44. softskill_Organizational Communication-g9TFF7fhiGc.txt 46 KB
Newer Older
Vandan Mujadia's avatar
Vandan Mujadia committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137
    1. శుభోదయం! 
    2. సాఫ్ట్‌ స్కిల్స్‌ ఉపన్యాసాలకి పున స్వాగతం.
    3. ఇప్పటి వరకూ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఒక వ్యక్తిని చక్కటి విజయవంతమైన ప్రోఫెషనల్‌గా ఎలా కయారు చేస్తాయో తెలుసుకున్నాం.
    4. సాఫ్ట్‌ స్కిల్‌ నేర్చుకోవటం ద్వారా మీలో ఉన్న ఇతర నైపుణ్యాలు కూడా వృద్ది చెంది మీ జీవితంలో ఉద్యోగంలో ఎంతో దోహదపడతాయి.
    5. ప్రభావంతమైన కమ్యూనికేషన్‌ లో వివిధ అంశాలు, శాబ్దిక ,అశాబ్దిక సంకేతాలు, సంజ్ఞలు గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం.
    6. నాన్-లిటరల్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, అక్షరరహిత కమ్యూనికేషన్ యొక్క వివిధ సంకేతాలు మీకు సమర్థవంతమైన సంభాషణకర్తగా మారడానికి ఎలా సహాయపడతాయనే దానిపై కూడా మేము దృష్టి కేంద్రీకరించాము.
    7. మీలో చాలా మంది మంచి ఉద్యోగాలు కోరుకునే విధ్యార్ధులు, ఉద్యోగస్తులు ఉండవచ్చు ఉజ్వలమైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.
    8. కాబట్టి మీరు ఏదో ఒక సంస్ధలో ఏదో ఒక ఉద్యోగంలో తప్పక చేరుతారు.
    9. ఇంతకు ముందు కమ్యూనికేషన్‌ వర్గీకరణలో సంస్ధాగత కమ్యూనికేషన్‌ని ప్రస్తావిoచినప్పటికీ ఇప్పుడు దాని గురించి విస్తృతంగా తెలుసుకోవడం చాలా అవసరం.
    10. ఎందుకంటే మీరందరూ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ద్వారా మీరు పనిచెయబోయే సంస్ధలో మీ ప్రతిభను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
    11. మనందరికీ ఒక సంస్ధ ఎలా పనిచేస్తుందో, అందులో కమ్యూనికేషన్‌ ఎలా ప్రసరిస్తుందో, కట్టడి చేయబడ్తుందో, సంస్ధని విజయవంతంగా, నైపుణ్యంగా నడిపించడానికి ఎలా తోడ్పడుతుందో తెలుసుకోవాలని ఉంటుంది.
    12. సంస్ధాగత కమ్యూనికేషన్‌ గురించి చర్చంచే ముందు మనం సంస్ధ అంటే ఏమిటి, అది ఒక అభ్యర్ధి లేదా ప్రోఫెషనల్‌ నుండి ఏం కోరుతుంది అని ఆలోచిద్దాం.
    13. సంస్ధ అంటే వ్యక్తులతో కూడిన సాంఘిక విభాగం. అది ఒక నిర్మాణాత్మక పద్ధతిలో నడుస్తూ సమిష్టి లక్ష్యాలను సాధించ డానికి కృషి చేస్తుంది.
    14. మీరు ఒక వ్యక్తిగా సంస్ధలో చేరినప్పటికీ సమిష్టి లక్ష్యాలను అర్ధం చేసుకోవాలి. ప్రతీ సంస్ధ మానేజ్‌మెంట్‌ వ్యవస్ధ సహాయంతో విభిన్న కార్యకలాపాలకి, ఉద్యోగులకి పని అప్పగించి, సమాచారాన్ని వ్యాప్తి చేసి లక్ష్యాల్ని సాధించేదిశగా కృషి చేస్తుంది. మీరు ఉద్యోగంలో ఉన్నతి పొందినపుడు మీ పాత్రని, బాధ్యతలని అర్ధం చేసుకొని కొన్ని వ్యవహారాలలో స్వతంత్రంగా అధికారం ప్రదర్శించాల్సి ఉంటుంది.
    15. అయితే అన్ని సంస్ధలకూ నిర్దిష్ట లక్ష్యాలుంటాయి.
    16. అవి విభిన్నంగా ఉన్నప్పటికీ, సంస్ధలన్నీ తమ ఉద్యోగుల సంక్షేమం కోసమే కాకుండా ప్రజాసంక్షేమం కోసం కూడా పనిచేస్తాయి.
    17. అంతే కాకుండా మీరు పనిచేసే సంస్ధలో కమ్యూనికేషన్‌ వాతావరణం ద్వారా మీ సామర్ధ్యం, సంస్ధకు మీ అవసరాన్ని తెలియజేయగలరు. 
    18. సంస్ధాగత కమ్యూనికేషన్‌ మీ వ్యక్తిత్వ వికాసంలో ముఖ్య పాత్ర వహిస్తుందని మీరు ఇంతకు ముందు ఉపన్యాసాల ద్వారా తెలుసుకున్నారు. కొన్ని నైపుణ్యాల సహయంతో మీ వ్యక్తిత్వం ద్వారా, మీరు సంస్ధకి ఎలా ముఖ్యమో తెలియజేయవచ్చు.
    19. సంస్ధాగత కమ్యూనికేషన్‌ అనే ప్రక్రియలో ఆలోచనలు ఇతరులకు ప్రసారం చేసి ,శ్రద్దగా అర్ధం చేసుకొని, ప్రతి చర్యల ద్వారా ఫీడబాక్‌ తీసుకొని పనిని సాధించాలి. అప్పుడే సంస్ధలక్ష్యాలు పూర్తిగా సాధించగలమని విలియం స్కాట్‌ చెప్పారు.
    20. మీలో చాలా మంది ఏదో ఒక సంస్ధలో ఉద్యోగం చేయాలను కుంటారు కాబట్టి కార్యాలయంలో మీ బాధ్యతలేమిటో తప్పక తెలుసుకోవాలి. మీరు ఒక ఉద్యోగం కోసం దరఖాస్తు చేసికొని ఇంటర్వ్యూలో ఎంపికైన క్షణం నుండి మీ ఉద్యోగ బాధ్యతల గురించే ఆలోచిస్తారు. 
    21. మీలో ఎక్కువ మంది సంస్థలో చేరాలనుకునే అభ్యర్థులు అని అర్థం చేసుకోవడం చాలా అవసరం, అయితే మీ ప్రత్యేకత బట్టి, సమర్ధతను బట్టి సంస్ధలో మీ బాధ్యతలు మారుతూ ఉంటాయి.
    22. ప్రస్తుత ప్రపంచంలో అవసరాన్ని బట్టి మీ సమర్ధత ఒక విషయంలోనే కాక ఉద్యోగానికి కావల్సిన అన్ని నైపుణ్యాలు చూపించాల్సి వస్తుంది.
    23. ఒక సంస్ధలో అనేక స్వభావాలు, రుచులు, ఆలోచనలు, శైలి ఉన్న అనేక వ్యక్తులు ఉంటారు.  ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు.
    24. వారందరితో వివిధ స్ధాయిలలో కమ్యూనికేట్‌ చేయాలంటే, పని విభజన చేయాలంటే చాలా మాధ్యమాలు ఉంటాయి.
    25. మీరు ఎవరికి ప్రతిస్పందించాలో మీరు అర్థం చేసుకోవాలి మరియు మీరు ప్రతిస్పందిస్తున్నప్పుడు లేదా మీరు ఇతరులతో కమ్యూనికేట్‌ చేసేటపుడు వారి కోపతాపాలు, స్వభావం ప్రవర్తనా పద్ధతి గమనించి ప్రతిస్పందించాలి.
    26. ప్రతి సంస్ధలో సమర్ధమైన మానేజ్‌మేంట్‌ కోసం కమ్యూనికేషన్‌ చాలా అవసరం. ప్రతి సంస్ధలో ముఖ్య సమూహమైన IMS (Information Mnagement System) ఉంటుంది. దీని ద్వారా వివిధ వ్యక్తుల నుండి వచ్చే అనేక రకాలైన సమాచారాన్ని విభిన్న రీతులలో సేకరించి సమకూర్చాలి.
    27. కొన్నిసార్లు మనం ఒంటరిగా పనిచేసినా, ఎక్కువగా వివిధ నేపధ్యాలు, వయసు, జేండర్‌, విశ్వాసాలు, మతాలు నమ్మకాలు కలిగిన వ్యక్తుల సమూహాలతో వ్యవహరించాల్సి వస్తుంది.
    28. అలాంటి సందర్భంలో ఒక సుహృద్భావ పూరిత వాతావరణం కల్పించి అందరికి కమ్యూనికేషన్‌ అర్ధమయేలా చూడాలి. మీ బాస్‌ తోనే కాక ఇతర విభాగాల ఉద్యోగులతో కమ్యూనికేట్‌ చేసేటపుడు సమాచార ప్రసారాన్ని అర్ధం చేసుకోవాలి.
    29. కమ్యూనికేషన్‌ అనేక సమూహాల గుంపు మధ్య జరుగుతుంది. కాబట్టి ఒక సంస్ధలో కమ్యూనికేషన్‌ యొక్క విధులేంటో తెలుసుకోవాలి. 
    30. మీరు ఒక బాంక్‌కి సమయానిక ముందుగా వెళ్లారు. అక్కడ కార్యకలాపాలు మొదలవక ముందు ఉద్యోగులందరూ ఒక ప్రదేశంలో గుమిగూడి నోట్లు తీసుకుంటూ ఒక వ్యక్తి చెప్పేది చాలా శ్రద్దగా ఏకాగ్రతతో వినటం గమనిస్తారు. 
    31. అది ఆరోజు జరగవలసిన వ్యవహారాల ప్రణాళికను అక్కడి అధికారి లేదా CEO లేదా మానేజర్‌ ఎవరైతే బాధ్యులో వారు అందరికీ వివరిస్తున్నారు.
    32. ప్రతీ సంస్ధలో కమ్యూనికేషన్‌ యొక్క కొన్ని విధులు ఉన్నాయని, ఈ విధులు ఊహించదగినవని మీరు గుర్తిస్తారు. 
    33. ఒకటి ముందస్తు అంచనా ప్రతీ సంస్ధలో ఒక లక్ష్యంతో అనేక ప్రణాళికలు రూపొందించినా, సంస్ధ అభివృద్ది క్రమంలో పరిణితి సాధించి, ప్రామాణికత పొందిన తరువాత కాలానుగుణంగా బాధ్యతలలో మార్పు వస్తుంది.
    34. కాబట్టి అంచనా అనేది ప్రతి సంస్ధకి ముఖ్యమైన విధి. అది మనం ఏం చేయాలనుకున్నాం, ఎక్కడ ఉండాలనుకున్నాం అని చెపుతుంది.
    35. మనం ప్రగతి సాధించిన ప్రముఖ సంస్ధల చరిత్ర పరిశీలించినట్లైతే వారి ప్రణాళిక, కృషి కనబడుతుంది. విజయం కనిపిస్తుంది. 
    36. కాని దాని వెనుక జరిగే మేధోమధనం, ఎంతో మంది దోహదం ఉన్నదని తెలియకపోవచ్చు.
    37. కాబట్టి ప్రతి సంస్ధ ముందస్తు అంచనాలతో తమ లక్ష్యాల్ని సాధించే ప్రణాళికలను తయారు చేస్తుంది.
    38. ఆ లక్ష్య సాధన కోసం వ్యక్తే కాక సంస్ధలో ఉన్న పదుల మంది వ్యక్తులు కష్టపడాలి, సంస్ధ పరిమాణం పెరిగే కొద్దీ కమ్యూనికేషన్‌ ఒకే వ్యక్తి నియంత్రణ చేసి పని జరిగేలా చూడటం కష్టం. 
    39. కాబట్టి పని విభజన, బాధ్యతల పంపిణీ వలన పనులను సాధించాలి. దీనికి చాలా అభ్యాసం ఉంటుంది.
    40. అలాగే ప్రతి సంస్ధలో నాణ్యత నియంత్రణ విభాగం, సిబ్బంది విభాగం, మానవ వనరుల విభాగం, ఆర్ధిక ఖాతాల విభాగం, స్టాక్‌ ధృవీకరణ, జాబితాలు చూసే విభాగం ఇలా ఎన్నో ఉంటాయి.
    41. ఈ విభాగాలన్నీ నిరంతరం ఒకరితో ఒకరు కమ్యూనికేట్‌ చేస్తుంటాయి.
    42. వ్యక్తిగతంగా సంస్ధలో అన్ని విభాగాల వారు ఒకరికొకరు తెలియక పోయినా ఆ విభాగాల అధిపతులు కమ్యూనికేట్‌ చేస్తారు. సూచనలు ఇస్తారు.
    43. కనుక ఇది చాలా కష్టం అవుతుంది.
    44. వివిధ విభాగాల నుండి వచ్చి బృందాలుగా పని చేసే వారికి సూచన లివ్వటానికి ఒక నాయకుడు కావాలి. ఎందుకంటే బృందాలో అందరికి వేర్వేలు ఆలోచనలు నేపధ్యాలుంటాయి.
    45. చివరికి నాయకుడు మొదట భాద్యత వహిస్తాడు.
    46. కాబట్టి నాయకుడి ప్రధమ బాధ్యత ఏమిటంటే తన బృందంలో లేదా విభాగంలో పని ఎటువంటి అంతరాయం లేకుండా జరిగేలా చూడటం.
    47. అందుకై నాయకుడు సలహాలు, సూచనలు, ఆజ్ఞలు ఇవ్వచ్చు లేదా ఒప్పించవచ్చు. ఇది అంతా లోపలనే జరుగుతుంది.
    48. వెలుపల తమ బృందమంతా ఒకే సమూహంగా ప్రాతినిధ్యం ఉండాలంటే చాలా సహకారం అవసరం.
    49. ఉదాహరణకు మీ బాస్‌ చెప్పింది మీకు వినటానికి ఇష్టం లేకపోతే మీరు దాన్ని ఇతరులతో చెప్పటానికి, సహాయం చెయ్యటానికి, ఎటువంటి శ్రద్దా ఉండదు. సిరీస్‌ను కలిగి ఉన్న మొత్తం కనెక్షన్ ఉన్నందున మేము తరువాత చర్చిస్తాము.
    50. కాబట్టి నాయకుడు అన్నీ నియంత్రించాలి. నాయకుడు ఆదర్శప్రాయంగా ఉంటేనే అందరూ అతన్ని అనుసరించి భవిష్యత్తులో మానేజర్లు, నాయకులు కాగలరు.
    51. అలా అవాలంటే మీరు దశల వారీగా క్రిందనుంచి పైకి మీ అంచనాలు, ఆశయాల ప్రకారం చేరుకోవాలి.
    52. ఈ ప్రక్రియలో మీరు వివిధ స్తాయిలలో ఉన్న అనేకమంది వ్యక్తులతో ప్రతిస్పందించి అనుభవాన్ని సంపాదిస్తే, రాబోయే రోజులలో అది ఎంతో ఉపయోగపడుతుంది.
    53. సంస్ధలోక కమ్యూనికేషన్‌ యొక్క విధులను తెలుసుకున్నాక, కమ్యూనికేట్‌ చేయడానికి ఏ లక్ష్యాలుంటాయో తెలుసుకోవాలి. సంస్ధలో వ్యక్తులు తాము చాలా సమావేశాలు హాజరౌతున్నామని, ఒక విభాగం నుంచి ఇంకొక దానికి తరచు వెళుతున్నామని ఫిర్యాదు చేస్తుంటారు. ఈ ప్రక్రియలు చాలా ముఖ్యం. 
    54. ఎందుకంటే ఒక సంస్ధ ప్రగతి సాధించాలంటే విభాగాల మధ్య పోటీ అవసరం.
    55. ముఖ్య నినాదం ఏంటంటే ఉద్యోగుల పనితీరు, జ్ఞానాన్ని నవీకరించాలి.
    56. ఇదే విషయంగా మేము ఎలక్ట్రిసిటీ మరియు ఇతర విభాగాల వారికి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అభివృద్ది కోసం ఉపన్యాసాలు ఇచ్చాము. అనేక సంస్ధలు తమ ఉద్యోగుల ఉన్నతి కోసం సెమినార్లు, కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేస్తారు. 
    57. ఈ కాన్ఫరెన్స్‌, వర్క్‌ షాపులలో పాల్గొనటం వల్ల మీ రంగంలో వస్తున్న ఆవిష్కరణల గురించి నేర్చుకుంటారు.
    58. ఒక సంస్ధలో చేరినపుడు మీ ఆశయాలు, జీవనోపాధి కోసం ఆలోచిస్తారు ఉన్నతి సాధించిన తరువాత కొంత స్పేస్‌ కావాలని, మనం చెప్పింది అందరూ విని అర్ధం చేసుకొని మేచ్చుకోవాలని అనుకుంటారు. ఈ విషయంలో ఇతరులను ఒప్పించడానికి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు బాగా ఉపయోగపడతాయి.
    59. ఒక నాయకుడు తన ఉద్యోగులతో మాట్లాడి సూచనలు ఇచ్చేటపుడు ఆ రోజు చేయాల్సిన పనులు, తరువాత వారాలు, నెలల్లో సాధించాల్సిన లక్ష్యం, సంవత్సరాంతాన సాధించాల్సిన ఆశయాల గురించి వివరిస్తాడు.
    60. ఇవన్నీ ఉద్యోగులతో చర్చించి నిర్ణయిస్తారు.
    61. వారి సహకారంతోనే పనిని విభజించి బాధ్యతలను అప్పచెప్పి లక్ష్యాలు సాధిస్తారు. ఒక వ్యక్తి కృషితో ఇదంతా సాధ్యం కాదు. ఏ మనిషీ స్వంతగా సంపూర్ణుడు కాదు.
    62. బృందాలలో పనిచేసేటపుడు మానేజరు, నాయకుని యొక్క సహకారం అవసరం వారు చక్కని నిర్ణయాలు తీసుకొని, కావల్సిన సమాచారం అందజేసి శక్తినిస్తారు.
    63. అతను నిజంగా తన ఉద్యోగులందరినీ విశ్వాసంలోకి తీసుకుంటాడు మరియు అతని ఉద్యోగులందరినీ సమాచారంతో శక్తివంతం చేస్తాడు, నాయకుడు బయటికి వెళ్లేటపుడు తన క్రింది అధికారికి బాధ్యత అప్పగిస్తాడు. 
    64. ఎందుకంటే సంస్ధలో పని ఆగకుండా ముందుకు సాగాలి.
    65. మీరు ఒక సంస్ధలో పనిచేసి ఉన్నతి సాధించినపుడు మీ కమ్యూనికేషన్‌ నైపుణ్యాల ద్వారా సంస్ధ కార్యకలాపాలకి, మానేజ్‌మెంట్‌కి నిర్వహణలో సహాయపడుతుందని మీరు అర్ధం చేసుకోవాలి.
    66. పాత్రల విషయానికి వస్తే పాత్రలు ఏమిటి? ఒక సంస్ధలో ఒకే వ్యక్తి అన్ని వ్యవహారాలను నియత్రించ లేడు, ఎందుకంటే ఇది ఒక వ్యవస్థ, నిర్వహణ వ్యవస్థ అని మీకు తెలుసు. కాబట్టి అందరికీ విభిన్న బాధ్యతలు అప్పగిస్తారు.
    67. ఇవి 'ఇంటర్‌ పర్సనల్‌ ' స్ధాయిలో ఉంటాయి. అంటే ఇద్దరు లేదా ఎక్కువమంది వ్యక్తులు ఇతరులతో ఒక ప్రాజెక్ట్‌, అసైన్మెంట్‌ లేదా కీలక విషయాల గురించి పరస్పరం చర్చించటం.
    68. కాబట్టి మానేజర్లు తమ వద్ద పనిచేసే అందరు ఉద్యోగులతో ఎల్లప్పుడూ మాట్లాడుతూ, వారిని సంతోషంగా ఉంచుతూ కమ్యూనికేషన్‌ వాతావరణాన్ని చక్కగా నిర్వహిస్తారు.
    69. ఒక్కరు ఒంటరిగా భావించకుండా సహాయ పడడానికి ఇతరులు ఉంటారు.
    70. ఒక సంస్ధ యొక్క ప్రాధమిక లక్ష్యం ఏంటంటే సహకారం, పోటీ తత్వంతో కొనసాగుతూ ప్రగతి సాధించలని. బయటి ప్రపంచానికి సంస్ధయొక్క ఉత్పత్తులు, సేవలు, ప్రత్యేకతలు తెలియ జేయటానికి తమ గళం గట్టిగా వినిపించాలి.
    71. తరువాతది సమాచారం తెలిపే బాధ్యత. ఒక సంస్ధలో ప్రతి ఉద్యోగికి అన్ని విభాగాలు, పనులు, ప్రాజ్‌క్టుల గురించి పూర్తి సమాచారం తెలిసుండాలి.
    72. నాయకుడు అందరికీ కొంత సమాచారం తెలియజేస్తాడు.
    73. కాని కొంత సమాచారంతోనే ఏకాగ్రతతో పని చేసి రావల్సినా, సమావేశాలకు హాజరైనపుడు మనం సమాధానం చెప్పలేక మాటల కోసం తడుముకోవాల్సి రావచ్చు.
    74. కాబట్టి సమాచారాన్ని పూర్తిగా తెలుసుకొని అర్ధం చేసుకోవాలి. మీరు మీ సంస్ధ ప్రతినిధిగా ఉన్నప్పుడు ఎవరే ప్రశ్న అడిగినా నిర్దిష్ట సమాధానాలు ఇవ్వగలగాలి, లేకపోతే మీరు ఆ సంస్ధకు చెందినవారని అనుకోరు. ఒక సంస్ధలో పనిచేసే నాయకుడిలో అందరితో సమర్ధవంతంగా కమ్యూనికేట్‌ చేయగల (అంటే అన్ని విభాగాలు, బృందాలు) నైపుణ్యం ఉండాలి.
    75. ఎప్పటికైనా మీరు ఒక సంస్ధలో నాయకుడు కాగలరు.
    76. కాబట్టి, మీరు వినాలి, అందుకే మేము ఉపన్యాసంలో చర్చిస్తున్నామని లేదా మేము చెప్పినదానిని వింటున్నామని మీకు తెలుసు, కొన్నిసార్లు మీరు మీ ఉద్యోగుల సమస్యలను కూడా వినవలసి ఉంటుంది.
    77. ఎందుకంటే ఉద్యోగులు కొన్నిసార్లు పని వాతావరణాన్ని ప్రభావితం చేసే కొన్ని అడ్డంకులను కలిగి ఉంటారు మరియు మీకు అది అక్కరలేదు, మీరు దీన్ని ఎప్పటికీ కోరుకోరు. అవి తీర్చకపోతే కార్యాలయంలో పనిచేసే వాతావరణం దెబ్బతింటుంది.
    78. ఒక నాయకుడిగా సహనంతో వినటం, సమాచారం, సందేశాలు తీసుకోవటం, వాటిని అనువదించటం, అవసరమైన రీతిలోతగిన నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది.
    79. కాబట్టి నాయకుడిగా విధి నిర్వహణలో కమ్యూనికేషన్‌కి సంబంధించిన అనేక ఇంటర్‌ పర్సనల్‌ పాత్రలను నిర్వహించాలుంటుంది.
    80. ఇక్కడ మనం అబ్రహాం మాస్లో చెప్పిన ' మానవ అవసరాలు' సిద్దాంతం గురించి తెలుసుకోవాలి. మనందరికీ మనుషులుగా కొన్ని కోరికలు, ఆశయాలు, అవసరాలు ఉంటాయి.
    81. ఇవి వివిధ దశలలో ఉంటాయి. మాస్లో చెప్పినట్టు మొదటి దశలో శారీరక అవసరాలైన ఆహారం, నిద్ర, ఇల్లు, డబ్బులాంటివి ఉంటాయి. ఇవి లభించిన తరువాత దశ ఆర్దికంగా పటిష్టత కలిగి ఉండటం.
    82. ఇక్కడ భద్రత గురించి ఆలోచిస్తాడు.
    83. ఒక బృందానికి చెంది ఉండటం, విఘూతాల నుండి రక్షణ పొందటం, మానసిక అవసరాల దశలో స్నేహం ప్రేమ కోరతారు.
    84. అందువల్ల, మీరు సురక్షితంగా ఉన్నప్పుడు, మీకు అవసరాలు మాత్రమే ఉండవని, మీకు కొన్ని సామాజిక బాధ్యతలు కూడా ఉన్నాయని మీరు భావిస్తారు.
    85. ఎస్టీమ్‌ దశలో గౌరవం, లక్ష్యసాధన ఉంటుంది. చివరగా స్వీయ వాస్తవీకరణ దశలో విలువలు, సృజనాత్మకత గురించి ఆలోచిస్తారు.కాబట్టి మనిషికి ప్రాధమిక అవసరాలు తీరాక, సమాజంలో గౌరవం గురించి, తన ఇగో గురించి ఆలోచిస్తూ వాస్తవీకరణ దిశగా పయనిస్తాడు.
    86. మీరు శారీరకంగా ప్రారంభిస్తారని మీకు తెలుసు, నైతికత ముఖ్యమని, సృజనాత్మకత ముఖ్యమని మీరు భావిస్తున్న చోట మిమ్మల్ని మీరు గ్రహించడం ప్రారంభిస్తారు, మీకు సహజత్వం ఉండాలని మీకు తెలుసు, మనిషిలో ఈ పెరుగుదల వలన జీవితానికి ఒక పరమార్ధం, పరిణితి, సమయస్ఫూర్తి కలుగుతుంది.
    87. ఎందుకు చెపుతున్నానంటే ఒక చిన్న కార్మికుడిగా సంస్ధలో చేరిన వ్యక్తికి CEO అవ్వాలనే కోరిక ఉండచ్చు.
    88. ఆశయం మనిషికి బానిస.
    89. మనం ఆశయాలకు బానిసలం.
    90. కనుక ప్రతి వ్యక్తిలో కొన్ని ఆశయాలు  ఉంటాయి.
    91. సంస్ధలో పనిచేసేటపుడు మన అవసరాలు, సంస్ధ లక్ష్యాలు సాధించడానికి అవసరమయే కమ్యూనికేషన్‌ వ్సూహాలు, ప్రసరణ గమనించాలి.
    92. ఇంతకు ముందు సేర్చుకున్నట్లుగా కమ్యూనికేషన్‌ నిలువుగా, సమాంతరంగా ప్రసరిస్తుంది.
    93. కొన్ని సాంప్రదాయిక సంస్ధలలో చాలావరకు సమాచారం పై స్ధాయి నుండి క్రింది స్ధాయికి ప్రసరిస్తుంది.
    94. కాని అదొక్కటీ మార్గం అని కాదు.
    95. ఒకే స్ధాయిలో ఉద్యోగ విభాగాలు ఒకరితో ఒకరు సమాంతరంగా కమ్యూనికేట్‌ చేస్తారు.
    96. రెండు విభాగాల్లో ఉన్న ఉద్యోగుల మధ్య ఎల్లప్పుడూ కమ్యూనికేట్‌ చేసే అవసరం లేకపోయినా, అప్పుడప్పుడూ కమ్యూనికేట్‌ చేసి దాన్ని అర్ధం చేసుకోవాల్సి వస్తుంది.
    97. కొన్నిసార్లు వక్రం గా కూడా కమ్యూనికేషన్‌ జరుగుతుంది. ఉదాహరణకి విధానాలకి సంబంధించిన సమాచారం, ఇంక్రిమెంట్‌, బోనస్‌ పెంపు వంటివి ఉద్యోగులను ఉత్సాహపరిచే విషయాలను వారి ఎదుగుదల కోసం ఈ విధంగా తెలియజేస్తారు.
    98. కొన్ని కమ్యూనికేషన్‌ వ్యూహాలు మీరు తెలుసుకోవాలి.
    99. మీరు పనిచేసే సంస్ధ నాయకుడు మీ అవసరాలు గుర్తిస్తారు.
    100. కమ్యూనికేషన్‌ చేయటానికి మనుషుల మనసు తెలుకోవటం అవసరం కదా. ఈ సందర్బంలో మెక్‌గ్రెకర్‌ ఏం చెపుతారంటే మానేజ్‌ మెంట్‌ లో రెండు శైలులుంటాయి.
    101. మొదటిది సాంప్రదాయిక పద్దతి. ఈ పద్ధతిలో కార్మికులకు కేవలం ఆహారం మరియు ఇతర ప్రాధమిక అవసరాలు మాత్రమే ఇవ్వాలని భావిస్తారు.
    102. వారికి సంస్ధ సంక్షేమం గురించి ఆందోళన ఉండదనుకుంటారు.
    103. అంతే కాకుండా సాంప్రదాయిక భావాలను విస్మరించి వారిని కేవలం కూలి వాళ్లుగా, ఒక వనరుగా మాత్రమే చూస్తారు.
    104. మెక్‌ గ్రెగర్‌ చెప్పిన రెండవ పద్ధతి ఆధునిక శైలి.
    105. ఈ పద్దతి నియంత్రణకి స్వేచ్ఛకి మధ్య సమతుల్యత ఉండాలని చెప్తుంది.
    106. అందరు ఉద్యోగులు కేవలం ప్రాధమిక అవసరాలు తీర్చుకోటానికే పరిమితమై ఉండరు. వారికి స్వేచ్ఛ కూడా అవసరం.
    107. వారికి  స్వయం ప్రతిపత్తి అవసరం. ఉద్యోగులను కార్మికులుగా కాక మనుషులుగా చూస్తే వారికి కూడా ఉన్నత స్ధాయి అవసరాలు, లక్ష్యాలుంటాయని తెలుస్తుంది.
    108. కాబట్టి ఉద్యోగులతో కమ్యూనికేషన్‌ చేసేటపుడు నాయకుడు ఉపయోగించే భాషలో నియంత్రణ మాత్రమే కాక ఒప్పించే నేర్పుకూడా ఉండాలి. అది ఉద్యోగులను అర్ధం చేసుకున్నప్పుడే వస్తుంది.
    109. అందువల్ల, ఇది ప్రేరణ ద్వారా ఏమి సూచిస్తుందో మేము ఇప్పటికే చర్చించాము.
    110. కాబట్టి ఉద్యోగుల అవసరాలు, అవరోధాలు, భేదాలు తెలసుకొని ప్రవర్తించాలి.
    111. వారి లక్ష్యాలు, అవసరాలు గమనించాలి.
    112. అలాగే సంస్ధ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలి. 
    113. లైన్ మరియు స్టాప్‌ మానేజర్ల మధ్య కూడా కమ్యూనికేషన్‌ ఉంటుంది. వీరి వలననే సంస్ధయొక్క ప్రాధమిక కార్య కలాపాలు జరుగుతాయి. అంటే ఉత్పత్తి, అమ్మకాలు, పంపిణీ, ఖాతాలు, సిబ్బంది వంటి వ్యవహారాల్లా, రోజువారీ కార్యకలాపాల్లో ఉద్యోగులంతా ఒకరితో ఒకరు చాలా సన్నిహితంగా పని చేయాల్సి వస్తుంది. ఒకరికొకరి సహాయం అవసరం అవుతుంది.
    114. చాలా సార్లు వారు నిజంగా అనుభూతి చెందుతారు మరియు వారు ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉంటారు.
    115. వాస్తవానికి ఒక ర్అకమైన మద్దతును అందిస్తారు. కాబట్టి ఉన్నత స్ధాయి ఉద్యోగులు, క్రింది స్ధాయి ఉద్యోగుల ప్రాముఖ్యతని గుర్తించాలి.
    116. సంస్ధలలో కమ్యూనికేషన్‌ ప్రసరణకి మరియు అనధికారిక మాధ్యమాలు ఉంటాయి. చాలా సంస్ధలలో చాటింగ్‌ మరియు గ్రేప్‌వైన్‌ ద్వారా అనధికారిక కమ్యూనికేషన్‌ జరుగుతుంది.
    117. ఈ రకమైన గ్రేప్‌వైన్‌, ఊహాగానాలు వారికి తృప్తి నిస్తాయి. ఇవి కొన్ని సార్లు పుకార్లు గా మారుతాయి, కాని ఒకోసారి కీలక మౌతాయి.
    118. అనధికారిక మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారం అనగా గ్రేప్‌వైన్‌ ప్రతికూలం కాదని మానేజ్‌మెంట్‌ పండితులు నమ్ముతారు. అనుకూలమనే వాదన నమ్ముతారు.
    119. మానేజర్లు కొంతమంది అదనపు జాగ్రత్త, అదనపు అప్రమత్తత కోరేవారు ఈ గ్రేప్‌వైన్‌ సమాచారాన్ని తెలుసుకోవటం ద్వారా ఏరకమైన అనుకోని సంఘటనలు జరుగకుండా ఆపవచ్చని, అది హెచ్చరిక అని భావిస్తారు.
    120. కొన్నిసార్లు మానేజర్లే స్వయంగా ఉద్దేశ పూర్వకంగా కొంత సమాచారాన్ని సందేశాల్ని అనధికారిక మాధ్యమాల్లో ప్రయోగిoచి అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులకు ఒక హెచ్చరిక లేదా నియంత్రణ కోసం ప్రయత్నిస్తారు.
    121. ఇక్కడ కూంజ్‌ మరియు ఓ డొన్నెల్‌ చెప్పిన విషయాలు ప్రస్తావించాలి. వారు చెప్పినట్టు ప్రభావంతమైన కమ్యూనికేషన్‌ కోసం మానేజర్లు అనధికారిక మాధ్యమాన్ని అధికారిక మాధ్యమాలతో అనుసంధానిస్తే మంచిది.
    122. ఎందుకంటే ప్రతిసంస్ధ ప్రాధమిక లక్ష్యం తన ఆశయాలను అన్ని మాధ్యమాలను ఉపయోగించి సాధించటం. 
    123. అనధికారిక మాధ్యమంలో వచ్చే సమాచారమంతా నిజం కాదు.
    124. అనధికారిక మాధ్యమంలో వచ్చే సమాచారాన్ని సరిగ్గా ఫిల్టర్‌ చేయాలి.
    125. మొదట్లో ఉద్యోగులుగా మీరు సంస్థలో జరిగే కమ్యూనికేషన్‌ గురించి శ్రద్ధవహించాలి. అందులో మొదటిది చట్టబద్దమైన సమాచారం.
    126. ప్రతి ఉద్యోగికి మొదట్లోనే తను పాటించవలసిన నియమాలు, నిబంధనలు, షరతులు, ఉద్యోగ బాధ్యతలు, సంస్థ ప్రణాళికలు, విధానాల గురించి తప్పక చెపుతారు.
    127. చాలా సంస్థలలో సమాచార ప్రసారం కోసం వార్తా బులెటిన్‌  వాడతారు. లేదా కొన్నిసార్లు ఏదైనా అవాంతరం వచ్చినప్పుడు సంస్థలోని అందరు ఉద్యోగులను సమావేశ పరచి, మానేజ్‌మెంట్‌ వారితో సహా అందరి వద్ద సలహాలు తీసుకొంటారు. ఆ సమయంలో సంస్థలోని ప్రతి సభ్యుడు, ఇది ప్రధాన కమిటీ సభ్యులకు లేదా ప్రధాన నిర్వహణ వ్యవస్థకు మధ్య ఉంటుంది.
    128. ఇలాంటి అత్యవసర పరిస్థితిలో తీవ్రమైన చర్చలు జరిపి ఒక నిర్ణయాన్ని తీసుకొంటారు. దీన్ని సంక్షోభ నియంత్రణ అంటారు.
    129. అందుకే సంక్షోభంలో చేసే కమ్యూనికేషన్‌లో ఒప్పించే లక్షణం, నియంత్రణ,హెచ్చరిక కలగలసి ఉంటాయి.
    130. ఒక సంస్ధలో చేరదలచుకున్న ఉద్యోగి లేదా పనిచేస్తున్న ఉద్యోగి, తన మానేజర్‌తో లేదా సహోద్యోగులతో ఎంత సమర్ధవంతంగా కమ్యూనికేట్‌ చేస్తే అంత విజయాన్ని పొందగలరు. మరియు మేనేజర్ లేదా కో-మేనేజర్ ఎలా ఆధారపడి ఉంటుంది ఉద్యోగిగా లేదా ఉద్యోగిగా, మీరు కమ్యూనికేషన్‌ను ఎలా బాగా ఉపయోగించుకోబోతున్నారో 
    131. ఈ గ్లోబల్‌ ప్రపంచంలో పోటీవల్ల ఉద్యోగులను సంతృప్తి పరచాలి. 
    132. సంతృప్తిగా ఉన్న ఉద్యోగి మాత్రమే అసంతృప్త ఉద్యోగి కంటే ఎక్కువ సమర్ధవంతంగా పనిచేస్తాడు.
    133. సంస్ధలో ప్రతి వ్యక్తి యొక్క ఆశయాలను గమనించి శ్రద్ధ తీసుకుంటేనే వారికి సంస్ధతో అనుబంధం పెరుగుతుంది.
    134. ఒక సంస్ధ విజయం ఆ సంస్ధ ఉద్యోగుల విజయంతోనే ముడిపడి ఉంది. అప్పుడే అది నిజమైన విజయం.
    135. కాబట్టి కాబోయే ఉద్యోగులైనా సంస్ధలో పనిచేసే వారైనా సంస్ధ నియమాలను అర్ధం చేసుకొని, పాటించి, మీ శక్తి నంతా ధారపోసి సంస్ధ విజయం కోసం కృషి చేస్తారని ఆశిస్తాను.
    136. ధన్యవాదాలు!