512.txt 2.31 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9
ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవం

https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B0%E0%B1%80%E0%B0%B0%E0%B0%95_%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8_%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%82

ప్రపంచ శారీరక చికిత్స (ఫిజియోథెరపీ) దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 8వ తేదీన నిర్వహించబడుతుంది.
ఫిజియోథెరపీ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం 1996లో ప్రపంచ శారీరక చికిత్స సమాఖ్య ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.
మందుల ద్వారా కాకుండా ఫిజియోథెరపీ ద్వారా జబ్బులను నయం చేయడం ద్వారా శరీరానికి ఎలాంటి నష్టం జరుగదన్న ఉద్ధేశ్యంతో ఫిజియో‍థెరపీని ప్రోత్సహించడంకోసం 1951, సెప్టెంబరు 8న ప్రపంచ ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది.
అప్పటినుండి ప్రతి సంవత్సరం సెప్టెంబరు 8న ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవంగా వైద్యులు నిర్వహిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న భవిత కేంద్రాల్లో సోమవారం రోజున ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, మిగతా అన్ని రోజుల్లో ఐఈఆర్‌టీ (ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్)లు విద్యాబోధన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.