34. softskill_Classification of Communication-1a9Td-WzovA.txt 39.1 KB
Newer Older
Vandan Mujadia's avatar
Vandan Mujadia committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130
    1. ఇప్పడు మనం కమ్యూనికేషన్‌(communication) యొక్క వర్గీకరణ గురించి తెలుసుకుందాం.
    2. ఇప్పటివరకు మీరు ప్రభావవంతమైన కమ్యూనికేషన్‌ ఒక సంస్ధకు, ఒక వ్యక్తికి ఎంత జీవశక్తిని ఇస్తుందో తెలుసుకున్నాం. మనం వివిధ కమ్యూనికేషన్‌ స్వరూపాలను తెలుసుకోగలిగితే ఏవిధంగా వర్గీకరణ చేయవచ్చో అర్ధం అవుతుంది.
    3. ఇంతకుముందు చర్చించినట్లుగా మనం సందర్భం, అవసరం, లక్ష్యాన్ని బట్టి వివిధ పద్ధతులలో కమ్యూనికేట్‌ చేస్తాము.
    4. ఉదాహరణకు మన రోజువారీ జీవితంలో మనం మౌఖికంగా కమ్యూనికేట్‌ చేస్తాము. కొన్నిసార్లు ముఖాముఖి, టెలిఫోన్‌ ద్వారా, ఇ-మెయిల్‌ ద్వారా ఉత్తరాలు వ్రాయటం ద్వారా, చాటింగ్‌, పరిశోధన పత్రాల ద్వారా, ప్రతిపాదనల ద్వారా మనం కమ్యునికేట్‌ చేయవచ్చు.
    5. కమ్యూనికేషన్‌ మౌఖికంగా ఉంటుంది మరియు వ్రాయవచ్చని  అందరికి తెలుసు.  
    6. మౌఖిక, లిఖిత కమ్యూనికేషన్‌ మధ్య ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటి? ఒక దాని కంటే ఇంకొకటి ఏవిధంగా మెరుగైనది? మనం లిఖిత కమ్యూనికేషన్‌ రెండవ స్థానంలో ఉన్నదని భావించవచ్చు. కాని మనకు ఏవిధమైన రికార్డు కావాలన్నా వాటిని వ్రాయవలసిందే.
    7. అయితే మన ప్రయోజనాన్ని బట్టి వ్రాత స్వరూపం మారుతుంది.
    8. వ్రాతకి, సంభాషణకి వ్యత్యాసం తెలుసుకోవాలంటే మీరు ఒకే వ్యక్తితో మాట్లాడాలి మరియు వ్రాతపూర్వకపత్రం పంపించాలి. మనం ఒక వ్యక్తితో సంభాషించినపుడు అందులో చాలా స్నేహశీలత, ఆర్ధ్రత కనబడతాయి.
    9. ఎందుకంటే మనం అవతలి వ్యక్తి జవాబు కోసం ఎదురుచూడాలి. అది ఆలస్యంగారావచ్చు. 
    10. కాని మౌఖిక కమ్యూనికేషన్‌లో మీరు ముఖాముఖి అవతలి వ్యక్తితో అప్పటికపుడు మాట్లాడుతారు.
    11. మీరు మాట్లాడిన పదాలలో ఏవైనా సంక్లిష్టంగా ఉంటే మీరు వెంటనే తగిన వివరణ ఇస్తారు. కాని లిఖిత కమ్యూనికేషన్‌లో ఈ వివరణ ప్రక్రియ చాలా ఆలస్యమౌతుంది.
    12. మౌఖిక కమ్యూనికేషన్‌ యాదృచ్ఛికం అయితే లిఖిత కమ్యూనికేషన్‌ చాలా వ్యవస్ధీకృతంగా ఉంటుంది. మౌఖిక కమ్యూనికేషన్‌ మనం మాట్లాడే పదాలను మన స్వరంలో మార్పుల ద్వారా మన భావ ప్రకటనను వ్యక్తం చేయవచ్చు, కాని లిఖిత కమ్యూనికేషన్‌లో ఇది కష్టం.
    13. కేవలం పద ప్రయెగమే ముఖ్యమైనది. వ్రాత క్లిష్టంగా ఉంటుంది.
    14. మనం మాట్లాడేటపుడు చాలా సాధారణంగా వ్యవహరించినా లిఖిత కమ్యునికేషన్‌ మాత్రం అధికారికంగానే ఉంటుంది. 
    15. లేబెస్క్యూ వ్రాసేటప్పుడు మీరు అనుసరించాలనుకునే కొన్ని నిర్మాణాలు కూడా ఉన్నాయి. 
    16. లిఖిత కమ్యూనికేషన్‌ తప్పకుండా ఒక స్వరూపాన్ని కొన్ని ప్రామాణికతలను పాటించాలి.
    17. వ్యాకరణ దోషాలు లేకుండా సరియైన వాక్యాలను ఉపయోగించాలి. అప్పడే అది పాఠకుల పైన మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.
    18. కాని వ్రాయడం అనేది చాలా క్లిష్టంగా జటిలంగా ఉంటుంది.
    19. మనం మాట్లాడేటప్పుడు శ్రోతల సమూహం పెద్దదిగా లేక చిన్నదిగా ఉండవచ్చు. కానీ లిఖిత కమ్యూనికేషన్‌ ప్రపంచవ్యాప్తంగా పాఠకులందరికీ చేరుతుంది.
    20. మౌఖిక కమ్యూనికేషన్‌లో వివిధ రకాలు ఉన్నాయి. అందులో ఒకటి బ్రీఫింగ్‌(briefing). ఉపన్యాసం ఇవ్వడం, సమూహ చర్చలో పాల్గొనడం, సదస్సులో, సమావేశాల్లో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించడం వంటివి చేస్తుంటాం. కొన్ని సందర్భాలలో ఇంటర్వూ తీసుకోవడం లేదా టెలిఫోన్‌ లో మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి మన సంభాషణలో పదాల ఎంపిక యొక్క ప్రాముఖ్యతని, కీలక పాత్రని గుర్తించాలి.
    21. మౌఖిక సంభాషణలో మనకు వివరణ ఇచ్చే అవకాశం ఉంది కానీ లిఖిత కమ్యూనికేషన్‌ ఒకసారి పాఠకులను చేరితే వివరణ ఇవ్వడం కష్టం. కాని మార్పులు చేయగలిగే అవకాశం మనకు ఈ-మెయిల్‌లో ఉన్నది.
    22. అయితే ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌ వాడేటపుడు మన సందేశం త్వరితంగా పంపించాలనే తొందరలో కొన్ని స్పెల్లింగ్‌ లోపాలు, సవరణలను ఉపేక్షిస్తాము.
    23. కాబట్టి మనం వివిధ సందర్భాలకు తగినట్లుగా వ్రాసే సంక్లిష్ట ప్రక్రియలో చాలా జాగ్రత్త వహించాలి.
    24. వ్రాయడం సంక్లిష్ట మైన ప్రక్రియ. వేర్వేరు ప్రయోజనాల కోసం వ్రాసేటప్పుడు కొన్ని మార్పులు ఉంటాయి. 
    25. వ్యాపార పరంగా వ్రాసే సందర్భంలో మనం లేఖలు, నివేదికలు, మెమోలు, నోటీసులు, వార్తాలేఖలు, కరపత్రాలు, పరిశోధన పత్రాలు వంటి వివిధ రూపాలలో ఉద్యోగులకు సమాచారాన్ని అందజేస్తాము.
    26. మనం ఇంతకు ముందు మాడ్యూల్‌లో చర్చించినట్లుగా ఇవి సంస్ధాగత కమ్యూనికేషన్‌ లో ఒక భాగం. అయితే ఇవన్నీ వ్రాసేటపుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇవి సంస్ధయొక్క విధానాలు, ప్రణాళికలు లేదా చట్టాలను ప్రతిబింబించేవిగా కంపనీ సూత్రాలకు అనుగుణంగా ఉండాలి. ఉద్యోగులలో కస్టమర్లు లేదా ఖాతాదారులలో ఆందోళన కలిగించకూడదు.
    27. మనం సంస్ధ లోపల కాని వెలుపల కాని తప్పకుండా మనుష్యులతోనే కమ్యూనికేట్‌ చేస్తాము. కాబట్టి దాని స్వభావాన్ని మనం క్షుణంగా తెలుసుకోవాలి.
    28. కమ్యూనికేషన్‌ పాల్గొనేవారి సంఖ్యను బట్టి నాలుగు రకాలుగా ఉండవచ్చు.
    29. మెదటిది ఇంట్రాపర్సనల్‌, రెండవది ఇంటర్‌ పర్సనల్‌, మూడవది ఎక్స్‌ట్రా పర్సనల్‌, నాలుగవది మాస్  మీడియా కమ్యూనికేషన్‌.
    30. ఇంట్రా పర్సనల్‌ అనగా మనతో మనం సంభాషించడం, ఈ కమ్యూనికేషన్ సంస్థలో జరుగుతుంది లేదా వ్యక్తిగత జీవితంలో కూడా జరగవచ్చు. 
    31. మనం ఇంతకు ముందు మాడ్యూల్‌లో చెప్పినట్టుగా కమ్యూనికేషన్‌  రెండు మార్గాలు కలిగి ఉంటుంది.
    32. అయితే ఇంట్రా పర్సనల్‌ కమ్యూనికేషన్‌లో రెండు పార్టీలు ఎలా ఉంటాయి? వ్యక్తిగత కమ్యూనికేషన్‌లో మన శరీరంలో ఎలక్ట్రో కెమికల్‌ ప్రక్రియ జరుగుతుంది. మన నేత్రాలు ట్రాన్స్మిటర్లుగా, కేంద్రనాడీవ్యవస్ధ మాధ్యమం  గా పనిచేస్తాయి.
    33. శరీరం యొక్క ఎలక్ట్రో కెమికల్‌ ప్రక్రియలు, వాస్తవానికి కమ్యూనికేషన్ ను ఉత్పత్తి చేస్తాయి. 
    34. మన మెదడు రిసీవర్‌గా పనిచేస్తుంది.
    35. దానికి ప్రతిచర్యగా మన కండరాలు కాని దవడలు కాని సంకోచిస్తాయి.
    36. ఈ విధంగా కమ్యూనికేషన్‌ జరుగుతుంది, ఇంట్రాపర్సనల్‌ కమ్యూనికేషన్‌  మనం చాలా సందర్భాలలో వాడుతాం.
    37. మనం ఒక పరీక్ష సరిగ్గా వ్రాయలేక పోతే దాని గురించి మనం మనసులో చర్చించుకొని ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి సరిదిద్దుకోగలం.
    38. మీరు ఈ పద్ధతుల్లో కొన్నింటిని అమలు చేసి ఉంటే, మీరు బాగా చేసి ఉండవచ్చు.
    39. ఈ విధంగా మనలో మనం సంభాషించు కోవడం వలన మనకు ఎంతో మేలు జరుగుతుంది. మనం ఇతరుల కంటే ఏ విధంగా మెరుగ్గా ఉన్నామో గ్రహించవచ్చు.
    40. మనం నాటకాలను గమనించి నట్లయితే అందులో ఉన్న కొన్ని పాత్రలు 'స్వగత సంభాణ'  చేస్తున్నట్లు తమలో తాము మాట్లాడుకోవడం చూస్తాము.
    41. వారు తమతో తామే కమ్యూనికేట్ చేస్తారు. ఉదాహరణ  'హామ్లెట్‌ నాటకంలో ఆ నాటకంలో ప్రధాన పాత్రధారి 'to be or not to be ' అని ప్రస్తావిస్తూ ఉంటారు.
    42. అది స్వభావాలలో ఒక భాగం.
    43. కాబట్టి ఇంట్రా పర్సనల్‌ కమ్యూనికేషన్‌ లో స్వయం ప్రతిపత్తి ఒక ముఖ్యభాగం.
    44. ఎందుకంటే దానివలన మనం మన గురించి ఎన్నో విషయాలను ఆవిష్కరించుకుంటాం.
    45. మనం ఇప్పుడు ఇంటర్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్‌  గుంచి తెలుసుకుందాం. ఇది ఇద్దరు వ్యక్తులు లేదా సమూహలమధ్య సంభాషణ రూపంలో ఉంటుంది.
    46. సంభాషణ అనేది ఒక కళ అది అందరికీ ప్రాప్తించదు.
    47. దానిని మనం అభివృద్ధి చేసుకోవాలి. మనం ఇంతకు ముందు కమ్యునికేషన్‌ గురించి చెప్పినట్లుగా సంభాషణలో కూడా రిసీవర్‌ యొక్క నేపధ్యాన్ని అర్ధం చేసుకోవాలి. అలాంటప్పడే మన సంభాషణ ఒక ఆనందదాయకమైన అనుభూతిని కలిగిస్తుంది.
    48. సంభాషణ అంటేనే అందులో ఇద్దరు వ్యక్తులు మధ్య కమ్యూనికేషన్‌  అనే అర్ధం వస్తుంది.
    49. అలాగే ఇంటర్వ్యూ కూడా ఇంటర్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్‌  లో ఒక భాగమే. ఇందులో ఒకటి నుండి 3 లేదా 4 మంది వ్యక్తులు ఒక సమూహంగా పాల్గొనవచ్చు.
    50. ఇంటర్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్‌ని 'డైయాడిక్‌' కమ్యూనికేషన్‌  అని కూడా అంటారు ఎందుకంటే సంభాషణను సఫలం చేయడానికి ఇందులో రెండు సమూహలు పాల్గొంటాయి.
    51. ఈ కమ్యూనికేషన్‌  విజయవంతం కావటానికి కొన్ని కారణాలు ఉంటాయి.
    52. ఉదాహరణకు ఒక సంస్థలో మీరు పని చేస్తున్నట్లైతే మీకు మీ అధికారితో ఉన్న భాంధవ్యాన్ని బట్టి కమ్యూనికేషన్‌ ) ఉంటుంది.
    53. కాబట్టి ఒక రచయిత ఇంటర్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్‌ ని బాంధవ్యకమ్యూనికేషన్‌ అని పేర్కోన్నారు.
    54. మీరు ఒక సందేశాన్ని కమ్యూనికేట్‌ చేసినపుడు దాని ప్రతిచర్య లేదా ప్రతిస్పందన రిసీవర్‌తో మీకున్న బాంధవ్యాన్ని బట్టి ఉంటుంది. ఆ రిసీవర్‌ మీ అధికారి లేక ఇంకెవరైనా అయి ఉండవచ్చు.
    55. తరువాతి అంశం బాహ్య కమ్యూనికేషన్‌. 
    56. మనం తెలుసుకున్నట్లుగా మనుషులే కాక జంతువులు కూడా కమ్యూనికేట్‌  చేస్తాయి.
    57. అయితే జంతువులకు భాషా సౌలభ్యం లేదు.
    58. భాష పుట్టక ముందు మనుషులు కూడా కమ్యూనికేట్‌ చేయలేక పోయేవారు.
    59. మనందరికీ తెలుసు, పూర్వపు రోజుల్లో జంతువులు తమ అరుపులు, కదలికలు లేదా శబ్దాల ద్వారా కమ్యూనికేట్‌ చేసేవి.
    60. మన భాషకు ఒక ప్రయోజనం ఉన్నది. 
    61. అయితే జంతువులు చేసే శబ్దాలు నిరర్దకం కావు, కాని కేవలం మనకు అర్ధం కావు. మనం అర్ధం చేసుకోవాలి.
    62. జంతువులు శబ్ధాల ద్వారా, తోక ఊపటం, తల ఎత్తడం, నోరు తెరవడం వంటి చర్యల ద్వారా తమ కోరికలను కమ్యూనికేట్‌ చేస్తాయి. బాహ్య కమ్యూనికేషన్‌ లో భాగంగా మానవులు జంతువులతో పదాలు ఉపయోగించి కమ్యూనికేట్‌ చేయవచ్చు.  
    63. వాస్తవానికి మీరు పదాల రూపంలో అభిప్రాయాన్ని పొందలేరు, కానీ జంతువు కొన్ని సంజ్ఞల ద్వారా లేదా కొన్ని ఇతర కార్యకలాపాల ద్వారా మీతో కమ్యూనికేట్ చేస్తుంది.
    64. అతను మీ కమ్యూనికేషన్‌ను అర్థం చేసుకోగలడని అతను చెబుతాడు.
    65. జంతువులు తమ కదలికలు లేదా ఇతర శరీర ప్రతిచర్యల ద్వారా ప్రతిస్పందన తెలియజేస్తాయి. ఇటువంటి కమ్యూనికేషన్‌ అర్ధం చేసుకోవడం కొంచం కష్టతరమే.
    66. నాల్గవ రకం కమ్యూనికేషన్ గ్రూప్ కమ్యూనికేషన్‌. 
    67. సమూహ కమ్యూనికేషన్‌ ఒక సమూహం లేదా ఒక పెద్ద బృంద సభ్యుల మధ్య జరుగుతుంది. ఉదాహరణకు నేను ఒక తరగతి గదిలో ఉపన్యాసాన్ని ఇస్తాను. ఇది ఒక రకమైన సమూహ కమ్యూనికేషన్‌.  
    68. అక్కడ వెంటనే ప్రతిస్పందన లేకపోవచ్చు. అది సమూహ కమ్యూనికేషన్‌ అయినప్పటికే ఏకపక్షంగా ఉండవచ్చు. చిన్న సమూహ కమ్యూనికేషన్‌ అంటే ఉదాహరణకు GD (Group Discussion) సమూహ చర్చలో పాల్గోనే సభ్యులు ఒకరితో ఒకరు సంభాషించి సమాచార మార్పిడి చేసుకుంటారు.
    69. అంతేకాకుండా సమూహ కమ్యూనికేషన్‌ లో ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, సమావేశంలో పాల్గొనే సభ్యులందరికీ తప్పక మాట్లాడే అవకాశం వస్తుంది కాని అదే విధంగా చర్చలో పాల్గొనే ప్రతిఒక్కరూ స్పందించరు.
    70. కొంత మంది ఎక్కువగా నిశ్శబ్ధంగా ఉంటారు. వారు ఎందుకు చర్చలో పాల్గొనకండా నిశ్సబ్దంగా ఉన్నారో మనమే ఊహించుకోవాలి. 
    71. ఈవిషయం గురించి మనం గ్రూప్‌ డైనమిక్స్‌  అనే మాడ్యూల్‌లో తెలుసుకుందాం.
    72. తరువాతి అంశం మాస్‌ మీడియా కమ్యూనికేషన్‌. 
    73. దీన్ని మనం తరచుగా విద్యుత్‌ మరియు యాంత్రిక పరికరాలు ఉపయెగించి చేస్తాము.
    74. మనం ఎక్కువ కవరేజ్‌ ఉన్న వార్తాపత్రికలు చదువుతూ ఉంటాము.
    75. దీనిలో రిసీవర్‌ యొక్క ప్రతిచర్య ఏమీ ఉండదు.
    76. అతడు నిష్క్రియాత్మకంగానే ఉంటాడు. ఈ పరిస్ధితి మనం టెలివిజన్‌ చూసినా, ఎవరైనా ఇచ్చిన ఉపన్యాసం విన్నా, మనం మాట్లాడినా అది మాస్‌ మీడియా కమ్యూనికేషన్‌  మాత్రమే.
    77. ఇటువంటి కమ్యూనికేషన్‌ 3 రకాలుగా జరగవచ్చు. వివరణ అడగటానికి కాని, సమాచారలోపం కాని, పరస్పర పరిచయం కాని ఉండే అవకాశం తక్కువ.
    78. మాస్‌ మీడియా కమ్యూనికేషన్‌లో వక్తకు, రిసీవర్‌కి మధ్య నియంత్రణ అనేది కష్టతరంగా ఉంటుంది.
    79. అయితే వక్త తన కమ్యూనికేషన్‌పై శ్రోతలకు శ్రద్ధ మరియు ఆసక్తి కలిగించాలంటే, వారి ప్రమేయం ఉండాలని కోరుకుంటే అందుకు తగిన భాషాజాలాన్ని, పదాలను ఉపయాగించాలి.
    80. చాలా సందర్భాలలో మీడియా మాధ్యమం పైన ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు. ఉదాహరణకి అన్ని రకాల కమ్యూనికేషన్‌ శబ్దపూరితమని మనకు తెలిసిన విషయమే.
    81. మనము మాట్లాడినా లేదా వ్రాసినా కూడా పదాలను ఉపయోగిస్తాము.
    82. ఇంతకు ముందు చెప్పినట్లుగా పదాలను ఎంచుకునేటపుడు ఉపయెగించేటపుడు చాలా నిర్దుష్టంగా ఉండాలి. అప్పుడే సెండర్‌ ఆ సందేశానికి ఉద్దేశించిన అర్ధం రిసీవర్‌కి సరిగ్గా అర్ధం అవుతుంది. రిసీవర్‌ నేపధ్యం తెలుసుకోవడం సెండర్‌ బాధ్యత.
    83. కాబట్టి కమ్యూనికేషన్‌ ఎపుడూ శబ్ధపూరితమే, అది లిఖిత లేదా మౌఖిక మైనా. అయితే కేవలం శబ్ధపూరిత కమ్యూనికేషన్‌ ఒక్కటే ఉందని మనం అనుకోగూడదు.
    84. అశాబ్దిక  కమ్యూనికేషన్‌ కూడా ఉంటుంది. మనం ఒక సినిమా లేదా నాటకం చూసినపుడు అందులోని పాత్రలు తమ శరీర కదలికల ద్వారా, చేష్టల ద్వారా వారు చెప్పిన సంభాషణలకి అర్ధాన్ని పూర్తి చేస్తారు.
    85. అశాబ్దిక సూచనలు 6 లక్షలకు పైగా ఉంటాయి.
    86. వాటినన్నింటినీ తెలుసుకోవడం కష్టమైనప్పటికి ఇంకొక మాడ్యూల్‌లో చర్చించుకుందాము.
    87. మనం ఏం చెప్తామో అది మన ముఖం పైన వ్రాసి ఉంటుందని అందరూ అంటారు.
    88. మన మాటల ద్వారా ఉత్పన్నమయ్యే బావాలు మన ముఖంపై ప్రతిబింబిస్తాయి.
    89. అవి ఎదుటివారు చక్కగా తెలుసుకోగలుగుతారు.
    90. మనం ముఖాముఖి కమ్యూనికేషన్‌లో ఎదుటి వారి మాటలను వినటమే కాక వారి హవభావాలు, ఇతర శరీర కదలికలు గమనిస్తూ శాబ్దిక, అశాబ్దిక సూచనలను కలుపుకొని పూర్తి అర్దాన్ని తెలుసుకుంటాము.
    91. తరువాతి అంశం మెటా కమ్యూనికేషన్‌.  
    92. ఈ మెటా కమ్యూనికేషన్‌ పదాలకు మించినది.
    93. 
    94. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక వాక్యాన్ని చెప్తె దానిలోని ఒక పదం వేరొక వ్యక్తికి ఇంకొక విధంగా అర్ధం కావచ్చు.
    95. అంటే మెటా కమ్యూనికేషన్‌ ద్వారా అనుద్ధేశ్యపూర్వక అర్ధాలను తెలుసుకుంటాము.
    96. మనం మాట్లాడే ప్రతివాక్యం, పదం ఎదుటివారు ఎలా అనువదించుకుంటారో మనం ఊహించలేం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి.
    97. తరువాతి అంశం ముద్రణ మరియు ఎలక్ట్రానిక్‌ మీడియా.
    98. ప్రస్తుత కాలంలో అందరూ ఎలక్ట్రానిక్‌ మీడియాకి ఎక్కువ అలవాటు పడ్డామని చెపుతుంటారు.
    99. అయితే దాని అర్ధం పుస్తకాలు ఎవరు వ్రాయట్ల్లేదనా? లేక ప్రజలకి పుస్తక పఠనం పై ఆసక్తి పోయిందనా? ఏమైనప్పటికి లిఖిత పదాలకు ఒక ప్రాముఖ్యత ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ వార్తాపత్రికలు చదివేవారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది.
    100. ముద్రణ మరియు ఎలక్ట్రానిక్‌ మీడియాలో కూడా పలురకాలుగా పలు పద్ధతులలో కమ్యూనికేషన్‌ ఉంటుంది.
    101. మనం ఇ-మెయిల్‌ లేదా ఛాటింగ్‌ ఉపయెగించవచ్చు.
    102. ప్రస్తుతం మనం నివసించే డిజిటల్‌ ప్రపంచంలో మనం కమ్యూనికేట్‌ చేయటానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
    103. అయితే మనం మన తృప్తి కోసం మనం వ్రాస్తే దాని అనువాదం మనం ఊహించలేము.
    104. కాని కొంతమంది రచించాలనే అత్యుత్సాహంతో వారి రచనల ప్రభావం ఎటువంటి సంక్షోభం, ఇబ్బందులు కలిగిస్తాయో తెలుసుకోలేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ రచనల గురించి చాలా శ్రద్ధ వహించాలి.
    105. తరువాతి అంశం క్రాస్  కల్చరల్‌ కమ్యూనికేషన్‌.
    106. ఒక సంస్ధలో భిన్న సంసృతులకు చెందిన వ్యక్తులు ఒకే వేదికపైకి వచ్చినపుడు మనం ఒక ఉద్దేశంతో సంభాషించినప్పటికీ వారి మతపరమైన విశ్వాసాలని తప్పక గౌరవించాలి. మర్యాదలను పద్ధతులనుపాటించాలి.
    107. ప్రతి సంస్థలో ఏ స్థాయి వారు ఏ స్థాయి వారితో కమ్యూనికేట్‌ చేయాలనే విషయంలో నిర్దిష్ట నమూనాలు ఉంటాయి. కొన్ని సంస్థలలో ఉన్నతాధికారులు తమ క్రింది ఉద్యోగులతో ఒక విధమైన అహంకార వైఖరితో ప్రవర్తిస్తే దాని వలన సంస్థ యొక్క కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలుగుతుంది.
    108. కాబట్టి గ్లోబల్‌ కమ్యూనికేషన్‌ లో సాంస్కృతిక సున్నితత్వం ఉండాలి.
    109. కొన్ని సార్లు సమయం సందర్బం కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. మీరు లాటిన్‌ అమెరికాలో ఉన్నట్లయితే, సమావేశం సమయానికి ప్రారంభం కాకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.
    110. ఎందుకంటే అక్కడ సమావేశానికి ముందు చర్చలు, భోజనాలు ఉంటాయి. బహమతుల మార్పిడి సమస్యను కలుగజేస్తుంది. 
    111. బహమతుల మార్పిడి సమస్యను కలుగజేస్తుంది. 
    112. అయితే మనం ఒక చైనీయుడికి గడియారం బహుమతి ఇస్తే అది చెడుకు సంకేతంగా వారు భావించవచ్చు.
    113. అందువల్ల, మీరు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
    114. ఒక సమాజం యొక్క నమ్మకాలు మరొక సమాజానికి భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి మనం ఇతరుల సాంద్రాయాలను తెలుసుకోవాలి.
    115. ఇటువంటి బేధాలను అధిగమించటానికి మనం రిసీవర్స్‌ కి కోంత ప్రాముఖ్యత ఇసౖే మనం మర్యాద పాటించిన వారి మౌతాము.
    116. ప్రస్తుతకాలంలో మనం ఒక సంస్థలో లేదా ఇతరులతో కమ్యూనికేట్‌ చేసినపుడు నైతిక సూత్రాలను గురించి శ్రద్ధ వహించాలి.
    117. ప్రతీ సంస్థకి ఒక నైతిక నిబంధనావళి ఉంటుంది. దాన్ని అందరు ఉద్యోగులు పాటిస్తారు, అంతే కాకుండా దానితో పాటు వారు వ్యక్తిగత నైతిక నియమావళి కూడా పాటించాలి.
    118. ఉదాహరణకి మీరు సంస్ధ నిధులు వాడుకొని ప్రయాణిస్తూ సంస్థకు వ్యతిరేక ఇంటర్వూ చెప్తె అది నైతికతకు విరుద్ధం. 
    119. మనం ఒక సంస్థలో పనిచేస్తున్నంతవరకు ఆ సంస్థ యొక్క విలువలను, నమ్మకాలను, నైతికి నియమావళిని, మరియు ప్రణాళికలను తప్పక గౌరవించాలి . కంపెనీ వెబ్‌సైట్‌ లో ఉన్న పబ్లిక్‌ సందేశాలు మనకు విధానాలు, ప్రక్రియల గురించి మార్గ నిర్దేశనం చేస్తాయి.
    120. కాబట్టి ఒక బాధ్యత గల పౌరుడిగా మనం ఒక సంస్థ్ధ యొక్క గౌరవాన్ని, ప్రతిష్ఠను నిలబెట్టాలి.
    121. ఆధునిక కాలంలో మనకు వాక్‌ స్వాతంత్య్రం ఉన్నప్పటికీ మన న్యాయపరమైన భాధ్యతను కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికీ న్యాయశీలత, సమగ్రత చాలా అవసరం.
    122. ఎందుకంటే మనం సమాచారాన్ని తప్పుగా చెప్పినా విధానాన్ని సరిగా అమలు చేయకున్నా మనం చాలా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవలసి వస్తుంది.
    123. కాబట్టి వేరే వ్యక్తులు చెప్పిన విషయాలను ప్రస్తావించినపుడు అది తప్పకుండా ఒప్పకోవాలి. కొంతమంది యువకులు ఉద్యోగాలు మారినపుడు తమ పూర్వసంస్థ గురించి అనాలోచితంగా విమర్శలు చేస్తారు, ఇది ఉద్యోగం కోసం చేసినా అది కేవలం అనైతికం మరియు అక్రమం.
    124. మిత్రులారా మీరు ఎప్పడూ కూడా మీరు పనిచేసే సంస్ధ యొక్క నిజమైన అంబాసిడర్‌గా వ్యవహరించాలి.
    125. మీరు వ్రాతపూర్వకంగా విమర్శ చెప్తె అది పరువు నష్టంగాను మాటలతో విమర్శ చెప్తె అపవాదు గాను భావించబడుతుంది.
    126. కాబట్టి మనం సమర్ధవంతంగా కమ్యూనికేట్‌ చేయాలంటే అపవాదు కలిగించే విమర్శలను చేయకూడదు మనం ఎప్పడైతే సామరస్యత సాధించుతామో అపుడే అది ప్రభావవంత కమ్యూనికేషన్‌  అవుతుంది. ఒక మంచి కమ్యూనికేటర్‌గా మనం సత్ప్రవర్తన, సాంఘిక మర్యాదల మిశ్రమంతో సమగ్రత పూర్వకంగా ప్రవర్తించాలి. అది సంస్ధలోపల అయినా, బయట అయినా సరే.
    127. ఈ ఉపన్యాసాల ద్వారా ఒక వ్యక్తికి మంచి ఉద్యోగం పొందటానికి సాప్ట్‌ స్కిల్‌ ఎంత ఆవశ్యకమో తెలుసుకున్నారు కదా.
    128. కాబట్టి నా సలహా ఏమిటంటే మీరు అర్ధవంతంగా, ఒక లక్ష్యంతో మనుషులని విడదీయడానికి కాకుండా కలపడానికి సామరస్యత పెంచటానికి కమ్యూనికేట్‌ చేయండి. మీ సంస్ధయొక్క నిర్ధిష్ఠ లక్యాలు సాధించండి.
    129. ధన్యవాదాలు!