52.txt 10 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49
ఉప్పుచెక్క

https://te.wikipedia.org/wiki/%E0%B0%89%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%9A%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%95

ఉప్పుచెక్క అనేక రకాలైన వన మూలికలు అనగా కొన్ని రకాల చెట్టు బెరుడులు, వేర్లు, కాయలు, పువ్వులు, ఇల్లాంటివాటిని చేర్చి కత్తితో ముక్కలుగా కత్తరించి దానిని రోట్లో వేసి దంచి పొడిగా చేసి దానికి అధిక మోతాదులో ఉప్పు కలిపి చేసే పదార్థం.
ఈ వుప్పు చెక్క తయారికి కావలసిన కొన్ని వనమూలికలు: మద్ది చెక్క (బెరడు) నేరేడు చెక్క, మామిడి చెక్క, కరక్కాయ, నల్లేరు, అడవి గుమ్మడి, అడవి ఉల్లి, మన్నేరు గడ్డ, ఎలక్కాయ, ఉసిరి కాయ, చలువ వేర్లు, అలా ఈ జాబితా చాల పెద్దది.
అన్నీ తేవాలని లేదు గాని వీలైనన్ని ఎక్కవ సేకరించాలు.
అందులో కొన్ని తప్పని సరైనవి కొన్ని వుంటాయి.
ఇందులో ముఖ్యంగా వుండాల్సిన వన మూలికలు, 'అడవి గుమ్మడి", మద్ది చెక్క, నేరేడు చెక్క, నల్లేరు, కలబంద గడ్డ, మారేడు కాయ, పన్నేరు గడ్డ, ఉసిరి, మాదీ ఫలం, వెలగపండు, మామిడి ముట్టి, మన్నేరు గాయ,అడవి ఉల్లి ఇలాంటివి కొన్ని తప్పనిసరైనవి వున్నాయి.
ఆవి గాక తమకు తోచిన అడవిలో దొరికే చెట్ల భాగాలు, అనగా కొన్న కాయలు, కొన్ని వేరులు, గడ్డలు, బెరడలు, పూలు మొదలగు నవి వీలైనన్ని ఎక్కువగా సేకరించి తెచ్చి ఉప్పు చెక్కను తయారు చేస్తారు.
పశువుల పండగ రోజున రైతులు ఇంటి కొక్కరు చొప్పన పల్లె వాసులు తెల్లవారక ముందే ఒక కత్తి, సంచి తీసుకొని పక్కనె వున్న అడవికి బయలు దేరుతారు.
అనేక రకాల వన మూలికలు, ఆకులు, కాయలు, చెట్టు బెరడు, గడ్డలు, పువ్వులు, వేర్లు, మొదలగు నవి తీసుకొని వస్తారు.
కొన్ని తప్పనిసరిగా వుండవలసిన మూలికలు కొన్ని వున్నాయి అవి తీసుకొని మిగతా ఎన్ని రకాల మూలికలు ఎన్ని వీలైతె అన్ని తీసుకొని వస్తారు.
ఇంటికి వచ్చి, వాటినన్నింటిని కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కత్తరించి ఆ తర్వాత రోట్లో వేసి బాగ దంచి పొడి లాగ చేస్తారు.
చివరిలో అందులో ఎక్కువ మోతాదులో ఉప్పు వేసి ఇంకా బాగ దంచు తారు.
దాన్ని "ఉప్పుచెక్క" అంటారు.
సంక్రాంతి వరుస పండగల్లో పశువుల పండుగ మూడోది.
పశువుల పండగ రోజున పశువులనన్నింటిని చెరువు లేదా బావి వద్దకు తోలు కెళ్లి బాగా స్నానం చేయించి ఇంటికి తీసుకవస్తారు.
వాటి కొమ్ములను జివిరి, వాటికి రంగులు పూసి, మెడ తాడు, పగ్గం, మూజంబరం మొదలగు వాటిని కొత్తవి అలంకరిస్తారు.
కొమ్ములకు కుప్పెలు, మెడలో మువ్వలు వేస్తారు.
అప్పుడు ఈ ఉప్పు చక్క"ను పశువులకు తినిపించే కార్యక్రమం చేస్తారు.
ఉప్పు చెక్కకు కావలసిన దినుసులను అడవికెళ్లి సేకరించడం, దానిని దంచి "ఉప్పు చెక్క"ను తయారు చేయడం, దానిని పశువులకు తినిపించడము .... ఇది ఆ రోజున పెద్ద కార్యక్రమం.
ఈ విషయంలో పల్లెల్లోని రైతులు ఒకరికొకరు బాగా సహకరించు కుంటారు.
ఇదొక సామూహిక కార్యక్రమము.
ఎవరికి వారు చేసుకునే పని కాదు.
అడవి నుండి తెచ్చిన వన మూలికలు ఒకరికి దొరకని వాటిని వారికిచ్చ తమకు దొరకని వాటిని ఇతరులనుండి తీసుకుంటారు.
అదే విదంగా కొన్ని పశువులు ఈ ఉప్పు చెక్కను ఓ పట్టాన తినవు.
వాటికి ఈ ఉప్పు చెక్కను తినిపించ డానికి నలుగురైదుగురు కలిసి తినిపిస్తారు.
ఈ విధంగా రైతులు ఒకరికొకరు సహకరించు కుంటారు.
ఈ ఉప్పు చెక్క చాల మధురమైన వాసన కలిగి వుంటుంది.
మేకలు, గొర్రెలు మొదలగు సన్న జీవాలు దీనిని బాగా తింటాయి.
కాని ఆవులు ఎద్దులు మొదలగు పెద్ద జంతువులు దీనిని అంత ఇష్టంగా తినవు.
కాని రైతులు బలవంతంగా వాటి నోటిని తెరిచి అందులో ఒక గుప్పెడు ఉప్పు చెక్కను వేసి నోరు మూసి వుంచుతారు.
దాన్ని అవి మింగేస్తాయి.
ఇలా తలా పది గుప్పుళ్లైనా..... ఒక్కొక్క దానికి తినిపిస్తారు.
ఇది పశువులకు సర్వ రోగ నివారిణిగా చెప్పుకుంటారు.
అదే ఉప్పు చెక్కను అదే విధంగా కాడెద్దులకు అనగా పనిచేసే ఎద్దులకు మరొక రకమైన పదార్థాన్ని దాని నోటికి కట్టి అలా సుమారు నాలుగు గంటలు వదిలేస్తారు.
ముఖ్యంగా నల్లేరు, మద్ది చెక్క, ఉప్పు ఇంకా కొన్ని ఘాటైన వాసన కలిగిన మూలికలను ముద్దగా నూరి దానిని లావు పాటి లావుపాటి వరిగడ్డితో చేసిన పురి మధ్యలో పెట్టి దానిని పశువు నోటిలో పెట్టి ఆ పురి రెండు కొసలను కొమ్ముల వెనకాల కట్టతారు.
ఆ విధంగా వన మూలికల ముద్ద పశువు నోటిలో వుంటుంది.
ఆ పశువు నోరు సగం తెరిచి వుంటుంది.
అలా సుమారు నాలుగు గంటలు అలా వదెలేస్తారు.
అప్పుడు ఆ పశువు సొంగ కారుస్తూనె వుంటుంది.
ఆ తర్వాత దానిని విప్పి పడేస్తారు.
దీని వలన పశువుకు కడుపులో వున్న మలిన పదార్థాలు సొంగ ద్వారా బయటకి వచ్చి, కడుపు శుభ్రమై ఆ తర్వాత అది మేత ఎక్కువగా తింటుంది.
భలం పుంజు కుంటుంది.
పశువులకు ఇదొక వైద్య విధానము.
పశువుల పండగ రోజున ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టతారు.
కాని ఆ తర్వాత కూడా పశువులు మేత సరిగా తినకపోతే, పశువు నలతా వుంటే ఈ ప్రక్రియ చేపడతారు.
ఈ ఆచారం ఎక్కువగా చిత్తూరు జిల్లాలోను ఆ పరిసర ప్రాంతాలైన తమిళనాడు లోను ఎక్కువ.