62.txt 2.23 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12
తెలంగాణ_గ్రామజ్యోతి_పథకం

https://te.wikipedia.org/wiki/తెలంగాణ_గ్రామజ్యోతి_పథకం

తెలంగాణ గ్రామజ్యోతి పథకం తెలంగాణ రాష్ట్రం లోని గ్రామాల అభివృద్ధికోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం.
తెలంగాణ గ్రామజ్యోతి పథకాన్ని 2015, ఆగస్టు 17వ తేదీన వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించారు.
ఈ పథకం అమలు కోసం మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుచేసారు.
ఈ కమిటీలో మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, టి.
హరీశ్ రావు, జోగు రామన్న సభ్యులుగా ఉన్నారు.
గ్రామజ్యోతి పథకం అమలుకు ఒక్కో మండలానికి ఒక్కో అధికారిని, గ్రామగ్రామాన ‘గ్రామజ్యోతి' పేరిట వారోత్సవాలకోసం పంచాయితీలకు సిబ్బందిని నియమించారు.
ఈ పథకంలో భాగంగా రానున్న 5 ఏళ్లలో గ్రామాల అభివృద్ధికి రూ.
25 వేల కోట్లు ఖర్చ చేయాలని... జనాభాను బట్టి అన్ని గ్రామాల అభివృద్ధికి రూ.2 నుంచి 6 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి నిధులు అందివ్వనున్నారు.