43. softskill_Group Discussion - Part II-R6RyBAZe94w.txt 45.6 KB
Newer Older
Vandan Mujadia's avatar
Vandan Mujadia committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204
    1. పున:స్వాగతం మిత్రులారా!.
    2. మనం సమూహ చర్చల గురించి మాట్లాడుతున్నాము. 
    3. పూర్వపు ఉపన్యాసంలో టాపిక్ మరియు కేన్ ఆధారిత GD ల గురించి చర్చించాం.
    4. అలాగే GD లో పాల్గొనేటపుడు సంఘర్షణ ఏర్పడితే దాన్ని ఎలా పరిష్కరించాలో తెలుసుకున్నాం.
    5.  మీరు GD పాల్గొనే సభ్యులైతే, మీరు ఏదైనా చెప్పాలనుకుంటారు కాని మాట్లాడలేక పోతారు.
    6. ఇంకో ఇద్దరు, ముగురు సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడటం మొదలుపెట్టి గొడవ చేస్తారు.
    7. అపుడు నాయకుడి పాత్ర ముందుకు వస్తుంది.
    8. ఇయితే GD లో ఎలాంటి నాయకుడు ఉండాలి, అతని అడుగుజాడల్లో ఎలా నడవాలి? ఎవరు నాయకుడు కాగలరు? నాయకత్వం చూపించగలరు?. 
    9. సాధారణంగా నియమింపబడిన నాయకుడు ఉంటే అతను మీటింగ్ అజెండా, దాని, సమయం, ప్రదేశం లాంటి వివరాల్ని నిర్ణయిస్తాడు.
    10. కొన్నిసార్లు, మిగతా సమూహాన్ని నిర్ధారించడానికి అతను తన స్థాయిని ఉత్తమంగా చేస్తాడు, సమూహ సభ్యులందరూ పాల్గొనేలా చేసి సమూహ రక్షకునిలా ప్రవర్తిస్తాడు.
    11. మీరు కూడా రక్షకులు అవగలరు.
    12. ఏ చర్చలో అయితే నాయకుడు ఉండడో, అది నావ నిండుగా మనుషులు ఉండినది మధ్యలో చిక్కుకుపోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్ధితిలా ఉంటుంది.
    13. కాబట్టి నాయకుడు అవసరం.
    14. నాయకుడు సమూహంలో ఒక ముఖ్యం భాగం.
    15. అతను సమూహం దారి తప్పకుండా రక్షించే బాధ్యత కలిగి ఉంటాడు.
    16. ఆలోచనలు, వైఖరులు భిన్నంగా ఉంటే సంఘర్షణ ఏర్పడుతుంది.
    17. ఎక్కడైతే ఘర్షణ ఉంటుందో దాన్ని పరిష్కారం చేయటానికి నాయకుడు సహాయం చేస్తాడు. సమూహంలో ఎవరైనా సభ్యుడు నిశ్శబ్దంగా ఉంటే నాయకుడు విడిపోతారు. 
    18. కాని ఇతరులు కాని అతన్ని చొరవ తీసుకొని ప్రోత్సహించి, ఒప్పించి మాట్లాడేలా చేయాలి. అలా చేస్తే అందరికీ ఉన్న ఆలోచనలు బహిర్గతమౌతాయి.
    19. ఎందుకంటే చర్చలో పాల్గొనే అందరూ బహిర్ముఖులుగా  ఉండరు. కొందరు అంతర్ముఖులుగా కూడా  ఉంటారు.
    20. అయితే కేవలం ప్రోత్సాహం వలన వారు అభిప్రాయాలు వ్యక్త పరచగలరు.
    21. ఒకవేళ సమూహ సభ్యులు చర్చను పక్కదారి మళ్లిస్తున్నా రని నాయకుడు తెలుసుకోవచ్చు. 
    22. అప్పుడు అతడు, చర్చ సారాంశాన్ని తెలిపి అందరు మళ్లీ చర్చలో పాల్గొనే సందర్భాన్ని సృష్టిస్తాడు.
    23. మనం నాయకత్వ రకాల గురించి ముందే తెలుసుకున్నాం కదా.
    24. అయితే నిర్దిష్ట నాయకుడు, ఉద్దేశిత నాయకుడు, ఉద్భవించే నాయకుడు, లేదా నియమితుడైన నాయకుడు ఇలా ఎవరైనా ఉండవచ్చు. నామినేట్ చేయబడతారు.
    25. అయితే చర్చలో నాయకుడి విషయం పూర్తిగా వేరే విధంగా ఉంటుంది.
    26. ఇక్కడ ఒక వ్యక్తి ఒక అవతార పురుషుడుగా ఉద్భవిస్తాడు.
    27. హఠాత్తుగా ఒక వ్యక్తికి చొరవ, తెగింపు కలిగి ఇతరులకి ఇలా చెప్తాడు.
    28. కనుక ఒక నాయకుడు ఉద్భవిస్తాడు.
    29. కనుక, అభివృద్ధి చెందుతున్న నాయకుడు ఉద్భవిస్తాడు
    30. అయితే ఉద్భవించే  నాయకుడంటే ఎవరు? మీరు కూడా ఉద్భవించే  నాయకుడు కావచ్చు.
    31. ఉద్భవించే  నాయకుడిలో ఎలాంటి విలక్షణతలు ఉండాలి? మొట్ట మొదటగా నాయకులందరికీ చక్కని కమ్యూనికేషన్ సామర్య్ధాలు కలిగి ఉండాలి. ఈ సామర్ధ్యం లేకపోతే వారు ఎవరినీ ఒప్పించి ప్రభావితం చేయలేరు.
    32. ఒక నాయకుడు ఎలా ఉండాలంటే, LEADER అనే పదం లోని అన్ని అక్షరాలనీ తీసుకుందాం.
    33. L అంటే నాయకుడు ఉదారతను కలిగి ఉండాలి. ఉదార వైఖరితో ఉండాలి. ధృడతను చూపరాదు.
    34. అందరూ చర్చలో పాల్గొనేలా చూడాలి.
    35. కనుక మొదటి అక్షరం L ను నేను ఉదారవాదిగా విశ్లేషించాను.
    36. కనుక నాయకుడు ఉదార వైఖరితో ఉండాలి.
    37. రెండవ అక్షరం E అంటే  ఆసక్తి మరియు ఉత్సాహభరితంగా ఉండాలి. 
    38. ఇతరులకి సహాయం చేసే ఆసక్తి, ఉత్సాహం కలిగి ఉండాలి.
    39. నాయకుడికి చాలా విషయ పరిజ్ఞానం ఉండాలి.
    40. ఎందుకంటే చర్చలో పాల్గొనటానికి అది అవసరం.
    41. అలాగే మంచి గ్రహణశక్తి కలిగి ఉండాలి. జ్ఞానం కంటే కూడా ఇతరుల నుంచి నేర్చుకునే పట్టుదల ఉండాలి. పూర్వపు జ్ఞానం కూడా సహాయకారి అవుతుంది.
    42. నాయకుడు తన ఆసక్తి, ఉత్సాహంతో సమూహ సభ్యులను గొడవ, సంఘర్షణ నుండి తప్పించి ఒకరకొకరు సహాయం చేసి కొనేలా చేయాలి.
    43. అంటే ఒకరి కొకరు ఈదటానికి సహాయం చేసుకొని ఒడ్డుకు చేరాలి.
    44. లేకపోతే చర్చ ముగిసి పోతుంది. ఒకోసారి కొంతమంది సభ్యులు టాపిక్ ని వనగానే నేను ఈ విషయాన్ని అంగీకరించలేను, కాబట్టి మనం ఈ చర్చని ముగించాలి అని అంటారు.
    45. ఇలాంటి నిరుత్సాహం పనికిరాదు.
    46. తరువాతి అక్షరం 'D' అంటే Democratic ప్రజాస్వామిక.
    47. నాయకుడు ప్రజాస్వామిక పద్ధతిలో ఉండాలి అంటే సమూహ సభ్యులందరికీ తమ అభిప్రాయాలు వ్యక్తీకరించే అవకాశాన్ని పొందేలా చూడాలి.
    48. ఏ ఒక్క వ్యక్తి సెంటిమెంట్స్ దెబ్బతినకుండా చూడాలి. అందరూ సమాన ప్రతిపత్తితో పాల్గొని చర్చసరైన దిశలో వెళ్లేలా చేయాలి.
    49. ఒక నాయకుడు ఎప్పుడూ ధృడమైన స్వభావం కలిగి ఉండాలి.
    50. తరువాత అక్షరం 'A' అంటే ధృడమైన స్వభావం కలిగి ఉండాలి. విషయ పరిజ్ఞనం ఉంటే పాండిత్యం ఉంటే సహజంగా ధృడత చూపించవచ్చు.
    51. అయితే అహంకారం చూపించకుండా ధృడ స్వభావాన్ని ప్రదర్శించాలి.
    52. ధృడత అంటే మీ నిర్మాణాత్మక ఆలోచనల ద్వారా ఇతరులను ప్రభావితం చేయడం. మరియు ఇది మీకు నిశ్చయంగా ఉండటానికి సహాయపడుతుంది.
    53. మీరు చెప్పే విషయంపైమీకు విశ్వాసం ఉంటే తప్పక నొక్కి చెప్పగలరు.
    54. కనుక ఒక నాయకుడు దృడంగా ఉండాలి.
    55. నాయకుడికి చర్చించే టాపిక్ లో చక్కని పాండిత్యం ఉంటే ధృడంగా చెప్పగలడు.
    56. నాయకుడికి హేతుబద్ధత  అంటే విచక్షణా వైఖరి ఉండకూడదు. అందరూ చర్చలో పాల్గొనేలా, చర్చ సరైన దిశలో కొనసాగేలా చూడాలి.
    57. కొంతమంది సభ్యులు చర్చకి ఎప్పుడూ రారు.
    58. మాట్లాడక పోవడం మంచిదని కొంతమంది అనుకోవచ్చు. కాని ఇది ప్రమాదకరం.
    59. కనుక మీకు ఎక్కువ సమయం లభిస్తుందా, లేదు.
    60. సమూహచర్చలో తప్పక పాల్గొనటమనేది అందరి బాధ్యత.
    61. అందువల్ల, ఒక సమూహంలో సభ్యునిగా, ఇతర సభ్యులు కూడా పాల్గొనడాన్ని మీరు చూడాలి.
    62. నిపుణులు మీరు ఎందుకు నిశ్శబ్దంగా ఉండి చొరవ తీసుకోవట్లేదనే విషయాన్ని గమనిస్తారు.
    63. కాబట్టి ఇలాంటి వారిని చాలా మర్యాద పూర్వకంగా ఉత్సాహపరిచి, ప్రోత్సహించి మాట్లాడేలా చేయాలి. లేకపోతే ఇలాంటి నిశ్శబ్ద, జడ స్వభావ సభ్యుడు ఒక భారంగా అనిపిస్తాడు. అనే సామెత ఉంది. 
    64. మీరు కేవలం మీ వ్యక్తిగత సమర్ధత కారణంగానే కాకుండా సమూహా బాధ్యతను ఎలా నిర్వర్తిస్తున్నారనే విషయాన్ని కూడా నిపుణులు పరిగణించి విశ్లేషిస్తారు కాబట్టి మీరు ఈ రెండు బాధ్యతలను సమానంగా నిర్వహించాలి.
    65. జడ స్వభావులు మాట్లాడేలా చేయాలి.
    66. నిపుణులు అన్నీ గమనిస్తుంటారు. అతను ఒక వ్యక్తి.
    67. నిపుణుని పాత్ర ఏమిటి, మీకు చర్చకి టాపిక్ ని ఇచ్చిన తర్వాత వారు ఒక పరిశీలకుని పాత్ర పోషిస్తారు. చాలా విషయాలు గమనిస్తారు. చర్చ జరుగుతుండగా కొన్ని విషయాలు వ్రాసి పెట్టుకుంటారు. వాటిని కొన్ని సమయాలలో చర్చించవచ్చు.
    68. ఒక నాయకుడు తన నిర్మాణాత్మక పాత్ర ద్వారా, హేతుబద్ద ఆలోచనల ద్వారా అందరనీ ఒప్పించి ఒక ప్రత్యేక ఆలోచనా విధానం ప్రాముఖ్యత గురించి ప్రభావితం చేస్తాడు. 
    69. సమూహ సభ్యుల్లో తన మద్దతు దారుల ద్వారా మద్ధతు కూడగడ్తాడు. ప్రత్యర్ధుల వైఖరిని బలహీన పరుస్తాడు.
    70. ఎవరైనా తీవ్రవైఖరిని అవలంభిస్తే నేను మరింత ముందుకు వెళ్తాను. 
    71. ఇతరులను బాధపెడ్తే ఆ సందర్భంలో నాయకుడు సహాయ సహకారాలందించి సమూహ సభ్యులలో ఉత్సాహాన్ని పూరిస్తాడు. త ద్వారా చర్చ కొనసాగుతుంది.
    72. అంతేకాకుండా నిపుణులు సమూహ సభ్యుల ప్రవర్తన చొరవ, ప్రతి చర్యలను కూడా చూస్తున్నారు. 
    73. అంతే కాకుండ శాబ్దిక, అశాబ్దిక ప్రవర్తన కూడా గమనిస్తారు. మీ భంగిమలు, హావభావాలు, స్వరస్ధాయి, మీరు ఇతరులను అణగదొక్కడానికి, ఒడించటానికి ఎలా పరుషంగా మాట్లాడతారో గమనిస్తాడు.
    74. మీరు భాదపడుతున్నారని అతనికి తెలియచెప్పండి.
    75. మీరు స్వరస్ధాయిని ఎలా పెంచారో గమనిస్తారు.
    76. సభ్యులలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ మాట్లాడారో, ఎవరు మాట్లాడుతూ హఠాత్తుగా మౌనంగా ఉన్నారో చూస్తారు.
    77. ఎవరు ఎక్కువ లేదా తక్కువ పాల్గొంటుంన్నారు, ఎక్కువ పాల్గొనే వారు ఆగిపోవటానికి కారణమేంటి? ఇలాంటి అన్ని వివరాలను తెలుసుకుంటారు.
    78. ఎమైనా కారణాలు ఉన్నాయా? మీరు చర్చలో పాల్గొన్నపుడు ఎవరినీ బాదించరాదు అనే విషయం తెలుసుకోవాలి. GD అంశం ఆధారంగా మీకు తెలిసినవి చాలా ఉన్నాయి.
    79. ఒకోసారి GD కి ఇచ్చిన టాపిక్ వివాదాస్పదమైనది, వాస్తవాల ఆధారితం లేదా ఊహజనితమైనది అయి ఉండవచ్చు.
    80.  మీకు ఎలాంటి విషయం ఇవ్వబడిందో మీకు తెలియదు.
    81. అలాంటి సందర్భంలో వివాదాస్పద విషయం చర్చించేటపుడు ఎవరినీ కూడా మత పరంగా లేదా నైతికంగా అవమానించబడ కూడదు. 
    82. అది నిపుణుల బాధ్యత. 
    83. నిపుణులు చర్చలో మార్పు ఎందువలన వచ్చందో గమనించాలి. అది కొందరు మద్దతు తెలపటం వలన, వ్యతిరేకత తెలపటం వలన, ఆధిపత్యం వలన లేదా అణగ దొక్కటం వలన ఇలాంటి అన్ని విషయాలు ఆలోచించాలి.
    84. దయచేసి జాగ్రత్తగా ఉండండి.
    85. సభ్యులలో నిశ్శబ్దంగా ఉండేవారు ఒక భారంగా మారతారు.
    86. కాబట్టి అతను మాట్లాడేలా చేయడానికి మీరు బిగ్గరగా మాట్లాడాలి.
    87. అలాంటి వారిని ఇతర సభ్యులు ఎలా చూస్తారు? 
    88. వారికి వారు భారమనే విషయాన్ని అనుభూతి పొందేలా చేస్తారా?. 
    89. అలా చేయకూడదు. 
    90. ఎందుకంటే చర్చ ముందుకు సాగాలి అందరూ చర్చలో పాల్గొనాలి.  దాని ద్వారా పాల్గోనే స్థాయిని అంచనా వేస్తారు.
    91. కొంతమంది తమ పాత్ర సరిగ్గానే పోషించామనుకుంటారు. ఇవన్నీ తప్పక విశ్లేషించాలి.
    92. ఇంతకు ముందు చెప్పినట్లుగా మీరు మీ పాల్గొనే స్ధాయి, ప్రేరణని చర్చ జరుగుతున్నంత సేపూ ప్రదర్శించాలి.
    93. GD లో అంకిత భావం చూపించాలి.
    94. అందరూ సరిగ్గా పాల్గొనక పోతే చర్చ ఇచ్చిన సమయానికి ముందే ముగిసి పోతుంది.
    95. కాబట్టి కొంతమంది ఉత్సాహంగా పొల్గొని చర్చను ముందుకు నడిపిస్తారు. వారు ఎందుకు ఎక్కువ పాల్గొంటున్నారంటే వారికి కేవలం ఆలోచనలు ఎక్కువ ఉన్నందువల్ల కాదు, అంకిత భావం వలన.
    96. సభ్యులందరూ ఇతర సభ్యులకు మద్దతు నివ్వాలి.
    97. ఇతరులు మీరు చెప్పిన విషయాలు వాదించినా, అంగీకరించినా కూడా వారిని సమర్ధించాలి. 
    98. మీరు ఎక్కువ పాల్గొనలేదని, మాట్లాడలేదని నిపుణులు అనుకోకూడదు.
    99. మీరు ఎవరికైనా మద్ధతు నిచ్చినా, వ్యతిరేకించినా మీరు మీ వైఖరి చెప్పినట్లే.
    100. కాబట్టి చర్చ కార్యకలాపాల్లో చురుకుగా ఆసక్తిచూపాలి. మీరు ఒకప్పుడు మాట్లాడి ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉన్నా ఎక్కువసేపు మౌనంగా ఉండకూడదు.
    101. మీ ఉనికిని మీరు ఎల్లప్పుడూ ప్రదర్శించే ఉత్సాహం చూపాలి.
    102. ఇప్పుడు ప్రశ్న GD కి ఎలా సిద్ధం అవాలి అనేది ప్రశ్న.
    103. ఈ ప్రశ్న మీకు ఎక్కువ సార్లు రావచ్చు.
    104. ఎందుకంటే ఒక ఉద్యోగం కోరుకొనే అభ్యర్ధిగా మీరు మొదటిసారి GD లో పరీక్షింపబడతారు.
    105. కాబట్టి ఏం చేయాలి? మొదట మీరు GD జరిగే వేదిక వద్దకు వెళ్లి, అక్కడ కుర్చీలుంటే వాటిలో సౌకర్యవంతగా కూర్చోవాలి. ఎందుకంటే మీరు కూర్చునే విధానం మీ అశాబ్దిక ప్రవర్తనను తెలియజేస్తుంది. మీరు చర్చలో పాల్గొన్నప్పుడు చూపించే ప్రతి చర్య కూడా అశాబ్దిక ప్రవర్తనకు సంకేతం. 
    106. కాబట్టి సౌకర్యంగా కూచోటం మీరు చేయవలసిన మొదటి పని.
    107. తరువాత టాపిక్ ని శ్రద్ధగా వినండి.
    108. ఎవరైతే నాకు ఏమీ తెలీదనే ఫిర్యాదు చేస్తారో వారు పలయనవాదులు. వారు సరిగ్గా విషయాల్ని వినరు.
    109. మీరు చక్కగా వింటే సగం విజయం పొందినట్లే. ప్రతి పదాన్ని శ్రద్ధగా వినాలి. 
    110. కొన్నికీలక పదాలు టాపిక్ లోనే ఉంటాయి.
    111. ఆ కీలక పదాలను మీరు అర్ధం చేసుకోవాలి.
    112. ఆపదాలను వింటుంటే ఏదో ఒకపదం మీ ఆలో చనా శక్తిని అకస్మాత్తుగా ప్రజ్వలింపజేస్తుంది.
    113. కనుక శ్రద్దగా వినాలి.
    114. శ్రద్ధగా వినటం GD లో ఒక ప్రముఖ భాగం.
    115. వినటం వలన చాలా విషయాలు తెలుస్తాయి.
    116. మనలో ఉరుచేతన స్ధితిలో అనేక విషయాలు సమాచారం స్తబ్ధుగా దాగి ఉంటాయి. మనం ఏదైనా నిర్దిష్ట పదం వినగానే ఆ విషయాలు సచేతనమౌతాయి.
    117. మీరు వెంటనే క్రియాశీలకంగా మారి అనేక విషయాలు సమర్పిస్తారు.
    118. కాబట్టి విషయాన్ని జాగ్రత్తగా వినండి.
    119. మీరు మాట్లాడే ముందు మీ ఆలోచనలను సమకూర్చు కోవడం తప్పనిసరి.
    120. అంటే మీరొక విధానం గురించి మాట్లాడేటపుడు అది మీకు నచ్చిందని, మెచ్చుకుంటానని చెపితే సరిపోదు.
    121. ఇటీవలి ప్రకటన చాలా తార్కికంగా, ఒప్పించేదిగా ఉంది అనవచ్చు.
    122. కాని మీరు ఆ విధంగా ఎందుకు అనుభూతి చెందుతున్నారో దాని కారణాల గురించి కూడా వివరించాలి. శ్రద్ధగా వినటం GD లో ఒక ప్రముఖ భాగం.
    123. అంటే మీరొక వాక్యం మాట్లాడితే దానికి అనుబంధంగా ఇంకొన్ని వాక్యాలను జోడించి మీకు టాపిక్ పై చాలా సమాచారం తెలుసని నిర్దారించాలి.
    124. అయితే మీరు అసంపూర్ణ వాక్యాలు, పదబంధాలు వాడకుండా పూర్తి వాక్యాలను ఉపయోగించాలి.
    125. వాక్యాలు వ్యాకరణపరంగా సరిగ్గా ఉండేలా చూడాలి.
    126. మీరు మాట్లాడే ముందు మీ ఆలోచనలను తెలుసుకోవాలి.
    127. మీరందరూ కూడా మొట్ట మొదటి అవకాశం దొరకగానే మాట్లాడాలి.
    128. మొట్ట మొదటి అవకాశం అంటే మీరు ఇతరుల అవకాశాల్ని చేజిక్కించుకోవడం కాదు. కేవలం ఒక రద్దీగా ఉన్న బస్సులో మీ స్ధానాన్ని వెతుక్కోవాలి.
    129. మీ సొంత ప్రయత్నం ద్వారా మీకొక స్ధలాన్ని మీరే ఏర్పరచుకోవాలి.
    130. మొదటి అవకాశం రాగానే మాట్లాడాలి, కాని ఇతరులతో పోట్లాడరాదు.
    131. ఎందుకంటే సమూహంలో సభ్యులందరూ మీలాంటి వారేకదా. 
    132. మొదటి అవకాశం రాగానే మాట్లాడాలి, ఇతరులు మాట్లాడేటపుడు మీరు ఏకాగ్రత, సమతుల్యత, సహనం చూపించాలి.
    133. వారి మాట్లాడటం ముగించాక మాట్లాడాలి.
    134. ఇతరులని నిరంతరంగా మాట్లాడనివ్వకండి.
    135. ఎప్పుడైతే అతనిని నిరోధించాలని మీకు అనిపిస్తుందో అపుడు మీరు జోక్యం చేసు కోవచ్చు. అయితే మీరు చెప్పే విషయం హేతుబద్ధంగా, అందరికీ అర్ధమయ్యేలా ఉండాలి.
    136. మీరు చెప్పే విషయం మర్యాద పూర్వకంగా చెప్పాలి.
    137. నేను ఇంతకుముందు మాట్లాడినట్లుగా, నేను నా మనస్సును పంచుకోగలనా, నా సమాచారం చెప్పగలనా, Mr.సూరజ్ చెప్పినది ఒక సందర్భానికే వర్తిస్తుంది. అన్నిటికీ వర్తించదు.
    138. ఇది. 
    139. ఎందుకంటే ప్రతి సందర్భానికి కొన్ని అవసరాలుంటాయి.
    140. ఇలా మీ ప్రతిపాదనను మర్యాదగా చెపుతున్నారు.
    141. అలాగే మీరు మీ మద్దతుదారులను, ప్రత్యర్ధులను గుర్తించాలి. మీ మద్దతు దారులు మాట్లాడుతుంటే మౌనంగా ఉండాలి. అవసరమైతే అతని ఆలోచనలను సమర్ధించాలి.
    142. మీ ప్రత్యర్ధులు మాట్లాడుతుంటే శ్రద్దగా విని, అభిప్రాయాలు తెలుసుకొని అవసరమైతే వాటిని ఖండించాలి.
    143. 
    144. కాబట్టి మీ మద్దతుదారులను, ప్రత్యర్ధులను గుర్తించాలి. 
    145. అయితే నిపుణులు ఇచ్చిన సమయంలోనే మీరు అన్నీ విషయాలు చర్చించారా అని గమనిస్తారు.
    146. కాబట్టి మీరు సమయాన్ని సరిగ్గా వాడుకోండి. సమయాన్ని సరిగ్గా పంచుకోండి.
    147. మీరు ఇతరులతో మాట్లాడేటపుడు, వినేటప్పుడు ఐ కాంటాక్టి ఉండేలా చూడాలి.
    148. మీ ప్రత్యర్ధులు లేదా మద్దతుదారులతో మాట్లాడేటపుడు ఐ కాంటాక్ట్ లేకపోతే మీ ఆలోచనలన్నీ శూన్యమవుతాయి.
    149. GD లో సమయాన్ని సరిగ్గా పంచుకోవాలి. కొంతమంది తమ సమయాన్ని ఇతరులు తీసేసుకున్నారన్న అపోహలో, ఆత్రుతలో ఉంటారు.
    150. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందులో మొదటిది, చర్చ ప్రారంభించాలనే ఆత్రుతలో ఉండకండి.
    151. మీకిచ్చిన 20 నిమిషాలలో మీకు తప్పక అవకాశం వస్తుంది. కాని మీరు చొరవ చూపించాలి.
    152. GD లో మౌనంగా ఉండకూడదు, మీరు ఏదో చెప్పాలి. 
    153. మీ వద్ద ఏమీ విషయాలు లేకపోతే ఇతరులు చెప్పింది వినటం ద్వారా సమాచారం పొందవచ్చు. GD లో విషయాలకు కొరత ఉండదు. ఎందుకంటే GD లో చాలా అభిప్రాయాలు వ్యక్తమౌతాయి.
    154. కొంతమంది తమ ఆధిపత్యం చూపిస్తే నాయకుడుగా నిర్ణయింపబడతామనే అపోహలో ఉంటారు.
    155. అది సరికాదు ఆధిపత్యం చూపించటం కంటే ప్రభావం చూపిస్తేనే నాయకులయ్యే వీలుంది.
    156. మీరు సమూహాన్ని ప్రభావితం చేయాలి.
    157. మీరు ఎలా ప్రభావితం చేయాలి. మీరు మీ నిర్మాణాత్మక సూచనలు, హేతుబద్ధ ఆలోచనలు, వాస్తవ సహాయక వైఖరుల ద్వారా ప్రభావితం చేయాలి.
    158. ఎప్పుడు సమూహ ఛైర్మన్ గా ప్రవర్తించకండి.
    159. ఛైర్మన్ ఎవరు,  ఛైర్మన్ వాస్తవంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. 
    160. మీరు మీ పాత్రని, బాధ్యతని సరిగ్గా చేపడితే అపవాదు పొందరు. మీరు ఆ మొత్తం ఎపిసోడ్ ని పాడుచెయ్యడానికి వెళ్లలేదు కదా. 
    161. ఎప్పుడూ కూడా న్యాయమూర్తి పాత్ర, తీవ్ర వైఖరిని తీసుకోకండి.
    162. కొంత మంది తీవ్ర వైఖరితో తమ సొంత తీర్పు ప్రకటిస్తారు. మీరు నైతికంగా ఆలోచించటం మంచిది కానీ మీరు అన్ని విషయాలూ తెలుసుకున్న తరువాతే తీర్పును ఇవ్వాలి. మీరు ఇది చేయకూడదు, ఇలామాట్లాడరాదు. అని మీ స్వంత తీర్పు లివ్వకండి.
    163. అరాచకత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఇతర వ్యక్తులను రక్షించడానికి ప్రయత్నించడం ద్వారా, మీరు మీ స్వంత దృక్పథాన్ని వ్యక్తపరచవలసి ఉంటుంది.  మీరు కేవలం ఒక సభ్యుని లాగే ప్రవర్తించాలి. మీరు మీ నాయకత్వ లక్షణాలను నైపుణ్యాలను వివిధ పద్ధతుల్లో ఇతరులను ప్రభావితం చేయటానికి లేదా సంక్షోభం నుండి కాపాడటానికి మాత్రమే ఉపయోగించాలి.
    164. ఒకోసారి మీకు మీ ప్రత్యర్ధుల అభిప్రాయాలన్ని తెలిసే పరిస్థితులు ఉండవచ్చు.
    165. అప్పుడు మీరు వారితో ఎక్కువగా వాదించి సమయం వృధా చేయద్దు. అందరూ తమ భావాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది కాబట్టి వాదనలు అనవసరం.
    166. అందువల్ల, మనమందరం మనుషులం అని మీకు తెలిసిన వారి తర్కంలో ఎప్పుడూ ప్రవేశించవద్దు
    167. మన మద్దతుదారునికి సహాయంగా లేదా ప్రత్యర్ధికి వ్యతిరేకంగా సమాంతర సంభాషణ లేదా గుసగుసలాడద్దు. 
    168. కనుక, ప్రత్యర్ధులతో వాదనలు అనవసరం. మద్దతుదారులతో గుసగుసలాడద్దు. 
    169. నైతిక తీర్పులను వాయిదా వెయ్యండి.
    170. కొంతమంది సభ్యులు GD లో పాల్గొనేటపుడు తమ ఉపాధ్యాయులు లేదా నిపుణుల వైపు చూస్తూ, మాట్లాడుతూ వారిని ప్రభావితం చెయ్యాలను కుంటారు. అది తప్పు పద్దతి. అలా చూడరాదు.
    171. సమూహంలో ఎవరైనా సభ్యుడు జడంగా, ని(ష్కియాత్మకంగా మౌనంగా ఉంటే వారిపై అరవకూడదు. పరుషమైన, నిందాత్మక పదాలను, భాషను ఉపయోగించకండి.
    172. దాని వలన GD ఉద్దేశమే భంగమౌతుంది. కొంతమంది చర్చలో పాల్గొనేటపుడు అధికంగా కదులుతూ ఉంటారు. తమ భావాలు చెప్పటానికి ఇతరులను నిరోధించటానికి ముందుకు వెళతారు.
    173. కాని అది తప్పు. మీరు సమతుల్యత పాటించి కుర్చీలోనే కూర్చుని ఉండాలి. మీ ఆలోచనలు బలంగా ఉండాలి, కాని మీ సొంత బరువు చూపించరాదు.
    174. అన్ని ఆలోచనలని ఒకేసారి చెప్పకండి.
    175. అలా చెప్తే మీరు మీ సమయాన్ని, ఇతరుల సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు.
    176. కొంత మంది చాలా వేగంగా మాట్లాడి తమ వాక్పటిమను ప్రదర్శించాలనుకుంటారు. వాక్పటిమ ఉండటం మంచిదేకాని ఇతరులకు మీరు మాట్లాడేది అర్ధమవ్వాలి.
    177. అలా అర్ధమవకపోతే మీరు GD లో పాల్గొనడం వ్యర్ధమే. 
    178. మీరు మంచి వక్త అయితే సరియైన పిచ్, ఉచ్చారణ, శృతి స్ధాయిని పాటించి అందరికీ అర్ధమయేలా మాట్లాడాలి. 
    179. టాపిక్ నుంచి వైదొలగి పోకండి.
    180. కొన్ని సార్లు వక్తులు తమ అభిప్రాయ వ్యక్తీకరణలో టాపిక్ నుండి దారిమళ్లిపోతారు. వారిని ఒక లీడర్ మాత్రమే తిరిగి సరియైన దారిలోకి తీసుకురాగలడు.
    181. మనం ముందు నేర్చుకున్నట్లుగా ఎవరైనా వ్యక్తి తన ఆధిపత్యం, ద్వారా సంక్షోభం సృష్టించి బుల్ డోజర్ లా ప్రవర్తిస్తాడు. 
    182. అతని ఆలోచన పద్ధతిలోని లోపాల్ని కనిపెట్టడం ద్వారా తిరిగి అతని సాధారణ స్ధితికి తీసుకు రావచ్చు.
    183. అయితే ఇలాంటి అల్లకల్లోల పరిస్ధితిని నియత్రించటానికి అరవకూడదు.
    184. అల్లకల్లోలం ఆటలో ఒక భాగమనుకోవాలి. అనుకూల ఆలోచనా పద్ధతిలో, హేతుబద్ధ వాదనలతో చక్కగా నియంత్రించవచ్చు.
    185. GD లో అనేక ఘర్షణలు, క్లిష్ట పరిస్ధితులు వస్తాయి, అయితే వాటిని బాగా నియంత్రించాలి.
    186. కొంత మంది అత్యుత్సాహంతో తమ విషయాలని నిరూపించే క్రమంలో సభ్యుల మధ్య ఉన్న జేండర్, సంస్కృతి తేడాలని మరిచిపోయి మాట్లాడతారు. మరికొంతమంది అహంభావిగా ప్రవర్తిస్తారు.
    187. ఇవన్నీ GD లో చోటు చేసుకోకూడదు. అందరూ చక్కని మర్యాదని పాటించాలి.  ఎందుకంటే GD లో మీ ప్రధాన లక్ష్యం చర్చను చాలా స్థిరంగా, చాలా ఆచరణాత్మకంగా కొనసాగించడం.
    188. GD లో చర్చని చక్కని పొందిక, హేతువాదం, తార్కికత, ప్రజాస్వామిక, సంతులన ఇంకా ఆదర్శ పద్దతిలో కొనసాగించటమే ముఖ్యోద్దేశం.
    189. కాబట్ టిఒకే రకమైన సమతుల్యం పాటించాలి.
    190. అయితే సమతుల్యత ఎలా సాధించాలి ? కొన్ని సార్లు జట్టు పక్కదారి పట్టిందని గమనిస్తారు.
    191. అలాంటపుడు కొన్ని చర్యలు చేపట్టాలి.
    192. మీరు GD లో చురుకుగా పాల్గొంటే ప్రతి విషయాన్ని నాణెం రెండు పక్కలా చూడాలని తెలుసు కదా! మీరు అందరినీ ఒప్పించే ప్రయత్నం చేసినా, ప్రతి చర్చ ఏకాభిప్రాయం సాధించాలని లేదు.
    193. కాని సరియైన భావాల మార్పిడి జరగాలి. అన్ని టాపిక్ లలో ఏకాభిప్రాయం సాధించలేము. కేవలం ఆలోచనలు పంచుకోవాలి.
    194. GD లో ఇవ్వబడే టాపిక్స్ రకరకాలుగా ఉంటాయి. వాస్తవ ఆధారత టాపిక్ లు- బ్రెయిన్ డ్రెయిన్ నిరోధించాలి, మానవ క్లోనింగ్ నిషేధించాలి లాంటివి. కొన్నిసార్లు వివాదాస్పదంగా ఉంటాయి.
    195. 'డబ్బు సంతోషానిస్తుంది, కాని ఎక్కువ డబ్బు అసంతృప్తినిస్తుంది. 
    196. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండరాదు. 
    197. మతప్రాముఖ్యత ఉన్న స్ధలాల్ని బదిలీ చేయడం మార్చడం'. ఇలాంటి GD లు నిర్వహించేటపుడు చర్చ సరైన మార్గంలో నడిచేలా చూడాలి. గందరగోళం కలిగించకూడదు.
    198. మిత్రులారా, ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు GD లో పాల్గొన్నపుడు మీరు తార్కిక పద్దతిలోనే వాదన చేయండి.
    199. ఏరకమైన విషయాలు చర్చించినా తగాదాకి దారితీయకూడదు.  ఎందుకంటే కొన్నిసార్లు చర్చ ద్వారా మరియు వాదన ద్వారా, మీరు గొడవను ముగించారు.
    200. GD లో అభిప్రాయ వ్యక్తీకరణ కోసం, ఏకాభిప్రాయ సాధన కోసం నిర్వహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత మరియు సమూహ బాధ్యతను చక్కగా నిర్వర్తించాలి.
    201. ఒక సమూహంగా మరియు ఇక వ్యక్తిగా ఒకరికొకరు సహకరించుకుంటారు, ఎందుకంటే GD ఈ రెండు బాధ్యతల సమ్మేళనం.
    202. మనం చర్చించిన ఈ అంశాలను తెలుసుకొని మీరంతా GD లో పాల్గొనటానికి మీరు ఉత్సాహంతో పొంగి పొర్లుతున్నారనుకుంటాను. మీరు అన్ని జాగ్రత్తలు పాటించి ఒక మంచి వక్తగా, శ్రోతగా ప్రవర్తించి GD లో మీ గొప్ప అభిప్రాయాల్ని పంచుకొని విజయం సాధించాలని ఆశిస్తున్నాను.
    203. ధన్యవాదాలు !