ఎకాంతోసిస్ నైగ్రికాన్స్https://te.wikipedia.org/wiki/%E0%B0%8E%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D_%E0%B0%A8%E0%B1%88%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8Dఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది ఒక చర్మసంబంధ సమస్య.చర్మపు ముడతలు, పల్లాలు ముదురు రంగులో వెల్‌వెట్ మాదిరిగా మందంగా తయారవటం ఈ వ్యాధి ముఖ్య లక్షణం.వ్యాధి ప్రభావానికి లోనైన చర్మం దళసరిగా మారడమే కాకుండా చెడు వాసన కూడా వస్తుంటుంది.ఈ వ్యాధిలో సాధారణంగా చంకలు, గజ్జలు, మెడ వెనుక చర్మపుముడతలు నలుపుగా, మందంగా తయారవుతుంటాయి.సాధారణంగా అధిక బరువు కలిగిన వ్యక్తుల్లోనూ, షుగర్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఈ లక్షణం కనిపిస్తుంటుంది.చిన్నతనంలో ఈ లక్షణాలు కనిపిస్తుంటే, పెద్దయిన తరువాత మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.చాలా చాలా అరుదైన ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది అమ్లాశయపు క్యాన్సర్‌కిగాని లేదా కాలేయపు క్యాన్సర్‌కిగాని హెచ్చరిక లక్షణంగా కనిపించవచ్చు.ఈ లక్షణం కనిపిస్తున్నప్పుడు సాధారణంగా దీనికి దారితీసే వ్యాధి స్థితిని సరిదిద్దితే సరిపోతుంది.చంకలు, గజ్జలు, మెడలోని చర్మపు ముడుతలు, పల్లాలు ముదురు రంగులోకి మారతాయి మందంగా, వెల్‌వెట్ గుడ్డ మాదిరిగా తయారవుతాయి ఈ మార్పులు వెంటనే కాకుండా నెమ్మదిగా, కొన్ని నెలలు, సంవత్సరాలపాటు చోటుచేసుకుంటాయి.వ్యాధి ప్రభావానికి గురైన చర్మం నుంచి చెడు వాసన వస్తుంటుంది.కొద్దిగా దురదగా కూడా అనిపిస్తుంటుంది.ఇన్సులిన్ హార్మోన్‌ని శరీరం వినియోగించుకోలేకపోవటం (ఇన్సులిన్ రెసిస్టెన్స్) : క్లోమగ్రంథి (ప్యాంక్రియాస్) ఇన్సులిన్ హార్మోన్‌ని విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే.ఇన్సులిన్ అనేది షుగర్‌ని శరీరం వినియోగించుకోవడానికి సహాయపడుతుందన్న సంగతి కూడా తెలిసిందే.ఒకవేళ ఈ ఇన్సులిన్ శరీరంగుర్తించలేకపోతే దానిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు.దీనివల్ల చర్మం ముడతలు మందంగా, నలుపుగా తయారవుతాయి.ఇన్సులిన్ రెసిస్టెన్స్‌వల్ల మున్ముందు కాలంలో షుగర్ వ్యాధివచ్చే అవకాశం ఉంటుంది.తయారై ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ రావచ్చు.అధిక బరువు, వంశపారంపర్యత, జన్యువులు.ఈ వ్యాధిని నిర్థారించడానికి కొంత సమాచారాన్ని మీరు డాక్టర్‌కి ఇవ్వాల్సి ఉంటుంది.ఉదాహరణకు: -మీ కుటుంబంలో నలుపుదనంతోకూడిన మందపాటి చర్మం ముడతలు ఉన్నాయా?చికిత్సల ఉద్దేశం-లక్షణాలను కలిగించే అంతర్గత వ్యాధిని ముందుగా గుర్తించి అదుపులో ఉంచటం.చర్మం ఎబ్బెట్టుగా కనిపించకుండా మచ్చల గాఢతను తగ్గించటం -ఆహారంలో మార్పులు చేర్పులను సూచించటం -ఒకవేళ అధిక బరువు కలిగి ఉంటే బరువు తగ్గేలాఆహార, విహార, ఔషధాపరమైన చికిత్సలనుసూచించటం చర్మంమీద నలుపు రంగు మందపాటి వైద్య సలహాతో వాడుకోవాల్సిన ఔషధాలు--పంచతిక్తఘృత గుగ్గులు, మహామంజిష్టాది క్వాథం, మహాభల్లాతక రసాయనం, అమృత భల్లాతక లేహ్యం, లంకేశ్వర రసం, అరగ్వదాది ఉద్వర్తనం, మహా మరీచ్యాది తైలం, శే్వత కరవీరాది తైలంకారణాన్ని బట్టి ట్రీట్ మెంట్ చేయాలి .మదుమేహము అదుపులో ఉండేటట్లు, కాన్సర్ అయితే దానికి తగిన వైద్యాన్ని ఇవ్వవలసి ఉంటుంది.సాధారణముగా ఇది దానంతట అదే తగ్గిపోవును .. . దాని మూలాన్ని బాగుజేసుకుంటే .Restoderm or Total derm వంటి ఆయింట్ మెంట్స్ బయట మచ్చలు పైన పూతగా రాస్తే కొద్దికాలములో ఇది పూర్తిగా మామూలు చర్మము రంగులోనికి మారిపోవును.