65.txt 1.88 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15
అమృతాంజనం

https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%AE%E0%B1%83%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B0%82

అమృతాంజనం (ఆంగ్లం: Amrutanjan) అనునది నొప్పి నివారిణిగా వాడబడే ఔషధతైలం.
ఇది అమృతాంజన్ హెల్త్ కేర్ అనే సంస్థకు చెందినది.
అమృతాంజం పేరు అమృతం + అంజనం అనే రెండు తెలుగు పదాల కలయికతో ఏర్పడింది.
అమృతాంజనం అనబడే ఈ ఔషధ తైలాన్ని 1893 లో భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్టు అయిన కాశీనాథుని నాగేశ్వరరావు కనుగొన్నారు.
ఈ ఔషధంతో ఆయన ప్రసిద్ధి చెందాడు.
ఆయన సంగీత కచేరీలలో ఉచితంగా సరఫరా చేసేవారు.
ప్రస్తుతం కూడా ఈ ఔషధం ప్రసిద్ధి పొందినది.
అమృతాంజన్ లిమిటెడ్ గా 1936 లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రూపుదిద్దుకొన్నది.
ఈ ఔషధాన్ని తలనొప్పికి ఎక్కువగా వాడుతారు.
ఈ ఉత్పత్తి అమృతాంజన్ హెల్త్‌కేర్కు చెందినది.
ఇది ప్రస్తుతం శంభుప్రసాద్ (కాశీనాధుని నాగేశ్వరరావు గారి మనుమడు) చే నిర్వహింపబడుతున్నది.