30. softskill_Positive Thinking-LG3xuiVqaOQ.txt 38 KB
Newer Older
Vandan Mujadia's avatar
Vandan Mujadia committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146
    1. పాజిటివ్‌ థింకింగ్‌ (Positive Thinking) హల్లొ(Hello). 
    2. మనం వ్యక్తిత్వంలో ఉండే విభిన్న అంశాల గురించి, కార్యాలయంలో మనం ప్రతి స్పందించే వ్యక్తుల నేపధ్యాల  ప్రజలు, విభిన్నదృక్పధాలతో ఉన్న వ్యక్తులు తెరపైకి వస్తారు.
    3. మన మనుగడ కోసం, విజయం కోసం మనకి అన్నిటికన్నా ఎక్కువగా ఉపయోగపడే అంశం పాజిటివ్‌ థింకింగ్‌(Positive Thinking). అది మనలో విశ్వాసాన్ని, మన కోసం, సంస్థ కోసం ఏదైనా సాధించాలనే పట్టుదల నింపుతుంది.
    4. మనం పాజిటివ్‌ థింకింగ్‌(Positive Thinking) అంటే ఏమిటి, మనం ఎలా పాజిటివ్‌గా(Positive) ఉండాలి అనే విషయాలు చర్చిద్దాం.
    5. మనం నేర్చుకున్నట్లుగా విభిన్న ధృక్పధాలు, వైఖరులు, వ్యక్తిత్వాలు ఉన్న మనుషులతో వ్వవహరించేటపుడు మనం ఎలా పాజిటివ్‌గా(Positive) ఉండగలం. మిమ్మల్ని మీరు ఎపుడైనా విశ్లేషించు కున్నారా? మీరు ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారో తెలుసుకున్నారా? మీరు ఆశావాదా? నిరాశావాదా? మనం ఒక ఉదహరణ ద్వారా తెలుసుకుందాం.
    6. ఒక గాజు గ్లాసులో(glass) సగం నీరు నింపబడి ఉన్నది. దాన్ని చూసి ఒక వ్యక్తి అది సగం ఖాళీగా ఉన్నదని, మరొక వ్యక్తి సగం నిండుగా ఉన్నదని అంటారు.
    7. ఇది వాస్తవానికి 2 రకాల వ్యక్తిత్వాలను సూచిస్తాయి.వారిలోని భేదాన్ని తెలియజేస్తుంది.
    8. సగం ఖాళీగా ఉన్నదన్న వక్తి నిరాశావాది. సగం నిండుగా ఉన్నదన్న వ్యక్తి ఆశావాది.
    9. నిరాశావాది చీకటి కోణాన్ని చూస్తాడు. ఆశావాది వెలుగుకోణాన్ని ఉపయోగించి విషయాల్ని చూస్తారు.
    10. నిరాశావాది తనకు వచ్చిన అవకాశాలలో కూడా ప్రతికూల పరిస్థితులను చూస్తాడు. ఆశావాది అవకాశం లేని చోట కూడా అవకాశాలను సృష్టించుకుంటాడు.
    11. దీనికి కారణం పాజిటివ్‌ థింకింగ్‌(Positive Thinking).
    12. అది మనం ఎలా సాధించగలం? ఒక పాజిటివ్‌ వ్యక్తికి చాలా లాభాలు ఉంటాయి.
    13. ఎప్పుడైతే మనం 'నో(no)' అని చెప్తామో అది మన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
    14. 
    15. ప్రసిద్ధ రచయిత మరియు ఆశావాది నార్మన్‌ విన్సెంట్‌ పీలే తన పుస్తకంలో పాజిటివ్‌ థింకింగ్‌(Positive Thinking) శక్తి. పాజటివ్‌ థింకింగ్‌ అనేది ఒక మానసిక వైఖరి అని, అది మనందరికి అవసరం అని పేర్కొన్నారు.
    16. మనం చేయగలమనే దృక్పధం ఉంటే తప్పక సాధించగలం.
    17. పాజిటివ్‌ థింకింగ్‌ (Positive Thinking) తో మనం అన్ని సమస్యలను సులభంగా మనకు లాభకరంగా సాధించగలము.
    18. ఇది నమ్మకం యొక్క ప్రశ్న.  ఇది సానుకూల ఆలోచన యొక్క ప్రశ్న. మరియు మనోశక్తి అవసరం.
    19. ఇది మంచి వ్యవస్థాపకుడిగా మారడానికి మీకు సహాయపడుతుందని మీరు కనుగొంటారు.
    20. మంచి వ్యవస్థాపకుడు ఎల్లప్పుడూ రిస్క్ తీసుకోవచ్చు.
    21. రిస్క్ తీసుకోలేనివాడు ఏమీ సాధించలేడు.
    22. మనం సాధించలేమనే ఆలోచనతో అవకాశాల్ని వదులుకుంటే మనం ఎప్పటికీ సాధించలేం. అదే చేయగలమని నమ్మితే తప్పక చేయగలతాము.
    23. మనం విలియం జేమ్స్‌ అనే ప్రసిద్ధ మనస్తత్వవేత్త ఇచ్చిన ఉదాహరణ 'మనం కేవలం సగం మేల్కొని ఉంటాం' గురించి తెలుసుకుందాం. మనమందరం మన శారీరక, మానసిక వనరులు లేదా శక్తులలో కేవలం ఒక చిన్నభాగాన్ని మాత్రమే ఉపయోగించుతున్నాము.
    24. మన శక్తి సామర్థాలను మనం తెలుసుకోవాలి. అంచనా వేయాలి. మనమే విశ్లేషించుకోవాలి. 
    25. ఆ అంచనాను బట్టి మనలో ఉన్న లోపాల్ని అధిగమించాలి. భర్తీ చేయాలి. మనుష్యులంతా తమ తమ పరిధులలోనే జీవిస్తారు. కాని మనకు పరిధులు తెలుసా? మనందరిలో మనకు తెలియని విషయాలు కొన్ని దాగి ఉంటాయి. మనం వాటిని ఎప్పుడూ అన్వేషించే ప్రయత్నం చేయము.
    26. మనలో ఉన్న వివిధ రకాల శక్తులను మనం సరిగ్గా ఉపయోగించము.
    27. మీరు చాలా పరిస్థితులను చూడవచ్చు. ఒక కొత్త ఆటగాడు ఆడటానికి వచ్చినపుడు అతడు చాలా బాధలను ఎదుర్కొంటాడు. అయితే అతనికి పాజిటివ్‌ థింకింగ్‌ ఉంటే అవన్నీ అధిగమించి విజయాన్ని సాధిస్తాడు.
    28. వాస్తవానికి వారి సుకూల నమ్మకం యొక్క ఫలితం, ఇది వారి సానుకూల ఆలోచన యొక్క ఫలితం. 
    29. మనం కార్యాలయంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వ్యక్తుల మనస్తత్వాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
    30. డా.ఎరిక్‌ బెర్నె.(Dr. Eric Berne) అనే వ్యక్తి మానవ ప్రవర్తన, వైఖరి గురించి అధ్యాయం చేసి నాలుగు ముగింపులను పేర్కొన్నారు.
    31. మొదటిది, ''నేను బాగా లేను, మీరు కూడా బాగాలేరు''. దీనిని అంతర్ముఖులు ( Introverts) అంటారు.
    32. అతను ఎవరూ సరిగ్గా లేరనే ఆలోచనలో ఉంటాడు.
    33. ఇది 1వ మనస్తత్వం. ఇలాంటి మనస్తత్వంతో ఉన్న వ్యక్తులు ఎప్పుడూ అభివృద్ధి సాధించలేరు.
    34. రెండవది, ''నేను బాగా లేను, మీరు బాగానే ఉన్నారు'' అని చెప్పారు. 
    35. ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తి (Negative Person) అని చెప్తాడు. అతను బాగా లేడని అతను అనుకున్నప్పుడు, కానీ మీరు బాగానే ఉన్నారు.
    36. మూడవది, ''నేను బాగానే ఉన్నాను, నీవు బాగాలేవు'' అని చేప్తారు. 
    37. ఇలాంటి వ్యక్తి తను మాత్రమే గొప్ప, ఇతరులు పనికిరారనే ఆధిపత్య ధోరణి కలిగి ఉంటాడు.
    38. మనం ప్రాజెక్టులలో(project) బృందాలుగా పనిచేసేటపుడు విభిన్న సంస్కృతులు, దేశాలు, మనస్తత్వాలు, అలవాట్లు, పద్ధతులు ఉన్నవారితో సహకరించాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో నేను బాగానే ఉన్నాను, నీవు బాగానే ఉన్నావు, అనే వైఖరి ఉన్న వ్యక్తి సానుకూల వైఖరితో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. 
    39. ఈ రాకామేన వ్యక్తి సానుకూలంగా ఉండటమే కాదు, అతను సహకారంగా ఉంటాడు. 
    40. అలాంటి వ్యక్తి సమూహానికి శక్తినిచ్చి, విజయాన్ని సాధించి, తనకూ, సంస్థకూ కూడా కీర్తిని సంపాదిస్తాడు.
    41. మనుషులందరికీ పాజిటివ్‌ థింకింగ్‌(Positive Thinking) ఉంటే పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా వారు పోరాడి విజయం సాధించగలరు.
    42. ప్రతికూల పరిస్థితిని మంచి అవకాశంగా మార్చగల సానుకూల వ్యక్తి మాత్రమే మరియు అతను వాస్తవానికి మార్పు తీసుకుని రాగలడు.
    43. మనుషులందరికి విజయం సాధించాలనే తపన ఉంటుంది. దాన్ని కైవసం చేసుకోవాలంటే మనలో సానుకూల వైఖరి (Positive Vision ) ఎలా అభివృద్ది చేసుకోవాలో తెలుసుకోవాలి.
    44. ఒక పనిని మనం చేపట్టేటప్పుడు ఎక్కువ సమయం ఆలోచించి మొదలుపెడితే మనం అది పూర్తి చేయగలుగుతాము. 
    45. అయితే మనం మన యందు నమ్మకాన్ని కలిగి, మన సత్తాని తెలుసుకొని అపారమైన సామర్ధాన్ని గుర్తించి మన స్వభావాన్ని రూపొందించుకోవాలి. 
    46. ఇంతకు ముందు ఉపన్యాసంలో చెప్పినట్లుగా మనం ప్రఖ్యాతి పొందిన వారిని అనుకరించి అన్ని లక్షణాలను పొందలేము.
    47. మనకు నచ్చిన వాటినే ఎంచుకుంటాము. మనం అన్నీ అనుకరిస్తే ఏం జరుగుతుంది? మనం మన ఉనికిని కొల్పోతాము.
    48. నాకు ఒక గాయకురాలి కధ గుర్తుకు వస్తుంది. కాని మంచి రూపం పొందలేదు. ఆమె పాడేటపుడు తన దంతాల్ని దాచడానికి ప్రయత్నించేది.
    49. అది గమనించిన ఒక దర్శకుడు ఆమెతో ఇలా అన్నాడు ''మీరు దంతాలు దాచే ప్రక్రియలో మీ గాత్రాన్ని కూడా దాస్తున్నారు. మీకు ఉన్న ప్రతిభను ప్రదర్శించలేక పోతున్నారు.
    50. ఇది తెలుసుకుంటే మీరు విజయం సాధిస్తారు. కాబట్టి మనం మన స్వభావాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు.
    51. మనం ఎప్పుడైతే అందరికంటే ఉత్తములమని భావిస్తామో అపుడే మనం ఉత్తములం అవుతాము.
    52. కాబట్టి మీ సమర్ధతను మీరు నమ్మండి.
    53. వాస్తవానికి మనందరిలో అన్ని నైపుణ్యాలు ఉండవు. కానీ కొన్ని సందర్భాల ద్వారా అవకాశాలు, సవాళ్లు, అభిముఖాల ద్వారా మనం కొన్ని నైపుణ్యాలు వృద్ధి చేసుకోవచ్చు.
    54. మనం ఇతరుల నుంచి నేర్చుకునేటపుడు మన స్వభావాన్ని కోల్పోకూడదు.
    55. మనం అభివృద్ది సాధించడానికి అవసరమైన వాటినే గ్రహించాలి. ప్రతి మనిషిలో ఉన్న నిర్దిష్ట లక్షణాలు అతనికి ముందుకు సాగడానికి సహాయపడతాయి. కానీ మీ లక్షణాలను కోల్పోకండి. 
    56. ఎందుకంటే ప్రతి మానవుడికి పుట్టుకతోనే కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి నిజంగా విభిన్నంగా ఉంటాయి.
    57. మీరు మీ గురించి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఒక విశిష్టమైన తత్వంను కనుగొంటారు. 
    58. ప్రతి మనిషి తనలో ఉన్న బలహీనతలను దాచాలని ప్రయత్నిస్తాడు. ఇది మానవ స్వభావం.
    59. కాని మనిషి తప్పక మారవచ్చు. మీకు తెలుసా, రూజ్‌వెల్ట్‌ (Roosevelt) చాలా బలహీనంగా ఉండేవాడు.
    60. డెమోస్తెనస్‌ (Demosthenes) కి నత్తి ఉండేది. అయితే సాధనతో దాన్ని అధిగమించి గొప్ప వక్తగా పేరుపొందాడు.
    61. మీలో మీకు భారీ అవకాశాలు ఉన్నాయి.
    62. మనలో ఉన్న సమర్ధత మన లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగించాలి.
    63. మనం సరైన దారిలో నడిచి సరైన పద్ధతిలో మన లక్ష్యం సాధించాలి.
    64. భగవద్గీతలో చెప్పినట్లుగా ''కర్మణ్యేవాధికరాస్తే మాఫలేషు కదాచనా''. అనగా నీవు కేవలం కర్తవే, ఫలితాన్ని గురించి ఆలోచించకు. లక్ష్య సాధనలో నీ ఏకాగ్రతను కేంద్రీకరించు. అప్పుడే విజయం సాధించగలవు.
    65. 
    66. మనం కార్యాలయంలో బృందాలుగా కలిసి పని చేసేటపుడు ఒకరికి మరొకరి సమర్ధత గురించి తెలియదు.
    67. ఒక సహకార పద్ధతిలో, పరస్పర స్పందనతో మంచి ప్రతి చర్యలతో వ్యవహరించాలి, 
    68. ఒకే బృందం లో పనిచేయాలి. బృంద సభ్యులంతా విభిన్న స్వభావాలు కలిగి ఉంటారు.
    69. అయితే మనం ఒక గుర్తింపు ఎలా నిలబెట్టుకోవాలి? ఇతరుల గురించి ఎలా తెలుసుకోవాలి?. 
    70. ఈ ప్రశ్నకి సమాధానం ఇద్దరు సిద్థాంతికులు 'జొహారి విండొ' (Johari Window)  ప్రతిపాదన ఇచ్చారు.
    71. ఈ ప్రతిపాదనను ఇద్దరు అమెరికన్‌ మనస్తత్వ వేత్తలు (American psychologists) జోసెఫ్‌ లుఫ్ట్‌(Joseph Luft) మరియు హారి ఇంగ్‌హామ్‌(Harry Ingham) 1955 లో రూపొందించారు.
    72. ఈ ఇద్దరు దీనిని విండో ప్యానెల్స్ తో ప్రదర్శించారు.
    73. ఎప్పుడైతే ఒక కొత్త సభ్యుడు ఒక బృందంలో ప్రవేశిస్తాడో, అపుడు తన నైపుణ్యాలను, సామర్ధ్యాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తాడు. తెలియని స్థితిలో ప్రదర్శించలేక పోతాడు.
    74. అయితే ఇతరులతో ప్రతి స్పందించినపుడు ఈ కొత్త వ్యక్తి యొక్క నైపుణ్యాలను బహిర్గతం చేయడం వారి బాధ్యత.
    75. దీని కోసం జొహారి విండో(Johari Window)ను ప్రతిపాదించారు. 
    76. దీని ముఖ్యోద్దేశము మనకు స్వీయ అవగాహన గురించి తెలిపి దానిని వృద్ధి చేయడం. 
    77. మనలో ఉన్న కొన్ని నైపుణ్యాలు మనకి తెలిసినవి, ఇతరులకి తెలియనివి, వారికి తెలిసి మనకు తెలియనివి మనకి మాత్రమే తెలిసినవి, మనకీ ఇతరులకీ కూడా తెలియనివి ఉంటాయి.
    78. కాబట్టి జొహారి విండొ(Johari Window) ద్వారా స్వీయ మరియు పరస్పర అవగాహన పెంచుకోవడానికి మరియు మెరుగుపరచుకోవడానికి పనిచేస్తుంది.
    79. అంతేకాకుండా ఇది బృందాల మధ్య ప్రతిస్పందన గురించి కూడా తెలియజేస్తుంది.
    80. మన గురించి మనకు తెలియని విషయాలు ఉన్నాయి, మన గురించి ప్రజలకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. సాఫ్ట్‌స్కిల్స్‌(soft skills)లో ఈ జొహారి విండొ ఒక కీలక పాత్ర పోషిస్తుంది.
    81. ఇది మన నైపుణ్యాలు, ప్రవర్తనని సాఫ్ట్‌స్కిల్స్‌(soft skills) ద్వారా ఎలా అభివృద్ది చేయవచ్చో చెప్తుంది.
    82. ఇపుడు మీరు జొహారి విండో(Johari Window) యొక్క బొమ్మని చూడండి. దానిలో కిటికీ నాలుగు  భాగాలుగా విభజించబడి ఉంటుంది. వాస్తవానికి ఇవి 4 చతుర్బుజాలు.
    83. ఇక్కడ మొదటిది ఓపెన్‌ సెల్ఫ్‌(open self), రెండవది బ్లైండ్‌ సెల్ఫ్‌(blind self), మూడవది హిడెన్‌ సెల్ఫ్‌(hidden self), నాలుగవది అన్‌నోన్‌ సెల్ఫ్‌(unknown self).
    84. ఈ జొహారి విండో (Johari Window) మనం నైపుణ్యాలని పరస్పర స్పందన ద్వారా ఫీడ్‌బాక్‌(feedback) ద్వారా ఎలా తెలియజేయవచ్చో చెప్తుంది.
    85. మనం సమాచారాన్ని అనుభవాలు, భావాలు, వైఖరులు, నైపుణ్యాలు, ఉద్దేశాలు, ప్రేరణల ద్వారా మనపట్ల లేదా ఇతరులతో ఎలా వ్యక్తీకరిస్తామో సూచిస్తుంది.
    86. జొహారి విండో(Johari Window) బృంద సభ్యులు కొత్త వ్యక్తితో సంభాషిస్తారు. 
    87. వారి మధ్య ఉన్న పరస్పర స్పందన, వారి సంబంధ బాంధవ్యాలు నాలుగు విభాగాల ద్వారా భాగస్వామ్యం చేయబడుతుంది. 
    88. ఈ నాలుగు విభాగాల్లో భావాలు, ప్రేరణలు, మనకీ ఇతరులకి తెలిసినవి, తెలియనివి ఉంటాయి.
    89. ఈ తెలియని ప్రేరణను కొన్నిసార్లు సమూహం అని పిలుస్తాము.
    90. మొదటి చతుర్బుజాన్ని 'ఓపెన్‌ ఏరియా' (open area) అంటాము. 
    91. ఇందులో మనగురించి మనకూ, ఇతరులకూ తెలిసిన అంశాలు ఉంటాయి.
    92. ఈ భాగం విస్తరించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఒక వ్యక్తి గురించి తెలియని విషయాలని తెలుసుకోగలుతాము. 
    93. ప్రతిస్పందన ద్వారా మరియు అభిప్రాయాల  ద్వారా తెలియని విషయాలని తెలుసుకోని మనల్ని మనం వృద్ది చేసుకుంటాము.
    94. రెండవ భాగం 'బ్లైండ్‌ ఏరియా'(blind area) ఇక్కడ మనకు తెలియని ఇతరులకు తెలిసిన అంశాలు ఉంటాయి.
    95. ఇక్కడ ఒక రకమైన ఖాళీ, శూన్యం ఉంటుంది.
    96. వ్యక్తి తన గురించి తెలుసుకునే తరగతి ఇది మరియు ఇతరులకు అది తెలియదు.
    97. మూడవ భాగం చివరి భాగం 'అన్‌నోన్‌'(unknown) భాగం. ఇందులో మనకి ఇతరులకి తెలియని అంశాలు ఉంటాయి 
    98. దీన్ని మనం దశల వారీగా తెలుసుకుందాం.
    99. మొదటి భాగం ప్రతి వ్యక్తి అభివృద్ధికి సహాయపడుతుంది. 
    100. నాకు తెలిసిన విషయాలను ఇతరులకు తెలియ చేయాలని అనుకుంటాను.
    101. కాబట్టి ఈ భాగాన్ని సమాంతరంగా, నిలువుగా కూడా విస్తరించవచ్చు. 
    102. దీన్ని పరస్పర చర్యల ద్వారా విన్నపాల ద్వారా, ఓపెన్‌ పాజిటివ్‌ కమ్యూనికేషన్‌ ద్వారా సాధించవచ్చు.
    103. పాజిటివ్‌ కమ్యూనికేషన్‌ ద్వారా ఓపెన్ ఏరియాని విస్తరించవచ్చు.
    104. రెండవ భాగం 'బ్లైండ్‌' ఏరియా(blind area). 
    105. వ్యక్తికి తనకు తెలియని విషయాలు, ఇతరులకు తెలుస్తాయి.
    106. కాబట్టి బృందంలోని సభ్యులు ఈ వ్యక్తికి తెలియని విషయాలను తెలియచేసి తమ పని ముందుకు చక్కగా సాగేట్లుగా చేసుకోవాలి.
    107. కొత్త సభ్యుడిని తెలుసుకోవలసిన వ్యక్తికి అది తెలియదు.
    108. ఇది భావోద్వేగాలకు భంగం కలిగిస్తుంది.
    109. ఈ భాగాన్ని విస్తరింప జేయటానికి మానేజర్లు(managers) పక్షపాత రహిత ఫీడ్‌బాక్‌(feedback) ఇవ్వాలి.
    110. అప్పుడే ఆవ్యక్తి తన గురించి అనేక విషయాలు తెలుసుకొని తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొంటాడు. తన లోపాలను తెలుసుకుంటాడు.
    111. తరువాతి భాగం 'హిడన్‌ సెల్ఫ్‌'(hidden self). 
    112. ఈ భాగంలో మనం మన గురించి తెలిసిన ఇతరుల నుండి దాచి ఉంచిన విషయాలు ఉంటాయి. కార్యాలయంలో ఇది సాధారణంగా జరుగుతుంది.
    113. అయితే మీ సామర్థ్యం, విధేయతను ఇతరులకు తెలియజేసి, సహకారం, నమ్మకం పొందినపుడే బృంద లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడుతారు. దీనివలన ఈ భాగాన్ని బహిరంగ ప్రదేశానికి తరలించాలి.
    114. ఈ హిడన్‌ సెల్ఫ్‌లో తగ్గింపు ఉండాలి. 
    115. ఇది అభ్యాసంపై నమ్మకాన్ని నిర్ధారించడానికి మరియు నేర్చుకోవడానికి ఒక రకమైన వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది మరియు సమూహంలోని సభ్యులందరూ ఒకరినొకరు సుసంపన్నం చేసుకోవడానికి మరియు ఒక సాధారణ లక్ష్యం కోసం పనిచేస్తారు మరియు ఇది సరైన సంభాషణ ద్వారా మాత్రమే సాధ్యము.
    116. నాలుగవ విభాగం 'అన్‌నోన్‌ సెల్ఫ్‌'(unknown self).
    117. ఈ భాగంలో మనకీ, ఇతరులకీ కూడా తెలియని అంశాలుంటాయి.
    118. ఇక్కడ విషయాలు విస్మరించబడే పరిస్థితి ఉంది, ఇక్కడ సామూహిక లేదా పరస్పర శోధన ద్వారా విషయాలు వెతకవచ్చు. ఉదాహరణకు ఒక సంక్లిష్ట క్షణంలో మనం పరస్పర విషయాలు తెలుసుకొనే సందర్భం వస్తుంది. కాబట్టి ఈ భాగంలో ఉన్న విషయాలు తెలియాలంటే మనకు స్వీయ ఆవిష్కరణ అవసరం.
    119. ఈ భాగాన్ని విస్తరించాలంటే చాలా సున్నితంగా, సునిశితంగా వ్యవహరించాలి.
    120. ఈ ప్రాంతాన్ని ఈ స్థాయికి విస్తరించవచ్చు?.
    121. ఇది అంతా కూడా ఆవ్యక్తి విచక్షణ పై ఆధారపడి ఉంటుంది.
    122. మిత్రులారా, మనం ఎప్పుడైతే ఒక సంస్థలో ఒక బృంద సభ్యుడిగా ఒక సమిష్టి లక్ష్యం కోసం కృషి చేస్తామో అపుడు మనకి ఒక అంతర్గత దిద్దుబాటు విధానం ఉంటుంది. ఇది పరస్పర ప్రతిస్పందన వల్ల, ఇతరుల నుంచి నేర్చుకోవడం విషయ పరిజ్ఞానం పొందడం, మరియు ఫీడ్‌బాక్‌ వలన సాధ్యం. కంపెనీ మానేజర్లు మరియు CEO నిజాయితీగా ఫీడ్‌బాక్‌(feedback), సూచనలు ఇచ్చి బృంద సభ్యులంతా సామరస్యంగా పనిచేసేలా సహాయ పడాలి.
    123. తెలియని కొన్ని అంశాలను  అన్‌నోన్‌ సెల్ఫ్‌, హిడన్‌ సెల్ఫ్‌ లో చర్చించాము.
    124. మనం అంచనా వేయలేని, కనిపెట్టలేని నైపుణ్యాలు ఉండవచ్చు.
    125. సరిగ్గా కనుగొనబడని వాటిని మనం తక్కువ అంచనా వేస్తాం.
    126. ఇవి మనలో ఉన్నాయని మనమే ఉహించలేము.
    127. బహుశా ఒకరు మంచిగాయకుడు. కాని అతనికి ఎప్పుడూ కూడా ఈ విషయం తెలుసుకునే సందర్భం రాలేదు. ఇతరులు ఎప్పుడూ ప్రోత్సహించలేదు.
    128. తనకి మంచి గాత్రం ఉందని అతనికే తెలియదు. అయితే స్యీయ ఆవిష్కరణ ద్వారా ఒక సందర్భంలో అతడు ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు.  
    129. కొన్ని సార్లు భయం, ప్రేమ లేదా అనారోగ్యం వల్ల తనలోని నైపుణ్యాలని తెలుసుకోలేడు.
    130. కొన్నిసార్లు అణచివేత వలన లేదా ఉపచేతన భావాల వలన కలిగే పరిస్థితులు సంవత్సరాలుగా ఈ గుణానికి ఆటంకం కలిగిస్తాయి.
    131. అతనిలో అవకాశం, సందర్భం కలిగిన వెంటనే మీ పరస్పర సహకారం ద్వారా ఈ నైపుణ్యం బహిర్గత మౌతుంది.
    132. మనం జీవించే పరిస్థితుల వలన, మన జీవన విధానం, పద్దతుల వలన మనం మన నైపుణ్యాలను వెల్లడి చేయలేక పోవచ్చు అపుడు అవి నిక్షిప్తంగా ఉంటాయి.
    133. మిత్రులారా మనం ఈ చర్చ ద్వారా జొహారి విండో(Johari Window) మనకు మనలోని నైపుణ్యాలు, ప్రవర్తనలోని అంశాలు ఏ విధంగా స్వీయ అవగాహన ద్వారా ప్రకటితం చేయవచ్చో తెలుసుకున్నాం .
    134. పూర్వపు ఉపన్యాసంలో మనం మనని ఏవిధంగా అభివృద్ది చేసుకోవచ్చో, వ్యక్తిత్వ వికాసం మరియు పరస్పర సహకారం గురించి తెలుసుకున్నాం.
    135. మన వ్యక్తిత్వం యొక్క కొన్ని లక్షణాల గురించి, ప్రజలతో మన అనుబంధం ద్వారా మరియు జీవితంలో వివిధ దశల ద్వారా మనం ఎలా తెలుసుకోవచ్చు.
    136. మీకు తెలుసా, ప్రపంచంలో ఏదీ స్థిరంగా ఉండదు. కాబట్టి మనం మనల్ని కూడా మార్చుకోవచ్చు.
    137. జొహారి విండో(Johari Window) ద్వారా మనం బృంద సభ్యుల గురించి తెలుసుకోవచ్చు, మంచి బాంధవ్యాల ద్వారా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌(communication skills) బాగుండేలా ప్రయత్నించవచ్చు.
    138. ఒక బృందంలో సభ్యుడు సరిగ్గా మాట్లాడలేనప్పుడు, అతను ఇతర సభ్యుల యొక్క ప్రతిస్పందన, పరస్పర సహకారంతో తనలోని లోపాలని తెలుసుకొని, దాన్ని అధిగమించవచ్చు. 
    139. పరస్పర సహకారంతో మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌(communication skills) సాధించి చక్కగా మాట్లాడవచ్చు. 
    140. జొహారి విండో కూడా మన ఆలోచనలోని ఖాళీలను తగ్గించి మన శక్తిని పెంపొందిస్తుంది అని అన్నారు.
    141. మిత్రులారా మనం గుర్తు పెట్టుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ధమ్మపదంలో చెప్పినట్లుగా ''మనం మన ఆలోచనల యొక్క ఫలిత రూపమే'' మీరు పాజిటివ్‌గా(positive) ఆలోచించి, శ్రద్దతో సాధించ గలననుకుంటే అన్నీ గెలుస్తారు.
    142. మీరు పాజిటివ్ థింకింగ్ తో ఆలోచిస్తే ఏదీ అసాధ్యం కాదు. తనలోని లోపాలని, రాక్షసత్వాని పోరాటంతో గెలవగలిగిన శక్తి, సామర్ధ్యం ఒక మానవునికే ఉంది. దాని ద్వారా మీ విజయాన్ని నిరూపించుకోవచ్చు.
    143. మీరు కూడా మీలోని శక్తిని గుర్తించి పాజిటివ్‌ ఆలోచనల ద్వారా విజయపు మెట్లు అధిరోహిస్తారు మంచి ఆకాంక్షలు, ప్రవర్తనతో రాబోయే రోజుల్లో అందరి మెప్పు పొంతుతారని ఆశిస్తున్నాను.
    144. ధన్యవాదాలు!.
    145.