హెపటైటిస్ ఎ టీకాhttps://te.wikipedia.org/wiki/%E0%B0%B9%E0%B1%86%E0%B0%AA%E0%B0%9F%E0%B1%88%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D_%E0%B0%8E_%E0%B0%9F%E0%B1%80%E0%B0%95%E0%B0%BEహెపటైటిస్ ఎ వ్యాక్సిన్,అనేది ఒక టీకా, ఇది హెపటైటిస్ ఎ నుండి కాపాడుతుంది.ఇది దాదాపు 95% కేసులలో ప్రభావవంతంగా ఉంది, దీని ప్రభావం కనీసం పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది, వ్యక్తి మొత్తం జీవిత కాలమంతా ఉండే అవకాశముంది.టీకా ఇచ్చినట్లయితే, ఒక సంవత్సరం వయస్సు దాటిన తరువాత మొదలుపెట్టి రెండు మోతాదులు వేయాలని సిఫార్సు చేయబడింది.ఇది కండరానికి ఇంజక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.సాధారణంగా వ్యాధులు ఓ మాదిరిగా ఉన్న ప్రాంతాలలో సార్వత్రిక టీకాలు వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫారసు చేస్తుంది.వ్యాధి చాలా సాధారణంగా ఉన్న ప్రాంతాలలో అందరికీ విస్తృతంగా టీకాలు వేయటాన్ని సిఫారసు చేయటంలేదు ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సాధారణంగా ఇన్ఫెక్షన్ ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు.సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) అధిక ప్రమాదం ఉన్న పెద్దలకు, పిల్లలందరికీ టీకాలు వేయాలని సిఫారసు చేస్తుంది.తీవ్రమైన దుష్ప్రభావాలు చాలా అరుదు.15% మంది పిల్లలలో, సగం మంది పెద్దలలో వారికి ఇంజక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి కలుగుతుంది.చాలా హెపటైటిస్ ఎ టీకాలలో క్రియారహితం చేసిన వైరస్ ఉంటుంది, కొన్నింటిలో బలహీనమైన వైరస్ ఉంటుంది.గర్భవతులకు లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి బలహీనమైన వైరస్ గల టీకా వేయటాన్ని సిఫారసు చేయలేదు.కొన్ని సూత్రీకరణలు హెపటైటిస్ ఎ ను, హెపటైటిస్ బితో లేదా టైఫాయిడ్ టీకాతో కలుపుతాయి.మొదటి హెపటైటిస్ ఎ టీకా, ఐరోపాలో 1991 లో, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 1995 లో ఆమోదించబడింది.ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అత్యవసరమైన మందుల జాబితాలో ఉంది, ఇది ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలో అవసరమైన చాలా అతి ముఖ్యమైన మందు.అమెరికా సంయుక్త రాష్ట్రాలలో దీని ధర 50 నుండి 100 డాలర్ల మధ్య ఉంది.