508.txt 3.09 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17
తెలంగాణ వైద్య విధాన పరిషత్తు

https://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3_%E0%B0%B5%E0%B1%88%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8_%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81

తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టిజివివిపి) తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విభాగం.
1986 చట్టం ద్వారా స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత 2014, జూన్ 2న వేరుచేయబడి ఈ తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఏర్పడింది.
30 నుండి 350 వరకు మంచాలు గల మధ్యస్థాయి ఆసుపత్రుల బాధ్యతను నిర్వర్తిస్తుంది.
ఈ ఆసుపత్రులలోని వైద్యులు, ఇతర సిబ్బందిని తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఉద్యోగాల ద్వారా భర్తీ చేస్తుంది.
తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఈ క్రింది అంశాలలో కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
ఆసుపత్రి భవనాల నిర్వహణ,పారిశుధ్యం
ప్రధాన, చిన్న పరికరాల సదుపాయం, నిర్వహణ, పర్యవేక్షణ
మందులు,వినియోగ వస్తువుల సదుపాయం
ప్రమోషన్లు, సీనియారిటీ, బదిలీలు, పోస్టింగ్‌లు, శిక్షణలు, క్రమశిక్షణ చర్యలు మొదలైన అన్ని ఉద్యోగుల సేవా అంశాలు
ఆసుపత్రుల పనితీరు సమీక్ష
ఆర్థిక కేటాయింపుతెలంగాణలోని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు కూడా తెలంగాణ వైద్య విధాన పరిషత్తు పరిధిలోకి వస్తాయి.
రాష్ట్రవ్యాప్తంగా 103 ఏరియా ఆసుపత్రులు, 8 జిల్లాస్థాయి ఆసుపత్రులు, 233 ఆయుర్వేద, 260 యునాని ఆసుపత్రులు దీని పరిధిలో ఉన్నాయి.
తెలంగాణ వైద్య విధాన పరిషత్తు అధికారిక వెబ్సైటు