96.txt 7.83 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39
డారునవిర్

https://te.wikipedia.org/wiki/%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%A8%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D

Darunavir, డారునవిర్ ([ (1R,5S,6R) -2,8-dioxabicyclo[3.3.oct-6-yl N-[ (2S,3R) -4- [ (4-aminophenyl) sulfonyl- (2-methylpropyl) amino-3-hydroxy-1-phenyl- butan-2-yl carbamate, DRV, brand name Prezista®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించే Protease Inhibitor అనే తరగతికి చెందిన ఒకానొక ఔషదము.
దీనికి DRV పొడిపేరు.
ఇది FDA (Food and Drug Administration of USA) వారిచే HIV చికిత్స కోసం 23-Jun-2006  రోజున అమోదించబడింది.
ఇది మన భారతీయ శాస్త్రవేత్త అయినటువంటి అరున్ కె గోష్ ( University of Illinois at Chicago) చే కనుగొనబడింది.
తర్వాత దీనిని Tibotec అనే సంస్థ అభివృద్ధి పరిచింది.
ప్రస్తుతానికి దీని ధర మన భారతదేశంలో ఎక్కువ.
ఈ మందును తప్పనిసరిగా రిటనోవిర్ పాటుగ తీసుకోవాలి.
ఈ మోతాదును రోజుకు రెండుసార్లు గాని ఒక్కసారి గాని వెసుకొనవలసి వుంటుంది
రోజుకు ఒక్కసారి మోతాదు ఎవరు వేసుకోవాలంటె.
- ఇంతకు ముందు ఎలాంటి HIV మందులు వాడని వాళ్ళు ఈ మందుతొ గనక ప్రారంబించాలనుకుంటె DRV/RTV ( 800 mg డారునవిర్ + 100 Mg రిటనోవిర్ ) కలిపి రోజుకు ఒక్కసారి వెసుకోవాలి.
రోజుకు రెండు సార్లు మోతాదు ఎవరు వేసుకోవాలంటె.
- ఇంతకు ముందు HIV మందులు వాడిన వాళ్ళు ఈ మందు గనక వెసుకోవాలంటె DRV/RTV ( 600 mg డారునవిర్ + 100 Mg రిటనోవిర్ ) కలిపి రోజుకు రెండుసార్లు వెసుకోవాలి.
ఈ మందును పిల్లలకు వారి బరువును బట్టి డొసేజ్ ఇవ్వవచ్చును.
3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వేసుకొనెందుకు అమోదించలేదు.
ఈ మందును తిన్న తర్వాత వేసుకొవాలి.
ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితో పాటుగా కనీసం రెండు ఇతర HIV మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
ఈ దుష్ప్రబావాలు  (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు.
కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు.
కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
కాలేయ సమస్యలు: తక్కువ CD4 సంఖ్య వున్న వాళ్ళు ఈ మందును వెసుకున్నప్పుడు కాలెయ సమస్యలు రావచ్చు.
మీ డాక్టరు ఎప్పటికప్పుడు మీ లివర్ ఎంజైములను (LFT's) టెస్ట్ చెస్తు మీ లివరు యొక్క పనితనాన్ని పరీక్షించవచ్చు.
అలసట అకలి లేకపొవటం.
కళ్ళు, చర్మం పసుపు రంగులోనికి మారటం, తెల్లటి విరేచనాలు అయితే వెంబడె డాక్టరును సంప్రందించండి.
Protease Inhibitor తరగతికి చెందిన ప్రతి మందు రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి.
దీనివల్ల చాతి బాగంలో, మెడ వెనక భాగంలో గొపురంలా కొవ్వు ముందుకు రావచ్చు, అలాగే మోహం పైన చర్మం కుంచించుకుపొవచ్చు.
రక్తంలో కొవ్వు శాతం పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావచ్చు.
అలాగే Protease Inhibitor లను వాడె వారిలో డయాబెటిస్ (మధుమేహం) వచ్చేఅవకాశం ఉంది.
సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, లెత తెలుపు రంగు విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, చర్మం పైన దుద్దుర్లుఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు.
మీకు లివర్, కిడ్ని సమస్యలు ముందు ఉండివుంటే.
గుండె సంబందిత సమస్యలు వుండి వుంటె, అలాగెమధుమేహం ఉండివుంటె ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది.
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి B గా వర్గీకరించబడ్డది.
అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలో తెలినది ఏమిటంటె గర్బం లోని పిండానికి హాని చేకురుస్తుంది .
కాని మనుషుల పైన సరియైన, కచ్చితమైన సమాచారం లేదు.
గర్బిణి మహిళలు ఈ మందును వెసుకునెముందు డాక్టరుతొ చర్చించడం ఉత్తమం అలాగే బాలింత మహిళ పాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు.
అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.