49. softskill_Proxemics--ULYYfJnhs8.txt 33.5 KB
Newer Older
Vandan Mujadia's avatar
Vandan Mujadia committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130
    1. శుభోదయం.
    2. మీరు బినోద్‌ మిశ్రా గారిచే ఇవ్వబడిన సాఫ్ట్‌స్కిల్స్‌  ఉపన్యాసాల వరుసను వింటున్నారు. ఇందులో భాగంగా మనం పదాలు లేకుండా కమ్యూనికేషన్‌, అశాబ్దిక కమ్యూనికేషన్‌ గురించి చర్చిస్తున్నాము.
    3. మనం అశాబ్దిక కమ్యూనికేషన్‌ యొక్క ప్రాముఖ్యత మన నిజ జీవితంలో లేదా కార్యాలయంలో ఈ అశాబ్దిక సంకేతాలు అనేక సందర్భాలలో ఎలా వాడతాము అని తెలుసుకున్నాము.
    4. ఈ ప్రసంగంలో ఇవాళ మనం 'ప్రాక్సిమిక్స్‌'(proxemics) గురించి మాట్లాడుకుందాం.
    5. ప్రాక్సిమిక్స్‌ గురించి కుతూహలం కలిగి ఉంటుంది. కమ్యూనికేషన్‌లో ఇది ఎంత ముఖ్యమో ఆలోచించండి.
    6. మీకు ప్రాక్సిమిక్స్‌ అంటే ఏమిటి, అందులో వివిధ అంశాలేమిటి, కమ్యూనికేషన్‌లో  దాని పాత్ర ఏమిటి, ప్రాక్సిమిక్స్‌ కి అంత పరిగణన, ప్రాధాన్యాత ఎందుకిచ్చారు.
    7. మనం ఒక్కోసారి ఏదైన రహస్యాన్ని లేదా అత్యంత కీలకమైన సమాచారాన్ని ఇతరులకు తెలియకుండా ఒక వ్యక్తికి అందించాలంటే మనం అతనికి దగ్గరగా వెళ్లి చెపుతాము.
    8. ఇంకోపక్క, మనం మనం కమ్యూనికేషన్‌ చేసే అనేక సంధర్భాలలో వివిధ పద్ధతులో మనం కొంతదూరాన్ని కూడా పాటిస్తాము.
    9. ప్రాక్సిమిక్స్‌ లో మనము ప్రాదేశిక సంబంధాల గురించి, వాటి అర్ధం గురించి, ప్రాదేశిక సంబంధాలు కమ్యూనికేషన్‌  లో ఎలాంటి పాత్ర పోషిస్తాయో తెలుసుకుందాము.
    10. ఇది ముఖ్యమా కాదా అని ఎప్పుడైనా ఆలోచించారా?
    11. కాబాట్టి కమ్యూనికేషన్‌  లో భౌతిక దూరం గురించి తెలిపే అధ్యాయనమే ప్రాక్సిమిక్స్‌.
    12. 'ప్రాక్సిమిక్స్‌ అంటే  ఒక స్థలానికి దగ్గరలో ఉండటం. 
    13. కాబట్టి ప్రాక్సిమిక్స్‌ ని మనం ప్రవర్తన నియమావళి దృష్టిలో అర్ధం చేసుకోవాలి.
    14. మనం జంతువులను గమనిస్తే, అవి ఒక గుంపుగా ఒకే చోట ఉంటే అవి కదలడానికి, నడవడానికి చాలా తక్కువ పరిమితమైన స్థలం ఉంటుంది. అదే గుంపు నుండి విడిగా వచ్చినపుడు అవి స్వేఛ్ఛాగా విశ్రాంతిగా ఉంటాయి.
    15. అదే విధంగా మనుషులకు కూడా కొంత స్థలం అవసరం. 
    16. స్పేస్‌ అర్ధం ప్రతి సంస్కృతిలో వేరుగా ఉంటుంది.
    17. మనం గమనిస్తే తల్లికీ బిడ్డకూ మధ్య స్పేస్‌ చాలా తక్కువగా ఉంటుంది.
    18. వారిద్దరి మధ్య మాటల ద్వారా కమ్యూనికేషన్‌ లేకున్నా ఒకరినొకరు చక్కగా అర్ధం చేసుకుంటారు. అశాబ్దిక సంకేతాలు, చేతులతో ఎత్తుకొని కౌగిలించుకోవటం, కోపం, అభిమానం వంటి భావాలు కూడా చాలా సన్నిహితంగా అర్ధమవుతాయి.
    19. కాబట్టి భౌతిక దూరం గురించి అధ్యయనం చేయటం చాలా ముఖ్యం.
    20. మన వ్యక్తిగత సంబంధాలలో, భౌతికంగా లేక అధికారికంగా చేసే కమ్యూనికేషన్‌ లో స్పెస్‌ చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది.
    21. అది ప్రతి సంస్కృతిలో విభిన్నంగా ఉంటుంది.
    22. ప్రాక్సిమిక్స్‌ స్నేహ భావాన్ని, మనం కోరుకునే స్వేచ్ఛని, ప్రశాంతతని వెచ్చదనం లేదా ఆర్ద్రతని ప్రతిబింబిస్తుంది.
    23. మనకు నాలుగు స్పేస్‌ జోన్ ఉంటాయి. వాటిని మనంనాలుగు భాగాలుగా వర్గీకరించవచ్చు.
    24. ప్రతి వ్యక్తికీ స్థలం, భూభాగం, స్పేస్‌ అనే భావాలు ఉంటాయి.
    25. మనకు ఇతరులతో ఉన్న సంబంధాన్ని బట్టి ఈ స్పేస్‌ జోన్స్‌ మారుతూ ఉంటాయి.
    26. మొదటిది సన్నిహిత  జోన్‌.
    27. ఈ సందర్భంలో మనం మనకు ఇతరులతో ఉన్న దగ్గరి తనం లేదా దూరపుతనాన్ని నిర్ధారించాలి.
    28. మొదటి జోన్ దూరం గురించి మాట్లాడే సన్నిహిత జోన్; వివిధ ప్రాంతాల గురించి మాట్లాడుకుందాం
    29. మనుషులకి జంతువులకి కూడా స్పేస్‌ అవసరం.
    30. మనం ఊపిరి పీల్చే స్పేస్‌ ని ఎవరూ కోరుకోరు.
    31. మన స్పేస్‌కి అనేక సందర్భాలలో భంగం కలిగినట్లుగా కూడా మనకు తెలుసు.
    32. కొన్నిసార్లు, ఇది కూడా ఉల్లంఘించబడుతుంది, అందుకే దాని భౌతిక స్థానం ప్రతి సంస్కృతిలో వేరుగా ఉంటుంది.
    33. మనం భౌతిక స్థానాన్ని  గురించి అధ్యయనం చేయవచ్చు. ఈ భౌతిక స్థానాన్ని 4 జోన్లుగా విభజించారు.
    34. 
    35. మొదటి విభాగం ఇంటిమేట్‌ స్పేస్‌. ఇది 18 అంగుళాల వరకు భౌతిక స్పర్శని అనుమతిస్తుంది.
    36. అయితే మనం ఒక వ్యక్తితో ఇంటిమేట్‌ జోన్‌ లో ఉన్నామా లేక వేరే జోన్‌లోనా అనేదే ప్రశ్న. మనకు ఒక వ్యక్తితో ఎంత సన్నిహితత్వం ఉందో దాని బట్టే మనం వారి ఇంటిమేట్‌  జోన్‌ లో ఉంటాము. మన కుటుంబ సభ్యులు, బంధువులు ఇంకా సన్నిహితులు ఈ జోన్‌ లో ఉంటారు.
    37. రెండవది వ్యక్తిగత జోన్‌. ఇది కూడా మా జోన్ వలే ఉంటుంది.
    38. ఈ జోన్‌లో భౌతిక స్పర్శ దూరం 18 అంగుళాల నుండి 4 అడుగులకు పెరుగుతుంది. మూడవది సాంఘిక  జోన్‌. ఇందులో భౌతిక స్పర్శ దూరం 4 నుండి 12 అడుగుల వరకు ఉంటుంది.
    39. నాలుగవది పబ్లిక్‌ జోన్‌. ఇందులో స్పర్శ దూరం 12 నుండి 30 అడుగుల వరకు పెరుగుతుంది.
    40. 
    41. మనకు ఈ జోన్ల గురించి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆంత్రోపాలజిస్ట్‌ మెహ్రాబియన్‌ చెప్పినట్లుగా ''ఒక వ్యక్తి స్ధాయి అతను విశ్రాంతిలో ఉండే భంగిమలు, ప్రతిచర్యల ద్వారా తెలుసుకోవచ్చు. మానవ శాస్త్రవేత్తలు వివిధ పరిశీలనలు కలిగి ఉన్నారు.
    42. మనం ఇతరుల పట్ల నిర్వహించే స్పేస్‌, వలన మనం మన స్థాయిని కూడా ప్రదర్శిస్తునాం. ఒక సంస్థలో పని చేసే ఉద్యోగులు తమ తమ స్పేస్‌ మరియు స్థాయిని విభిన్నంగా నిర్వహిస్తారు.
    43. వారి గదిలో ఉండే ఫర్నిచర్‌ వారి స్థాయిని సూచించేదిగా ఉంటుంది.
    44. అనేక సంస్థలలో బాస్‌ యొక్క గది విశాలంగాను, ఇతర ఉద్యోగుల గదులు వారి స్థాయిని బట్టి ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం.
    45. సాధారణ ఉద్యోగులకు కాబిన్స్‌ ఉంటాయి. కాబట్టి స్పేస్‌ అనేది ఒక సంస్థలో ఉద్యోగి యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తుంది.
    46. అమెరికాలో పని చేసే అశాబ్దిక కమ్యూనికేషన్‌ మనకొక శక్తిని, అధికారాన్ని, నియంత్రణ, ఆధిపత్యం ఇచ్చి సంస్థలో మన స్థానాన్ని తెలియజేస్తుంది.
    47. అందుకే అమెరికాలోని కొన్ని సంస్థలలో బాస్‌ ఎప్పుడు ఒక కార్నర్‌లో ఉండి ఉద్యోగులందరినీ గమనించుతారు.
    48. మన దేశంలో కూడా ఉన్నతాధికారులందరికీ మంచి విశాలమైన ఆఫీసు గదులు, అధికారం, వసతి ఇవన్నీ కూడా చాలా భారీగా ఉంటాయి.
    49. కాబట్టి స్పేస్‌ అధికారాన్ని సూచిస్తుంది. ఇది ప్రతి సంస్కృతిలో వేరుగా ఉంటుంది.
    50. ఒక సంస్కృతిలో అనుమతించబడినది. ఇంకొక దానిలో తిరస్కరించబడ వచ్చు.
    51. భౌతిక స్థలం ఎంత ముఖ్యమైనదో ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం.
    52. ఒక అమెరికన్‌ ఒకసారి ఒక జపానీస్‌ సంస్థచే గౌరవ అతిథిగా ఆహ్వానించబడ్డాడు.
    53. అతనిని వేదిక వద్దకు తీసుకురావడానికి కారు పంపించారు. అంతే కాకుండా ఇద్దరు వ్యక్తులను ఎస్కార్ట్‌గా పంపించారు.
    54. ఆ ఎస్కార్ట్స్ డ్రైవరు పక్క సీటులో కూర్చోని ప్ర్రయాణించారు. అతిథి వెనక సీట్లో కూర్చున్నారు.
    55. అతిథి తను ఒంటరిగా ప్రయాణించడం గురించి చాలా బాధ పడ్డాడు.
    56. ఎందుకు ఒంటరిగా ఉన్నాడో అతనికి అర్ధం కాలేదు.
    57. ఇదే గౌరవ అతిథి ఇంకొకసారి మళ్లీ అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఈ సారి ముగ్గురు ఎస్కార్ట్స్  వచ్చారు. ఒక్కరన్నా తన ప్రక్కన కూర్చుంటారేమో అనుకుంటే ముగ్గురూ డ్రైవర్‌ పక్కనే కూర్చుని ప్రయాణించారు.
    58. అతిథి తన వలన వారికి ఏమైన ఇబ్బందిగా ఉందా, లేదా తన శరీరం నుంచి ఏదైనా దుర్వాసన వస్తుందా అని ఆలోచించారు. అయితే సమస్స అది కాదు.
    59. తరువాత అతను తన ఆంగ్ల/బ్రిటీష్‌ విద్యార్ధులను గమనిస్తే వారు కూడా చాలా దూరంగా కూర్చుని ఉన్నారు. ఈ వ్యక్తి ఒంటరిగా కూర్చున్నాడు.
    60. కాని జపాన్‌లో అతిథికి మర్యాదపూర్వకంగా చాలా స్పేస్‌ ఇస్తారని చెప్పాడు. కాబట్టి అది అమర్యాద కాదు అని చెప్పారు.
    61. కాబట్టి దూరం అనేది విభిన్న వ్యక్తులు వేరుగా అర్ధం చేసుకుంటారు.
    62. మనం ఇప్పుడు ఈ నాలుగు జోన్స్‌ ఎలా ఉంటాయో చూద్దాం.
    63. యూరోపియన్లు ఇంటిమేట్‌ జోన్‌లో 15-25 సెంటిమీటర్ల దూరాన్ని పాటిస్తారు. ఇది ఎదుటి వారితో వారి సంబంధాన్ని బట్టి ఉంటుంది.
    64. స్పేస్‌ అనేది శక్తిని, ఆధిపత్యాన్ని సూచిస్తుంది కాబట్టి ఇంటిమేట్‌ జోన్‌లో కేవలం మన కుటుంబ సభ్యులు ఇంకా దగ్గరి బంధువులు మాత్రమే ఉంటారు.
    65. ఎప్పుడైనా ఒక అపరిచిత వ్యక్తి వేరొక జోన్‌ నుంచి మన ఇంటిమేట్‌ జోన్‌లోకి ప్రవేశిస్తే మనం బెదిరిపోతాం.
    66. మన సంస్థలో కూడా మనం బాస్‌తో మాట్లాడేటపుడు కొంత దూరాన్ని పాటిస్తాం.
    67. మీరు యజమానితో చాలా సన్నిహితంగా ఉంటే వారికి ఇబ్బందిగా ఉంటుంది.
    68. పర్సనలో జోన్‌
    69. మన స్నేహితులు, తోటి వారు, సహోద్యోగులు మాత్రమే ప్రవేశించగలరు.
    70. అయితే పర్సనల్‌ జోన్‌లోని వ్యక్తులతో మనకి సన్నిహితత్వం పెరిగి మన విషయాలనీ రహస్యాలనీ వారితో పంచుకోగలిగినపుడు మాత్రమే వారు ఇంటిమేట్‌ జోన్‌ లోకి రాగలుగుతారు.
    71. అందువల్ల, వ్యక్తి అనుమతి లేకుండా, ఒక జోన్ మరొక జోన్‌తో జోక్యం చేసుకోదు.
    72. సోషల్‌జోన్‌లో అపరిచితులు, అపుడపుడూ వచ్చే ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌, పాలవాడు వంటి సందర్శకులు ఉంటారు.
    73. వీరిని మనం ఇంట్లో కాని, కార్యాలయంలో కాని కొంత పరిధి వరకే అనుమతిస్తాము. అంత కంటే వారు ప్రవేశించలేరు. కాబట్టి ఒక సంస్థ యొక్క అధిపతిని కలవాలంటే మనం ఒక నిర్ణీత ప్రదేశంలో వేచి ఉండాలి.
    74. బాస్‌కి మన రాక తెలియజేసాక అతని వీలు ప్రకారం ఎవరినైనా కలవవచ్చు.
    75. తరువాతది పబ్లిక్‌ జోన్‌. ఇది వాస్తవానికి చాలా పెద్ద దూరం.
    76. ఇందులో మనం ప్రజాసమావేశాలకు, కాన్పరెన్స్‌లకి వెళ్లినప్పుడు, అక్కడి వక్తకి, నాయకుడికి ప్రేక్షకులకి మధ్య చాలా దూరం ఉంటుంది.
    77. మన ప్రసంగానికి ఫీడ్‌బాక్‌ మనం తీసుకోలేం.
    78. స్పేస్‌ సంస్కృతిచే నిర్ణయించబడనందున విభిన్న సంస్కృతులకు వేర్వేరు అర్థాలు ఉన్నాయి, కాబట్టి మనం ప్రపంచాన్ని రెండు సాంస్కృతిక జోన్స్‌ గా విభజించ వచ్చు.
    79. తక్కువ సాంస్కృతిక జోన్‌లో నార్త్‌ అమెరికా, జర్మనీ, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, ఇటలీ మరియు స్కాండినేనియా ఉన్నాయి. ఎక్కువ సాంస్కృతిక జోన్‌ లో జపాన్‌, అరబ్‌ , చైనా, గ్రీస్‌ , మెక్సికో , స్పేయిన్‌  దేశాలు ఉన్నాయి.
    80. ఈ రెండిటి మధ్య స్పేస్‌కి సంబంధించిన తేడాలు ఎలా ఉన్నాయి?
    81. తక్కువ సాంస్కృతిక జోన్‌లో ఉన్న ప్రజలు లిఖిత సందేశాలను నమ్ముతారు.
    82. అశాబ్దిక సంకేతాలను పట్టించుకోరు. అయితే ఎక్కువ సాంస్కృతిక జోన్‌ లో ఉన్న ప్రజలు అశాబ్దిక సంకేతాలను కూడా నమ్మి అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకి అమెరికాలో ప్రజలు సుదీర్ఘ ఇ-మెయిల్స్‌ వ్రాస్తారు. అదే జపాన్‌లో చాలా చిన్న సందేశాలు వ్రాస్తారు.
    83. కాబట్టి ఫ్రాన్స్ వారు తమ సందేశాలలో విషయాలు దాస్తున్నారని అమెరికన్లు భావిస్తే, అమెరికన్లు ఎక్కువ వ్రాయటం ద్వారా తమ ఆధిపత్యం చూపిస్తున్నారని ఫ్రాన్స్ వారు భావిస్తారు.
    84. అమెరికన్స్‌ ఎక్కువ స్పేస్‌ కోరుకుంటారు. కాబట్టి వారు ఇతరులు తమ స్పేస్‌ని ఉల్లంఘించారని అనుకుంటారు. అలాగే అమెరికన్లు తమ స్పేస్‌లో ప్రవేశించి ఇబ్బంది పెడుతున్నారని ఇతరులు అనుకుంటారు.
    85. అరబ్బులలో పురుషులు లేదా స్త్రీలు వారి జెండర్‌ వారితో నార్త్‌ అమెరికా వారి కంటే దగ్గరగా నిలబడతారు.అలాగే భారతీయులు కూడా. ఇది ఇతర సంస్కృతుల వారికి ఇబ్బందికరంగా ఉంటుంది.
    86. ఒక ఉదాహరణ చూదాం. ఒకసారి డెన్మార్క్‌ దంపతులు అమెరికన్‌ క్లబ్‌లో సభ్యులయ్యారు.
    87. అమెరికన్ స్పేస్‌ నిర్వహణ గురించి తెలియక వారిని ఇబ్బంది పెట్టారు.
    88. భౌతిక స్థలం ఉల్లంఘించిన సందర్భాలు చాలా ఉన్నాయి మరియు కొన్నిసార్లు వేర్వేరు పరిణామాలకు దారితీస్తుంది.
    89. ఉదాహరణకు మన దేశంలో కూడా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఎలక్షన్‌ ర్యాలీలో ప్రసంగిస్తుండగా కొంతమంది స్పేస్‌ని ఉల్లఘించి అతనికి దగ్గరగా వెళ్ళారు. చాలా గొడవ జరిగింది.
    90. కాబట్టి మనం ఇతరులతో కమ్యూనికేట్‌ చేసేటపుడు స్పేస్‌కి సంబంధించిన పరిధులను గుర్తించి వారికీ మనకీ ఇబ్బంది లేకుండా ప్రవర్తించాలి.
    91. చాలా సార్లు మనకు సంస్కృతి పరంగా స్పేస్‌ గురించి సర్దుబాటు తెలియక గందరగోళం ఏర్పడుతుంది.
    92. కొంతమంది మేధావుల పరిశీలనలు చేశారు.  
    93. అందుకని, అమెరికన్లు మరియు జపనీస్ పూర్తిగా భిన్నంగా ఉన్నారు.
    94. జపనీయులు చాలా రిజర్వు మరియు అమెరికన్లు చాలా ఓపెన్ మైండెడ్.
    95. ఈ కదలికలు చూసిన వారికి అది ఒక నృత్యం లాగా అనిపిస్తుంది. స్పేస్‌ గురించి అవగాహన లేకపోతే అది అపార్ధాలకు, గందరగోళం, దురభిప్రాయాలకు దారితీస్తుంది.
    96. కమ్యూనికేషన్‌లో స్పేస్‌తో పాటు సమయం యొక్క అధ్యయనం కూడా ముఖ్యమైనదే.
    97. చాలా దేశాలలో సమయం, సమయపాలన అనేది విభిన్నంగా ఉంటుంది. సమయాని కిచ్చే ప్రాధాన్యత వేరు. కానీ కొన్ని సంస్కృతులలో, ప్రజలు ఇతరుల మాదిరిగా సమయాన్ని తీవ్రంగా తీసుకోరని కూడా కనుగొనబడింది  ఈ సమయ అధ్యయనాన్ని క్రోనిమిక్స్‌ అంటారు.
    98. క్రోనెమిక్స్ అనేది సమయం అధ్యయనం మరియు మీలో ఎక్కువ మంది నిపుణులు అవుతారు. ప్రోఫెషనల్‌ ప్రపంచంలో సమయానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది.
    99. అది అక్కడ ఒక ముఖ్య వస్తువు.
    100. సమయం మనిషి యొక్క వ్యక్తిత్వానికి ప్రతీక. ఇతరుల పట్ల మన వైఖరిని కూడా ప్రతిబింబిస్తుంది.
    101. మన ప్రాధాన్యతను తెలుపుతుంది.
    102. చాలా దేశాల్లో సంస్కృతులలో సమయ పాలన మంచి లాభాలు ఇస్తుంది.
    103. మీ వృత్తిలో మీకొక ప్రాజెక్ట్‌ ఇచ్చారంటే దానితో పాటు సమయ పరిమితి లేదా గడువు ఇచ్చినట్లే.
    104. మనం సమయ పాలన చేయకపోతే అది మన వ్యక్తిత్వంపై ఒక ప్రతికూల లక్షణంగా అనిపిస్తుంది.
    105. మీరు సమయపాలన చేయకపోతే అది మీ నిజాయితిని శంకించేలా చేస్తుంది.
    106. ఇది సంస్కృతి నుండి సంస్కృతికి మారుతుంది.
    107. సమయము మీకు మీ పనులు సరిగ్గా ప్రణాళిక బద్దంగా చేసుకోడానికి తోడ్పడుతుంది.
    108. కొన్ని లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో మెక్సికోలో సమావేశాలు సమయానికి ప్రారంభం కావు.
    109. చాలా సరదాగా ముచ్చట్లాడిన తరువాత సమావేశం ప్రారంభిస్తారు. అదే  సమయ పాలన వలన మీకు గౌరవం లభిస్తుంది. మన దేశంలో మనం సమయ పాలన గురించి ఎంతో మాట్లాడినా కూడా అది పాటించకపోవడం వలన చాలా సమస్యలు వస్తాయి.
    110. కమ్యూనికేషన్‌ చేసేటప్పుడు సమయ పాలన మంచి ఫలితాలు ఇస్తుంది.
    111. రాబర్ట్‌ ఇహాల్‌ అనే మనస్తత్వ వేత్త ఇలా అన్నారు సమయం మాట్లాడుతుంది, స్పేస్‌ చూపుతుంది మనం ఒక ప్రసంగం చేయాలనుకుంటే దాన్ని మనకు ఇచ్చిన సమయంలో ముగించాలి.
    112. ఉదాహరణకు మీ ప్రసంగానికి 20 నిమిషాల సమయం ఉంటే దాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకోవాలి.
    113. తద్వారా మీ చర్చ సమయానికి ముగుస్తుంది. ఇది 20 నిమిషాల ప్రదర్శన కంటే ఎక్కువ ఉంటే, ఇది నిజంగా మీ సమయాన్ని వృథా చేస్తుంది.
    114. అందువల్ల, జాగ్రత్తగా మాట్లాడేవారు మరియు జాగ్రత్తగా సంభాషించేవారు, వారు సందేశం యొక్క సరైన సమయాన్ని అలాగే మీ ప్రదర్శన లేదా సంభాషణ సమయాన్ని తెలుసుకొని నిర్ణయిస్తారు.
    115. మీరు పరిచయాల కోసం ఎక్కువ సమయాన్ని అనుమతిస్తే, మీరు ప్రదర్శించడానికి తక్కువ సమయం ఉంటుంది. కాబట్టి చక్కటి ప్రజంటేషన్‌ ఇవ్వాలంటే పరిచయ భాగం, మధ్య భాగం, ముగింపు సమయం ప్రకారం సరిగ్గా ఉండాలి.
    116. అప్పుడే మీ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తుంది. మిమ్మల్ని విజయవంతమైన ప్రోఫెషనల్‌ చేస్తుంది.
    117. కానీ ప్రతి వ్యక్తి కూడా తమ ఇష్టానుసారం సమయాన్ని ఉపయోగిస్తారు.
    118. ఒక సంస్థలో ఉన్నతాధికారులను కలవటానికి మీరు ముందే సమయం అడగాలి.
    119. ఆ అధికారి కూడా మీకెంత సమయం కేటాయించాలో నిర్ణయిస్తారు. 
    120. అది వ్యక్తి ప్రాముఖ్యతని చూపుతుంది.
    121. వారు తమ సమయాన్ని ప్లాన్‌ చేసుకుంటారు.
    122. సకాలంలో, సమయానుకూల ప్రదర్శన, సమయోచిత సహాయం, సరైన ప్రణాళికలు, చర్చలు మంచి ఫలితాలను ఇస్తాయి.
    123. ఈ కాలంలో ప్రాక్సిమిక్స్‌, క్రోనిమిక్స్‌ రెండూ అవసరం.
    124. మీరు మీ సమయాన్ని ఎలా విభజిస్తారనేది మీ ఇష్టం; మనం మన కాలాన్ని, స్పేస్‌ని సరిగ్గా ఉపయోగించి అనుసంధానం చేసుకోవాలి. ఎందుకంటే అవి రెండూ కమ్యూనికేట్‌ చేస్తాయి.
    125. అవి రెండు అశాబ్దిక సంకేతాలు మన వృత్తిలో ఇవి చాలా ప్రధానమైనవి. మనము ఒక విజయవంతమైన మానేజరుగా, ప్రోఫెషనల్‌ గా అవటానికి తోడ్పడుతాయి. రాబోయే రోజుల్లో ఈ 2 అశాబ్దిక విషయాలపై తగినంత శ్రద్ధ వహించాలి.
    126. ఇతర సాంస్కృతిక నైపధ్యం ఉన్న వ్యక్తులతో కమ్యూనికేట్‌ చేసేటప్పుడు స్పేస్‌, సమయం గురించి సమాచారం ముందే తెలుసుకుంటే మనం దురభిప్రాయాలని నివారించవచ్చు. ప్రతికూలత ఎర్పడదు.
    127. స్పేస్‌, సమయం గురించి ఇచ్చిన ఈ ఉపన్యాసం మీ వ్యాపారానికి, వ్యవహారాలకి తోడ్పడుతుందని ఆశిస్తున్నాను.
    128. మన సంబంధాలు విజయవంతమవడానికి కారణం కూడా మన శ్రోతలు ప్రేక్షకులే.
    129. ధన్యవాదాలు!