నాడి (యోగా)https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BF_(%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97%E0%B0%BE)సుషుమ్న నాడి :మానవ శరీరమునందు 72,000 నాడులు కలవని అనేక శాస్త్రములు (స్వరశాస్త్రమంజరి) వివరిస్తున్నవి.ఉపనిషత్త్ లలో కుండలిని ఉపనిషద్, యోగోపనిషద్,దర్శనొపనిషద్ వంటి అనేక యొగ గ్రంథములలో కూడా వివరణ ఉంది.యోగ సాధనలోని ఆసనముల-ప్రాణాయామ పద్ధతుల ద్వారాను- ధారణ ధ్యానాదుల సాధనచేతను శరీరమందలి నాడులను శుభ్రపరచి,మూలాధారమునందు నిదురించుచున్న శక్తిని ఉత్తేజపరచ వచ్చును.ఇడ (ఎడమ నాసగ్రము నందు)నాడి-పింగళ నాడి (కుడి నాసాగ్రమున)సుషుమ్న (నాసాగ్రము మధ్యన)కలదు.ఇడా నాడిని చంద్ర నాడి అని, పింగళనాడిని సూర్య నాడి అని కూడా చెప్పెదరు.ఈ నాడుల ఉద్దీపనను కుండలిని ఉద్దీపనము అని కూడా అనవచ్చును.ప్రాశ్ఛాత్యుల శాస్త్రము ప్రకారము మెదడులో గల భాగములలో ఎడమ భాగమునకు కుడి నాసాగ్రముతొను - మెదడు లోని కుడిభాగము నకు ఎడమ నాసాగ్రముతొను సంబంధము కలదు .అనగా సింపతటిక్, పరాసింపతటిక్ అన్ద్ సెంట్రల్ నెర్వస్ సిస్ట్మ్.మెదడులోని ప్రతీ కణమునకు నాడులు కలుపబడి ఉన్నాయి.ఆనాడులు మానవ శరీరమందలి అన్ని భాగములకు ప్రాణశక్తిని అందించుచున్నవి.