50. softskill_Structure of Reports - Part-I-0i8ZTFac6c8.txt 43.5 KB
Newer Older
Vandan Mujadia's avatar
Vandan Mujadia committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207
    1. హాలో! సాఫ్ట్ స్కిల్స్ లెక్చర్స్ కి పునస్వాగతం.
    2. క్రిందటి ఉపన్యాసంలో డేటా విశ్లేషణ, అమరిక గురించి తెలుసుకున్నాం.
    3. దాన్ని ముగించే ముందు నివేదిక నిర్మాణం గురించి చర్చిద్ధామని అనుకున్నాం.
    4. నివేదిక నిర్మాణం అంటే ఏమిటి? ఒక పెద్ద భవంతి ముందు నించున్నామని ఊహించుకోండి.
    5. ఆ భవంతిని చూస్తున్నపుడు దాని అందం మిమ్మల్ని ముగ్ధుల్ని చేస్తుంది.
    6. అయితే ఈ అందమైన భవంతి ఎలా నిర్మితమైందో ఎపుడైనా ఆలోచించారా. ఈ భవంతి నిర్మించడానికి చాలా సమయం పట్టి ఉంటుంది. ఇటుక పేర్చి ఒక పద్ధతి ప్రకారం కట్టి ఉంటారు.
    7. నివేదిక విషయంలో కూడా ఇదే నిజం.
    8. నివేదిక ఒక అధికారిక పత్రం కాబట్టి అది కూడా పద్దతి ప్రకారం నిర్మించబడుతుంది.
    9. ముందు చర్చించినట్లుగా డేటా అంతా తయారుగా ఉండి, వివిధ విభాగాలుగా విభజించబడి, ఒక టైలర్ వస్ర్త్తాన్ని అనేక భాగాలుగా కత్తిరించినట్లు చివరగా దాన్ని కూర్పు చేయడమే.
    10. మీరు కూడా విభాగాలతో ఉన్న డేటాని అలాగే నివేదిక నిర్మాణానికి ఉపయోగించాలి.
    11. నివేదిక శీర్షికను బట్టి ఎలాంటి నిర్మాణం అవసరమో తీర్మానించాలి.
    12. ఏ రకమైన నివేదిక కైనా దాదాపు ఒకే నిర్మాణం ఉంటుంది.
    13. కేవలం ఒక విధమైన నివేదిక విషయంలో ------ ఒక విధమైన నివేదిక మొత్తం నిర్మాణాన్ని అనుసరించకపోవచ్చు, కాని అప్పుడు మీరు ఒక నివేదిక నుండి ఏమి ఆశించాలో అర్థం చేసుకోవాలి. అది ఆ నివేదిక ఉద్దేశ్యం పై ఆధారపడి ఉంటుంది.
    14. దానికొరకు మీరు Terms of Reference ను సంప్రదించాలి. మీకు నివేదిక పనిని అప్పగించినవారు ఈ విషయాలన్నీ మీకు సూచనలిచ్చి ఉంటారు.
    15. నివేదిక యొక్క అవసరాలను గుర్తించి నివేదిక తయారు చేయటం మొదలు పెట్టాలి.
    16. నిర్మాణం అంటే నివేదిక ఉనికి కోసం తయారుచేసిన పునాది.
    17. నివేదిక నిర్మాణంలో మూడు భాగాలున్నాయి.
    18. మనం వ్యాపార కరస్పాండెన్స్ లో తెలుసుకున్నట్లుగా ఒక లేఖలో ఉపోద్ఘాతం, చర్చ మరియు ముగింపు. 
    19. ఈ మూడు భాగాలు నివేదిక లో కూడా ఉంటాయి.
    20. ఈ మూడు భాగాలు యొక్క ఐక్యత వలనే ఒక సాంకేతిక నివేదిక తయారౌతుంది.
    21. ఈ మూడు భాగాలలో మొదట్టి ప్రి-మెటీరియల్, రెండవది ప్రధాన విభాగం, మూడవది అంత్య భాగం.
    22. అయితే ఈ ప్రి-మెటీరియల్ విభాగంలో ఏం అంశాలుంటాయని అనుకోవచ్చు. దీనినే ప్రంట్ మ్యాటర్ అని కూడా పిలుస్తారు. చాలా పుస్తకాలలో ఉండే ఆరంభ, మధ్య, అంత్య విభాగాలలో ఆరంభ భాగమే ఈ ప్రి-మెటీరియల్.
    23. ఒక విధంగా ముందు పదార్ధం ప్రి-మెటీరియల్.
    24. ప్రి-మెటీరియల్ విభాగంలో చాలా ఐటమ్స్ ఉంటాయి.
    25. అవన్నీ చాలా ముఖ్యమైనవి.
    26. నివేదిక అనేది డిమాండ్ వలన, క్రమబద్ధంగా, క్రియాత్మకంగా కూర్చిన డేటాతో వ్రాయబడుతుంది.
    27. డేటాను వివిధ విభాగాలలో విభజించినపుడు, ముఖ్యభాగం మొదటి భాగం.
    28. మీరు ఒక పుస్తకాన్ని గమనించాలి. నివేదిక లాగానే పుస్తకంలో కూడా ఒక నిర్ధిష్ట విషయం ఉంటుంది.
    29. ఒక నిర్దిష్ట అంశంపై ఒక పుస్తకం కూడా ఒక నివేదిక లాంటిది.
    30. ఈ రెండిటిలో కూడా మొదట వచ్చేది కవర్ పేజి. 
    31. కనుక నివేదించబడిన కేసు ఉంది. 
    32. కాబట్టి, ఒక నివేదిక యొక్క అంశాలు ప్రత్యేకంగా ముఖచిత్రం యొక్క అంశాలు.
    33. తరువాత టైటిల్ పెజీ, కాపీరైట్ నోటీస్, ఫార్వర్డింగ్ లెటర్, ప్రిఫేస్, కృతజ్ఞతాపత్రం, విషయాల పట్టిక, దృష్టాంతాల జాభితా, తరువాత సారాంశం.
    34. ఇవన్నీ మొదటి భాగంలో ఉంటాయి. 
    35. మనం ఈ అన్ని విషయాలను క్షుణ్ణంగా చర్చించి తెలుసుకుందాం.
    36. ఎందుకంటే ఒక ప్రోఫెషనల్ గా మీరు ఏదో ఒక సమయంలో నివేదిక వ్రాయాల్సి ఉంటుంది.
    37. ఒక 30-40 పేజీల నివేదిక ఉంటే ముందుగా కనబడేది కవర్.
    38. దాన్ని ఎలా సృష్టించాలి? చాలా సంస్ధలలో దీనికి ఒక ప్రత్యేక ప్రోఫార్మా ఉంటుంది. అయితే నిర్ధిష్ట ప్రోఫార్మా లేకపోతే కవర్ ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలి.
    39. సాధారణంగా నివేదిక యొక్క కవర్ ఒక తెల్లని మందమైన కాగితం ఉంటుంది. అయితే కవర్ని ఆకర్షణీయంగా చేయడానికి రంగు కవర్లను వాడుతారు. అనేక సంస్థలు నివేదిక యొక్క ముఖచిత్రం తెల్లగా ఉండాలని ఇష్టపడతాయి.
    40. తర్వాత కవర్ పై ఉండాల్సిన అంశాలేమిటో తెలుసుకోవాలి.
    41. కొన్ని సంస్ధలలో ప్రతీ సంవత్సరం అనేక నివేదికలు వ్రాయబడతాయి. కాబట్టి ప్రతినివేదికకి ఒక సంఖ్యనిస్తారు.
    42. ఒకవేళ ప్రోఫార్మా ఉంటే దానిలో సంఖ్య వ్రాస్తారు.
    43. నివేదిక కవర్ పేజి పైన మొట్ట మొదట 'రిపోర్ట్ ఆన్ ' అని వ్రాయాలి.
    44. ప్రతి నివేదికకి ఒక శీర్షిక ఉంటుంది.
    45. శీర్షిక వ్రాయడంలో కొంత స్వేచ్చ ఉంటుంది. 
    46. శీర్షిక ఎలా వ్రాయాలో, ఖచ్చితంగా ఎలా ఉండాలో తెలియాలి. ప్రతి శీర్షికలో నివేదిక నుండి కొన్ని కీలక పదాలుండాలి. మరియు శీర్షికను రాజధానులలో కూడా వ్రాయవచ్చు.
    47. శీర్షకని పెద్ద అచ్చు అక్షరాలలో లేదా వ్యాకరణ విభాగాలు మినహా ఇతర అక్షరాలు పెద్దగా వ్రాయచ్చు.
    48. ఉదాహారణకి ' సేవ పరిశ్రమలలో నాణ్యతా నిర్వహణ ' అనే నివేదిక శీర్షిక ఉంది.
    49. కుడివైపున నివేదిక సంఖ్య ఉంటుంది.
    50. మీరు ఈ నివేదికను వ్రాయబోతున్నారని మీరు చూస్తారు.ఒక సమిష్టి ప్రయత్నంగా ఒక సమూహం కూడా నివేదికను వ్రాస్తుందని మీరు కనుగొంటారు.
    51. మీరు నివేదిక వ్రాస్తున్నపుడు కొంతమంది నివేదిక రచయిత ఎవరో తెలుసుకోవాలనుకుంటారు.
    52. కాబట్టి నివేదికలో రచయిత పేరు వ్రాయాలి.
    53. మీకు ఉద్యోగి సంఖ్య ఉంటే దాన్ని వ్రాయవచ్చు. మీరు విద్యార్ధి అయితే రోల్ నంబర్ వ్రాయాలి.
    54. తరువాత మీరు ఎవరి డిమాండ్ లేదా సూచనల ప్రకారం నివేదిక వ్రాస్తున్నారో, ఎవరికి నివేదిక సమర్పిస్తారో ఆ వివరాలన్నీ వ్రాయాలి.
    55. చివరగా మీరు ఏ సంస్ధ తరపున ఈ నివేదిక వ్రాస్తున్నారో ఆ వ్యక్తి పేరు వ్రాయాలి. 
    56. ప్రతి నివేదికలో మీరు ఈ స్థలం చివరలో ఉందని అర్థం, వాస్తవానికి మీరు నివేదిక వ్రాస్తున్న సంస్థ నుండి స్థలం.
    57. ఇన్స్టిట్యూట్ పేరు, నెల, సంవత్సరం వివరాలు వ్రాయాలి.
    58. ప్రతి నివేదిక ఒక ప్రత్యేక విషయంపై వ్రాయబడినందున ప్రాముఖ్యత పొందుతుంది.
    59. ఇతరులు ఎవరైనా ఒక సర్వే లేదా పరిశోధన చేస్తుంటే వారికి మీ నివేదిక ఉపయోగపడుతుంది. అందుకే నివేదిక పై సంఖ్య.
    60. నెల సంవత్సరాల వివరాలు వ్రాస్తారు.
    61. ఇది ఒక శాంపుల్ కవర్ .
    62. తరువాత నివేదిక మొదటి భాగం వస్తుంది.
    63. ఈ మొదటి భాగం అంటే ఏమిటి? కవర్ పేజీ తరువాత టైటిల్ పేజీ ఉంటుంది. శీర్షికపేజీ ఉంటుంది.
    64. మీరు ప్రశ్న అడగవచ్చు, కవర్ పేజీ, టైటిల్ పేజీలకి తేడా ఏమిటి? 
    65. కొన్నినివేదికలలో శీర్షిక కాకుండా ఉపశీర్షిక కూడా ఉంటుంది.
    66. ఉదాహరణకు నివేదికలో ఉపశీర్షిక ఉండవచ్చు.
    67. దాన్ని శీర్షిక కింద టైటిల్ పేజీలో వ్రాయాలి.
    68. ఆపై మీరు టైటిల్ పేజీని వ్రాసిన తర్వాత, ఇక్కడ మీరు సంస్థ పేరు, నెల తేదీ మరియు అన్నీ వ్రాస్తారు, కానీ టైటిల్ కాకుండా కొన్ని తేడాలు ఉన్నాయని గుర్తుంచుకోండి.
    69. ఉదాహరణకు, మీరు నివేదికను వ్రాసేటప్పుడు మీ నివేదికను కొన్ని సంస్థలు ఆమోదించినట్లయితే, మీ నివేదికను ఎవరైనా ఆమోదించాలి.
    70. మీ నివేదిక ఒకోసారి ఎవరి చేతనైనా ఆమోదించబడాలంటే, ఆ వ్యక్తి యొక్క పేరు, విద్యార్హతలు నివేదిక ఎడమ వైపున, నివేదిక క్రింది ప్రక్క వ్రాయాలి.
    71. కొన్ని సందర్భాలలో అధ్యయనం మూడు ప్రముఖ మార్గాల్లో ఉండవచ్చు.
    72. మొదటిది వివరణాత్మక  అధ్యయనం, రెండవది సహసంబంధ అధ్యయనం, మరియు మూడవది కారణాత్మక  అధ్యయనం.
    73. ఇవి మీకు శీర్షిక తయారు చేయడంలో, వ్రాయడంలో తోడ్పడుతాయి.
    74. ఉదాహరణకి 'సంస్ధలో ద్విచక్ర వాహనాల డిమాండ్ ' అనే శీర్షిక ఉంటే, అది వివరణాత్మక అధ్యయనం కావచ్చు. సహసంబంధ అధ్యయనం అయితే రెండు విషయాల్ని పోల్చుతారు. కారణాత్మక అధ్యయవం అయితే `మానవజాతిపై కాలుష్య ప్రభావం వంటి శీర్షిక ఉంటుంది.
    75. అయితే మీరు వ్రాసే నివేదిక సబ్జెక్ట్ పై, శీర్షిక ఆధారపడి ఉంటుంది.
    76. టైటిల్ పేజ్ ఒక సన్నని, పలుచని పేపర్ ఉంటుంది. ఇది వాస్తవానికి ఉపయోగించబడుతుంది, ఇది పాఠకులలో ఒక రకమైన ఉత్సుకతను కలిగిస్తుంది.
    77. ఇది లోపలి పేజీల్ని కాపాడుతుంది. కొన్ని నివేదికల్లో డ్రాయింగ్స్ ఉంటాయి.
    78. దీనిలో కొన్నొ చార్ట్స్ మరియు బౌండ్ రిపోర్ట్ ఉండవచ్చు.
    79. ప్రతి నివేదికని బైండింగ్ చేయలేము. 
    80. చిన్న నివేదికలను బైండ్ చేయము.
    81. సుదీర్ఘ నివేదికలను బైండింగ్ చేయాలి. నివేదిక మొదటి భాగం చాలాముఖ్యమైనది. 
    82. ఈ కాలంలో మొదటి భాగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
    83. అంటే అది మొత్తం నివేదికపై గవాక్ష ప్రదర్శన్న లాగా ఉంటుంది.
    84. సాంకేతిక నివేదికలకి ఇది అవసరం లేకపోయినా ఇన్నీ నివేదికలూ ఒకేలా ఉండవు.
    85. కొన్ని నివేదికలలో డ్రాయింగ్, ఫోటోలు ఉంటాయి. 
    86. కాబట్టి మొదటిభాగం చాలా ముఖ్యం.
    87. ఇక్కడ ఒక టైటిల్ పేజీ నమూనా ఉంది.
    88. మీరు గమనిస్తే శీర్షికలో ఉన్న మూడు పదాలలో మొదటి అక్షరాలు పెద్దవిగా ఉండాలి.
    89. ఉదాహరణకి ఆసుపత్రులలో నాణ్యతా నిర్వహణ కేస్ స్టడీ అని వ్రాస్తారు. 
    90. శీర్షికలో కేస్ స్టడీ అనేది ఉపశీర్షిక .
    91. ఎవరికోసమైతే నివేదిక వ్రాసారో వారి పేరు, నివేదిక తయారు చేసినవారి పేరు వ్రాయాలి.
    92. ఎడమ ప్రక్కన ఆమోదించిన వారి పేరు వ్రాయాలి.
    93. మీరు ఒక విభాగంలో పనిచేస్తునపుడు మీ ప్రధాన బాస్ లేదా కంట్రోలింగ్ ఆఫీసర్ నివేదికని ఆమోదించాలంటే మీ నివేదిక 'ప్రాపర్ ఛానెల్ ' ద్వారా వెళ్లాలి. 
    94. కాబట్టి కంట్రోలింగ్ ఆఫీసర్ పేరు ఆమోదించబడిన అధికారిగా వ్రాస్తారు.
    95. దాని తరువాత కాపీరైట్ నోటీసు వస్తుంది.
    96. మీరు వ్రాసిన నివేదిక మీ ఆస్తి అంటే మీ స్వయంకృషి వలన స్వంతగా తయారుజేయబడింది. 
    97. ఆ విషయాన్ని మీరు కాపీరైట్ నోటీసులో పేర్కొనవలసి ఉంటుంది.
    98. ఉదాహరణకి మీ పేరు అమిత్ జైన్ అనుకుందాం. 
    99. టైటిల్ పేజీ వెనక పక్క మీరు అమిత్ జైన్ , 2017 అని వ్రాస్తారు.
    100. అంటే నివేదిక 2017 లో వ్రాయబడిందని అర్ధం.
    101. తరువాత కొన్ని పదాలుంటాయి. ప్రస్తుత ప్రపంచంలో మీ ఆలోచనలు మీరు కనుగొన్న విషయాలు మీకు మాత్రమే సొంతం.
    102. మీ అనుమతి లేకుండా వాటిని ఉపయోగించే అధికారం, ఆస్కారం ఎవరికీ ఉండదు.
    103. కాబట్టి ఏం వ్రాస్తారంటే. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
    104. ఈ నివేదికలోని ఏ భాగాన్నీ కూడా రచయిత లేదా ప్రచురణ కర్త వ్రాతపూర్వక అనుమతి లేకుండా ఏ విధంగాను ఉపయోగించరాదు.
    105. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది తప్పక వ్రాయాలి.
    106. కాపీరైట్ నోటీస్ తరువాత వచ్చేది ఫార్వార్డింగ్ లేఖ.
    107. మీరు నివేదిక వ్రాసేటపుడు ఒక సంస్ధలో పని చేస్తున్నట్లయితే మీరు ప్రోపర్ ఛానల్ ద్వారా వెళ్లాలి.
    108. ఇతరులకు నివేదిక సమర్పించాలంటే దాన్ని ఫార్వర్డ్ చేయాలి.
    109. దాని కోసం ఫార్వార్డింగ్ లేఖ అవసరం. 
    110. కొన్ని సందర్భాల్లో దాన్నిప్రసరణ లేఖ అనికూడా అంటారు.
    111. మీ పై ఉన్నతాధికారి ఫార్వార్డింగ్ లేఖను వ్రాస్తారు.
    112. అతను ఈ లేఖను ఫార్వర్డ్ చేస్తే అది సరైన ఛానెల్ ద్వారా పంపినట్లు అర్ధం.
    113. అంతేకాకుండా అతడు దాన్ని ధృవీకరించినట్లు తెలుస్తుంది.
    114. ఆ లేఖ సమర్పణ మరియు ఆధరైజ్ చేసినట్లు లెక్క.
    115. మీకు TOR ఇచ్చినపుడే మీకు నివేదిక వ్రాయడానికి అధికారికత వచ్చిందని అర్ధం.
    116. అందుకే ఫార్వర్డింగ్ లేఖ అవసరం.
    117. ఆ లేఖ విషయాన్ని, ఉద్దేశాన్ని, పరిధిని, పరిమితులను సూచించడమే కాకుండా కృతజ్ఞతను కూడా తెలుపుతుంది.
    118. అయితే అన్ని నివేదికలలో ఈ లేఖ తప్పనిసరి కాదు.
    119. ఈ ఫార్వర్డింగ్ లేఖ, ఇతర వ్యాపార లేఖల ఫార్మాట్ లోనే ఉంటుంది. దీన్ని వ్రాసే కంటోలింగ్ ఆఫీసర్ ఆ నివేదిక ఎందుకు వ్రాయబడిందో దాని ప్రాముఖ్యత ఏమిటో తెలియ జేస్తారు.
    120. ఈ లేఖలో ఉదాహరణ గమనించినట్లయితే అది నీలేష్ మాధుర్ కి వ్రాయబడింది.
    121. ఆ లేఖ వ్రాసిన వ్యక్తి తనకు ఈ నివేదిక వ్రాయటంలో సహాయపడిన వారందరికి కృతజ్ఞతలు తెలుపుతాడు.
    122. తరువాత వచ్చేది ప్రిఫేస్. ఇది నివేదికలో మొదటి పేజీ. 
    123. అంతేకాకుండా నివేదిక రచయిత మొట్ట మొదటిగా స్వయంగా వ్రాసిన పేజీ.
    124. ఈ లేఖలో నివేదిక రచయిత నివేదిక విషయాన్ని, తను చేసిన పనిని వివరిస్తాడు.
    125. అంటే ఒక విధంగా నివేదికను పాఠకులకు పరిచయం చేస్తాడు.
    126. అయితే ప్రిఫేన్ పెద్దదిగా ఉండరాదు.
    127. కొన్నిసార్లు ప్రిఫేస్, ముందు మాట మధ్య తేడా ఏమిటో తెలియకపోవచ్చు. అది అర్ధం చేసుకోవడం మంచిది. ప్రిఫేస్ నివేదిక రచయిత మాత్రమే వ్రాస్తాడు. కాని ముందుమాటని ఆ సబ్జెక్ నిపుణులు ఎవరైనా వ్రాయవచ్చు.
    128. ఉదాహరణకి నేనొక పుస్తకం వ్రాస్తే, ప్రిఫేస్ నేనే వ్రాస్తాను. అయితే ఆ విషయ పరిజ్ఞానం కలిగిన నిపుణుడు ముందు మాట వ్రాసి ఆ రచనని పాఠకులకు సిఫారసు చేస్తాడు.
    129. అందువల్ల, ఎవరైనా ముందు మాట వ్రాసినప్పుడు, అది పాఠకుడికి ఒక రకమైన సిఫార్సు.
    130. ప్రిఫేస్ లో మీరు అధ్యయనం యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావిస్తారు.
    131. నివేదికలో ఉన్న విభాగాల గురించి చెప్పవచ్చు. ఒక విధంగా కృతజ్ఞతలు చెప్పవచ్చు.
    132. కాబట్టి కృతజ్ఞతల విభాగంలో మీకు సహాయం చేసిన వారందరి గురించి మీరు ప్రస్తావించవచ్చు.
    133. అందుకే ఉపోద్ఘాతంలో ప్రజలందరినీ అంగీకరించకపోవడం మంచిది.
    134. అందువల్ల, పరిచయం సాధ్యమైనంత తక్కువగా ఉండనివ్వండి.
    135. ఈ విభాగంలో, ఒక నివేదిక రచయితగా ఎంత మంది వ్యక్తులు మీకు ఏరకంగా సహాయసహకారాల్ని అందించాలో తెలుసు కాబట్టి వారందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపవచ్చు.
    136. తరువాతి అంశం కృతజ్ఞతల పేజీ. 
    137. ఇది ప్రిఫేస్ తర్వాత వస్తుంది. కృతజ్ఞతలు తెలిపేటపుడు వ్యక్తులని వివిధ వర్గాలుగా పంపిణీ చేయాలి.
    138. మీరు ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్న చాలా మంది వ్యక్తులను చూసారు కాబట్టి, మీకు బాగా తెలుసు.
    139. అలాగే, మీరు అంగీకరించాలనుకునే వారు చాలా మంది ఉన్నారు.
    140. 
    141. కృతజ్ఞతలు తెలిపేటపుడు వ్యక్తులని వివిధ వర్గాలుగా విభజించాలి.
    142. కొన్ని పుస్తకాలు, నివేదికలు చూసినట్లయితే రచయితలు వారి కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు చెప్తారు. అయితే మీరు ఒక సంస్ధలో పనిచేస్తూ వారి తరపున నివేదిక వ్రాస్తే ముందుగా వారి పేర్లను వ్రాసి కృతజ్ఞత చూపించాలి.
    143. కృతజ్ఞతలు కొంత భావోద్వేగ రీతిలో వ్రాస్తారు.
    144. కాబట్టి కేవలం 2-3 పేరాలు ఉండాలి. వ్రాసే భాష చాలా మర్యాదపూర్వకంగా ఉండాలి.
    145. ఉదాహరణకి మీరు మీ సంస్ధ డైరెక్టర్, శ్రీ వంటి వార్ల పేర్లు ముందుగా వ్రాయాలి. ఒకే రకమైన పదజాలం మళ్లీ పునరావృతం చేస్తే చదివే వారికి విసుగు కలిగిస్తుంది.
    146. కనుక సమయాన్నిమార్చాలి. 
    147. మొదటి పేరా మొదటి వాక్యంలో మీరు ఒక వ్యక్తి సహాయన్ని గుర్తించినట్లు, రెండవ వాక్యంలో కొకరి సహాయం పట్ల అత్యధిక సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వ్రాయాలి.
    148. నేను కృతజ్ఞుడను, నా వందనాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞత తెలుపకపోతే నా కర్తవ్యాన్నివిస్మరించినట్లే. 
    149. ఫలానా వ్యక్తిని నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలా ప్రతీ వాక్యంలో, ప్రతి పేరాలో వైవిధ్యం చూపించాలి.
    150. అయితే వైవిధ్యత కోసం ఉపమానాల భాష వాడితే అందరికీ అర్ధం కాదు.
    151. మీకు కావలిసిందల్లా సరళమైన భాష. మనం నివేదికలో ఎలాంటి భాషనుపయోగించాలో విడిగా చర్చిద్దాం.
    152. మీరు పడికట్టు పదాలు వాడకుండా శ్రద్ద వహించాలి. ఎందుకంటే పాఠకులు మీ అంత చదువుకున్నవారు కాకపోవచ్చు.
    153. కాబట్టి భాష సాధ్యమైనంత సరళంగా ఉండాలి.
    154. తరువాత వచ్చేది విషయ పట్టిక. 
    155. మిత్రులారా పూర్వపు ఉపన్యాసంలో ఔట్ లైన్ గురించి చెప్పినట్లుగా గుర్తు. 
    156. ఇప్పుడు విషయ పట్టిక గురించి మాట్లాడుతున్నాము.
    157. ఔట్ లైన్ సమాచారాన్ని అనేక భాగాలుగా విభజించినాము.
    158. విషయ పట్టికలో కూడా సమాచారాన్ని అనేక భాగాలుగా విభజించినాము.
    159. అయితే ఇక్కడ తేడా ఏమిటంటే ఔట్ లైన్ లో పేజీల సంఖ్య గురించి వ్రాయం. కాని విషయ పట్టికలో వివిధ విభాగాల పేజీ సంఖ్యలను వ్రాస్తాం.
    160. విషయపట్టిక తయారు చేసేటపుడు కొన్ని నిబంధనలు పాటించాలి. విషయపట్టికను పేజీ మధ్యలో వ్రాయాలి.
    161. అంటే పేజీ పైభాగాన మధ్యలో తరువాత కొంత స్పేస్ వదిలి క్రింద ప్రిఫేస్, కృతజ్ఞతలు, అబ్ స్ట్రాక్ట్, సారాంశం వంటి వ్రాయాలి. తరువాత నివేదిక ఇతర విభాగాలు, శీర్షికలు, చార్టురీ శీర్షికలు ఇవన్నీ వస్తాయి.
    162. ప్రిఫేస్, కృతజ్ఞతలు, సారాంశం ఇటాలిక్స్ లో సంఖ్యలు రోమన్ పద్ధతిలో ఉండాలి.
    163. పేజీల సంఖ్య ఉపోద్ధాతం నుండే మొదలౌతుంది.
    164. ఆపై, పరిచయం అసలు మార్కింగ్ ప్రారంభమవుతుంది.
    165. ఇక్కడ సంఖ్యలు వ్రాసేటపుడు ఉపవిభాగాలకు కూడా సంఖ్య ఇవ్వాలని అనుకుంటారు. కాని అవసరం లేదు.
    166. కాని కేవలం శీర్షికలకు సంఖ్య ఇస్తే చాలు. ఎందుకంటే సమాచారం అంతా బుక్ లేదా నివేదికలోనే ఉంటుంది. చివరగా అపెండిక్స్, బిబ్లియోగ్రఫీలు కూడా విషయపట్టికలో ఉంటాయి.
    167. నివేదికలో కొన్ని దృష్టాంతాల జాబితాలు కూడా ఉంటాయి.
    168. అయితే ఈ దృష్టాంతాల జాబితాలంటే ఏమిటో చూద్దాం.
    169. మనం సాంకేతిక నివేదిక వ్రాసేటపుడు కేవలం లిఖిత, సమాచారాన్ని మాత్రమే ఇవ్వరు. వైఖరులు, గ్రాఫ్ లు, పట్టికలు ఇవన్నీ ఉపయోగిస్తాము.
    170. కొన్ని సందర్భాల్లో మీరు వాటిని విషయాల పట్టికలో ప్రస్తావించడాన్ని నివారించవచ్చు, అయితే వీటిని కూడా విషయ పట్టికలో ప్రస్తావించాలి.
    171. తరువాత వచ్చేవి అబ్ స్ట్రాక్ట్ మరియు సారాంశం.
    172. మనం ఇపుడు దృష్టాంతాల గురించి మాట్లాడే ముందు ఈ ఉపమానాల జాబితా ఏమిటి? సాంకేతిక నివేదికలో కేవలం శాబ్దిక సమాచారమే ఉండదు. 
    173. ముందు చెప్పినట్లుగా పాఠకులందరికీ నివేదిక మొత్తం చదివే సమయం ఉండకపోవచ్చు.
    174. కాబట్టి విషయాన్ని వైఖరులు, గ్రాఫ్ లు లేదా పట్టికల ద్వారా త్వరగా తెలుసుకోవాలనుకుంటారు.
    175. కాబట్టి ఈ దృష్టాంతాల పట్టికను ఇవ్వడం ద్వారా మీరు వారికి వెసులుబాటు కల్పిస్తున్నారు ఆ పట్టికలో దృష్టాంతాల సంఖ్యను కూడా వ్రాస్తారు.
    176. పేజీ సంఖ్యను కూడా వ్రాస్తారు.
    177. ఇపుడు వచ్చేది అబ్ స్ట్రాక్ట్, లేదా సమ్మరీ.
    178. ఈ రెండిటి మధ్యా తేడా ఏంటి? వాటి ప్రాముఖ్యత ఏంటి? ఉదాహరణకి మీరు ఒక కాన్పరెన్స్ కి వెళ్లి అక్కడ మీరు వ్రాసిన పేపర్ చదువుతారు.
    179. అబ్ స్ర్టాక్ట్ అక్కడ ఏం ఆశిస్తారు? మొదటగా అబ్ స్ర్టాక్ట్ పంపించమంటారు.
    180. అబ్ స్ర్టాక్ట్ మీ మొత్తం పేపర్ లేదా ప్రజంటేషన్ యొక్క సంక్షిప్త రూపం.
    181. అది ఎంత చక్కగా వ్రాయాలంటే అది చదివితే అందరికీ మీ నివేదిక గురించి అంతా అర్ధమవాలి.
    182. కాబట్టి అది చాలా సంక్షిప్తంగా క్లుప్తంగా ఉంచి మీ నివేదికను అందిస్తారు.
    183. ఇప్పుడు మీ నివేదిక యొక్క ముఖ్యోద్దేశాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది.
    184. ఎపుడైతే మీరు సారాంశం గురించి ప్రస్తావిస్తారో అది అబ్ స్ర్టాక్ట్ కంటే కొంత ఎక్కువగా ఉంటుంది. 
    185. అబ్ స్ర్టాక్ట్ చిన్నగా ఉండి కొన్ని ముఖ్యపదాల్ని ఉద్ఘాటిస్తారు. మీ నివేదిక ఉద్దేశాన్ని, మీ పని గురించి ఇవి తెలుపుతాయి.
    186. అయితే సారాంశం పెద్దదిగా ఉండి అందులో మొత్తం నివేదిక గురించి ప్రస్తావన ఉంటుంది. ఒకోసారి ఎక్సెక్యూటివ్ సారాంశం కూడా వ్రాస్తారు. దానిలో నివేదిక మొత్తం వివరాలు చాలా క్లుప్తంగా ఉంటాయి.
    187. నివేదిక మొత్తం వివరాలు చాలా క్లుప్తంగా   ఉన్నప్పటికి ఈ సారాంశం 1.5 - 2 పేజీలుండవచ్చు. అయితే గుర్తుంచుకోండి అబ్ స్ర్టాక్ట్ మరియు నివేదికలో వాడే భాషలో తటస్ధత అనుసరించాలి.
    188. ఏ వ్యాపార సంబంధిత కమ్యూనికేషన్ లో అయినా ఒక విధమైన నిర్లిప్తతను పాటించి కేవలం శాస్త్రీయ వివరణనే వ్రాయాలి.
    189. ఉపమానాలతో నిండిన పడికట్టు పదాలు వాడకూడదు.
    190. మీరు నివేదిక వ్రాసేటపుడు గుర్తుంచుకోవాలి. 
    191. నివేదిక వ్రాసేటపుడు నిర్మాణత, సారాంశం గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే పాఠకులను మీ అబ్ స్ర్టాక్ట్ చదవడం ద్వారా కొంత జ్ఞానంపొంది, నివేదిక చదవడానికి తయారుగా ఉంటారు.
    192. తరువాతి అంశం ఎక్సెక్యూటివ్ సారాంశం.
    193. ఇక్కడ మనం దీని గురించి కొంత తెలుసుకుందాం, 
    194. ఎక్సెక్యూటివ్ సారాంశం నివేదిక యొక్క క్లుప్త రూపం.
    195. ముందుగా మీరు కొంత నివేదిక నేపధ్యాన్ని, నివేదిక ఉద్దేశాన్ని వ్రాస్తారు. కానీ ఇక్కడ మీరు దాని గురించి తెలుసుకోండి మీరు ఈ నివేదికను ఎందుకు వ్రాస్తున్నారు, ఎందుకు ఈ కాగితం వ్రాస్తున్నారు అనే దాని గురించి మీరు మాట్లాడబోతున్నారు.
    196. కాబట్టి టాపిక్ వాక్యాల్ని గుర్తించి వాటిని వివిధ పేరాలలో ఉంచాలి.
    197. టాపిక్ వాక్యానికి ఇతర వాక్యాలకి పొందిక ఉండేలా చూడాలి.
    198. మీ నివేదిక లక్ష్యాలు, ఫలితాలు కనుగొన్న విషయాల గురించి అబ్ స్ర్టాక్ట్ లో వ్రాయండి. పరిశోధన పద్ధతిని కూడా ప్రస్తావించాలి.
    199. నివేదిక ఎలా ముందుకు సాగుతుందో, సిఫార్సులు ఏమిటో కూడా వ్రాయాలి.
    200. అపుడే ఎవరైనా అబ్ స్ర్టాక్ట్ చదివాక వారి విషయాలు తెలిసి నివేదికను చదవాలనే శ్రద్ద, కోరిక కలిగి ఉంటారు.
    201. మిత్రులారా మనం నివేదిక మొదటి భాగం గురించి మాట్లాడినపుడు కవర్ పేజీ, టైటిల్ పేజీ, కాపీరైట్ నోటీస్, కృతజ్ఞతలు, అబ్ స్ర్టాక్ట్, సారాంశం, దృష్టాంతాలు ఇవన్నీ చాలా సాధారణ విభాగాలు. ఇవి ప్రధాన విభాగాన్ని రూపొందించడానికి తోడ్పడుతాయి.
    202. కాబట్టి వాటిని ప్ రి- మెటిరియల్ భాగాలు అంటారు.
    203. మనం వీటి గురించి చక్కగా చర్చించాం.
    204. ఇపుడు మిగిలిన నివేదిక భాగాల గురించి తరువాతి ఉపన్యాసాలలో తెలుసుకుందాం.
    205. అపుటి దాకా నేర్చుకున్న విషయాల్ని నెమరు వేసుకోండి.
    206. ధన్యవాదాలు!