భారతదేశంలో వైద్య కళాశాలలుhttps://te.wikipedia.org/wiki/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%B5%E0%B1%88%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF_%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B2%E0%B1%81భారతదేశంలో వైద్య విద్యను అందించే విద్యా సంస్థ, వైద్య కళాశాల.అమెరికా లోను, కొన్ని ఇతర దేశాలలోనూ దీన్ని "వైద్య పాఠశాల" అంటారు.MBBS అనేది ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956 ద్వారా స్థాపించబడిన వైద్య డిగ్రీ.ప్రస్తుతం ఇది నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం 2019 కులోబడి ఉంది.MBBS తర్వాత, వైద్యులు రాష్ట్రాల వైద్య మండళ్ళలో నమోదు చేసుకుంటారు.భారతీయ చట్టం ప్రకారం ఈ సంస్థలను నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తించాలి ఇలా ఆమోదించబడిన వైద్య కళాశాలల జాబితాను భారత ప్రభుత్వం వద్ద ఉంటుంది.MBBS డిగ్రీలు లేని వ్యక్తులు కొందరు, వైద్యుల వలె ప్రాక్టీస్ చేస్తూంటారు.వారిని క్వాక్స్ అంటారు.నేషనల్ మెడికల్ కమీషన్ యాక్ట్ 2019 ప్రకారం, ఇలాంటి వారికి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, INR 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.భారతదేశంలో ఆధునిక వైద్యం చేసేందుకు అవసరమైన ప్రామాణిక డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (MBBS).ఐదున్నర-సంవత్సరాల గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేసిన తర్వాత సంపాదించే డిగ్రీ ఇది.సాధారణ సైన్స్ సబ్జెక్టులలో ఒక సంవత్సరం ప్రి-క్లినికల్ అధ్యయనాలు, మూడున్నర సంవత్సరాల పారాక్లినికల్, క్లినికల్ స్టడీస్‌తో దీని పాఠ్యప్రణాళిక కూడుకుని ఉంటుంది.ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు క్లినికల్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది.ఇంటర్న్‌షిప్ ప్రారంభించే ముందు, విద్యార్థులు అనేక పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి.వాటిలో చివరి దాన్ని రెండు భాగాలుగా నిర్వహిస్తారు.మెడికల్ స్పెషాలిటీలలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం MBBS అయిన తర్వాత మూడు సంవత్సరాల పాటు చదవాలి.ఇది చదివాక మాస్టర్ ఆఫ్ సర్జరీ గానీ, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ గానీ లభిస్తుంది.ఆ తరువాత మరో రెండు సంవత్సరాల చదువు పూర్తి చేస్తే మెడికల్ స్పెషలైజేషన్‌లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలు పొందవచ్చు.వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రకారం, అత్యధిక సంఖ్యలో వైద్య కళాశాలలు (392) ఉన్న దేశం భారతదేశం.