మెనింగోకాకల్ టీకాhttps://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%86%E0%B0%A8%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8B%E0%B0%95%E0%B0%BE%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D_%E0%B0%9F%E0%B1%80%E0%B0%95%E0%B0%BEమెనింగోకాకల్ టీకా, నీసేరియా మెనింగిటిడిస్ ద్వారా సంక్రమణను నివారించడానికి ఉపయోగించే టీకాలలో దేనినైనా సూచిస్తుంది.ఈ క్రింది కొన్ని లేదా అన్ని రకాల మెనింగోకాకస్‌లకు అంటే A, C, W135, Yలను నిరోధించటానికి వేర్వేరు రకాలు ప్రభావవంతంగా ఉంటాయి.85 శాతం నుండి 100 శాతం వరకు టీకాలు ప్రభావవంతంగా ఉంటాయి.దీన్ని విస్తృతంగా ఉపయోగించే జనాభాలో మెనింజైటిస్, సెప్సిస్ ఫలితాలలో తగ్గుదల ఉంది.ఇది కండరానికి లేదా చర్మం కింద ఇంజక్షన్ ద్వారా ఇవ్వబడతాయి.ఓ మాదిరి లేదా అధిక రేటు ఉన్న దేశాలలో లేదా తరచూ విజృంభణ చెందుతున్న దేశాలలో మామూలుగా టీకాలు వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేస్తుంది.వ్యాధి వచ్చే తక్కువ ప్రమాదవకాశం ఉన్న దేశాలలో, అధిక ప్రమాదం గల ప్రజలకు వ్యాధుల నుండి రోగ నిరోధక శక్తిని కలిగించాలని వారు సిఫార్సు చేస్తున్నారు.ఆఫ్రికన్ మెనింజైటిస్ బెల్ట్‌లో ఒకటి నుండి ముప్పై ఏళ్ళ మధ్య ఉన్న వారికి మెనింగోకాకల్ ఎ కాంజుగేట్ వ్యాక్సిన్‌తో వ్యాధి నిరోధక శక్తిని కలిగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, టీనేజర్లు, అధిక ప్రమాదం ఉన్న ఇతరులకు మామూలుగా నాలుగు రకాల నిరోధానికి టీకాలను సిఫార్సు చేస్తారు.హజ్ కోసం మక్కాకు ప్రయాణించే ప్రజలకు కూడా ఇవి అవసరం.భద్రత అనేది సాధారణంగా మంచిది.ఇంజక్షన్ చేసిన ప్రదేశంలో కొందరికి నొప్పి, ఎర్రబడటం జరుగుతుంది.గర్భధారణ స్లమయంలో దీని వాడకం సురక్షితంగా కనిపిస్తుంది.మిలియన్ మోతాదులలో ఒకటి కన్నా తక్కువ కేసులలో అనేక రకాల తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలు సంభవిస్తాయి.మొదటి మెనింగోకాకల్ వ్యాక్సిన్ 1970 లో అందుబాటులోకి వచ్చింది.ఇది ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలో అవసరమైన అతి ముఖ్యమైన మందు.2014 నాటికి ఒక మోతాదుకు మొత్తం ఖర్చు 3.23 నుండి 10.77 అమెరికా డాలర్లు ఉంది.అమెరికా సంయుక్త రాష్ట్రాలలో దీని ధర 100 నుండి 200 డాలర్ల మధ్య ఉంది.