ఎల్లోపతీhttps://te.wikipedia.org/wiki/%E0%B0%8E%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B%E0%B0%AA%E0%B0%A4%E0%B1%80ఎల్లోపతీ (Allopathy):దీనిని నవీన వైద్య విధానమందురు.మొట్టమొదట హోమియో వైద్యులైన డా.సామ్యూల్ హనిమాన్ ఈ పదాన్ని వాడేరు.ఈ వైద్య విధానములో ఒక వ్యక్తికి జబ్బు వలన కలిగే బాధలను అణచి వేయుటకు(To suppress)మందులను వాడేవిధానమని ఆయన ఉద్దేశము.ఇది హోమియో వైద్యవిధానానికి వ్యతిరేక ప్రక్రియ.ఉదాహరణకి జ్వరము తగ్గడానికి ఉష్ణోగ్రతను తక్కువచేసే 'పారసిటమాల్ 'ను అల్లోపతి లో వాడుతాము.ఈ పరసిటమాల్ జ్వరము ఉన్నవారిలోను , జ్వరములేనివారిలోనూ ఉస్ణోగ్రతను తగ్గిస్తుంది.హోమియో వైద్యవిధానములో అలా కాకుండా జ్వరమునకు వాడే మందు నార్మల్ వ్యక్తులలో జ్వరమును పుట్టిస్తుంది ,జ్వరముతో బాధపడేవారిలో జ్వరమును తగ్గిస్తుంది.అల్లొపతీ వైద్య విధానములో ఒక రోగము వలన కలిగే బాధలను తగ్గించడానికి తగిన మందులివ్వడమే కాకుండా ఆ రోగము రావడానికి గల మూలకారణము వివిధ పద్దతులద్వారా కనుగొని, కారక సూక్ష్మక్రిములను తెలుసుకొని తదనుగునముగా చికిత్స చేయుదురు.నేడు ఎన్నో రకములైన లేబొరటరీ పరీక్షలు, ఎక్షురే పద్దతులు, స్కానింగ్ పరికరాలు అందుబాటులోనికి వచ్చాయి.ఈ వైద్యవిధానము లో చికిత్స చేయు వైద్యునకు సంభందిత డిగ్రీ ఉదా: MBBS, MD, MS, MCh, DM, లాంటి చదువులు అవసరము.మూలము : డా.వందన శేషగిరిరావు-యం.బి.బి.యస్.