పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంhttps://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%BF.%E0%B0%B5%E0%B0%BF._%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81_%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3_%E0%B0%AA%E0%B0%B6%E0%B1%81%E0%B0%B5%E0%B1%88%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82పి.వి.నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఒక పశువైద్య విశ్వవిద్యాలయం.ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 నవంబరు 22న ఈ విశ్వవిద్యాలయం ఏర్పడింది.భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు మీదుగా ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయడమైనది.హైదరాబాద్ నిజాం సహకారంతో 1946 ఆగస్టు 8న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హైదరాబాదు పశువైద్య కళాశాలగా ఇది స్థాపించబడింది.1964లో ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించబడినప్పుడు ఈ కళాశాల, విశ్వవిద్యాలయ పరిధిలోకి వచ్చింది.2005 జూన్ 12న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత, పశువైద్య ఇన్‌స్టిట్యూట్‌లు విభజించబడ్డాయి.2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ ఏర్పడిన తరువాత, తెలంగాణ ప్రభుత్వ చట్టం ద్వారా పివి నరసింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య, జంతు, మత్స్య శాస్త్రాల విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది.2016 మే 24 నుండి పి.వి.నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చబడింది.పశువులు, జంతువులు, మత్స్య మొదలైన కోర్సులలో విద్యను అందించడం.తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలకు పశువులు, జంతువులు, మత్స్య కోర్సులపై పరిశోధనలు చేపట్టడంపశువులు, జంతువులు, మత్స్య ప్రొడక్షన్ మరియు హార్వెస్ట్ టెక్నాలజీని ప్రోత్సహించడంపశువులు, జంతువులు, మత్స్యరంగంలో తగిన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయడంఅధిక పనితీరు గల జంతువులు, ఆధునిక రోగనిర్ధారణ, రోగనిరోధక సాధనాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రాథమిక పరిశోధనను చేపట్టడంరాష్ట్రంలోని పశువుల పెంపకందారులలో వ్యవస్థాపక సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపశువుల, పశువుల ఉత్పత్తులపై పరిజ్ఞానాన్ని నవీకరించడం ద్వారా రాష్ట్ర రైతులకు సేవ చేయడంఅధికారిక వెబ్‌సైటు