58. softskill_Communication Breakdown Part II-bv-C68SgTD0.txt 35.7 KB
Newer Older
Vandan Mujadia's avatar
Vandan Mujadia committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102
    1. కమ్యూనికేషన్‌లో విచ్ఛిన్నత రెండవ ఉపన్యాసానికి స్వాగతం.
    2. చివరి ఉపన్యాసంలో మేము వివిధ రకాలైన కమ్యూనికేషన్ల గురించి మాట్లాడాము మరియు మూలం వద్ద కమ్యూనికేషన్ ఎలా అంతరాయం కలిగిస్తుందో కూడా చూశాము, అంటే పంపినవారి స్థాయి నుండి ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్‌లో అంతరాయాలను పిలుస్తాము.
    3. తరువాత మేము ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్‌లో అంతరాయాలు అని పిలిచే వారి మధ్య కమ్యూనికేషన్ అడ్డంకుల గురించి కూడా మాట్లాడాము.
    4. మనం ప్రోఫెషనల్స్‌గా సంస్ధలలో పని చేసేటపుడు ఒక ఉద్దేశంతో కమ్యూనికేట్‌ చేస్తాం.
    5. కాబట్టి అందులో అత్యంత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.
    6. సంస్ధాగత కమ్యూనికేషన్‌లో ఉండే అవరోధాలు ఏమిటి? అవి ఎందుకు ఏర్పడుతాయి? 
    7. మనం తెలుసుకున్నట్లుగా ప్రతి సంస్ధలో ఒక కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ ఉంటుంది, దానికి కొని లక్షణాలు ఉంటాయి. ఒక సంస్ధలో పనిచేసే ఉద్యోగి కాలగమనంలో అభివృద్ది చెంది వివిధ బాధ్యతలు చేపట్టవచ్చు.
    8. ఆ లక్షణాల వలన అవరోధాలు ఏర్పడుతాయి.
    9. అంతే కాక బాస్‌ యొక్క అవగాహన వలన అవరోధం కలగవచ్చు. సంస్ధగత కమ్యూనికేషన్‌ వివిధ స్ధాయి ఉద్యోగుల మధ్య జరిగినపుడు ఏ ఇద్దరు వ్యక్తుల అవగాహన ఒకేలాగ ఉండదు. కానీ మీరు రెండు వేర్వేరు స్థాయిల వ్యక్తులతో కమ్యూనికేట్ చేస్తారు.
    10. మీరు ఎప్పుడైతే ఒక సీనియర్‌ వ్యక్తితో కమ్యూనికేట్‌ చేస్తారో ,మీకు తెలుసు మీ కార్యలాపాల్ని అతను మార్గనిర్దేశం చేస్తూ, వీక్షిస్తూ, గమనిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి మీ విభాగం అధికారి లేదా నాయకుడు కావచ్చు. మీరు అతని అవగాహన గురించి ఏర్పడిన భయం వలన సరిగా కమ్యూనికేట్‌ చెయ్యరు. కొన్ని సంస్ధలలో అందరూ అందరితో కమ్యూనికేట్‌ చేసే వీలుండదు. నిజమైన కమ్యూనికేషన్ లేని సంస్థలలో ఫారమ్‌లు కమ్యూనికేట్ చేయలేవు, అందువలన సమస్యలు తలెత్తుతాయి.
    11. క్రింది స్ధాయి ఉద్యోగులకు ఎన్నో విషయాలు తెలిసినప్పటికీ పై అధికారి స్ధాయి శక్తి వలన భయంతో చెప్పలేరు.
    12. కొన్ని సంస్ధలలో నెగటివ్‌ వైఖరి ఉంటుంది. సంస్ధలో పనిచేసే ఉద్యోగుల నేపధ్యాలు, సంస్కృతి, విశ్వాసము విభిన్నంగా ఉండి వారు వివిధ రాష్ట్రాలకు చెందినవారై ఉంటారు.
    13. వారంతా వివిధ బృందాలుగా, సమూహాలుగా ఏర్పడితే ఏం జరుగుతుంది? ఒక్కొసారి ఒక నిర్ణయం సమూహంలోని ఒక వ్యక్తిపై ప్రభావం చూపిస్తుంది.
    14. అప్పుడు ఒక నెగటివ్‌ వైఖరి ఏర్పడుతుంది. మీ విషయంలో విషయాలు సరిగ్గా జరగకపోతే మీరు ప్రతికూల వైఖరిని పెంచుకుంటారు.
    15. కొన్నిసార్లు మానేజర్‌ మీ పైన ఒక రకమైన నెగటివ్‌ అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాడు. అది నిజం కాకపోయినా దాని వలన సంస్ధలో స్పష్టతని దూరం చేసి దాపరికం కలిగిన వాతావరణాన్ని సృష్టిస్ధాయి.
    16. అప్పుడు మనం ప్రభావవంతంగా కమ్యూనికేట్‌ చేయలేక అపోహలు కలుగుతాయి. తరువాతి అంశం మీడియా మరియు సమాచార ఓవర్లోడ్‌ గురించి మన అపార్ధాలు.
    17. ఈ సంస్ధాగత విచ్ఛిన్నతల గురించి ఎలా తెలుసుకోవాలి? ఏం చేయాలి? ఒక సంస్ధలో ఉన్నతాధికారి తన క్రింది స్ధాయి ఉద్యోగులతో కమ్యూనికేట్‌ చేసినపుడు, అతని హోదా చాలా ముఖ్యపాత్ర వహిస్తుంది, ఎందుకంటే క్రిందిస్ధాయి వారికి పై స్ధాయి వారితో మాట్లాడే అవకాశం ఎక్కువగా రాదు.
    18. మీకు చక్కని, వినూత్న ఆలోచనలున్నా వాటికి వెంటనే సూటిగా మీ బాస్‌కి లేదా ఉన్నతాధికారికి చెప్పలేరు ఎందుకంటే సంస్ధలో ఉన్న ఆంక్షల వలన కేవలం 'ప్రాపర్‌ ఛానెల్‌' ద్వారానే వెళ్లవలసి ఉంటుంది.
    19. అంటే కొన్ని నియమాలు పాటించి ఉన్నతాధికారితో సూటిగా మాట్లాడలేరు, 
    20. పెద్ద సంస్ధలలో ముందుగా విభాగపు అధికారిని గాని కంట్రోలింగ్‌ ఆఫీసర్‌ని గాని కలవాల్సి ఉంటుంది.
    21. కొన్ని సంస్ధలలో చాలా అధికారపు వరుసలుంటాయి. చాలా విభాగాలు, యూనిట్లు, సబ్‌ యూనిట్ల అధికారులతో మాట్లాడవలసి ఉంటుంది. 
    22. వారితో మీ మనోవేదన తెలియ జేస్తే అది పై అధికారుల వరకు చేరుతుంది.
    23. కొన్నిసార్లు గమనిస్తే సీనియర్‌, జూనియర్‌ స్ధాయి ఉద్యోగుల మధ్య చాలా తేడాలుంటాయి.
    24. ఈ కారణాల వలన సంస్ధలలో 'గ్రేవ్‌వైన్‌' అనేది తయారౌతుంది. అయితే అది ఎప్పుడూ ప్రతికూలం కాదు.
    25. గ్రేప్‌వైన్‌ కొన్నిసార్లు వ్యక్తుల మనసులో దాచి ఉంచిన, అణచివేసిన కోరికలను విడుదల చేసేశక్తిగా పని చేస్తుంది. ఉద్యోగులు తమ స్నేహితులతో, సహోద్యోగులతో అనేక విషయాలు గుసగుసలాడుతుంటారు.
    26. ఇది అంతా వివిధ విభాగాల మధ్య అపనమ్మకం వలన కలుగుతుంది. మీరు పెద్ద విస్తరణ యూనిట్లను కూడా కనుగొంటారు, నమ్మకం విషయానికి వస్తే ఏదో లోపం ఉందని మీరు కూడా కనుగొంటారు.
    27. కొన్నిసార్లు ఒకే స్ధాయిలో ఉన్న ఉద్యోగులు తమ అసంపూర్ణ కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు బయటపడతాయనే భయంతో తమ సహోద్యోగులతో కమ్యూనికేట్‌ చేయడం తగిస్తారు.
    28. కొని ఒక సంస్ధలో పనిచేసే ఉద్యోగులందరి మధ్య సహకారం సమన్వయం ఉంటేనే, క్రిందిస్ధాయి ఉద్యోగులను నమ్ముతేనే ఉత్పత్తి సాధించగలరు.
    29. చాలా పెద్ద సంస్ధలలో ఉద్యోగులు బృందాలు, ఉప బృందాలు తమ ప్రాధాన్యతలను బట్టి ఏర్పరచుకుంటారు.
    30. ప్రాధాన్యత మతం, విశ్వాసం, ఇష్టాయిష్టాల వలన కలుగుతుంది.
    31. ఈ ఉపబృందాలు కొన్నిసార్లు సంస్ధాగత మాధ్యమానికి అవరోధాలవుతాయి.
    32. కొన్ని సంస్థలలో చాలా బదిలీ స్టేషన్‌లుంటాయి. అవి ఏమిటి? ప్రతి సంస్థలో సమాచార ప్రసరణ జరగడానికి లేదా కమ్యూనికేషన్‌ కోసం ఒక సోపానక్రమం ఉంటుంది.
    33. సందేశం అనేక స్థాయి వ్యక్తుల నడుమ ఒకో వరుస దాటుతుంది. ఆ వ్యక్తులందరూ తమ ఇచ్ఛానుసారంగా సందేశాన్ని పలుమార్లు మార్చి వ్రాయటం వలన అది విచ్ఛిన్నమౌతుంది.
    34. కాబట్టి మనం పంపిన సందేశం ఇతరులు రిసీవ్‌ చేసుకున్న సందేశం ఒకటే కాక పోవచ్చు.
    35. ఒక ఉద్యోగి యొక్క ఈ సందర్భంగా నేను మీకు చాలా చిన్న ఉదాహరణ ఇస్తాను, ఎందుకంటే అతను కొంత వ్యక్తిగత సెలవులకు వెళుతున్నాడు లేదా అతను కొంత వ్యక్తిగత అవసరానికి వెళ్తున్నాడు.
    36. ఒకసారి ఒక ఉద్యోగి సెలవు తీసుకోవాలను కుంటాడు. తన సహోద్యోగులతో తన స్నేహితుడు ఈఊరి మీదుగా వెళ్తున్నాడు. అతన్ని కలిసి రావాలి. బాస్‌ వస్తే నేను మధ్యాహ్నాం ఆలస్యంగా వస్తానని రాకపోతే సెలవని చెప్పిమని చెప్పి వెళతాడు.
    37. ఇప్పుడు ఈ సహోద్యోగి బాస్ లేదా అతని చీఫ్‌ను కలిసినప్పుడు, మిస్టర్ ఎక్స్ తన స్నేహితుడు ప్రయాణిస్తున్నాడని నాకు చెప్పాడు, అందువల్ల అతను నిజంగా తనను కలవాలని మరియు అతను వెళ్ళే ముందు చర్చించాలని మరియు చివరికి , మరియు అతను తిరిగి రాకపోతే అతను సెలవులో ఉన్నాడని అర్థం చేసుకోవాలి అని కూడా చెప్పాడు.. 
    38. చివరగా, అతను యజమాని వద్దకు వెళ్ళినప్పుడు, యజమాని తన కార్యదర్శికి ఎవరైనా కాల్ చేస్తే లేదా మిస్టర్ X తో ఎవరైనా మాట్లాడాలనుకుంటే, అతను ఇక లేడని చెప్పండి.
    39. ఈ మొత్తం సంఘటన మనం గమనిస్తే మాటల కూర్పు వలన గందరగోళం ఏర్పడింది. అంతేకాక సందేశం ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి వెళ్లే క్రమంలో వక్రీకరించ బడింది.
    40. మిస్టర్‌ 'X' తన స్నేహితుడు ఇటుగా వెళ్తున్నాడని చెప్పడానికి 'Passing away' అని చెప్తాడు. ఆ పదానికి అర్ధం చనిపోవడం అని.
    41. 'Passing by' అని ఉపయోగించాల్సింది. అలాగే తిరిగిరాకపోతే అనే భావాన్ని కూడా ప్రతికూలంగా అర్ధం చేసుకున్నారు. అది సెలవుని మాత్రమే సూచిస్తుంది.
    42. ఈ సంఘటన మన సందేశం రిసీవర్‌ కి చేరేలోగా ఎంత మారిపోతుందో చెపుతుంది.
    43. కొన్ని సార్లు మనం సందేశం పంపడానికి తప్పు మాధ్యమాన్ని ఎంచుకుంటాము. 
    44. ఈ కాలంలో మనకు అందుబాటులో ఉన్న వందలాది మాధ్యమాలను మనం ఉపయోగించాలను కుంటాము.
    45. దీనినే 'మీడియా సమృద్ది' అంటారు.
    46. మనం మీడియా లేదా మాధ్యమాన్ని ఎంచుకునేటపుడు, రిసీవర్‌ యొక్క నేపధ్యం, వయసు, జేండర్‌ వంటి విషయాల్ని గ్రహించాలన్ని గుర్తు పెట్టు కోవాలి. వారి పట్ల సానుభూతి కలిగిఉండాలి.
    47. మీరు ఫోన్‌ లేదా ఇ-మెయిల్‌ ద్వారా సందేశం పంపదలిస్తే అవతలి వారికి ఈ సదుపాయాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
    48. చాలా సందర్భాలలో ఉన్నత స్ధాయి వ్యక్తులు అనుభవించే సౌకర్యాలు తక్కువ స్ధాయి వ్యక్తుల వద్ద లేకపోవచ్చు.
    49. కాబట్టి సాంకేతిక పరమైన లేదా లక్ష్యపూరిత సందేశాలను రూపొందించేటపుడు ఆ విషయాలు ఇతరులకు అసలు అర్ధం అవుతాయో లేదా, వారికి ఆజ్ఞానం ఉందో లేదో తెలుసుకోవాలి.
    50. మీరు సాంకేతిక విషయం గురించి మాట్లాడుతే, మీరు నిపుణులు కాబట్టి మీకున్న పరిజ్ఞానం ఇతరులకి లేక పోవచ్చు.
    51. వారు దానిని మంచి ఉద్దేశ్యంతో భావించరు. వాళ్లకి సందేశం చదివి అర్ధం చేసుకోవటం ఒక సవాలుగా మారుతుంది. అలాగే సంస్ధలలో ప్రతి సంస్ధ కూడా అన్ని మూలలా తమ శాఖలుండటం వలన, బౌతిక సమస్యల వలన, అంటే వారి కార్యాలయం మార్కెట్‌ ప్రదేశంలో ఉండటం లేదా నిశ్శబ్దాన్కి అవకాశం లేకపోవటంవలన, సందేశం అర్ధం చేసుకోలేరు. వసతులు సరిగ్గా వాడుకోలేరు. కొన్ని సార్లు ధ్వని వ్యవస్ధ వలన కూడా సమస్యలు వస్తాయి.
    52. నేను ఇచ్చే ఉపన్యాసం మీరంతా చాలా శ్రద్ధగా విని అర్ధం చేసుకుంటారని అనుకోడానికి కారణం ధ్వని వ్యవస్ధ లేదా యంత్ర పరికరాలు సరిగ్గా పనిచేయటం వలన కాదు.
    53. అయితే, ఒక రకమైన కప్పబడిన శబ్దం రూపంలో ధ్వని రాగలిగినప్పుడు వాయిస్ స్పష్టంగా రాని సందర్భాలు ఉన్నాయి మరియు మీరు బయట అంతరాయాలను ఆశించవచ్చు.
    54. కొన్నిసార్లు స్వరంలో స్పష్టత లేక పోయినా, అసహజ శబ్దం వచ్చినా, బయటి శబ్దాలు వినిపించినా మన కమ్యూనికేషన్‌ ప్రక్రియ చక్కగా సాగకుండా అంతరాయం ఏర్పడుతుంది.
    55. అంతేకాకుండా కొన్నిసార్లు వెలుతురు సరిగ్గా లేకపోయినా అంటే పవర్‌కట్‌ వలన చీకటి ఏర్పడితే అపుడు ముఖ్యమైన విషయాలు మాట్లాడటానికి అసౌకర్యంగా ఉంటుంది.
    56. అప్పుడు నైతికతకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఇక ప్రవర్తనా నియమావళి ప్రకారం సంస్ధలలో మనం మాట్లాడే ప్రతి విషయం అందరికీ చేరుతుంది. ఈ గ్లోబల్‌ ప్రపంచంలో అన్ని విషయాలూ 'వైరల్‌' అవుతాయి ఎందుకంటే మనం చెప్పిన మాటలను మార్చి చెప్పటం వలన సమస్యలు ఎదురౌతాయి.
    57. కాబట్టి మీరు కమ్యూనికేట్‌ చేసేటపుడు సందేశం మారిపోకుండా ఉండేలా చూసుకోవాలి.
    58. అయితే మనం ఎవర్ని అడిగినా ఎవరూ ఏ సందర్భంలోనూ తాము చేసిన తప్పు ఒప్పుకోరు. 
    59. ముఖ్యంగా నాయకులు చెప్పేది ఒకటి, వార్రాపత్రికలలో వచ్చేది వేరొకటి వారిని అడినపుడు నెనెప్పుడూ అలా మాట్లాడలేదని, మార్చి వ్రాసారని అంటారు.
    60. కాబట్టి సంస్ధాగత కమ్యూనికేషన్‌ లో నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి సందేశాన్ని మార్చరాదు. మనం మాట్లాడిన విషయాలను భవిష్యత్తు వాణిలాగా వినిపించ కూడదు. ఎందుకంటే కొంతమంది ఇలాంటి విషయాలను చాలా ఎక్కువగా ప్రచారం చేసి మీకు చెడు పేరు తెచ్చేలా చేస్తారు.
    61. ఇలాంటి కమ్యూనికేషన్‌ని నివారించాలి. కాబట్టి కమ్యూనికేషన్‌ లో మనం ఏం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి.  మరియు ఇది తరచూ ఒక రకమైన తప్పుడు వ్యాఖ్యానానికి మరియు ఒక రకమైన దుర్వినియోగానికి దారితీస్తుంది.
    62. మనుషుల మధ్య చెప్పని విషయాల గురించి కూడా, గందరగోళం, అపార్ధాలు ఏర్పడతాయి.
    63. కనుక మీరు అపార్ధాలు కలిగే సందర్భాలు రాకుండా చూసుకోవాలి. మీకు మీ సంస్ధకు కూడా ఉపకరించే సమర్ధవంతమైన సందేశాలను తయారుచేయాలి. 
    64. ఎందుకంటే ఒక సంస్ధలో పనిచేసేటపుడు మీ కమ్యూనికేషన్‌ వలన లాభం కలగాలి.
    65. కాని మనం నివసించే ఈ కాలంలో ఒక బటన్‌ ఒత్తడం వలన లేదా ఒక నిమిషంలోనే వేగంగా సమాచారాన్ని పొందవచ్చు.
    66. మనం పక్షపాత వైఖరి లేకుండా చక్కగా కమ్యూనికేట్‌ చేయాలి ఎందుకంటే సంస్ధ భవిష్యత్తు వారు ప్రకటించే సమాచారం పైనే ఆధారపడి ఉంది.
    67. మనం కొన్ని పద్ధతుల ద్వారా ఈ అవాంతరాలను ఎదుర్కోవచ్చు.
    68. అందులో ఒక పద్ధతి నిస్పక్షపాతంగా వ్యవహరించటం. మీరు కమ్యూనికేషన్‌ లో ఎప్పుడూ కూడా పక్షపాత వైఖరి సూచించే పదాలు వాడరాదు.
    69. మీరు చేసే వ్యాఖ్యలు సంస్ధ లేదా మీ యొక్క ప్రతిష్ట తగ్గించేసేవిగా ఉండకూడదు. 
    70. మీరు ఒక సంస్ధలో ఉన్నప్పుడు బయటి ప్రపంచానికి సంస్ధలో మీ స్ధానం గురించి ఒక రకమైన సందేశాన్ని ఇస్తున్నారు.
    71. మీరు మాట్లాడేటపుడు ఉపయోగించే పదాలను చక్కగా ఎంచుకొని, ఇతర ఏ అర్ధమూ సూచించని విధంగా నియంత్రణతో ఉపయోగించాలి.
    72. మీరు కమ్యూనికేట్‌ చేసేటపుడు ఇతరుల స్ధానంలో ఉండి ఆలోచించాలి. అదే సందేశానికి మనం ఎలా స్పందిస్తామో ఊహించుకోవాలి. 
    73. అందుకై మనకు కరుణాపూరిత వైఖరి ఉండాలి. చెప్పిన దాని కంటే ఎక్కువ ఊహించుకోకూడదు.
    74. దానివలన అనేక సమస్యలు ప్రమాదాలు జరుగుతాయి.
    75. సంస్ధలో కమ్యూనికేషన్‌ విచ్ధిన్నత లేదా అవరోధం లేకుండా ఉండాలంటే అందరికి మంచి నైపుణ్యం ఉండాలి.
    76. సమర్థవంతమైన శ్రవణ అంటే ఏమిటి మరియు సరైన శ్రవణ అంటే ఏమిటి అని మేము ఇప్పటికే మా ఉపన్యాసాలలో చర్చించాము. ఈ విషయం మనం పూర్వపు ఉపన్యాసంలో తెలుసుకున్నాం.
    77. కాబట్టి ఒక ఉద్దేశ్యం ప్రకారం కమ్యూనికేట్‌ చేసినపుడు కోరుకున్న ఫలితం రావాలంటే పడికట్టు పదాలు వాడకూడదు.
    78. మీరు మనం దేశం వారితోనే కాక ఇతర దేశాలు సంస్కృతుల వారితో కమ్యూనికేట్‌ చేసినపుడు మన సాంస్కృతిక ప్రభావం వలన వ్యవహారం చెడి పోకూడదు.
    79. మీరు వ్రాతపూర్వక సంభాషణను ఉపయోగిస్తుంటే, మీరు వ్రాస్తున్నది సరైనదిగా పరిగణించబడాలని చూడండి మరియు దీని కోసం మేము మా ఉపన్యాసంలో రాయడం గురించి చర్చించినప్పుడు చర్చిస్తాము, మన లిఖిత కమ్యూనికేషన్‌లో కూడా విషయాలు అర్ధమయేలా సంక్షిప్త వాక్యాలు, పారాగ్రాఫ్‌లను   ఉపయోగించవచ్చు, తద్వారా ప్రజలు సందేశాన్ని బాగా పొందుతారు. 
    80. మనం పంపించే సందేశం అవతలి వారికి సరిగ్గా అర్ధమవాలి. అదే విదంగా మౌఖిక కమ్యూనికేషన్‌ లో మన సంభాషణ ద్వారా నెగోసియేషన్‌ జరిగి ఫలితం లభించాలి. అందుకు మనం అశాబ్దిక సంకేతాలను పరిగణనలోకి తీసుకోవాలి.
    81. కొన్ని సార్లు మనం కమ్యూనికేషన్‌లో పదాలను వాడకపోతే మన అశాబ్దిక ప్రవర్తనను ఇతరులు వేరేవిధంగా అర్ధం చేసుకుంటారు.
    82. కాబట్టి మీరు శ్రోతల ఆలోచన కోణంలో సందేశాన్ని తయారుచేయాలి.
    83. ఇతరుల స్ధానంలో ఉండి ఆలోచించాలి.
    84. కమ్యూనికేషన్‌ వాతావరణం అనుకూలంగా ఉండాలి. చాలా సంస్ధలలో కమ్యూనికేషన్‌ వాతావరణం నియంత్రణగా ఉంటుంది. ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ వ్యాపారం చాలా అభివృద్ది చెందుకుంది.
    85. అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని పంపేటపుడు నేరుగా బాస్‌కే ఇవ్వాలి. మధ్యలో ఉన్న స్ధాయి క్రమాన్ని పాటించే అవసరం లేదు. మీరు పంపిన సందేశం చక్కగా అర్ధమయిందో లేదో తెలుసుకొవటానికి వెంటనే ఫీడ్‌బాక్‌ తీసుకోవాలి.
    86. ఈ విధంగా నిరంతర ఫీడ్‌ బాక్‌ వలన మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవచ్చు మరియు విజయం సాధించవచ్చు.
    87. మంచి ప్రవర్తన పాటించి, పక్షపాత వైఖరి లేకుండా, వాఖ్యలు చేయకుండా ప్రభావవంతమైన, సమర్ధవంతమైన సందేశాలను పంపించే ప్రయత్నం చేయండి.
    88. సరైన మాధ్యమాన్ని ఎంచుకోండి, మీ ప్రేక్షకుల యొక్క నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సందేశాన్ని తయారుచేయండి.
    89. మీరు కొత్తగా వచ్చిన మానేజర్లు లేదా వ్యవస్ధాపకులతో మాట్లాడేటపుడు అత్యంత శ్రద్దతో పదాలను ఎంచుకోండి.
    90. సీనియర్‌లలో జరిగే చర్చలలో ఎంపిక చేసిన పడికట్టు పదాలను వాడినా జూనియర్లకి అది పనిచేయదు.
    91. కమ్యూనికేట్‌ చేసేటపుడు మనం చెప్పిన విషయాలు ప్రపంచమంతా అదే విధంగా ఉంటాయని ఊహించకూడదు. నాకు ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. ఒక స్త్రీ ఒక కూడలి వద్ద నిలబడి ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలు, ఒక చిన్నపాపతో ఉన్న వ్యక్తిని చూసింది. 
    92. ముద్దుగా ఉన్న చిన్నపాపను చూడాలనుకుంది. ఆమె బస్సు కొరకు ఎదురుచూస్తున్నప్పటికీ ఆ వ్యక్తి ఆవిడ చూపులు గమనించి నాకోసం ఎదురు చూస్తున్నారా? అని అడిగాడు. ఇది ఒక అసత్య ఊహజనిత విషయం. ఆవిడ వెంటనే మీ పాపను చూస్తే ఇంటిదగ్గర ఉన్న నా చిన్నిపాప గుర్తుకువచ్చింది. అందుకే చూశానని జవాబిచ్చింది.
    93. ఇలా జరగడానికి కారణం మనం ఇతరుల ఊహలను, అవగాహనను అర్ధం చేసుకోలేక పోవడం.
    94. మీకు సలహా ఇచ్చేటపుడు నాకొక ప్రఖ్యాత అమెరికన్‌ కవి చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. నేను ఆనందించిన, పాట పాడిన, ఊహించినవి మీరు కూడా చేయండి. మీలో నాలో ఉండే పరమాణపు ఒకటే. 
    95. దీని అర్ధం ఏంటంటే మీరు కమ్యూనికేట్‌ చేసేటపుడు శ్రోతగా, వక్తగా ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవాలి.
    96. మీరు ఇతరుల స్ధానంలో ఉంటే ఎలా ప్రవర్తిస్తారో ఊహించండి. మీరు వ్రాసిన లేదా మాట్లాడిన విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే అందులోని అవరోధాలు, సవాళ్లు నివారించే వీలుండి కమ్యూనికేషన్‌ విచ్ఛన్నం అవకుండా చూడవచ్చు.
    97. విచ్చిన్నత అనేది జీవితంలోనే కాక కమ్యూనికేషన్‌లో కూడా ఎదురౌతుంది. వాటిని మనం సరియైన పదాలు, మాధ్యమం, నేపధ్యం, ప్రతిస్పందన ఎంచుకోవటం ద్వారా నివారించాలి.
    98. అవతలి వ్యక్తి కోసం, మాధ్యమాన్ని ఉపయోగించడంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు అది ఎలా స్పందిస్తుందో కూడా మనం గుర్తుంచుకోవాలి.
    99. ఈ విధంగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని, ప్రతిరోజూ నేర్చుకుంటూ, కమ్యూనికేట్‌ చేస్త్తూ, ఫీడ్‌బాక్‌ తీసుకొని, కమ్యూనికేషన్‌ మెరుగు పరచడం ద్వారా మీకు సంతృప్తి, విజయం, సమృద్ది కోసం పాటుపడ గలుగుతారు.
    100. ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని మీరు మంచి కమ్యూనికేటర్‌ అవుతారని, ఎలాంటి విచ్ఛిన్నత లేకుండా, విచ్చిన్నత ఏర్పడినా చక్కని పరిష్కారం ద్వారా దాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను.
    101. ధన్యవాదాలు!