68.txt 8.03 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21
డా. రెడ్డీస్ ల్యాబ్స్

https://te.wikipedia.org/wiki/%E0%B0%A1%E0%B0%BE._%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B1%80%E0%B0%B8%E0%B1%8D_%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D

డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఒక బహుళజాతి ఔషధ సంస్థ.
ఈ సంస్థను భారతదేశంలోని హైదరాబాద్‌కు చెందిన మెంటార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో పనిచేసిన అంజిరెడ్డి స్థాపించాడు.డాక్టర్ రెడ్డి భారతదేశంతోపాటు విదేశాలలో కూడా విస్తృతమైన ఔషధాలను తయారు చేసి మార్కెట్ చేస్తుంది.కంపెనీలో 190 రకాలకు చెందిన మందులు, ఔషధ తయారీరంగానికి అవసరమైన 60 యాక్టివ్ ఫార్మాస్యూటికల్ (క్రియాశీల) పదార్థాలు (ఎపిఐలు), డయాగ్నొస్టిక్ కిట్లు, క్రిటికల్ కేర్, బయోటెక్నాలజీ ఉత్పత్తులు తయారవుతాయి.
జీనోమ్ వ్యాలీలో కూడా తన కార్యకలాపాలును ప్రారంభించింది.
కళ్లం అంజిరెడ్డిచే (1 ఫిబ్రవరి 1939 - 15 మార్చి 2013) డా.రెడ్డీస్ ల్యాబ్స్ సంస్థ 1984 లో స్థాపించబడింది.అంజిరెడ్డి గుంటూరు జిల్లా, తాడేపల్లిలో జన్మించాడు.
రెడ్డీస్ ల్యాబ్స్ సంస్థకు అంజిరెడ్డి అతని పూర్తి జీవితకాలం వ్యవస్థాపక చైర్మన్ గా పనిచేశాడు.అంతేగాదు  కార్పొరేట్ సామాజిక సంస్థ డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ (DRF),  రెడ్డీస్ ల్యాబ్స్ గ్రూపు సంస్థలకు చైర్మన్ గా, పనిచేశాడు.
భారత ఔషధ పరిశ్రమకు  చేసిన కృషికి భారత ప్రభుత్వం 2001 లో పద్మశ్రీతో,  2011 లో పద్మ భూషణ్ తో సత్కరించింది.అతను భారత ప్రధానమంత్రి వాణిజ్య, పరిశ్రమల మండలిలో సభ్యుడుగా కూడా పనిచేశాడు.
డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ మొదట 1984 లో క్రియాశీల ఔషధ పదార్ధాలను ఉత్పత్తి చేసింది.1986 లో రెడ్డీ ల్యాబ్స్ బ్రాండెడ్ సూత్రీకరణలపై కార్యకలాపాలను ప్రారంభించింది.
ఒక సంవత్సరంలోనే రెడ్డీస్ లాబొరేటరీస్ భారతదేశంలో మొట్టమొదటి గుర్తింపు పొందిన బ్రాండ్ "నోరిలెట్" అనే మందుబిళ్లను తయారుచేసింది.
దాని తరువాత కొద్ది కాలంలోనే, డాక్టర్ రెడ్డి  ఒమేజ్‌తో మరో విజయాన్ని సాధించింది.దాని బ్రాండెడ్ ఒమెప్రజోల్.ఇది కడుపులో ఆమ్ల పదార్థాన్ని తగ్గించటానికి వాడబడే గుణంగల ఒకమందు గుళికఆ సమయంలో భారత మార్కెట్లో విక్రయించే ఇతర బ్రాండ్లరేటులో ఈ మెడిషన్ సగంధరకే లభించేవిధంగా విడుదల చేసింది.ఒక సంవత్సరంలోనే, రెడ్డీస్  షధాల కోసం క్రియాశీల పదార్ధాలను ఐరోపాకు ఎగుమతి చేసిన మొదటి భారతీయ సంస్థగా అవతరించింది.
రెడ్డీల్యాబ్స్ 1987 లో ఔషధ పదార్ధాల సరఫరాదారు నుండి ఇతర తయారీదారులకు ఔషధ ఉత్పత్తుల తయారీదారుగా మారడం ప్రారంభించింది.డా.
రెడ్డీస్ ల్యాబ్స్ అంచెలంచెలుగా ఎదిగి భారత దేశంలోనెే రెండవ పెద్ద ఫార్మా కంపనీగా ఎదిగింది.
ఇది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టయిన మందుల కంపెనీగా గుర్తించబడింది.హృద్రోగ జబ్బుల వైద్యంలో ఉపయోగించే అధునాతన ఔషధానికి సంబంధించి ట్రయల్స్ కోసం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, న్యూజిల్యాండ్కు చెందిన అక్‌లాండ్ విశ్వవిద్యాలయంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
రెడ్డీస్ ల్యాబ్స్ అంతర్జాతీయ మొట్టమొదటి విస్తరణ చర్య, 1992 లో రష్యాతో మొదలుపెట్టింది.
అక్కడ డాక్టర్ రెడ్డి దేశంలోని అతిపెద్ద ఔషధ ఉత్పత్తిదారుల  బయోమెడ్‌తో (జీవవైద్య శాస్త్రవేత్తల బృందం) జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది.
కొంతకాలం తరువాత కుంభకోణం ఆరోపణల మధ్య వారు 1995 లో వైదొలిగారు.
"బయోమెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సహాయంతో, మాస్కో రెడ్డి ల్యాబ్స్ శాఖ కార్యకలాపాల వల్ల గణనీయమైన భౌతిక నష్టం" జరిగింది.ఇది జరిగినాక రెడ్డి ల్యాబ్స్ జాయింట్ వెంచర్‌ను, ''క్రెమ్లిన్ - ప్రెండ్లీ సిస్టెమా గ్రూపు''కు విక్రయించింది.1993 లో రెడ్డీ లాబొరేటరీస్ మధ్యప్రాచ్యంలో ఒక జాయింట్ వెంచర్‌లోకి ప్రవేశించి, రష్యాలో రెండు సూత్రీకరణ యూనిట్లను నెలకొల్పింది.రెడ్డి లాబొరేటరీస్, బల్క్ ఔషధాలను ఈ సూత్రీకరణ యూనిట్లకు ఎగుమతి చేసేది.
తరువాత వాటిని తుది ఉత్పత్తులుగా మార్చేది.