23. softskill_Principles of Business Writing-nYdlpa7xnVA.txt 53.2 KB
Newer Older
Vandan Mujadia's avatar
Vandan Mujadia committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236
    1. శుభోదయం! పూర్వపు మాడ్యూల్లో మనం రచనా నైపుణ్యాల గురించి నేర్చుకున్నాం.
    2. అందులో భాగంగా మన వ్యాపార లావాదేవిలలో ఇంకా రోజువారీ జీవితంలో ప్రభావవంతమైన రచనలయొక్క అనేక కోణాలను పరిశీలించాం.
    3. మేము రాయడం ప్రారంభించినప్పుడు రచనలో ఉపయోగించవలసిన వివిధ నమూనాల గురించి ఉద్ఘాటించాం.
    4. పాఠకుల యొక్క నేపధ్యం మన సందేశం వ్రాయటంలో ఎలాంటి ముఖ్యపాత్ర వహిస్తుందో తెలుసుకున్నాం.
    5. నమూనాల కంటే కూడా వ్యాపార రచనా సూత్రాల గురించి తెలుసుకోటం అత్యంత ప్రాముఖ్యమైనది.
    6. మీరు మీ స్నేహితులకు వ్రాసేవి మీ వ్యక్తిగత రచనలో భాగం, కానీ ఇక రాబోయే రోజులో మీరు మీ అద్భుతమైన వ్యాపార రచనలో ముందుకు వెళ్లాలి.
    7. కాబట్టి, మన జీవితానికి నిజంగా మార్గనిర్ధేశం చేసే సూత్రాలను తెలుసుకోవటం చాలా అవసరం.
    8. మీ రచనలు విభిన్నమైన పాఠకులను చేరుతాయి.
    9. వారి విద్యార్హతలు, వయసు, లింగం, రుచులు, నమ్మకాలు, సంస్కృతి, విశ్వాసాలు ప్రాధాన్యతలు నేపధ్యాలు వేరుగాఉంటాయి.
    10. కానీ రచయిత మరియు అతని పాఠకుల మధ్య రచన బాగా ఉందని తెలుసుకోవడం, ఇది పంపినవారికి మరియు గ్రహీతకు మధ్య ఒక రకమైన సినర్జీ.
    11. మిత్రులారా, వ్యాపార రచనలో Csలు చాలా ముఖ్యమైనవి. 
    12. అవి మీ రచనకు ఎంతో విలువ కలిగించి సంస్ధలో మీ ప్రాధాన్యతను పెంచుతాయి.
    13. అయితే ఈ 5 Cs ఏమిటి? మొదటిది స్పష్టత (Clarity).
    14. మీరు వ్రాయదలచుకున్నది ఏదైనా స్పష్టంగాఉండాలి.
    15. కొన్నిసార్లు సందిగ్దత ఉన్నప్పటికీ, అది కేవలం సాహిత్య రచనలలో, రొజువారీ గాసిప్లో కనబడేలక్షణం. కానీ వ్యాపార రచనలలో ముఖ్యంగా సందిగ్ధత అనేది ఆహ్వానంలేని అతిధి, అంటే కోరుకోనిది.
    16. మీ సందేశంలో సందిగ్ధత ఉంటే చర్య తీసుకోలేరు.
    17. కాబట్టి మీరు స్పష్టంగా ఉండాలి. ఇంకా ప్రజల కోసమే మీరు వ్రాస్తున్నారనే నమ్మకం ఉండాలి.
    18. అందుకే మీ రచనలో మర్యాద, మన్నన కనబడాలి.
    19. మీ రచనల ద్వారా మీరు సమాచారాన్నిఅందజేస్తున్నారు.
    20. అయితే సమాచారం అనేది చిరచిరలాడే వ్యక్తి చేతిలోని ఆటవస్తువు కాదు. చిందరవందరగా ఉండరాదు. మీరు పంపిన సమాచారం, సందేశాన్ని పాఠకులు వాటిని ముఖ్యమైనవిగా భావించాలంటే అవి మర్యాదపూర్వకంగా ఉండాలి. తరువాతి అంశం పరిగణన,(Consideration).
    21. మనంరచన చేసేటపుడు పాఠకులెవరో తెలియదు.
    22. కొన్నిసార్లు పాఠకులు చిన్న వయస్సు యువత లేదా వయసు పండిన వృద్దులై ఉండవచ్చు.
    23. కాబట్టి మీరు ఏం వ్రాసినా వారిపై ప్రభావం చూపిస్తుంది.
    24. మీ రచనలు ఎవరినీ బాధపెట్టకూడదని మీరు భావిస్తారు.
    25. కాబట్టి ఆలోచన యొక్క అవసరం తలెత్తుతుంది. తరువాత సారాంశం వస్తుంది. మీరు వ్రాసేటపుడు ఈ విషయాలన్నీ పరిగణించాలి.
    26. క్రిందటి ఉపన్యాసంలో మేము మాట్లాడినట్లుగా, సారాంశం ఎంత ముఖ్యమైనది.
    27. తరువాతి అంశం సంక్షిప్తత. అంటే మనం వ్రాసే సందేశం లేదా రచన క్లుప్తంగా ఉండాలి. అయితే క్లుప్తత కోసం మన రచనలకు క్లిష్టంగా చేయరాదు. నేను చాలాసార్లు చెప్పినాను.
    28. ఎవరూ కూడా నిఘంటువు లేదా శబ్దకోశం పక్కన పెట్టుకొని సందేశాలు చదవరు.
    29. ముఖ్యంగా లేఖలు, నివేదికలు వ్రాసేటపుడు క్లుప్తత పాటించాలి.
    30. క్లుప్తత పాటించేటపుడు ఇతర నిర్ధిష్ట ప్రమాణాలను దాటి ప్రవర్తించకూడదు, మీరు క్లుప్తత తప్పక పాటించాల్సిందే.
    31. అట్లాగే మీ పాఠకులు మీ రచనలోని ఉద్దేశం, సారాంశం అందరికీ అర్ధమయ్యేలా చేయాలి.
    32. తరువాతి అంశం సుహృద్భావం.
    33. మనం అనేక ఉదాహరణల ద్వారా వీటిని బాగా అర్ధం చేసుకుందాం.
    34. చాలా మంది వ్యాపార లావాదేవీల్లో మనుషులతో వ్యవహరిస్తున్నామనే విషయాన్ని మర్చిపోతున్నారు.
    35. కేవలం వ్యాపారం జరగటమే కాకుండా మనుషులతో కూడా ముందుకు వెశ్లాలి.
    36. కాబట్టి వ్యాపార రచన ఉద్దేశం భావవ్యక్తీకరణే కాని వారిని మెప్పించడంకాదు.
    37. కాబట్టి మీకు వ్యక్తీకరణ, మెప్పుదల మధ్య భేదాన్నిఉద్ఘాటిస్తాను.
    38. కొన్నిసార్లు మీరు చక్కగా అందంగా దుస్తులు ధరించిన వ్యక్తులచే ఆకట్టుకోబడతారు. ఒకోసారి అందమైన దుస్తులు ధరించకున్నా వ్యక్తులు మాట్లాడే మాటల వలన ఆకట్టుకుంటారు.
    39. కాని వ్యాపారంలోముఖ్యమైన విధి, భావవ్యక్తీకరణ.
    40. కాబట్టి మీకేం కావాలో చెప్పాలి. ఒక బాస్ గా మీరు సూచనలు ఇవ్వాలి. అవి స్పష్టంగా లేకపోతే ఏ చర్య జరగదు.
    41. ఒకోసారి ఇతరులను ఆకట్టుకోవడానికి మీరు చాలా క్లిష్ట పదాలు వాడి మెప్పించాలనుకుంటారు. కాని వారికి అవి అర్ధమైతే కాని వారు ఆకట్టుకోబడరు, 
    42. కాబట్టి అర్ధం అయితే మెప్పుదల వస్తుంది. దీనికై మీరు సరళత పాటించాలి.
    43. మీరు మీ స్పష్టతతో ఇతరులను మెప్పించవచ్చు. ఒక పువ్వు ఎలా మనని మెప్పిస్తుందో అలా మీరు చెప్పే పదాల్లో, సందేశంలో విషయాలు స్పష్టంగా చక్కగా సరిగ్గా ఉండాలి.
    44. ఒక మంచి రచన చాలా విలువైనది.
    45. అది స్పష్టంగా, క్లుప్తంగా సరళంగా ఉండాలి. మిత్రులారా,
    46. మీరు వ్రాసే పాఠకులకు మీరు వాడిన పదాలు అర్ధం కాకపోతే ఉపయోగం ఏంటి? కాబట్టి విచిత్ర పదాలు వాడద్దు.
    47. అందుకే నైపుణ్యత లేని రచయితలు అనుభవం లేని ప్రపంచ వైఖరి తెలియని వారు వ్రాసే సందేశం లేదా రచనల్లో స్పష్టత లేక మంచుతో కప్పబడినట్లు ఉంటాయని గమనించడమైనది. 
    48. నైపుణ్యత, అనుభవంలేని రచయితలు వ్రాసే సందేశాలు స్పష్టత లేక మబ్బుగా ఉంటాయి.
    49. మీరు అనేక ఉదాహరణలలో రచయిత వ్రాసిన సందేశంలో ఒక పదం క్లిష్టంగా ఉండి ఆ నిర్ధిష్ట పదం వద్ద సెండర్ ఆగిపోతాడు.
    50. ఎందుకంటే అతనికి ఆ పదం యొక్క అర్ధంకాని, సందర్భోచిత భావం కాని తెలియదు.
    51. ఉద్యోగులకు తగినంత అవగాహన ఈ రసాయనాల సంభావ్య ప్రతికూల పరిణామాల గురించి ఇవ్వబడలేదు.
    52. ఉదాహరణకి ఈవాక్యం చూడండి.
    53. ఈవాక్యాన్నిగమనిస్తే, అది కేవలం పొడవుగా ఉండటమే కాకుండా, అందులోని పదాలు పాఠకులకి అలసట కలిగించేవిలా ఉన్నాయి. అయితే పాఠకులు నిఘంటువు చూసి అర్ధం తెలుసుకుంటే సారాంశం స్పష్టంగా ఉంటుంది.
    54. కానీ పాఠకులకు అంత ఒపిక, సమయం ఉండవు.
    55. కాబట్టి స్పష్టత లేని సందిగ్ధత కలిగిన సందేశాలు మన సమయం, శక్తిపై నిరోధకంగా ఉండి మీ అవగాహన తగ్గిస్తాయి. 
    56. పైన చెప్పిన వాక్యాన్ని ఇలా స్పష్టంగా వ్రాయవచ్చు. ఈ రసాయనాల గురించి మీ ఉద్యోగులకు హెచ్చరిక చేయండి.
    57. ఇదే ఆ సందేశ సారాంశం. కాని ఆ విషయాన్ని గజిబిజిగా, కష్టతరంగా చేయడానికి క్లిష్టపదాలు వాడారు. 
    58. రచయితకి స్పష్టత ఉంటే ఇలా క్లుప్తంగా వ్రాసేవాడు. పాఠకుడికి అర్ధం అయ్యేది.
    59. మిత్రులారా స్పష్టత గురించి మాట్లాడేటపుడు అస్పష్ట పదాలని తొలగించాలనే విషయం పరిగణించాలి.
    60. కాలగమనంలో మీరు చాలా అనుభవజ్డులైన తరువాత ఈపదంవాడితే బాగుండేది కదా అనిపిస్తుంది. ఆ ప్రదేశంలో  వేరొక వాక్యం ఉపయోగించి ఉంటే 
    61. ఆ ప్రదేశంలో వేరొక వాక్యం ఉపయోగించి ఉంటే సందేశం ఇంకా బలంగా, ప్రభావవంతంగా ఉండేదనిపిస్తుంది.
    62. కాబట్టి అపరిచిత పదాల్ని తెలిసిన పదాలతో భర్తీ చేయాలి.
    63. అప్పడే మీ పాఠకులకు మీ రచన అర్ధం అవుతుందనే అభిప్రాయం కలుగుతుంది.
    64. అయితే స్పష్టత కోసం రచనని క్లుప్తంగా, క్లుప్తత కోసం క్లిష్టంగా చేయకూడదు.
    65. ఎపుడూ చాలా ఉదాహరణలు ఇస్తే బాగుంటుంది. కొన్ని సార్లు ఎక్కువ పదాలు వాడాల్సి వస్తే వాటిని ఉపయోగించాలి. తక్కువ పదాలు వాడి కష్టతరం చేయరాదు. 
    66. ఇక్కడ సలహా ఏంటంటే అవసరాన్ని బట్టి పదాల్ని వాడాలి.
    67. అయితే చాలా మంది ఈ అవసరాన్ని గుర్తించలేరు.
    68. వారు అవసరాన్ని గుర్తించినా తమ గజిబిజి రచనలతో పాఠకుల ఆలోచనా ప్రవాహాన్నిఅడ్డగిస్తారు.
    69. నా ఉద్దేశ్యం మీకు చాలా అక్షరాకు వస్తాయి. మీరు చాలా లేఖలు, మెయిల్స్, అసైన్మెంట్లు పొందుతూ ఉంటారు. అవి సంఖ్యలో ఎక్కువగా ఉన్నా నాణ్యతలో తక్కువగా ఉంటాయి.
    70. కాబట్టి అర్ధవంతంగా ఉంటేనే నాణ్యతగాఉంటాయి.
    71. అర్ధం జోడించాలంటే T.S.Eliot చెప్పిన సలహా పాటించండి.
    72. T.S.Eliot చెప్పింది ఇప్పటికీ నిజమని మీకు తెలుసు.
    73. అతను ఏమన్నాడంటే సబ్జెక్ట్ కి మించిన పెద్ద పదాలు వాడవద్దు.
    74. అంటే పాఠకుల స్థాయి ననుసరించి మరీ పెద్ద పదాలు వ్రాయద్దు. 
    75. మీరు అర్ధం చేసుకున్నప్పుడు , అది అపరిమితంగా ఉండకూడదు. 
    76. మీరు కొన్నిసారాలు ప్రజలు చాలా చెప్పాలని కోరుకుంటారు. కానీ వారు అనంతం వంటి పదం ఉపయోగిస్తారు.
    77.  అనంతం అనే పదం వాడాల్సి వచ్చినపుడు, అనంతం అంటే ఏమిటి? అసలు ఏ పదం ఉపయోగించలేరని ఎలియట్ అంటారు .
    78. కాబట్టి యువ మిత్రులారా, పదాలకి సందర్భానుసారంగా ఒక ప్రాముఖ్యత ఉంటుంది.
    79. ప్రతి పదానికి సమానార్ధకం లేదా పర్యాయపదం ఉంటుంది. కాని అవి అసలు పదాన్ని భర్తీ చేయలేవు.
    80. కాబట్టి ఎప్పుడూ సందర్భానికి సరితూగే పదాల్నే ఎంచుకోవాలి. కేవలం ఇతరులను మెప్పించటానికి కఠిన పదాల్ని వాడకూడదు.
    81. అందువల్ల, కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకోవడం చాలా సందర్భోచితంగా మారుతుంది.
    82. ఇవన్నీ మనం తగిన ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం.
    83. ఈ వాక్యంలో ఉదాహరణ చూస్తే, ఇది  వాస్తవానికి ఒక కస్టమర్  రాసిన లేఖలో భాగం.  
    84. మీ స్థాపన అందించిన  ''వినియోగదారుడు ఎక్కువ ధర ఉన్న AC, మాసంస్ధ నుంచి సరఫరా చేసినది, అది సరిగ్గా పనిచేయట్లేదని ఫిర్యాదు చేసినపుడు మాకు చాలా భయం ఆందోళన కలిగింది'' అని వ్రాయబడింది.
    85. ఇప్పుడు ఈ వాక్యాన్ని చూడండి.
    86. అసలు అర్ధం''భయాందోళనలు. కాబట్టి కోపం అనే పదం వాడితే తేలిగ్గా అర్ధమౌతుంది. అలాగే మిగిలిన వాక్యం కూడా క్లిష్టంగా ఉంది.
    87. మీ స్థాపన అందించిన ఎక్కువ ధర ఉన్న AC, అది సరిగ్గా పనిచేయట్లేదని ఫిర్యాదు చేస్తున్నారని చెప్తున్నారు.
    88. ఇక్కడ ఒక వాక్యం తగ్గించవచ్చు.
    89. మీరు వ్రాసిన లేఖను చదివి ఎవరైనా చర్య తీసుకోవాలంటే వారికి అర్ధం అవాలి కదా, కాబట్టి ఈ వాక్యాన్నిస్పష్టంగా, క్లుప్తంగా వేరే విధంగా వ్రాయచ్చు.
    90. ఒక సూచన నిస్తాను గమనించండి.
    91. సూటిగా చెప్పాలంటే, `మాకు AC గురించి ఫిర్యాదు వచ్చింది.
    92. మీ సూచనల కోసం ఎదురు చూస్తున్నాం.
    93. అర్ధం మారకుండా అదే విషయాన్ని మనం చెప్పవచ్చు. అంటే వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదుల గురించి ఏం చేయాలో సూచనలు కోరుతున్నారు.
    94. ఏదైనా చర్య తీసుకోవాలి.
    95. కాబట్టి మర్యాద పూర్వకంగా మేము సరఫరా చేసిన ACల గురించి ఫిర్యాదులు వచ్చాయి.
    96. మేము ఏం చేయగలమో సూచించగలరు.
    97. అని వ్రాస్తే ఇది పాఠకులు మెచ్చే పద్దతిలో ఉంటుంది. పరిస్ధితిని కొంత మెరుగు పరుస్తుంది.
    98. ఎపుడైనా మీరు వస్తువులు ఆర్డర్ చేసి తీసుకొన్నప్పుడు సరిగ్గా లేకపోతే చాలా కోపంవస్తుంది. ఆ కోపాన్నిఇతరులపై చూపించడం ఎందుకు.  
    99. మీకు మీ మనోవేదన తొలగి, ఫిర్యాదుకి సమాధానం దొరకాలి. అది మంచిగా వ్రాసినా సాధించవచ్చు.
    100. మరొక వాక్యాన్ని చూడండి,  బ్రాండెడ్ గాంచిన బ్రాండెడ్ ACలను సరఫరా చేసే డిస్టిబ్యూటర్ వద్ద నుండి అత్యధిక ధర చెల్లించి పొందిన AC యొక్క వెల డబ్బు రూపంలో తిరిగి పొందటానికి నేను ఏమి చేయాలో నాకు చెబుతారా?.
    101. మీ ఉత్పత్తిని కొనడానికి ఖర్చు చేసిన మొత్తాన్ని నేను తిరిగి చేలించగలను.. 
    102. ఈ వాక్యం లో వినియోగదారుని బాధ, కోపం కనిపిస్తున్నాయి. అయితే మర్యాద పూర్వకంగా ఇలా అడగవచ్చు నేను మీ వద్ద ఒక బ్రాండెడ్ AC కొన్నాను.
    103. దయచేసి ఈ ఫిర్యాదుని ఎలా పరిష్కరించవచ్చో తెలియ చేయండి.
    104. ఈ వాక్యం కూడా అదే ప్రయోజనాన్ని సాధిస్తుంది. అంతే కాకుండా భాష చాలా మర్యాదగా, రిసీవర్ దృష్టికోణంలో ఆలోచించి వ్రాయబడింది.
    105. మీరు ఏదైనా వ్రాసేటపుడు మిమ్మల్ని రిసీవర్ గా ఊహించుకొని వ్రాయమని నా సలహ.
    106. అపుడే మీరు సరియైన, ఉత్తమమైన రచనలు చేయగలరు.
    107. స్పష్టత కోసం సరిగ్గా వ్రాయటం కోసం మీరు కొన్ని పనులు చేయాలి.
    108. అందులో మొదటిది పదాల సంఖ్య తగ్గించడం.
    109. కొన్నిసార్లు 4 పదాల స్ధానంలో ఒకే పదం వాడవచ్చు.
    110.  3 పదాల బదులు ఒకటే వ్రాయవచ్చు.
    111. ఒక పెద్ద పదబంధంలో ఉంచడానికి బదులుగా మీరు సరైన పదాన్ని వ్రాయవచ్చు.
    112. ఒక పెద్దనిబంధన వాడే బదులు ఒక చిన్న పదబంధం వాడవచ్చు.
    113. అది ఎలా సాధ్యం ? నేను ఒక ఊదాహరణ నిస్తాను. మిగిలినవి మీరు ఆలోచించి తెలుసుకోవచ్చు. మీరంతా తెలివైనవారు కదా. మీరు పరిస్ధితిని సందర్భాన్ని బట్టి సరైన పదాలు వాడాలి.
    114. ఒక ఉదాహరణ there are three words. బదులుగా many అని వ్రాయచ్చు. అది కూడా లక్ష్యాన్ని సాధిస్తుంది.
    115. కనుక ఇది ఒక పదం.
    116. 3 పదాలను ఉపయోగించడానికి బదులు ఒక పదాన్ని ఉపయోగిస్తాము మరియు అది ప్రయోజనానికి కూడా ఉపయోగపడుతుంది.
    117. అలాగే'' at your earliest possible convenience'' బదులుగా' soon 'అని వ్రాయచ్చు. అంటే పని తోందరగా జరగాలని మీ ఉద్దేశం.
    118. కాబట్టి, మీ సాధ్యమైనంత త్వరగా దాన్ని ఉపయోగించడంతో పోలిస్తే దీన్ని వెంటనే ఎందుకు ఉపయోగించకూడదు.
    119. పదాల సారాంశం. కాబట్టి నిర్దిష్టత లేని పదాల్ని తీసి వేయండి. చిన్నగా ఉన్న పదాల్నివాడండి.
    120. అలాగే 'fullest possible extent' వంటి పదాల వాడకాన్ని కూడా చూస్తాము.
    121. బదులు' fully' అనే పదం వాడితే సరిపోతుంది.
    122. కొంత మంది''It would be unreasonable to assume' 'అని వ్రాస్తారు. దాని బదులు' be natural 'లేదా 'don't assume' అని వ్రాయచ్చు. క్లిష్ట పదాల వలన వాక్యాలు గజిబిజిగా మారిపోతాయి.
    123. కానీ మీరు తటస్థంగా ఉండటానికి ప్రయత్నిస్తారని మీరు చెప్తారు, మీరు నిజంగా చాలా భారం పడుతున్నారు, మీరు ఈ పదబంధాన్ని అనుచితంగా ఉపయోగించుకుంటారు, కాబట్టి నేను దానిని ఉపయోగించడానికి అంగీకరిస్తున్నాను ఎందుకంటే ఇది కూడా సరైనదే.
    124. సరియైన చిన్నపదాలు వాడితే స్పష్టత ఉంటుంది, విషయం సరిగ్గా అర్ధమవుతుంది. నిజానికి ఇక్కడ రచయిత పాఠకుని దృష్టికోణంలోఆలోచించివ్రాయటంలేదు. అలా ఆలోచిస్తే చక్కని ప్రభావవంతమైన ,సరళమైన పద్దతిలో వ్రాస్తే వ్రాస్తారు. ఈ పరిస్ధితిని మనం చేధించలేమా? అంటే పరిస్ధితి మెరుగు పర్చవచ్చు.
    125. రచన అనేది సాధనతోనే వస్తుంది.
    126. 'సాధనమున పనులు సమకూరు ధరలోన ' అనే సామెత కూడా ఉంది.
    127. ఒక సంస్ధలో ప్రవేశించిన నూతన వ్యక్తిగా మీకు అనేక బాధ్యతలు అంటే రచనా బాధ్యతలు కూడా ఇవ్వబడతాయి. దాని వలన మీరు దిక్కు తోచని స్ధితిలో ఉంటారు. అయితే అలా ఆందోళన చెంద నక్కరలేదు. సాధన వలన అన్నీ నేర్చుకొని చేయగలరు.
    128. కొంతమంది వ్యక్తులు మర్యాదని త్యజిస్తారు.
    129. అయితే ప్రపంచంలో మర్యాద గల వారు కూడా ఉంటారు.
    130. మీరు రిసీవర్ అయితే ఇతరుల రచనలో మర్యాదని కోరుకుంటారుకదా.
    131. మీరు రచన చేసేటపుడు అవతలి వ్యక్తి మానసిక స్థితి తెలియదుకదా. వారు చాలా భావోద్వేగం పొందవచ్చు. 
    132. కాబట్టి మర్యాద పాటిస్తే మంచిది. ఈ కాలంలో వ్యాపార లావాదేవీలన్నీ మంచి సంబంధాల పైనే ఆధారపడి ఉన్నాయి. ప్రభావవంతమైన, మర్యాదా పూర్వకమైన కమ్యూనికేషన్ తోనే అది సాధ్యం.
    133. మర్యాద పూర్వకంగా ఉండాలంటే దానికి కొంత నైపుణ్యత మరియు కొంత తెలివి ఉండాలి. మీరొక సంస్ధ డైరెక్టరుని కలవాలనే తొందరలో ఉన్నారు. కాని రిసెప్షనిస్ట్ మీరు డైరెక్టర్ని కలవలేరు, అతను ఊళ్లో లేడని మీకు తెలియదా అంటారు.
    134. ఈ విషయాన్నే వారు మర్యదా పూర్వకంగా చెప్పవచ్చు. మీరు డైరెక్టర్నికలవాలని శ్రద్ద చూపినందుకు ధన్యవాదాలు.కాని అతను ఇవాళ ఊళ్లో లేడు.
    135. అతను వెనక్కి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాము.
    136. ఇలా చెప్తే అవతలి వ్యక్తికి బాధ అనిపించదు.రిసెప్షనిస్ట్ మీరు డైరెక్టర్ని కలవలేరు, అతను ఊళ్లో లేడని మీకు తెలియదా అంటే,  పరుషంగా మాట్లాడితే బాధ కలుగుతుంది.
    137. అలాగే కొన్నిసార్లు సూటిగా ఉన్న భాషని గమనించవచ్చు. మీరు నాకు 12 గీజర్స్ అధికారిక వెలకి పంపిస్తారా? ఇక్కడ మీరు ఒక వ్యాపార లావాదేవీలు జరుపుతున్నారు.
    138. కాబట్టి సూటిగా కాకుండా ఇంకో విధంగాచెప్పవచ్చు.
    139. మాకు 125 గీజర్స్ కావాలి.
    140. మీరు అధికారిక వెలకే సరఫరా చేయగలరని ఆశిస్తున్నాము" 
    141. లేదా ''మేము కొనాలనుకొన్న 125 గీజర్స్ వెల తెలియ చేయగలరా ?అనవచ్చు.
    142. దాని వలన మీకు ఖర్చేం ఉండదు. లాభమే కలుగుతుంది.
    143. కొన్నిసార్లు మీరు ఒక మీటింగ్కి వెళితే అక్కడ ఈ విధంగా బోర్డు కనిపిస్తుంది. ఎక్సిక్యూటివ్ కమిటీ మీటింగ్ వాయిదా వేయబడింది.
    144. అనగా, మీరు అక్కడ ఒక సమావేశానికి వెళ్ళారు. అకస్మాత్తుగా ఎక్సిక్యూటివ్ కమిటీ మీటింగ్ వాయిదా వేయబడింది  అని మీకు తెలిసింది.
    145. ''ఇది ఇంకో పద్దతిలో చెప్పవచ్చు మరియు రచన భిన్నంగా ఉండవచ్చు.  
    146. కొన్ని అనివార్య కారణాల వలన సమావేశం వాయిదా పడినందున మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. 
    147. ఇలా వ్రాస్తే చదివిన వారికి బాగా అనిపిస్తుంది. వారు తమ భావాల్ని పరిగణించినందుకు సంతోషిస్తారు.
    148. ఒకోసారి మీకు ఒకసందేశం వస్తుంది. కేవలం PAN నంబరు మాత్రమే మీ ఆన్లైన్ Tax ప్రక్రియని సులభతరం చేస్తుందని మీరు తెలుసుకోవాలి.
    149. దీన్నిమనం మెరుగు పర్చవచ్చు. 'మీరు PAN నంబరు ఇవ్వగలిగితే అభినందనీయులు. 
    150. దీని వలన మీ ఆన్లైన్ Tax ప్రక్రియ సులభతరం అవుతుంది.
    151. కాబట్టి ఏదైనా వాక్యం పరుషంగా అనిపిస్తే దాన్ని రెండు వాక్యాలుగా విభజించి, సరైన పదాల్ని, సున్నితంగా మర్యాద పూర్వకమైన పదాల్నిఎంచుకోవాలి.
    152. లేకపోతే ప్రజలు రిసీవర్స్ ఆ వాఖ్యలని అపార్ధం చేసుకుంటారు.
    153. ఇతరులని బాధ పెట్టకండి. మర్యాదగా ఉండటానికి ప్రయత్నిద్దాం.
    154. ఒకోసారి మీరు ఒక ఉద్యోగం కోసం ధరఖాస్తు పంపినపుడు మీకొక సందేశం లేదా లేఖ వస్తుంది.
    155. కొన్నిసార్లు ఇది పోస్ట్ ద్వారా మీకు వస్తుంది, కానీ మీరు దీన్ని వ్రాయబోతున్నందున, మీరు అలాంటి ఆలోచనలను పాటించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను.
    156. మీరు మరొక వైపు ఉన్నవారిని ఎక్కువగా పరిగణించాలి.
    157. ఈ పరిగణన సరియైన పదాలు, వాక్యాల అమరిక వలన వస్తుంది.
    158. ఉదాహరణకి మీరొక ప్రాజక్ట్ కోసం ధరఖాస్తు చేశారు.
    159. దానికి సమాధనం ఇలా వచ్చింది. ఈ సంవత్సరం నిధుల కొరత వలన మీ ప్రాజక్ట్ తిప్పి పంపుతున్నాం. వచ్చే సంవత్సరం మళ్లీ పంపండి.
    160. ఈ సందేశం వలన ప్రాజక్ట్ ఆమోదించ బడలేదని తెలిసినా ఇతరులను బాధ పెట్టే విధంగా ఉండకూడదు.
    161. దీన్నే వేరే విధంగా వ్రాయవచ్చు, ''మీరు ప్రాజక్ట్ సమర్పించి నందుకు ధన్యవాదాలు.
    162. మాకు ఈ సంవత్సరం నిధుల కొరత ఉందని చెప్పడానికి చింతిస్తున్నాం.
    163. మాకు నిధులు లభించగానే మీకు తెలియజేస్తాం.
    164. అంటే మీరు ఇతరులను నిరాశ పర్చకుండా విషయం చెప్తున్నారు.
    165. మిత్రులారా, మీరు ఇతరులకు ఏమీ ఇవ్వలేక పోయినా కొంత ఆశ కలిగించవచ్చు.
    166. కాబట్టి ఒక ప్రతికూల సందేశం ఇచ్చేటపుడు దాన్ని ఒక అనుకూల సందేశం మధ్యలోఉంచాలి. అప్పుడే ఆశ తరిగి పోకుండా ఉంటుంది. మాకు నిధులు లభించగానే మీకు తెలియజేస్తాం.
    167. ఆశ జీవించి ఉండాలంటే మనం రచయితగా పాఠకులకి లేదా రిసీవర్స్ కి ఆశ కొనసాగించాలి.
    168. మనం ఇంకొక ఉదాహరణ చూద్దాం.
    169. మీ కంపెనీ నుండి క్రితం నెలలో కొన్న DVD ప్లేయర్స్ కి వచ్చిన పగుళ్లను ఎందుకు సరిచేయలేదో దయ చేసి వివరించగలరు.  
    170. ఈ వాక్యంలో మీరు మీ కోపోద్రేకాన్ని భావోద్వేగాల్ని వెల్లడి చేస్తున్నారు.
    171. దీన్నికొంత వేరేగా మర్యాదగా, నెమ్మదిగా చెప్పవచ్చు. మేము మీ వద్ద DVD ప్లేయర్స్ కొన్నాము. వాటికి పగుళ్లు ఏర్పడ్డాయి. వాటిని ఎలా సరిచేస్తారో తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇక్కడ మీరు కేవలం వాక్యాల్ని విభజించి మర్యాదా పూర్వకంగా అడిగారు.
    172. ఎలా సరిచేస్తారో మీకు తెలుసా.
    173. ఆలోచనాత్మక విధానంతో వాక్యాన్ని విభజించాలి. అలాంటి ఆలోచన కోసం ప్రయత్నిస్తున్నాము.
    174. వ్యాపార లావాదేవీలను నేను పునరావృతం చేస్తున్నాను.. 
    175. వ్యాపార లావాదేవీలలో అది ఫిర్యాదు, మనోవేదన, లేదా జవాబు ఇవ్వడం అయినా మనం రిసీవర్కి మన ప్రశంసలు తెలపాలి. అప్పడే ఆ వ్యవహారం సులభంగా జరుగుతుంది.
    176. అలాగే మన సందేశం సంక్షిప్తంగా ఉండాలి. 
    177. అంటే క్లుప్తంగా, పొందికగా ఉండటం.
    178. దానికి మనం ఏం చేయాలి? మృదునైన పదబంధాల్ని తొలగించాలి.
    179. రచనలో చివరి అంశం పునర్విమర్శ కదా. రచన పూర్తి చేసి ప్రచురించే ముందు ఒకసారి పునర్విమర్శ చేసుకోవాలి.
    180. అపుడు కొన్నిఅవసరం లేని పదాలు, నిబంధనలు, పదబంధాల్నితొలగించాలి. అపుడే రచన సంక్షిప్తంగా ప్రభావవంతంగా ఉంటుంది.
    181. ఒకోసారి కొన్నిపదాలు కష్టతరంగా ఉన్నాయని గమనిస్తారు.
    182. అది అర్ధాన్ని జోడించకుండా అవరోధం కలిగిస్తున్నాయి.
    183. ఇలాంటి వాటిని మనం అనవసర పునరావృతాలు లేదా శిధిల పునరావృతాలు అని అంటాం.
    184. అనవసర పునరావృతాలు లేదా శిధిల పునరావృతాలు సంక్షిప్తతకై తొలగించవచ్చు.
    185. మిత్రులారా,  సంక్షిప్తత చమత్కారానికి ఆత్మ అని చిన్నప్పటి నుండి మీరు మీ ఉపాధ్యాయులు చెపితే వినే ఉంటారు.
    186. అంటే ఏంచేయాలి? మీరు అధికంగా ఉన్న నామవాచకాలు, ఆడంబరమైన పదాలు, పొడవైన వ్యక్తీకరణలను తగ్గించాలి.
    187. మీరు 3 పనులు చేయాలని నేను కోరుతున్నాను. అనేది సామాన్య వాక్యం, అర్ధం సరిగ్గానే ఉంది.
    188. కాని ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే 'మీరు 3 పనులు చేయాలి అనవచ్చు. 
    189. మీరు 3 పనులు చేయాలని నేను కోరుతున్నాను. అని ఎప్పుడూ చెప్తాము.
    190. అంటే దీని ధర ఏమిటి? దీనికి ఎక్కువ ఖర్చు కాలేదు. కేవలం కొన్ని పదాల్ని త్యజించారు. 
    191. కొన్నిసార్లు అనవసర పదాల భారం వలన వాక్యాలు సరిగ్గా, అనిపించినా అర్ధం ఉక్కిరి బిక్కిరి అవుతుంది.
    192. ఉదాహరణకి నాణ్యతా నియంత్రణ విభాగంలో ఉన్న అసంబద్ద ధృవీకరణ ప్రక్రియ వలన వినియోగదారుల నుండి భారీగా వచ్చిన ఫిర్యాదులను సమయం వృధా చేయకుండా దర్యాప్తు చేయాలి. 
    193. ఈ వాక్యం చదవడానికి చాలా అందంగా అనిపించినా పాఠకులకు కష్టంగా ఉంటుంది.
    194. కాబట్టి ఇలావ్రాయచ్చు. మాకు నాణ్యతా నియంత్రణ నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దర్యాప్తు అవసరం.
    195. మనం అదే విషయాన్ని చాలా తేలికగా అర్ధమయ్యేలా ఇంకో విధంగా చెప్పాము.
    196. మనం ఇలా సమస్యలని, గందరగోళాన్ని రిసీవర్ దృష్టికోణం నుంచి చూడాలి. 
    197. రిసీవర్స్  స్థానంలో ఉండి అలోచిస్తే సమాధానాలు లభిస్తాయి.
    198. అందరికీ మీలాగే సమస్యలు, సమయ పరిమితులు ఉంటాయి.
    199. కాబట్టి మీరు అధికారిక సూచనలు అనుసరించి సరైన సమయంలో నివేదికలు సమర్పించాలి.
    200. ఒక సంస్ధలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అందరికీ సమయ పరిమితు లుంటాయనే హెచ్చరికనిస్తారు.
    201. సభ్యులు ఇలాంటి భాషను ఉపయోగిస్తారు. 
    202. సంస్ధలో అందరూ అధికారిక సమయపాలన చేస్తారు.
    203. అధికారిక సమయం ప్రకారం శుక్రవారం అందరూ నివేదికలు సమర్పించాలి.
    204. ఉదాహరణకి ఇలా చెప్పచ్చు. అందరికీ సమయ పరిమితి సమస్యలున్నా, సమయం ప్రకారం నివేదికలు సమర్పించాలని కోరుకుంటున్నాము.
    205. కాబట్టి మర్యాద పూర్వకంగా వ్రాయాలనే ఉద్దేశాన్ని పరిగణించాలి. క్లుప్తత కోసం మనస్సాక్షిని మర్చిపోకూడదు.
    206. మీ అవసరం ప్రకారం పదాలు ఎక్కువో, తక్కువో వాడవచ్చు.
    207. ఇవన్నీ పాటించేటపుడు సుహృద్భావాన్ని వదిలిపెట్టద్దనే జాగ్రత్తను పాటించాలి.
    208. లిఖిత లేదా మౌఖిక కమ్యూనికేషన్ అంతా కూడా సుహృద్భావం, సహకారాల సమ్మేళనమే.
    209. అయితే లిఖిత కమ్యూనికేషన్లో రచయిత కాని పాఠకుడు కాని కనిపించరు. కాబట్టి చాలా సవాలుగా ఉంటుంది.
    210. కాబట్టి మీ సందేశం ప్రతికూలంగా, నిర్భయంగా కాకుండా ఆసక్తి కలిగించేదిగా ఉండాలి. పాఠకులకు ఆసక్తి కలిగించకుంటే అది విఫలం అయినట్లే.
    211. వినియోగదారునికి సంస్ధకి మధ్య జరిగే ప్రతికూల వ్యవహారం వలన సంస్ధకే భారీ నష్టం కలుగుతుంది.
    212. కాబట్టి సరియైన భాషనుపయోగించాలి.
    213. సుహృద్భావం కోల్పోకూడదు.
    214. ఉదాహరణకి మాకు సంస్ధ పురోగతి ఎందుకు కుంటుపడుతోందో అర్ధం కావట్లేదు.  
    215. ఆ పదాలను, భాషను తగ్గించి, పునశ్చరణ చేసికొని తిరిగి వ్రాయవచ్చు. మేము సంస్ధ పురోగతి గురించి ఆందోళన చెందుతున్నాము అని వ్రాయచ్చు.
    216. అలాగే ఇంకో వాక్యంలో మీరు మా సంస్ధ సభ్యులు కారు, మీ డిమాండ్లు మేము అనుమతించలేము. 
    217. ఇది ఇతరులను ప్రభావితం చేస్తుంది.
    218. బదులు, సూటిగా చెప్పాలన్నా కూడా ఇది సభ్యుల కోసమే, మీకు సభ్యత్వం ఉంటే మిమ్మల్ని అంగీకరించే వీలుంది అని చెప్పవచ్చు.
    219. లేదా మేము మా సభ్యులనే అనుమతిస్తాం అని వ్రాయచ్చు.
    220. మీరు సభ్యులుగా మా సంస్ధలో చేరితే బాగుంటుంది అని చెప్పచ్చు.
    221. ఈ విధంగా వ్రాస్తే స్నేహపూర్వకంగా ఉంటుంది. కాబట్టి మొదట్లోనే ప్రతికూల పదాలను వాడద్దు.
    222. ఉదాహరణకి మీరు సమర్పించిన నివేదికపై ఇలా స్పందన వచ్చింది. మీ నివేదికలో అనేక అంశాలను పరిశీలించినందున సంతృప్తికరంగా లేదు. ఇది చాలా ప్రతికూలంగా ఉంటుంది.
    223. ఇంకో విధంగా ఇలా అడగచ్చు మాకు వివరంగా ఉన్న నివేదిక అయితే అభినందనీయంగా ఉంటుంది. 
    224. మిత్రులారా ప్రపంచంలో చాలా కఠినత ఉన్నప్పటికీ లిఖిత, మౌఖిక కమ్యూనికేషన్ సౌమ్యత ప్రదర్శించాలి.
    225. మనషులుగా మనం సందేశాన్ని చదివే పాఠకుల సెంటిమెంట్స్, భావోద్వేగాల్ని అర్ధం చేసుకోవాలి.
    226. కాబట్టి ఆశావాదాన్ని కలిగి ఉండాలి. పరిస్ధితులు ఎప్పుడు తారుమారౌతాయో మనకు తెలీదు.
    227. మీరు రిసీవర్స్ స్థానంలో ఉండి, వేరొక రచయిత వ్రాసిన పరుషమైన కఠినమైన లేఖను చదివి ఇలాంటి బాధే పొందచ్చు. 
    228. అందువలన మనకి బాధ కలిగించే వారికి మనం కూడా నొప్పి కలిగించద్దు.
    229. వారికి తప్పక ఆశావాదాన్నేఇద్దాం. 
    230. ఆస్కార్ వైల్డ్ చేప్పినట్లుగా మీరు మంచిగా ఉన్నట్లు నటిస్తే ప్రపంచం మిమ్మల్ని తీవ్రంగా పరిగణిస్తుంది.
    231. అనగా మనం ఇతరులు మంచిగా ఉండాలని కోరుకునే ప్రపంచంలో జీవిస్తున్నాము.
    232. మీరు మంచిగా ఉన్నట్లు నటిస్తే ప్రపంచం మిమ్మల్ని తీవ్రంగా పరిగణిస్తుంది. అయితే మీరు చెడువారిగా నటిస్తే ప్రపంచం వెంటనే గుర్తిస్తుంది.
    233. ఇదే ఆశావాదం యొక్క నమ్మశక్యం కాని మూర్ఖత్వం'' ఎందుకంటే ప్రపంచంలో అందరూ ఇతరులు మంచిగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి వ్యాపార లావాదేవీల్లో కూడా మీరు ఆశను కలిగి ఉండండి. ఇరువైపులా మంచి సంబంధాల్నికొనసాగించండి. ప్రపంచంలో నదులుంటాయి . గాలిఉంటుంది. అయితే కల్లోలంగా ఉన్ననదిలో కూడా నావికుడు చక్కగా నడపగలడు కదా.
    234. అలాగే ఒక కమ్యూనికేటర్ గా మీరు రచనలు ఎలా చక్కగా, చేయాలో, ప్రయాణం ఎలా సున్నితంగా సాగాలో, వినియోగదారులతో ఎలా చక్కని సంబంధాలుండాలో అన్నీ మీరు చక్కగా ముందు సాధన చేయడం చాలా అవసరం.
    235. ధన్యవాదాలు!