యవస్థలోని యోని, గర్భాశయం, అండకోశాలు మొదలైన భాగాలకు సంబంధించిన చికిత్సా విధానం.
ఈ వైద్యవిధానానికి చెందిన నిపుణులను గైనకాలజిస్టులు (Gynecologist) అంటారు.
సాహిత్యపరంగా స్త్రీల వైద్యం ("the science of women") గా దీనిని భావించవచ్చును.
పురుషులలో దీనికి సమానార్ధంగా ఆండ్రాలజీ (andrology), ఇది పురుష జననేంద్రియ వ్యవస్థకు సంబంధించిన వైద్య విధానం.
చాలా మంది ఆధునిక గైనకాలజిస్టులు గర్భానికి సంబంధించిన నిపుణులుగా కూడా పనిచేస్తారు.
అందువలన రెంటినీ కలిపి ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ (obstetrics and gynaecology) గా పరిగణిస్తారు.
గైనకాలజీ అనే పదం ప్రాచీన గ్రీకు భాషకు చెందిన γυνή gyne, "స్త్రీ", -logia, "శాస్త్రం" నుండి ఉద్భవించింది.
గైనకాలజిస్టులు చేపట్టే కొన్ని ముఖ్యమైన వ్యాధులు:
జననేంద్రియాలకు చెందిన క్యాన్సర్, క్యాన్సర్ ముందు పరిస్థితులు.
స్త్రీల మూత్ర వ్యవస్థకు సంబంధించిన సమస్యలు
ఋతుచక్రం ఆగిపోయిన స్థితి (Amenorrhoea or absent menstrual periods)
ఋతుస్రావంలో నొప్పి (Dysmenorrhoea or painful menstrual periods)
సంతానలేమి (Infertility)
అధిక ఋతుస్రావం (Menorrhagia or heavy menstrual periods)
గర్భసంచి జారడం (prolapse of pelvic organs)
జననేంద్రియాలకు చెందిన వివిధ భాగాలలో రకరకాలైన ఇన్‌ఫెక్షన్ వలన కలిగే సమస్యలు.
స్త్రీలకు సంబంధించిన లైంగిక సంక్రమణ వ్యాధులు