255.txt 3.27 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23
బెణుకు

https://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B1%86%E0%B0%A3%E0%B1%81%E0%B0%95%E0%B1%81

ఆకస్మికంగా కాలుజారుట వలన, తమాయించుకోవడానికి ప్రయత్నించడంలో స్నాయువు లేదా సంధి కండరాలు (Ligaments) బాగా లాగబడడం లేదా మలపడడం గాని జరిగి వాచిపోయి తీవ్రమైన నొప్పి కలుగుతుంది.
దీనినే బెణుకులు (Sprains) అంటారు.
ఇంకా ప్రమాదమైన పరిస్థితులలో ఈ సంధి కండరాలు పూర్తిగా తెగిపోవచ్చును.
అటువంటి పరిస్థితులలో శస్త్రచికిత్స అవసరమవుతుంది.
బెణుకులు ఎక్కువగా మడమ, మోకాలు, మోచేయి, మణికట్టు కీళ్ళకు జరుగుతుంది.
బెణుకుని ఆంగ్లంలో స్పెరియిన్ అని పిలుస్తారు.
స్పెరియిన్ తీవ్రత బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తారు.
మొదటి డిగ్రీ - సంధి కండరాలు లాగబడ్డాయి, కాని చాలా ఎక్కువగా లాగబడలేదు, తెగిపోలేదు.
రెండవ డిగ్రీ - సంధి కండరాలు బాగా లాగబడ్డాయి.
చాలా కొద్ది భాగంలో కండరాలు తెగిపోవచ్చు కూడా.
ఈ రకం బెణుకు అత్యంత నొప్పిని ఇస్తుంది
మూడవ డిగ్రీ - సంధి కండరాలు చాలా వఱకు తెగిపోయాయి.
ఈ రకం బెణుకుకి శస్త్ర చికిత్స అవసరం.
చాలా తీవ్రత కలిగిన ఈ బెణుకు వల్ల నొప్పి తీవ్రత తక్కువగా ఉంటుంది.చికిత్సని ప్రధానంగా RICE  అనే ఆంగ్ల పదంలో గుర్తు పెట్టుకొని చేస్తారు.
ఏ పనిచేస్తున్నప్పుడు బెణికిందో ఆ పని మళ్ళీ చేయవద్దు.
Rest- విశ్రాంతి-నొప్పిపెడుతున్న భాగానికి పూర్తి విశ్రాంతి అవసరం.
Ice- ఐస్ మంచుముక్కలను ఆ భాగం చుట్టూ మధ్యలో విరామంతో పెడుతుంటే నొప్పి త్వరగా తగ్గుతుంది.
Compression- కంప్రెషన్ బాండేజీ గుడ్డతో గట్టిగా చుట్టూ కట్టుకట్టి ఎత్తులో ఉంచండి.
Elevation- ఆ భాగాన్ని ఎత్తులో ఉంచడం