26. softskill_Meta-communication-rlrM3zx8Dio.txt 44.4 KB
Newer Older
Vandan Mujadia's avatar
Vandan Mujadia committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171
    1. సాఫ్ట్‌ స్కిల్స్‌ (Soft Skills) ఉపన్యాసాలకు పునః స్వాగతం. 
    2. మనం ఇప్పటి వరకూ సాఫ్ట్‌స్కిల్స్‌(Soft Skills) ఏ పద్ధతుల ద్వారా సమర్ధవంతంగా నేర్చుకోవచ్చో వివిధ పాఠ్యాంశాల ద్వారా తెలుసుకున్నాము.
    3. పూర్వపు ఉపన్యాసంలో పదాలు లేకుండా కమ్యూనికేషన్‌ చేయడం కూడా ఒక నైపుణ్యమని తెలుసుకున్నాం.
    4. అశాబ్దక సంకేతాలు ముఖాముఖి సంభాషణలో ఎలా సహాయ పడతాయో చూశాం. 
    5. మనం కేవలం మౌఖికంగా, మాటలతోనే కాక అశాబ్దికం సంభాషణ కూడా చేస్తాము.   
    6. దీనిలో కైనిసిక్స్‌‌, ప్రాక్సిమిక్స్‌, క్రొనిమిక్‌, హాప్టిక్స్‌ ఇంకా పారాలాంగ్వేజ్‌  గురించి చర్చించుకున్నాం.
    7. ఈవేళ మనం ఇంకొక ముఖ్యమైన అశాబ్దిక కమ్యూనికేషన్‌ అయిన మెటా కమ్యూనికేషన్‌ (Meta-communication) గురించి నేర్చుకుందాం.
    8. మీకు ఆసక్తి కలిగించే మెటా కమ్యూనికేషన్‌ అంటే ఏమిటి?
    9. మెటా కమ్యూనికేషన్‌ రెండు భాగాలున్నాయి.
    10. మెటా అంటే 'మించి' అని, అర్ధం కమ్యూనికేషన్ అంటే సమాచారం అందించుట. పదాలను మించి మనం తెలుసుకునేదే మెటా కమ్యూనికేషన్.  
    11. మెటా కమ్యూనికేషన్‌ (Meta-communication)లో వివిధ అంశాలు ఏమిటి? మన మెటా కమ్యూనికేషన్‌ (Meta-communication) చేసేటపుడు కేవలం పదాలకు మాత్రమే పరిమితం కాము.
    12. పదాలు నిర్దిష్ట అర్ధాన్ని కలిగి ఉంటాయి.
    13. అయితే సందర్భమును బట్టి, వక్త, స్వరస్ధాయి, భావోద్వేగము వంటి వాటిపై ఆధారపడి పదము యొక్క అర్ధం మారుతుంది. ఇదంతా మెటా కమ్యూనికేషన్‌.
    14.  ఒక కమ్యూనికేషన్‌ లో వక్త ఎంచుకున్న పదాల సందర్భాన్ని బట్టి ఆ పదం యొక్క ఉద్దేశిత అర్ధం మారుతుంది.
    15. మనం ఆ పదాన్ని ఎలా పలుకుతామనేది కూడా ముఖ్యమే.
    16. కొంతమంది నత్తిగా మాట్లాడుతారు.
    17. కొంతమంది మాటలకోసం తడుముకోవటం, సంకోచించటం నిశ్శబ్దంగా ఆగిపోయి మాట్లాడుతారు. 
    18. ఇవన్నీ మెటా కమ్యూనికేషన్‌ లో భాగమే.
    19. మెటా కమ్యూనికేషన్‌ లో స్పీకర్‌  పదాలను ఎంచుకోవటం, స్వరాన్ని నిర్ధారించుకోవటం ఇవన్నీ ఉంటాయి.
    20. మనం మాట్లాడిన ప్రతి సారీ ఒకే స్వర స్ధాయిలో మాట్లాడము.
    21. అలా అయితే కమ్యూనికేషన్‌ అంతా ఒంటరిగా మారుతుంది. 
    22. మనం సందర్భాన్ని, పరిస్ధితిని బట్టి, మన ఉద్దేశం ప్రకారం ఒక పదాన్ని మనం జాగ్రత్తగా వాడుతాము. అది కమ్యూనికేషన్‌కి ఎంతో దోహదం చేస్తుంది.
    23. మెటా కమ్యూనికేషన్‌ పదాలను మించి ఉన్నప్పుడు అది ఉద్దేశ పూర్వకమా? కాదు.
    24. అన్ని సమయాల్లో అది ఉద్దేశ పూర్వకం కాదు. అనుద్దేశ పూర్వకం కూడా కావచ్చు.
    25. మనం మాట్లాడే వ్యక్తి యొక్క మనసులో ఏముందో, అతని వైఖరి ఎలా ఉందో గమనించలేము.
    26. అలాగే మనం అతను చెప్పిన విషయాన్ని కూడా పట్టించుకోము. వారే రకంగా ఏ ఉద్దేశంతో చెప్పారో గుర్తించం.
    27. కాబట్టి కేవలం పదాలకు మాత్రమే అర్ధం ఉంటుందని అనుకోకూడదు.
    28. మనం ఒక మాట మాట్లాడిన తరువాత ఇచ్చే విరామానికి అర్ధం ఉంటుంది. అలాగే నిశ్శబ్దానికి కూడా అర్ధం ఉంటుంది.
    29. నిశ్శబ్దానికి విభిన్న సందర్భాలలో ఎలాంటి అర్ధాలు ఆపాదించవచ్చో వివిధ సంస్కృతులలో దీని అర్ధం ఏమిటో తరువాత తెలుసుకుందాం.
    30. కొన్నిసార్లు మెటా కమ్యూనికేషన్‌(Meta-communication) తటస్ధతని కూడా సూచిస్తుంది.
    31. మనం ఒక వీధిలో వెళుతున్నప్పుడు అక్కడ చాలామంది చాలా కార్యకలాపాలలో నిమగ్నులై ఉంటారు. అయితే మీరు ఏమీ మాట్లాడకపోయినా, మీరు అందులో భాగమే కదా, మీకు ప్రతిచర్య లేదు మీరు ప్రభావితం కాలేదని అనుకోకూడదు.
    32. నిజానికి కొన్నిసార్లు నిశ్శబ్దం పాటించడం చాలా తప్పనిసరి.
    33. అత్యావశ్యకం.
    34. కొన్ని సార్లు మనం మాట్లాడము లేదా మాటలు కొన్నిటిని వదిలేస్తాము. దాని ఉద్దేశం మీరు అర్ధాన్ని దాచాలనుకోటమే.
    35. చాలా సందర్ధాలలో మన కార్యాలయంలో మనం ప్రతిస్పందన తెలపాలని అనుకోము.
    36. అంటే అర్ధం ఏమిటి? మీరు కొన్ని ప్రతి చర్యలను నిర్ధారించుకొని, మీ భావాలు దాచాలని కాని లేదా మీరు పక్షపాత రహితులని తెలియచేయాలనుకుంటున్నారు.
    37. కాబట్టి మోటా కమ్యూనికేషన్‌) communication) ద్వారా మనం భావాలను వ్యక్తీకరించటమే కాకుండా అర్ధాన్ని కూడా దాచుతాం.
    38. మెటాకమ్యూనికేషన్‌) communication) వివిధ పద్దతుల ద్వారా మనకు కమ్యూనికేషన్‌) communication)లో ఆసక్తి - అనాసక్తి గురించి చెపుతుంది.
    39. ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడేటపుడు, స్పీకర్‌ అయిన వ్యక్తి చాలా ఉద్వేగంగా చెపుతూ ఉంటే శ్రోత చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంటాడు. ఆ నిశ్శబ్దానికి విరామానికి, శ్రోత స్పందించక పోవటానికి కారణం ఏమిటి? శ్రోతకి స్పీకర్‌ ని అభినందించే ఉద్దేశం లేెదు. ప్రతిస్పందించాలని కాని, మర్యాద పూర్వకంగా, దయా పూర్వకంగా ప్రవర్తించాలని కాని అనుకోవట్లేదు.
    40. కాబట్టి మెటాకమ్యూనికేషన్‌(Meta-communication) లో అర్ధం పదాల స్ధానంపై ఆధారపడి ఉంటుంది.
    41. ఉదాహరణకు ఒక రోజు మీరు చాలా అద్ధుతంగా దుస్తులు ధరించి కాలేజ్‌ లేదా కార్యాలయానికి వెళుతున్నారు. దారిలో మీ స్నేహితుడు కలిసి మిమ్మలి చూసి 'ఇవాళ నువ్వు ఎంత అందంగా ఉన్నావు అని అభినందిస్తాడు.
    42. అయితేె అతను మెచ్చుకున్నాడా లేదా అనేది నిజంగా అతని స్వరం మీద ఆధారపడి ఉంటుంది
    43. మీరు చాలా చక్కగా ఉన్నారు, మంచి దుస్తులు వేసుకున్నారంటే, దానికి అర్ధం ఇంతకుముందు మీరు బాగాలేరని, దుస్తులు మంచివి వేసుకోలేదని కాదు.
    44. మనం మాటలకు అర్ధాన్ని ఎలా పరిగ్రహిస్తా మనేది మాట్లాడిన వ్యక్తి యొక్క స్వరాన్ని బట్టి ఉంటుంది.
    45. కొన్ని సార్లు పదాల స్ధానాన్ని మార్చటం ద్వారా అర్ధాన్ని మార్చవచ్చు.
    46. ఉదాహరణకు ఒక ప్రదేశానికి మిమ్మల్ని ఎవరైనా 'సమయానికి చేరుకోమంటారు. 
    47. అంటే దాని అర్ధం వారు మీకు సలహా ఇవ్వచ్చు లేక వారి ఆత్రుత చూపించవచ్చు.
    48. కొన్ని సార్లు మీరు సమయానికి వెళ్లక ఫ్లైట్‌ అందుకోలేక పోతేె, వారు మీకు ఆందోళనను తెలుపవచ్చు. కొన్ని సార్లు వ్యక్తులు వాళ్లు మాట్లాడిన ఉద్దేశాన్ని, కొన్నిసార్లు వెటకారాన్ని తమ మాటల ద్వారా ప్రదర్శిస్తారు.
    49. ఉదాహరణకి ఈ వాక్యాన్ని చూడండి. అతన్ని వదలండి, చంపకండి. అని మనం ఇక్కడా మనం మాట్లాడే వాక్యాన్ని చూడండి. 
    50. ఆంగ్లంలో 'Leave Him, not kill him' అనే వాక్యంలో విరామ చిహ్నాన్ని మారుస్తే 'Leave him not, kill him' 'వదలకండి,చంపండి' అనే అర్ధం వస్తుంది. పదాల విజభన వల్ల అర్దం పూర్తిగా మారిపోయింది.
    51. మెటా కమ్యూనికేషన్‌ చాలా అర్ధాన్ని తెలియజేస్తుంది.
    52. కేవలం పదాలే కాక ఉచ్చారణ, స్వరం, వైఖరి ద్వారా ఇది సాధ్యమౌతుంది. కొంతమంది ప్రశ్నలు అడిగితే వారు అభ్యర్ధన చేస్తున్నట్లు అనిపిస్తుంది.
    53. మీరు నాతో ఒక కప్పు కాఫీకి రాగలరా? ఇది ప్రశ్న. 
    54. కానీ, అదే సమయంలో అది ఒక మర్యాద పూర్వక అభ్యర్ధన, అది మాట్లాడిన వ్యక్తిని బట్టి లేదా సాధారణంగా అర్ధం చేసుకోవాలి.
    55. కొన్నిసార్లు మనం సమావేశంలో సమూహంలో లేదా స్నేహితుల మధ్య ఉన్నప్పుడు ఏదైనా జరిగితే ఎవరైనా అడిగితే మీరు మాట్లాడకుండా నిశ్శబ్ధంగా ఉంటారు. 
    56. నిశ్శబ్దం అనేది మెటా కమ్యూనికేషన్‌ (Meta-communication) లో ఒక భాగం.
    57. నిశ్శబ్దం అర్ధవంతంగా, భావవంతంగా ఉంటుంది.
    58. ప్రతి సంస్కృతిలో నిశ్శబ్దానికి వేరే అర్ధం ఉంటుంది.
    59. ఈ విషయం మీరు తెలుసుకోకపోతే మీరు మీ సంస్ధలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు.
    60. మీరు ఒక అప్లికేషన్‌ తీసుకొని బాస్‌ దగ్గరకు వెళ్తారు. అది ఒక అభ్యర్దన కావచ్చు. అయితేె బాస్‌ ఏమీ మాట్లాడక పోతే మీరు దాన్ని ప్రతికూలమా, అనుకూలమా అని ఎలా తెలుసుకుంటారు?. 
    61. ఇది అశాబ్దిక సంకేతాలను చదవగల మీ సామర్ధ్యంపేయి ఆధారాపడి ఉంటుంది.
    62. దీనిని మీరు మెటా కమ్యూనికేషన్‌ ద్వారా చదువుకోవచ్చు.
    63. ఎందుకంటే కమ్యూనికేషన్‌ అనేది మన ఊహలు, అంచనాల పై ఆధారపడి ఉంది.
    64. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలాగా ఉండరు. అయితే ఇద్దరు వ్యక్తులు ఒక సంస్కృతికి చెందిన వారైతే వారి ప్రతిస్పందన, మెటా కమ్యూనికేషన్‌ ఒకలాగే ఉంటుంది.
    65. కొన్నిసార్లు ఇది కష్టంగా ఉంటుంది.
    66. విజయవంతమైన కమ్యూనికేషన్‌ సమిష్టి అంచనాలు, అప్రకటిత వాదనలతోనే సాధ్యం.
    67. ఈ అప్రకటిత వాదనలు మౌనం రూపంలో ఉంటాయి.
    68. ఉదాహరణకు ఒకోసారి సమావేశంలో ఒక విషయం గురించి అందరి అభిప్రాయాలు అడుగుతారు. అయితే కొంత మంది మౌనంగా ఉంటారు.
    69. వారు అవును లేక కాదు అని చెప్పవచ్చు. కాని తటస్ధంగా ఉండటానికి, తన భావం చెప్పలేక, లేదా తన అభిప్రాయాన్ని దాచటానికి మౌనంగా ఉంటారు. ఏమీ మాట్లాడక పోతే వారు సమావేశంలో పాల్గొనకుండా తమ వైరుధ్యాన్ని, అసమ్మతిని తెలియజేస్తున్నారని అర్ధం.
    70. ఈ విషయాలను మనం శరీర కదలికలు గమనించడం ద్వారా తెలుసుకోవాలి.
    71. మునుపటి ఉపన్యాసంలో ఇది తెలుసుకున్నాము.
    72. మిత్రులారా కొన్నిసార్లు పదాలకంటే నిశ్శబ్దం ఎక్కువ అర్ధాన్ని తెలియజేస్తుంది. కొన్నిసార్లు నిశ్శబ్దం బిగ్గరగా భయంకరంగా అనిపిస్తుంది.
    73. నిశ్శబ్దం కొన్నిసార్లు చాలా లాభకరంగా ఉంటుంది.
    74. ఒక వ్యక్తి సంస్థలో ఎక్కువ మాట్లాడితే, అతన్ని చాలా తీవ్రంగా పరిగణీస్తారని కాదు.
    75. తన మాటలను నిశ్శబ్దాన్ని సరిగ్గా ఉపయోగించుకునే వారే విజయపు మెట్లు త్వరగా ఎక్కుతారు.
    76. నిశ్శబ్దం లేదా మౌనం యొక్క ప్రయోజనాలు ఏమిటి? కొన్ని సందర్భాలలో నిశ్శబ్దం చాలా ఉపయోగకరం. 
    77. ఒక వ్యక్తి, లేక నేనే మీతో ఆపకుండా మాట్లాడుతూ ఉంటే శ్రోతలకి ఇతను కాసేపు మాట్లకుండా ఆగితే బాగుంటుంది కదా అనిపిస్తుంది.
    78. కొన్నిసార్లు ఉపన్యాసం మధ్యలో కొంత నిశ్శబ్దం పాటిస్తే అది మీ మాటల, పదాల సమర్ధత పెంచుతుంది.
    79. నిశ్శబ్దం లేదా మౌనం చాలా ప్రయోజనాలను కలిగి ఉంది. నిశ్శబ్దం శ్రోతలకు మొనోటనీ నుండి కొంత ఉపశమనం కలిగిస్తుంది.
    80. మాటల మధ్య నిశ్శబ్దం మనకి చాలా సహాయపడుతుంది. 
    81. ఆ మాటలు నెమరు వేసుకోటానికి అర్ధం చేసుకోటానికి సమయాన్నిస్తుంది.
    82. ఇది స్పీకర్‌కి శ్రోతలకి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
    83. స్పీకర్‌ నిరంతరంగా మాట్లాడుతుంటే అతని ఆలోచనలు, సమాచారం తరిగిపోతుంది. శ్రోతలకి ఆలోచనల బరువు, ఒత్తిడి పెరుగుతుంది.
    84. ఈ నిశ్శబ్దపు ఖాళీ వలన స్పీకర్‌ తరువాత పునరావృతం చేసుకొని ఏం మాట్లాడాలో నిర్ణయించుకోవచ్చు.
    85. ఇది ఇతర సభ్యులతో సంబంధం కలిగి ఉండటానికి కూడా సహాయపడుతుంది. ఇది ఒక రకమైన పరిచయాన్ని ఏర్పరచటానికి వారికి సహాయపడుతుంది.
    86. శ్రోతలకి తాము విన్న విషయాలు సమకూర్చుకొని, అనుసంధానం చేెసుకునేె వీలు దొరుకుతుంది.
    87. నిశ్శబ్దము ఆలోచనలను ప్రేరెేపించగలదు.
    88. నిశ్శబ్దము ఆలోచనలను ఎలా ప్రేరెేపిస్తుంది?. మన ప్రసంగం మధ్యలో కొంత నిశ్శబ్దం పాటిస్తే ఆ సమయంలో మనకు కొత్త ఆలోచనలు వస్తాయి.
    89. మన ప్రసంగం మధ్యలో కొంత నిశ్శబ్దం పాటిస్తే ఆ సమయంలో మనకు కొత్త ఆలోచనలు వస్తాయి. ప్రేక్షకులకి కూడా కొంత విరామం ఇవ్వాలి. 
    90. కొన్నిసార్లు స్పీకర్‌ కాని, శ్రోతలు కాని తాము మాట్లాడే, వినే విషయానికి ట్యూన్‌ అవలేదని అనిపిస్తుంది.
    91. దాని వలన ఒక రకమైన భాద, అంతరాయం ఏర్పడుతుంది.
    92. శ్రోతలను తిరిగి చర్చా శశకు తేవాలంటే మీరు కొంత నిశ్శబ్దాన్ని పాటిస్తే , స్పీకర్‌ తను గమనించుకోవచ్చు, వారిపై శ్రద్ధ చూపించవచ్చు.
    93. అంతే కాకుండా మనమంతా శ్రోతలుగా, స్పీకర్‌ వేగంగా మాట్లాడకుండా మనకు అర్ధమయ్యేలా మాట్లాడాలని కోరుకుంటాం.
    94. నెమ్మదిగా మట్లాడుతూ, మధ్యలో నిశ్శబ్దం పాటించే స్పీకర్‌ శ్రోతల అభిమానాన్ని పొందుతాడు.
    95. వాస్తవంగా ఆలోచనాత్మకంగా మాట్లాడే స్పీకర్ మధ్యలో నిశ్శబ్దం పాటిస్తే ప్రేక్షకులు శ్వాస తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
    96. దీనివల్ల శ్రోతలు చక్కగా స్పీకర్ కు కనెక్ట్‌ అవుతారు. 
    97. తమ మాటల మధ్యలో నిశ్శబ్దాన్ని చొప్పించలేని స్పీకర్‌ తను మాట్లాడాలనుకున్నది మర్చిపోవటమో లేదా కొన్ని విషయాలు ప్రస్తావించ లేకపోతారు.
    98. కొన్నిసార్లు వేగంగా మాట్లాడటంవలన పదాల ఉచ్చారణ కూడా మారుతుంది.
    99. మాటల్లో తడబాటు వలన వారు సమాచారం కోసం తడుముకుంటున్నట్లుగా, సర్గిగ్గా ప్రిపేర్‌ అవనట్లుగా అనిపిస్తుంది.
    100. మనం ప్రసంగం చేసేటపుడు మనం పదాలే కాక కొన్ని 'నాన్‌ వర్డ్‌స్'(non-words) కూడా వాడుతాం.
    101. మనం మాట్లాడటానికి ఏ పదాలు గుర్తురాకపోతే, మనం నత్తిగా మాట్లాడటం ప్రారంభిస్తాము. 
    102.  పదాల కోసం ఆలోచించడం మొదలుపెడతాము. నిశ్శబ్దం ఒక నాన్‌ వర్డ్‌.
    103. (non-words) ఇవి వేగంగా మాట్లాడే వారి ప్రసంగంలో మనకు కనిపిస్తాయి.
    104. వారు అందుకే విరామాన్ని ఇచ్చి నా ఉద్దేశ్యం, మంచిది, ఆహా,  లాంటి నాన్‌ వర్డ్స్(words) ఉపయోగిస్తారు. 
    105. ఇవన్నీ వారి ప్రసంగానికి అడ్దుకట్ట వేస్తాయి.
    106. ఇలా చేయడం ద్వారా, వినేవారికి వారి ఆలోచనలలో స్పీకర్ స్పష్టంగా లేదని భావిస్తారు.
    107. అతను చాలా అస్పష్టంగా ఉన్నాడని, అతను చెప్పేదానిలో సందేహం ఉంది.
    108. నాన్‌వర్డ్స్(non-words) వల్ల కలిగిన ఇబ్బందిపై చాలా సందిగ్దత, అనుమానం ఉందని అనిపిస్తుంది.
    109.  కాబట్టి మీరు మీ ప్రసంగంలో నిశ్శబ్దం లేదా నాన్‌వర్స్డ్‌(non-words) ఎప్పుడు ఎలా వాడాలో ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి.
    110. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మనం మాట్లాడే వేగం నిమిషానికి 125-130 పదాలుగా ఉండాలి.
    111. కొన్ని సందర్బాలలో స్పీకర్ చాలా వేగంగా మాట్లాడుతారు.
    112. అలా వేగంగా మాట్లాడితే ఏమవుతుంది?. స్పీకర్‌ రెండు విషయాల మధ్య ఖాళీని ఇవ్వలేడు. 
    113. 2 విభాగాలు, ఉపవాక్యాల మధ్య, 2 పదాల మధ్య ఖాళీని ఇవ్వలేడు. దాని వలన ప్రసంగం అర్ధరహితంగా అనిపిస్తుంది. ప్రేక్షకులు దానిని చాలా ప్రమాదకరమైన స్థితిగా భావిస్తారు. 
    114. ప్రేక్షకులకు స్పీకర్‌ పట్ల గౌరవం పోతుంది.
    115. కనుక  2 విషయాలు, 2 విభాగాలు, 2 ఉపవాక్యాల మధ్య, 2 పదాలను సర్దుబాటు చేయడం చాలా ముఖ్యం.
    116. కనుక ఈ నాన్‌ వర్డ్స్న(non-words) చాలా ముఖ్యమైనవి.
    117. మనం ప్రసంగంలో కాని సమావేశంలో కాని వేగంగా మాట్లాడితే దానిని ఎవరూ అర్ధం చేసుకోలేరు, మరియు మీరు సిద్ధంగా లేరని అనుకుంటారు, కాబట్టి మీరు ప్రసంగంలో నిశ్శబ్ద సమయాన్ని పాటించాలి.
    118. కొత్తగా ప్రసంగం చేసేవారు, అనుభవం లేనివారు తమ ప్రసంగంలో పదాల మధ్య నిశ్శబ్దాన్ని పాటించలేక పోతారు. ఎందుకంటే అది అభ్యాసం ద్వారానే వస్తుంది. కాబట్టి వారు నిశ్శబ్దం, విరామం యొక్క ప్రాముఖ్యతని తెలుసుకొని వాటిని సరిగ్గా ఉపయోగించాలి. 
    119. ప్రేక్షకులు తరచుగా ఎక్కువ శబ్ధ మరియు సుదీర్ఘ నిశ్శబ్దాన్ని ఇష్టపడరు. 
    120. నిశబ్దం సరియైనదే  కానీ,  ఎవరినైనా నిశబ్దంగా ఉండమంటే, ఎంత సేపుంటారు?. 
    121. మీరు ప్రసంగం చేసేటపుడు కొద్ది సేపు మాత్రమే నిశ్శబ్దాన్ని వినియోగించాలి. అది ఎక్కువైతే ప్రేక్షకులకి ఇష్టం ఉండదు ఎందుకంటే వారు మీరు చెప్పేకొత్త విషయాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
    122. కొన్నిసారు స్పీకర్‌ నిశ్శబ్దాన్ని వాడినపుడు అది ఒక రకమైన గందరగోళానికి దారి తీస్తుంది.
    123. స్పీకర్ ప్రసంగం సరియైన పద్ధతిలో సాగాలంటే నిశ్శబ్దాన్ని వాడేటాప్పుడు నాన్ వర్డ్స్ ని ఉపయోగిస్తాడు. కానీ ఆ నిశ్శబ్ధం ఎక్కువ సేపు ఉండకూడదు.
    124. ప్రసంగం సరియైన పద్ధతిలో సాగాలంటే నిశ్శబ్దాన్ని ఇవ్వాలి. కానీ ఆ నిశ్శబ్ధం ఎక్కువ సేపు ఉండకూడదు.
    125. ఎందుకంటే నిశ్శబ్దం మరియు నిశ్శబ్దంగా ఉండటానికి మధ్య చాలా తేడా ఉంది.
    126. అన్ని విషయాలనూ మనం గుర్తు పెట్టుకొని మాట్లాడినప్పటికీ ఎక్కడ నిశ్శబ్దం, విరామం ఇవ్వాలనేది మనం గుర్తుపెట్టుకోలేం.
    127. మనం ప్రసంగం వ్రాతపూర్వకంగా తయారు చేసేటపుడు అందులో ఇవన్నీ వాడతాము. కామా, సెమికోలన్‌, డాష్‌, హైఫన్‌, ఇన్‌వర్టెడ్‌ కామా, ఇవన్నీ  లిఖిత కమ్యూనికేషన్‌లో ఉపయోగించటం ద్వారా ఇది సాధ్యం. 
    128. మీరు వ్రాసేటప్పుడు నిశ్శబ్దాన్ని అందిస్తున్నారు, కానీ అదే ప్రసంగం చెప్పేటపుడు విరామ చిహ్నాలు మర్చిపోతాం.
    129. కాబట్టి మనం చెప్పదలచుకున్నది అయిపోయిందనుకుంటే, నాన్ వర్డ్స్ (non-words) వాడటానికి బదులు మీ ప్రసంగాన్ని ముగించాలి.  
    130. నాన్ వర్డ్స్ వాడటం, పదాల కోసం తడుముకోవటం వలన మీ నిస్సహాయత బయట పడుతుంది.
    131. కాబట్టి ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని మీ ప్రసంగాన్ని సరిగ్గా ముగించాలి.
    132. ప్రఖ్యాత వక్తలు తమ ప్రసంగంలో నిశ్శబ్దాన్ని చక్కగా అభ్యాసం చేస్తారు.
    133. కాబట్టి ఒక ప్రసంగం చేయటానికి వెళ్లినపుడు ముందుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి అది మీరు అక్కడ ఉండటం వలన లేక చూడటంవలన. 
    134. మనం ప్రేక్షకుల ముందు నిలబడి వారి వంక నిశ్శబ్దంగా చూస్తున్నారు. 
    135. అలా ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక రకమైన పరస్పర ఒప్పందం జరుగుతుంది.
    136. కాబట్టి మౌనం అర్ధవంతమైనది.
    137. మీరు ప్రేక్షకులతో మాట్లాడిన మొదటి పదం, వారిని సంబోధించే విధానం వారి ముఖాలపై తెచ్చే భావమే మీ ప్రసంగానికి కూడా వర్తిస్తుంది.
    138. మీకు ప్రేక్షకులతో ఒక అవగాహన కలుగుతుంది. ఇదే మెటా కమ్యూనికేషన్‌. 
    139. అంతేకాకుండా మీరు ప్రసంగంలో మీ అభిప్రాయాలు, ఆలోచనలు చర్చించేటపుడు మీ స్వరస్ధాయిని కూడా మారుస్తుంటారు. ప్రతి క్షణం ఒకే స్వరం ఉండదు.
    140. అలా కాకుండా మొనోటోనస్‌ గా ఉంటే ప్రసంగం సమర్ధవంతంగా ఉండదు.
    141. అందుకే మనం మాట్లాడేటపుడు మెటా కమ్యూనికేషన్‌  గురించి జాగ్రత్త వహించాలని కోర్టు చెపుతుంది. మీరు స్పీకర్‌ని చూస్తున్నపుడు మీ మెటా కమ్యూనికేషన్‌ యొక్క రకం నిర్దారించబడింది.
    142. మీ మెటా కమ్యూనికేషన్‌ ద్వారా అతనికి ఒక సందేశం ఇస్తున్నారు.
    143. ఆడ్రియన్‌ రిచ్‌ (Adrienne Rich) అన్నట్లుగా ''మనం పదాలద్వారా, నిశ్శబ్దం ద్వారా కూడా అబద్ధం చెప్పుతాము''.
    144. మనం పదాలను సందర్భాను సారంగా వాడుతూ, అర్ధాన్ని దాస్తూ కూడా అబద్దం చెప్పవచ్చు. కాని మనం నిశ్శబ్దాన్ని వాడతాం. కొన్నిసార్లు మనం బాధాకర సందర్భాలలో స్పందించాల్సి వచ్చినపుడు , మీరు నిశ్శబ్దంగా ఉంటారు. దీన్ని ఎప్పుడూ చేయలేరు. ఎందుకంటే సమయ అవసరం ప్రకారం విరామం తీసుకోవాలి. ఇప్పుడు నిశ్శబ్దం మరియు విరామం మధ్య తేడా ఏమిటి? విరామం అనేది నిశ్శబ్దం యొక్క చిన్న రూపం, మరియు ఈ విరామాలు ఎక్కువైనప్పుడు, వాటిని నిశ్శబ్దం అంటారు.
    145. మన నిశ్శబ్దం ఇతరులకి చాలా అర్ధాన్ని తెలియజేయాలి.మన బాధని, దుఃఖాన్ని నిశ్శబ్దంగా ఉండటం ద్వారా తెలుపుతాం.
    146. మనం మాట్లాడేెటపుడు నిశ్శబ్దం కంటే విరామం వాడతాం. విరామం ఒక నాన్‌వర్డ్‌.
    147. (non-words)విరామం ఆలోచనలు, విషయాలను విభజించటానికి తోడ్పడుతుంది.
    148. విరామాల సహాయంతో మీరు మీ ఆలోచనల మొత్తం ఆకృతిలో మార్పులు చేస్తారు.
    149. అయితే మనలో చాలా మందికి ఎప్పుడు ఎక్కడ విరామం ఇవ్వాలో తెలియదు. కేవలం నాటకాలలో, సినిమాలలో నటించే వారికే ఇవన్నీ తెలుస్తాయి. వారు నిశ్శబ్దం, విరామం ఇవన్నీ చక్కగా అభ్యసించి నేర్చుకుంటారు.
    150. మీరు ఒక్క విషయం విరామం ఇచ్చి అవగాహన, సౌహార్ద్రత పెంచుకోవాలని చూస్తున్నారు.
    151. ఒక నమ్మకం కలిగిన వ్యక్తి బాగా ప్రిపేర్‌ అయిన వ్యక్తి మాత్రమే విరామం ఉపయోగించి తన నమ్మకాన్ని నియంత్రణని ప్రదర్శించగలడు.
    152. విరామం ప్రేక్షకుల నుండి ఫీడ్‌బాక్‌ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
    153. విరామం మనకు పదాల వరద, పదాల వెల్లువ నుండి క్లుప్త ఉపశమనాన్ని ఇస్తుంది.
    154. విరామం సహాయంతో మీరు కూడా ఒక రకమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. 
    155. వాస్తవానికి శ్రోతలు కూడా విశ్లేషణ చేస్తారు. ఎందుకంటే మన మైండ్‌ మాటలకంటే వేగంగా పని చేస్తుంది.
    156. కనుక ప్రేక్షకులుగా విన్నదాన్ని స్పీకర్ చెప్పినప్పుడు అతనితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాము.
    157. స్పీకర్‌  చెప్పింది శ్రోతలకు అర్ధమైతే ప్రసంగం నిరాటంకంగా, చక్కగా సాగిందనే విజయోత్సాహం, విజయవంతమైన నవ్వు ఇద్దరి మఖాలపై వెల్లి విరుస్తుంది.
    158. వక్తగా లేదా వినేవారిగా, ఈ చర్చ ఇద్దరికీ బాగా జరుగుతుంటే, వారి ముఖాల్లో సంతృప్తికరమైన నవ్వు ఉంటుంది.
    159. విరామం మీకు పునరావృతం చేసుకొనే హామీ, ధైర్యం ఇచ్చి ప్రసంగానికి అందాన్నిస్తుంది.
    160. అందుకే మీరు గమనించే ఉంటారు, బాగా అనుభవం ఉన్న శిక్షణ పొందిన వక్తలు, ప్రసంగాన్ని ముంగించే ఆత్రుత ప్రదర్శించరు.
    161. తాము ప్రేక్షకుల కోసమే అక్కడ ఉన్నారు కాబట్టి, నిశబ్దం మరియు విరామం యొక్క మేలు కలయిక ద్వారా తమ ప్రసంగం చక్కగా ప్రేక్షకులకు అర్ధం అయేలా చేస్తారు.
    162. మనం నిపుణులు, ప్రఖ్యాతులైన వక్తలను వేరే సంస్థల నుండి ఆహ్వానించి, వారిని మనం ప్రేక్షకుల లాభంకోసమే పిలిచాం కాబట్టి వారి ప్రసంగం చక్కగా ఉండాలి.
    163. అమెరికా మాజీ అధ్యక్షులలో ఒకరు ఏం చెప్పారో గుర్తుంచుకోండి. ''మీ దేశం మీకు ఏం చేస్తుందని కాకుండా, దేశం కోసం ఏం చేయాలని అడగండి'' అన్నారు.
    164. అది చాలా అందంగా, ప్రభావంతంగా ఉంది ఎందుకంటే అందులోని ఆలోచన వల్ల కాక అందులో ఉపయోగించిన విరామం వలన.
    165. కాబట్టి మనం కూడా ఈ విషయం నేర్చుకుందాం, మరియు అభ్యాసం చేద్దాం. దేశం కోసం ఏం చేయాలని అడగడానికి అందులోని ఆలోచన వల్ల కాక అందులో ఉపయోగించిన పదాల వ్యక్తీకరణను పదాలు కాని వాటిని కూడా గుర్తుంచుకోవాలి.
    166. ఇదంతా మెటా కమ్యూనికేషన్‌. మిత్రులారా రాబోయే రోజుల్లో మీరు నేర్చుకున్న ఈ పాఠ్యాంశాలన్నీ మీకు నిశ్శబ్దం, విరామం మధ్య సంతులనం చేసే సమర్ధతనిస్తాయని, తద్వారా మీరు మీ కమ్యూనికేషన్‌, ప్రసంగం లేదా ప్రజంటేషన్‌  అందరికి అర్ధమయ్యేలా ఇవ్వగలరని ఆశిస్తాను.
    167. మీ నిశ్శబ్దం మాట్లాడుతుంది.
    168. మీరు నిశ్శబ్దం, మీ విరామం అని అర్ధం. తద్వారా మీ విరామాలు అందంగా ఉంటాయి. మరియు మీరు వ్యక్తపరచాలనుకుంటున్నది భాగా వ్యక్తమవుతుంది. 
    169. ప్రసంగం లేదా ప్రజంటేషన్‌ ఇవ్వబోతున్నప్పుడు  మీరు నిశ్శబ్దం, విరామం మరియు నాన్‌వర్డ్స్ (non-words) యొక్క ప్ర్రాముఖ్యత గుర్తుంచుకుంటారని, వాటిని మీ ప్రసంగంలో వాడతారని ఆశిస్తున్నాను.  మీరు ఒక ఫార్మాట్ చేసినప్పుడు మరియు సంస్థ మీ ప్రసంగాన్ని చేస్తుంది. లేదా సంభాషణను నిర్వహిస్తుంది.
    170. ధన్యవాదాలు!