45. softskill_Culture as Communication-c-XMzUghRts.txt 48.1 KB
Newer Older
Vandan Mujadia's avatar
Vandan Mujadia committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187
    1. శుభోదయం మిత్రులారా !మీరు సాఫ్ట్‌ స్కిల్స్‌లో భాగంగా అనేక ఉపన్యాసాలు వింటున్నారు.
    2. ఇప్పుడు రాబోయే రెండు ఉపన్యాసాలు సంస్కృతి ద్వారా కమ్యూనికేషన్‌ అనే అంశంపై ఉంటాయి.
    3. గ్లోబల్‌ ప్రపంచంలో పనిచేసే ప్రొఫేషనల్స్‌గా మనం విభిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తులతో ప్రతి స్పందిస్తూ ఉంటాం.
    4. వారితో కమ్యూనికేట్‌ చేసేటప్పుడు మన సంస్కృతికి అఘాతం కలుగుతుందనో లేదా వారి సంస్కృతిని అంతరింపజేస్తున్నామనో అనుకుంటాము.
    5. కాబట్టి కమ్యూనికేషన్‌లో సంస్కృతి యొక్క ప్రాశస్త్యం ఎంతో ఉంది.
    6. వేరే దేశస్థులు మనతో ఎందుకు విభిన్నంగా కమ్యూనికేట్‌ చేస్తున్నారని మనం అనుకుంటామో అలాగే మన గురించి వారు కూడా అనుకుంటారు.
    7. ఇది మీకు కూడా నిజం కావచ్చు.
    8. కమ్యూనికేషన్‌లో మన ప్రతిచర్య భిన్నంగా ఉంటుంది. 
    9. కారణం అందులో సంస్కృతి ప్రతిబింబించటమే. 
    10. కాబట్టి సంస్కృతి అంటే ఏమిటి? అది కమ్యూనికేషన్‌ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.
    11. మనం పెరిగిన సంస్కృతి ప్రభావం, మనం ప్రవర్తించే తీరు, ప్రతిస్పందన, ఇతరులను అర్థం చేసుకునే విధానాలపై కనబడుతుంది. ఎందుకంటే మనకు తెలిసిన సంస్కృతి మనది మాత్రమే.
    12. కానీ మీరు వేరే సంస్కృతితో సంబంధంలోకి వచ్చినప్పుడు సమస్య, ఎందుకంటే మనుషులుగా, ప్రపంచం మన ప్రకారం వెళుతుందని మేము భావిస్తున్నాము.
    13. కాని ఒక సంస్కృతిలో మంచి అనుకున్నది ఇంకో సంస్కృతిలో వేరుగా ఉండవచ్చు,
    14. ఇతర సంస్కృతుల వారితో కమ్యునికేట్‌ చేయటానికి ఇది అవసరం. కాబట్టి మనం సాంస్కృతిక సున్నితత్వం పెంచుకోవాలి.
    15. సంస్కృతి అనేది అనేక విలక్షణతలు, ప్రవర్తనాంశాలు, విలువలు, ప్రధలు, సంప్రదాయాల యొక్క సమ్మేళనం. మనం పాటించే విషయాలు మన సంస్కృతికే పరిమితం. ఇతర సంస్కృతిలో కనిపించవు.
    16. ఒక జన సమూహం తమంతట తాముగా జీవిస్తూ ఇతరులపై ఆధారపడకుండా తమ తరాల్ని సాగిస్తుంటారు.
    17. మనం ఒక సంఘటనకి ఎలా స్పందిస్తామో ప్రపంచంలో అందరూ అదే విధంగా స్పందిస్తారను కోవటం నిజం కాదు.
    18. సంస్కృతి అనేది ఒక సమూహం యొక్క ఆలోచనా స్రవంతి, అనుభవాలు, ప్రవర్తనా నియమాలు ఇంకా ఇతర సంస్కృతులతో పరిచయం వలన సంపూర్ణ మౌతుంది.
    19. ఉదాహరణకు మీరు, మీ బ్రదర్‌ ఒకే దేశంలో పుట్టి, ఒకే చోట చదువుకున్నా కొన్ని సంవత్సరాల తరువాత అతను వేరే దేశానికి వెళ్ళి అక్కడ నివసిస్తాడు.  విద్య వల్ల మాత్రమే అతను, అక్కడ నేర్చుకోవాలి. 
    20. అతను వెనక్కి మన దేశానికి తిరిగి వచ్చినప్పుడు అతని ఆలోచనా విధానం, ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తుంది.
    21. అతను చాలా మారిపోయాడని అంటారు.
    22. కాబట్టి సంస్కృతి తన ప్రభావం చూపిస్తుంది.
    23. అతను తన పరిసరాలు వదిలి వెళ్ళాక తప్పక సంస్కృతి నియమాలు నేర్చుకోవాల్సి వస్తుంది.
    24. ప్రస్తుతం మనం నివసించేది గ్లోబల్‌ ప్రపంచంలో, ఈ రోజుల్లో ఈ ప్రపంచం, ప్రపంచ గ్రామంగా ఉందని మేము చెప్తాము.
    25. మీరు కౌలాలంపూర్‌లో ఉపాహారం తీసుకొని ఢిల్లిలో రాత్రి భోజనం చేస్తారు. 
    26. మీరు తిన్న ఉపాహారానికి, భోజనానికి రుచిలో చాలా తేడా ఉంటుంది.
    27. ఎందుకంటే సంస్కృతి మన ఆహారపు అలవాట్లు, జీవన విధానాన్ని నిర్ధారిస్తుంది.
    28. ప్రపంచంలో చాలా సంస్కృతులు ఉన్నాయి. ఒక సంస్థలో పనిచేసేటప్పుడు మనకు విభిన్న సంస్కృతుల వారు కలుస్తారు.
    29. మన దేశంలో కూడా ఒక రాష్ట్రానికి చెందిన వారు, వేరే రాష్ట్రం వారికంటే భిన్నంగా ప్రవర్తిస్తారు.
    30. ఒక రాష్ట్రానికి చెందిన వారు, వేరే రాష్టాల ప్రజల కఁటే భిన్నమైన  ఆహారపు అలవాట్లను కలిగి ఉన్నారు.
    31. వారి అలవాట్లు, వారు జరుపుకునే పండుగలు వేరుగా ఉంటాయి.
    32. ఇది సంస్కృతి మార్పిడి. అయితే సంస్కృతి ఒక వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేస్తుందా? ఖచ్చితంగా, ఎందుంటే మనం పుట్టిన సంస్కృతిని మనం అవగాహన చేసుకుంటాం. ఇతర సంస్కృతులను చూసినప్పుడు మనకి ఆ భేదం తెలుస్తుంది.
    33. మీరు వేరే సంస్కృతిలో చాలా కాలం నివసిస్తే అక్కడి అలవాట్లు, రుచులు తప్పక నేర్చుకుంటారు.
    34. ఈ గ్లోబల్‌ ప్రపంచంలో చాలా వైవిధ్యత ఉంది. మనం ఏదైనా హోటల్‌లో ఆహారం తీసుకున్నప్పుడు అక్కడ స్వదేశీ మరియు విదేశీ పదార్థాలు ఉంటాయి. ఈ విధంగా సాంస్కృతిక మార్పిడి జరుగుతుంది.
    35. గ్లోబలైజేషన్‌ వలన, విభిన్న సౌకర్యాల వలన మార్కెట్‌ అనేది గ్లోబల్‌గా మారింది.
    36. యువతలోనే కాక పెద్దవారికి కూడా విదేశీ వస్తువుల పట్ల మోజు ఉంటుంది. ఆ వస్తువులు వారికి ఒక ప్రత్యేక శక్తి, అనుభూతి మరియు గుర్తింపునిస్తాయని భావిస్తారు. సంస్కృతికి మన గుర్తింపుకి సంబంధం ఉంది.
    37. మనం ఈ రోజుల్లో వ్యాపార పోకడలని గమనించినట్లైతే అనేక విదేశీ సంస్థలు, కంపెనీలు తమ విభాగాలని మన దేశంలో తెరిచినట్లే, మన దేశం కూడా విదేశాలలో మన సంస్థలను స్థాపించింది.
    38. ఇది గ్లోబలైజేషన్‌ మహిమ.
    39. అంతేకాకుండా సాంస్కృతిక విప్లవం వలన మనం అన్ని వస్తువులనూ మన దేశంలోనే పొందగలుగుతున్నాము.
    40. ఉదాహరణకు మన దేశపు సంస్కృతిలో ఇతర ఉప సంస్కృతులుంటాయి. మనం వారి రుచులు, ఆహారపు అలవాట్లు నేర్చుకుంటాం.
    41. అంటే దక్షిణాదిలో ఉండే ప్రత్యేక ఆహారమైన ఇడ్లీ, సాంబార్‌, దోశ ఇప్పుడు ఉత్తరాదిలో కూడా అన్నిచోట్ల లభిస్తుంది.
    42. ఇదే సాంస్కృతిక మార్పిడి.
    43. అలాగే గ్లోబల్‌ పరిధిలో ఒప్పందాలపై సంతకాలు చేయడం ద్వారా GATT (General Agreement on Trade and Tarrif ) లేదా NAFTA (North American Free Trade Agreement) దేశాల మధ్య వ్యాపార సంబంధాలు పెరుగుతాయి.
    44. ఒకరికొకరు సహాయం చేసుకోవటానికి, నేర్చుకోవటానికి, గ్రహించటానికి వీలుంటుంది.
    45. కాబట్టి ఈ కాలంలో కార్యాలయాలన్నీ బహుళ సంస్కృతుల శ్రామికులతో నిండి ఉన్నాయి.
    46. అనేక వినూత్న పరిణామాలు, టెక్నాలజీ వలన ఉన్నత రవాణా వ్యవస్థ వలన మనం ఇతర దేశాల్లో పూచే పూలు, కాచే పండ్లను పొందగలుగుతున్నాము.
    47. మన దేశపు మామిడి పండ్లకు ప్రపంచమంతా గుర్తింపు ఉంది. ప్రజాదరణ పొందింది.
    48. కాబట్టి సంస్కృతికి గుర్తింపుకి అనుబంధం ఉన్నది.
    49. ఆన్‌లైన్‌ షాపింగ్‌ యొక్క అభివృద్ధి వలన మన ఇష్ట ప్రకారంగా, మన అభిరుచిని బట్టి వస్తువులను కొనుక్కోగలుగుతున్నాం.
    50. కొన్నిసార్లు తన సంస్కృతిలో పాతుకుపోయిన వ్యక్తికి వేరే సంస్కృతి తెలుసుకునే అవకాశం వస్తే ఆ తేడాల వలన ప్రభావితం అవుతాడు.
    51. అది కార్యాలయంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుకోవటం అత్యవసరం.
    52. ప్రపంచం అంతా సాంస్కృతిక మార్పిడి ద్వారా విద్య, శాంతి, సంపద వెల్లివిరుస్తుంది.
    53. ఇది ఒక రకంగా గ్లోబల్‌ గా పెరుగుదలకు తోడ్పడుతుంది.
    54. అప్పుడప్పుడూ మన భారతీయులు విదేశాల్లో నివసిస్తూ అక్కడి సంస్కృతి నేర్చుకొని, మన సంస్కృతి పట్ల విభిన్న అభిప్రాయాలు వ్యక్త పరుస్తారు.
    55. గ్లోబల్‌ ప్రపంచంలో జీవించటానికి సంస్కృతి అవలంబించటం అవసరం గ్లోబలైజేషన్‌లో భాగంగా సాంస్కృతిక వైవిధ్యాన్ని మనం ఆహ్వానించాలి.
    56. ఇప్పుడు ప్రశ్న, సంస్కృతి మన కమ్యూనికేషన్‌ని ఎలా ప్రభావితం చేస్తుంది అని. సంస్కృతి అనేక విలక్షణతలు, విలువలు, సాంఘిక, నైతిక ప్రమాణాలు, ఆచారాలతో కూడిన క్లిష్ట వ్యవస్థ. అది మన రోజువారీ జీవితంలో ఎక్కడో ఒకచోట జోక్యం కలుగ జేసుకుంటుంది.
    57. అలాగే కమ్యూనికేషన్‌లో కూడా కొన్నిసార్లు మనం ఇతర సంస్కృతుల నుంచి నేర్చుకున్న పదాలు, పదజాలం, భాష, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు అన్నీ వాడుతాం.
    58. ఏ రెండు సంస్కృతులూ ఒకటి కావు, ఒకేలాగ ఉండవు.
    59. మనం ఇతర సంస్కృతుల వారితో వ్యవహరించేటపుడు వారి సంస్కృతి యొక్క ఉత్కృష్టతను, సౌందర్యాన్ని గ్రహించాలి. ఎందుకంటే ప్రతి సంస్కృతికీ ఇది సహజం.
    60. ప్రతి సంస్కృతిలో ఒక ఆలోచనా పద్ధతి, తార్కికత, ప్రవర్తన, వస్త్రధారణ, ఉత్సవ సంబరాలు ఉంటాయి. అయితే ప్రతి సంస్కృతి సంపూర్ణంగా ఉందని చెప్పగలము.
    61. కాబట్టి, ఒక సంస్కృతి స్వయంగా సరిపోతుంది లేదా మీ సంస్కృతి చాలా పరిచయ వాక్యం అవుతుంది.
    62. సంస్కృతి మనకు ఆలోచించడం, ప్రవర్తన, ప్రతిస్పందన నేర్పిస్తుంది.
    63. మనకు మార్పుకు అనుగుణమైన ప్రవృత్తి ఉండటం వలన సంస్కృతిని అంతర్గతం చేసుకోవాలి.
    64. ఈ కాలంలో ప్రవాస జీవితం యొక్క సత్యాలను మనం తెలుసుకోవాలి. చాలా మంది భారతీయులు ఇతర దేశాల్లో నివసిస్తున్నారు.
    65. మొదట్లో వారికి కొంత బేధ భావం, ఘర్షణ ఉన్నప్పటికీ దీర్ఘకాల నివాసం వలన సంస్కృతి అలవాటౌతుంది.
    66. కొన్నిసార్లు వారికి సాంస్కృతిక షాక్‌ కలుగుతుంది. ఈ కల్చరల్‌ షాక్‌ అనేది ఒక జీవన విధానం, శైలి, ప్రతిచర్య తెలియక పోవడం వలన వస్తుంది. అపుడు మీరు ఒంటరిగా, వెలివేయ బడినట్లుగా భావిస్తారు.
    67. మీకు తెలిసేఉంటుంది, ఒక గొప్ప నవల Namesake ను గొప్ప చిత్రంగా మలిచారు. 
    68. మీరు ఆ చిత్రం చూసే ఉంటారు.
    69. ఆ చిత్రంలో నాయిక తన భర్తతో కలిసి అమెరికాలో నివసించటానికి వెళ్తుంది. ఆమెకు బిడ్డ పుట్టే సమయంలో ఒక ఆసుపత్రిలో ఉండగా తన దేశం గుర్తుకొస్తుంది. తన దేశంలో ప్రసవ సమయంలో చుట్టూ ఎంతో మంది జనాలు ఉంటారు.
    70. US లో తను ఎంత ఒంటరిగా ఉందో తెలుసుకుంటుంది. తన మాటల్లో ఒక బిడ్డకు పరాయి దేశంలో ఒంటరిగా జన్మనివ్వడం అనుకుంటుంది.
    71. ఇది కూడా ఒక రకమైన కల్చరల్‌ షాక్‌. మనం చక్కగా అర్థం చేసుకొని ముందుకు వెళ్తే ప్రపంచం అందమైన నివాస స్థానం అవుతుంది.
    72. మనం ఒక సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే అందులోని చిహ్నాలు, ఆచారాలు, విలువలు,వారి నాయకులు, ఆరాధనా పద్ధతులు తెలుసుకోవాలి.
    73. మనం మనకి అలవాటు, పరిచయం లేని భిన్న ప్రపంచంలో ఉండాల్సి వస్తే అక్కడి సాంస్కృతిక బేధాలు ప్రదర్శిస్తే అన్ని సమస్యలు మొదలౌతాయి.
    74. కాబట్టి మనం బేధభావాన్ని కాకుండా, గౌరవాన్ని ప్రదర్శించాలి.
    75. ఒక సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే, అందులో భాగమైన భాష, సంజ్ఞలు, వ్యక్తిగత రూపాలు, మతం, వేదాంతం, విలువలు, కుటుంబ వ్యవస్ధ, ఆచారాలు మరియు కమ్యూనికేషన్‌ వ్యవస్ధ గురించి తెలుసుకోవాలి.
    76. మనం ఒక ప్రామాణికమైన జీవితాన్ని గడపాలంటే సంస్కృతిని చక్కగా అర్ధం చేసుకోవాలి. చాలా మంది విదేశాల్లో నివసించడానికి వెళ్లినపుడు తాము రెండవ స్ధాయి పౌరులుగా ఉన్నామని భావిస్తారు.
    77. దాని కారణం వారు అక్కడ ప్రచారంలో ఉన్న సంస్కృతిని అనుసరించక పోవటమే.
    78. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే మనం సంస్కృతిని నేర్చుకోగలం. సంస్కతి అచంచలమైనది.
    79. మన దేశంలో వేరే ప్రదేశంలో నివసిస్తే అక్కడి సంస్కృతి అలవాటై జీర్ణించుకుంటారు. మనం ఇతరుల సంస్కృతితో పోల్చుకొని ఇతరులకి మనంత సాంస్కృతిక సున్నితత్వం లేదనుకుంటాం.
    80. ఇది మనకు సంస్కృతితో ఉండే అనుబంధం వలన వస్తుంది.
    81. సాంస్కృతిక నిబంధనలు తార్కికంగా ఉంటాయి.
    82. మనం ఒక నిర్దష్ట సంప్రదాయం లేదా పంధా యొక్క చరిత్రని పరిశీలిస్తే ప్రతి పద్దతికీ ఒక తార్కిక కారణం ఉంటుంది.
    83. నేను ఒకసారి విదేశీ స్నేహితుడితో బైక్‌ పై వెళుతుండగా ఒక పిల్లి అడ్డం వచ్చింది. నేను బైక్‌ ఆపాను. 
    84. అతను ఎందుకు ఆపావని ప్రశ్నించాడు. ఇది అతనికి వింతగా అనిపించింది.
    85. మన సంస్కృతిలో పిల్లి దారికడ్డం వసేత అశుభంగా, చెడుకి చిహ్నంగా భావిస్తాం. కాబట్టి ప్రతి సంస్కృతిలో వారికి ప్రత్యేక నమ్మకాలుంటాయి. అవి మనకు నచ్చకపోవచ్చు.
    86. సంస్కృతి మనకు ఒక గుర్తింపు ఇంకా అనుబంధాన్ని ఇస్తుంది.
    87. చాలా మంది విదేశానికి వెళ్లి తిరిగి వచ్చాక మన ఆహారం జీవన విధానాన్ని ఎంతో ఆస్వాదిస్తారు.
    88. ఇతరుల సంస్కృతి మనకు బెదిరింపు గా ఉండకూడదు.
    89. సంస్కృతి దృశ్య, అదృశ్య విషయాల సమ్మేళనంతో అచంచలంగా ఉంటుంది.
    90. పూర్వకాలంలో మూఢంగా అనిపించింది ఈ కాలంలో మారి పోతుంది.
    91. మనం ఏ రాష్ట్రం, సంఘానికి చెందిన వారమైతే ఆ విభిన్న నమ్మకాలుంటాయి.
    92. కానీ ఇతరుల మతం, నమ్మకాలు విశ్వాసాల గురించి మనం సున్నితత్వం ప్రదర్శించాలి, ఎందుకంటే మనం నమ్మిందే అంతిమ సత్యం కాదు.
    93. ప్రపంచంలో గొప్ప సాంస్కృతిక, విశ్వాసాల వైవిధ్యత ఉంది.
    94. ఇక్కడ మహాత్మా గాంధీ దేవుని గురించి ఏం చెప్పారో విందాం. మనం విభిన్నమార్గాల ద్వారా దేవుని చేరినా, అంతిమలక్ష్యం దేవుని చేరటమే.
    95. అదేవిధంగా ప్రతి సంస్కృతిలో చాలా మార్గాలున్నా ఆ సంస్కృతి యొక్క సౌందర్యం, ప్రాముఖ్యత తెలుసుకోవటం ముఖ్యం.
    96. అయితే ఒక సంస్కృతి యొక్క ప్రమాణాలు ఏంటి? మొదటిది సందర్భము. ఇంకా వ్యక్తిగత వాదన, సంప్రదాయం, కమ్యూనికేషన్‌ శైలి, సమయ పాలన ఉంటాయి.
    97. ఇవన్నీ విభిన్నంగా ఉండవచ్చు.
    98. మీరు మన దేశంలో ఒక రాష్ట్రంలో నివసిస్తున్నపుడు అక్కడి లక్షణాలని నేర్చుకొని వాటిని పాటిస్తాం.
    99. మీరు మీ తల్లితండ్రులను గమనించి అనుసరిస్తారు.
    100. కొంత సమయం తరువాతే బేధాన్ని గమనించగలరు.
    101. కాబట్టి ప్రతి వ్యక్తికి తను నివసించే సందర్భాన్ని బట్టి ప్రపంచం రెండు సాంస్కృతిక విభాగాలుగా ఉంటుంది.
    102. ప్రపంచం రెండు సాంస్కృతిక విభాగాలుగా ఉంటుంది. దీఓని గురించి తర్వాత చర్చిస్తాము.
    103. మొదటిది ఉన్నత స్ధాయి సంస్కృతి, రెండవది తక్కువ స్ధాయి సంస్కృతి ఈ రెండు వేరు వేరుగా విభిన్నంగా ఉంటాయి.
    104. ఉదాహరణకి ఒక భాషకి, పండుగకి, సమయానికి ప్రతి స్పందించే తీరు విభిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ వాటి ప్రాముఖ్యత, విశిష్టత ఏమీ తగ్గదు. తరువాత వ్యక్తిగత వాదన, తరువాత ఫార్మాలిటీ, కమ్యూనికేషన్ స్టైల్ మరియు టైమ్ ఓరియంటేషన్ ఉంటాయి.
    105. మనం పద్ధతుల గురించి మాట్లాడేటపుడు సాంప్రదాయ వాదులుగా ఉంటాము.
    106. మనం ఒక నిర్ధిష్ట సంప్రదాయాన్ని అనుసరించాము, మనం సంప్రదాయ విరుద్ధంగా ఏం చేసినా., 
    107. హాస్యాస్పదులౌతాం లేదా చర్చకు కారణం అవుతాం లేదా అందరి దృష్టిలో ఖండించబడతాము. మనం కొన్ని వేడుకలు, సాంఘిక మర్యాదలు పాటించవలసి ఉంటుంది.
    108. మనం అతిధులను ఆహ్వానించే పద్దతి, విభిన్న సంస్కృతులలో వేరుగా ఉంటుంది. 
    109. అది ఆ సంస్కృతికి ప్రత్యేకం.
    110. భారతీయులుగా మనకి ఉదారత, అతిధి మర్యాద అనేది ఎక్కువగా ఉంటుంది.
    111. వివిద  సంస్కృతుల ప్రజలలో పద్దతులు   వేరుగా ఉంటాయి.
    112. ఉదాహరణకి మనం ఇతరులతో మాట్లాడే స్పందించే పద్దతి అమెరికన్లకి భిన్నంగా ఉంటుంది.
    113. కొన్ని అధ్యయనాల ప్రకారం అమెరికన్లు మరింత సౌకర్యవంతమైన,  ప్రత్యక్షంగా మాట్లాడటానికి ఇష్టపడతారు, వారు వాస్తవానికి త్వరగా ఈ స్తహానానికి చేరుతారు.
    114. అమెరికన్లు చాలా సాధారణంగా ప్రత్యక్షంగా మాట్లాడుతారు.
    115. అధికారిక సమావేశాలలో అమెరికన్లు Mr.X లేదా Mr.Y అని సంబోధిస్తారు, లేదా వారి స్ధాయిని కాని మొదటి పేరుని బట్టి పిలుస్తారు.
    116. అదే జపానులో అయితే వారి పదవిని బట్టి Mr. ప్రెసిడెంట్‌ అని Mr. ప్రైం మినిస్టర్ అని సంబోధిస్తారు. చైనాలో కూడా మిస్టర్ అని సంబోధిస్తారు.  
    117. ఇది వ్యాపార లావాదేవీల్లో కూడా ప్రతిబింబిస్తుంది. అలాగే నెగోసియేషన్‌ లో అమెరికన్లు చెప్పాలనుకున్న విషయాన్ని వెంటనే సూటిగా చెపుతారు.
    118. అమెరికన్తో కమ్యూనికేట్ చేస్తుంటే, వారికి నిశ్శబ్దంగా ఉండటం నచ్చదు.
    119. మనం నిశ్శబ్దంగా ఉంటే వారికి అసహనం కలుగుతుంది. ఒక నిపుణుడు ఏమంటాడంటే, ఆసియన్లు నిశ్శబ్దాన్ని చాలా చాకచక్యంగా ఉపయోగించి వ్యాపారంలో రాయితీలు పొందుతారు.
    120. మెక్సికన్లు అయితే, వ్యాపారంలోకి రావాలని అడిగినప్పుడు వారు నిజంగా బాధపడతారు
    121. అదే మెక్సికన్లకి చాలా గౌరవ ఉపచారాలుంటాయి. వారు ముందుగా విందు ఆరగించి, ఒకరినొకరు పలకరించుకొని తరువాత వ్యాపారం గురించి ఆలోచిస్తారు.
    122. వారు వ్యాపార లావాదేవీల కంటే స్నేహ సుహృద్భావాలకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు.
    123. జపానులో సంప్రదాయం ప్రకారం కార్డ్స్‌ ఇచ్చుకోవటం, పత్రాలు సంతకం చేయటం అనేది ఒక ముఖ్య ఆచారంగా భావిస్తారు.
    124. ఒక పరిశీలన ప్రకారం అమెరికన్లు హాంబర్గర్‌ పద్దతి మానేజ్‌మెంట్‌ పాటిస్తారు.
    125. అంటే వారు ఎవరినైనా విమర్శించాలనుకుంటే ముందుగా వారి కుటుంబ విషయాలు మాట్లాడతారు.
    126. తరువాత విమర్శలను చెప్పి చివరగా చెప్పాలనుకున్నది స్పష్టంగా విడమర్చి చెప్తారు.కాబట్టి పైన కనిపించేటంత మెత్తగా విషయం ఉండదు. 
    127. ప్రశ్న పరంగా చూస్తే, అమెరికన్లకి, జపనీయులకి మధ్య చాలా తేడా ఉంటుంది.
    128. అమెరికన్లు ఎక్కువ నిశ్శబ్దాన్ని సహించరు మరియు వారు ఎప్పుడూ మాట్లాడతారు, వారు ఎక్కువగా మాట్లాడాలని కోరుకుంటారు మరియు వారు త్వరలోనే ఈ విషయానికి వస్తారు. కమ్యూనికేషన్‌ లో కూడా అమెరికన్లు, సూటిగా మాట్లాడతారు.
    129. యూరోపియన్లు అవసరం, ఆహ్వానం లేకుండా ఇతరులని మొదటి పేరుతో పిలవరు. చాలా అధికారికంగా ప్రవర్తిస్తారు.
    130. అలాగే అరబ్బులు, దక్షిణ అమెరికన్లు, ఆసియా వారు తమ వ్యాపార లావాదేవీల కంటే స్నేహభావానికి ఎక్కువ విలువ నిస్తారు. సుహృద్భాం మొదట, వ్యాపారం తరువాత వస్తుంది.
    131. ఇక మనుషులకు ఇచ్చే ప్రాముఖ్యతను చూస్తే పశ్శిమ దేశాల వారు ఇతరుల స్ధాయి, సాంఘిక స్ధితి బట్టి ప్రవర్తించరు. వారు మనుషుల్లో బేధభావాన్ని ప్రదర్శించరు.
    132. అందరినీ సమానంగా చూస్తారు.
    133. మిత్రులారా, ఈ గ్లోబల్‌ ప్రపంచంలో ఉన్న వివిధ సంస్కృతుల బేధాన్ని గమనించి, వారితో కమ్యూనికేట్‌ చేయవలసిన పద్ధతిని అర్ధం చేసుకోవాలి.
    134. మనం చర్చించినట్లుగా అమెరికన్లు సూటిగా స్పష్టంగా విషయం చెప్తారు. విమర్శించే ముందు నేపధ్యం తెలుసుకుంటారు.
    135. వారికి నిశ్శబ్దం, ఆలస్యం అనేవి నచ్చవు.
    136. వారితో మీరు వ్యవహారాలు చర్చంచేటపుడు మీరు మాట్లాడిన పదాల అర్ధం నేరుగా తీసుకుంటారు. వాటికి నేపధ్యాం ఆలోచించరు.
    137. కాబట్టి వారితో చాలా స్పష్టంగా మాట్లాడాలి.
    138. అదే దక్షిణ అమెరికన్లు, అరబ్బులకు కావ్యభాష ఇష్టం.
    139. కాబట్టి వారు సూటిగా చెప్పక నేపధ్యాన్ని సృష్టించి అప్పుడు అసలు విషయం చెప్తారు.
    140. ఈ విషయంలో నైజీరియన్లు చాలా నిశ్శబ్దంగా, స్పష్టంగా ఉంటారు.
    141. వారి అభిప్రాయాన్ని సుస్పష్టంగా, సంపూర్ణంగా ఎక్కువ వాదన లేకుండా చెప్తారు.
    142. జర్మన్లు కూడా సూటిగా మాట్లాడతారు. ఈ సందర్భంగా ఒక సామెత ఉంది. అమెరికన్లు సూటిగా, జర్మన్లు తక్కువ సూటిగా, జపానీయులు నెమ్మదిగా మాట్లాడతారు.
    143. అమెరికన్లు, జర్మన్లు పదాల అర్ధాన్ని నేరుగా తీసుకుంటారు.
    144. వారితో కమ్యూనికేషన్‌లో వ్యాపార లావాదేవీల్లో, అంగీకార పత్రాలు, కాంట్రాక్ట్‌లలో విస్పష్టంగా ఉండాలి, 
    145. ఎందుకంటే అమెరికన్లు తక్కువ స్ధాయి సంస్కృతిలో ఉంటారు.
    146. కాబట్టి వారు పదాలకేకాని అశాబ్దిక సంకేతాలు, నాన్‌వర్డ్స్‌ కి ప్రాధాన్యత ఇవ్వరు.
    147. గ్రీకు వారు కాంట్రాక్ట్‌ ని అధికారిక పత్రంగా భావిస్తారు. ఎందుకంటే దానిపై వారు సంతకం చేస్తారు కాబట్టి.
    148. జపనీయులు కాంట్రాక్ట్‌ కేవలం ఒక ఉద్దేశ పత్రంగానే భావిస్తారు. ఆ పని జరుగుతుండగా మెరుగుదల ఉంటుందని అనుకుంటారు. అమెరికన్ల వలె కాదు.
    149. అలాగే మెక్సికన్లు కాంట్రాక్ట్‌ పత్రాన్ని ఒక కళాత్మక ప్రక్రియగా భావిస్తారు. వారు పదాలని, సమయాన్ని ఎక్కువ పట్టించుకోకుండా నెమ్మదిగా వ్యవహరిస్తారు.
    150. వ్యవహార మార్గంలో వచ్చే విషయాలని పరిష్కరించుకోవచ్చని భావిస్తారు.
    151. అయతే అరబ్బులు కాంట్రాక్ట్‌ని అవమానంగా అనుకుంటారు. ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారు ఉన్నత స్ధాయి సంస్కృతికి చెందిన వారు కాబట్టి అశాబ్దిక సంకేతాలకు ప్రాముఖ్యత ఇస్తారు.
    152. అశాబ్దిక కమ్యూనికేషన్‌లో స్పేస్‌కి ప్రాదాన్యత ఉంటుంది.
    153. అమెరికా, కెనడాలలో కమ్యూనికేషన్‌ చెసేటపుడు ఐదు అడుగుల దూరాన్ని పాటిస్తారు. ఇది కొన్ని సంస్కృతులలో చాలా దగ్గర అని కొన్నిట్లో చాలా దూరమని భావిస్తారు.
    154. సమయం గురించి కూడా వివిధ సంస్కృతులలో భిన్నాభి ప్రాయాలు, పద్దతులు ఉంటాయి.
    155. ఆసియన్లు బాగా సమయపాలన చేస్తారని అయితే వారు లావాదేవీలను ముగించటానికి ఆలస్యం చేస్తారని అందరూ అంటారు. మీ రాష్ట్రాల్లో మీ సంస్కృతిలో కూడా కొంతమంది సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
    156. కొన్ని సంస్కృతులలో కొంతమంది సమయానికి తక్కువ  ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని సంస్కృతులలో సమయం ప్రకారమే పనులు జరుగు తాయని భావిస్తారు. 
    157. నార్త్‌ అమెరికన్లు సమయాన్ని ఒక ముఖ్య వ్యాపార వస్తువుగా భావిస్తారు. కాబట్టి దాన్ని వ్యర్ధం చేయకుండా త్వరగా పనులు చేస్తారు. సమయం వాళ్లకు డబ్బుతో సమానం. 
    158. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అమెరికన్‌ ఒక ఎలక్ట్రానిక్‌ ఉపకరణం కొనడానికి రెండు గంటలు వేచి ఉండాల్సివచ్చింది.  అతనికి అమ్మే వ్యక్తికి సమయం అంత ముఖ్యం కాదని తెలుసు.
    159. సంస్కృతిలో ఉన్న తేడాలపై అవగాహన అందరికీ ఉంటే వ్యవహారాలు మృదువుగా ముగుస్తాయి.
    160. చాలా దేశాల్లో సమయానికి చాలా విలువ నిస్తారు.
    161. అక్కడ సరైన సమయంలో ప్రతిస్పందన, ప్రతిచర్య, సలహాలు ఇవ్వటం ముఖ్యం. సమయకూల సూచన కూడా చాలా ముఖ్యం.
    162. ప్రపంచంలో ఉన్న అనేక సాంస్కృతిక వైవిధ్యతలో ప్రజలు కలుసుకుని చర్చించుకుంటారు. 
    163. ఈ విషయాలుఎంత ముఖ్యమో తెలుసుకోటానికి చాలా సహనం కావాలి.
    164. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత వాదమే నచ్చుతుంది. కాని సమూహాల్లో పనిచేయటం చాలా అవసరం.
    165. చాలా దేశాల్లో స్పేస్‌ విభజన కూడా ముఖ్యమని భావిస్తారు.
    166. ఎక్కువ దేశాల్లో బాస్‌ కార్నర్‌లో కూర్చుంటే, మెక్సికోలో మధ్యలో కూర్చుంటారు. అందరినీ గమనిస్తూ ఉంటారు.
    167. సంస్కృతిని బట్టి స్పేస్‌ నిబంధనలు ఉంటాయి.
    168. మనం ఇంతకు ముందే తెలుసుకున్నట్లుగా స్పేస్‌, సమయం, భాష చాలా ముఖ్యమైనవి.
    169. మన సంభాషణలో వచ్చే ఏవైనా పదాలు అర్థం కాకపోతే సరియైన భావం తెలియదు.
    170. ఒక  రెస్టారెంట్‌లో ఇలా వ్రాసి ఉంది. మా వైన్‌ మిమ్మల్ని అన్నీ మర్చిపోయేలా, ఎక్కడా లేకుండా ఉండేలా చేస్తుంది.
    171. కొన్ని ప్రకటనలలో ప్రతి పదాన్ని అనువదిస్తారు.
    172. ఒక స్విస్  రెస్టారెంట్‌లో ఇలా వ్రాసి ఉంది. మా వైన్‌ మిమ్మల్ని అన్నీ మర్చిపోయేలా, ఎక్కడా లేకుండా ఉండేలా చేస్తుంది.
    173. కొన్ని ప్రకటనలలో ప్రతి పదాన్ని అనువదిస్తారు. పంచ్‌ లైన్స్‌ కూడా అంతే వ్రాస్తారు. మనం కేవలం పదాల అర్థం తీసుకుంటే భావం మారిపోతుంది. ప్రతికూలంగా అనిపిస్తుంది.
    174. ఇంకొక హోటల్‌లో ఏం వ్రాసారంటే స్త్రీలు బార్‌ దగ్గర పిల్లలను కలిగి ఉండరాదు. 
    175. అంటే వాళ్లు చెప్పదలచుకున్న సందేశం ఏమిటి అంటే స్త్రీలు బార్‌కి రావద్దనా లేక పిల్లలను తీసుకురావద్దనా.
    176. ఇంకొక ఉదాహరణ నీరు గురించి.
    177. ఒక హోటల్‌ వారు తాము ఇచ్చే నీరు చాలా శుద్ధమైనదని చెప్పాలనుకున్నారు. ఇలా వ్రాసారు మా నీరు మానేజర్‌ స్వయంగా వదిలినది, అది చాలా అసభ్యంగా అనిపించవచ్చు.
    178. అంటే వ్రాసే విషయంలో స్పష్టత లేకపోతే సందేశం సరిగ్గా అర్థం చేసుకోవడానికి సమయం అవసరం అవుతుంది.
    179. మన సంస్కృతి కూడా మనను వేరే విధంగా ఆలోచింపజేస్తుంది.
    180. మిత్రులారా, మనం ఈ ప్రపంచంలో ఉన్న సాంస్కృతిక వైవిధ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం విభిన్న వ్యక్తులతో పనిచేయాల్సి వస్తుంది.
    181. మనం ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే సాంస్కృతిక నిజాలు తెలుసుకోవాలి.
    182. మనం గొప్ప ప్రయత్నం చేస్తే తప్పక ఒక సంస్కృతి గురించి తెలుసుకొని చక్కగా ప్రతిస్పందించ గలుగుతాము.
    183. ఏ ఒక్క సంస్కృతిలో, విశ్వాసంలో తార్కికత లేకుండా ఉండదు. ఆ విషయం తెలుసుకుంటే మనం ఇతరుల సంస్కృతిని చులకన చేయం.
    184. సంస్కృతి ఉద్దేశం కూడా అదే.
    185. కమ్యూనికేషన్‌ యొక్క ముఖ్యోద్దేశం మనుషులని దగ్గరికి చేర్చటమే. మనం ప్రపంచంలో అన్ని సంస్కృతుల గురించి తెలుసుకుంటే అనేక విషయాలు తెలుస్తాయి. మనం అన్ని విషయాలనీ అవగాహన చేసుకొని ప్రవర్తిస్తే మనకు కల్చరల్‌ షాక్‌ తగలదు.
    186. ధన్యవాదాలు !