softskill_Paralanguage-R11IjFu8Dj0.txt 57.8 KB
Newer Older
Vandan Mujadia's avatar
Vandan Mujadia committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266
    1. హలో.
    2. ఈ ఉపన్యాసానికి స్వాగతం.
    3. పూర్వపు ఉపన్యాసంలో మనం పదాలు లేకుండా ఎలా కమ్యూనికేట్‌ చేయగల వివిధ మార్గాల గురించి మాట్లాడాము. మనం సంభాషించేటప్పుడు ఉపయోగించే నాన్ వెర్బల్స్ కూడా ఉన్నాయి.
    4. అయితే మనం పదాలు వాడుతున్నాం.
    5. పదాలు వాడి నపుడు దానికి సంబంధించిన ప్రమాణాలు, అంశాలు ఎలా పదాలకు అర్దాన్ని కలిగిస్తాయో తెలుసుకోవాలి.
    6. ఆ అధ్యయనమే పారా లాంగ్వేజ్‌ మనం పదాలను, వాక్యాలను కూర్చుకొని వాటిని చక్కగా అర్దవంతంగా చెప్పాలని ప్రయత్నిస్తాం.
    7. అయితే కొంతమంది చక్కని స్వరంతో సంభాషిస్తారు.
    8. మనకు అసూయకూడా కలుగుతుంది.
    9. స్వరం కమ్యూనికేషన్‌ లో అంత ప్రాధాన్యత వహిస్తుందా? ప్రతి ఒక్కరి స్వరం విభిన్నంగా ఉంటుంది, ఏ ఇద్దరి స్వరం ఒకేలాగ ఉండదు.
    10. కొంత మంది బిగ్గరగా, కొంతమంది నెమ్మదిగా, మాట్లాడతారు.
    11. కొంత మంది వ్యాపార లావాదేవీల సాధనకై కరుకుగా మాట్లాడతారు.
    12. కాబట్టి స్వరం అనేది ముఖ్యమైనది.
    13. మనం తెలుసుకున్నట్లుగా మనం బాధలో ఉన్నప్పుడు మనస్వరం వేరుగా, సంతోషంగా ఉన్నప్పుడు సష్టంగా ఉంటుంది.
    14. మన స్వరం యొక్క భాష చాలా ముఖ్యమైనది.
    15. స్వరం అనేది దేవుడిచ్చిన వరం.
    16. అది అందరికీ లభించదు.
    17. బిగ్‌ 'బి' అమితాబ్‌ బచ్చన్‌ అంత మంచి ప్రత్యేకమైన స్వరం అందరికీ ఉండదు.
    18. మనలో ప్రతి ఒక్కరి స్వరానికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది.
    19. మన స్వరం కూడా మారవచ్చు.
    20. మన స్వరం ఉద్దేశపూర్వక, అనుద్దేశ పూర్వక సందేశాలు, భావాలను తెలుపుతుంది.
    21. మీరు ఊహించుకోండి, మీరు అలసిపోయి, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక సమావేశంలో లేదా కాన్ఫరెన్స్‌లో పాల్గొనవలసి వచ్చినపుడు మీ బాధ మీ స్వరంలో ఒక భాగమౌతుంది.
    22. మనం ఆ బాధని అధిగమించాలనుకున్నా అది సాధ్యపడదు.
    23. ఎందు కంటే నటన, మోసం చెయ్యలేరు.
    24. మీ భావాలు దాచటం సాధ్యం కాదు.
    25. కొన్నిసార్లు నిరాశ, నిస్పృహ, దుఃఖం వల్ల మనం సరిగ్గా మాట్లాడలేం.
    26. కాని మన సందేశం అందరూ సరిగ్గా విని అర్ధం చేసుకోటానికి మనం స్పష్టంగా మాట్లాడాలి.
    27. స్పష్టత కమ్యూనికేషన్‌ యొక్క నాణ్యతా చిహ్నం.
    28. మనం సరిగ్గా మాట్లాడితేనే స్పష్టత ఉంటుంది అయితే.
    29. అనారోగ్యంగా ఉన్న వ్యక్తి పదాన్ని స్పష్టంగా ఉచ్చరించలేడు.
    30. అలా మాట్లాడటానికి కొంత ప్రయాస అవసరం.
    31. మనం శబ్దాలు పలికేటపుడు అందులో అచ్చులు మరియు హల్లులు  ఉంటాయి.
    32. శబ్దాల ఉత్పత్తి ఒక ప్రక్రియ అందులో మూడు దశలు ఉంటాయి.
    33. మొదట్టి దశ ఆర్టిక్యులెటరీ, శ్వాసక్రియకు సంబంధించినది.
    34. మనం అచ్చులు లేదా హల్లు శబ్దాలు ఉత్పత్తి చేసేటపుడు శ్వాస వివిధ శ్వాసకోశ మార్గాల ద్వారా ప్రసరిస్తుంది.
    35. వాయునాళం, గొంతు, పళ్ళు, నాసిక ద్వారా పెదాలను చేరుతుంది.
    36. శబ్దం బయటికి వస్తుంది.
    37. మనం కొన్ని శబ్దాలు పలికేటపుడు పెదాలను అర్ద వృత్తాకారంగా తెరుస్తాము.
    38. కొన్ని శబ్దాలు మనం పళ్శు ఉపయోగించి పలుకుతాం.
    39. అవి ఫ్రికేటివ్స్‌ మరియు డెంటల్స్‌ మనం మాట్లాడేటపుడు ఉండాల్సిన స్పష్టత ఆర్టిక్యులేషన్‌ వలన వస్తుంది.
    40. మనం చెప్పాలనుకున్న విషయం నిజాయితీగా విస్పష్టంగా లేకపోతే అది ప్రేక్షకుల మీద ప్రభావం చూపించదు.
    41. కాబట్టి మీరు ప్రతి పదాన్ని స్పష్టంగా ఉచ్ఛరించి మాట్లాడాలి.
    42. మన సంభాషణలో వచ్చే ఒక సమస్య ఉచ్ఛారణ.
    43. మన గ్లోబల్ ప్రపంచంలో వివిధ దిశల నుండి వచ్చే మనుషులకు నేపధ్యాలు, అలవాట్లు ఉచ్ఛారణ విభిన్నంగా ఉంటాయి.
    44. ఆసియా వారి, అమెరికన్ల  ఉచ్చారణ వేరుగా ఉంటుంది.
    45. అమెరికన్ల ఉచ్చారణ చాలావరకు స్పష్టంగా ఉన్నప్పటికీ పాశ్చాత్య ప్రపంచంలో అది ఒకసారి కష్టతరంగా ఉంటుంది.
    46. మనం ఇతరుల కోసం కమ్యూనికేషన్ చేస్తాం కాబట్టి అది స్పష్టంగా ఉండి వారికి అర్ధం కాకపోతే అది వ్యర్ధం.
    47. కాబట్టి స్వరం అనేది చాలా ముఖ్యం.
    48. మనకి ఇంగ్లీషు మాతృభాషకాదు, ద్వితీయ భాష, కొన్ని దేశాలలో అది తృతీయ భాషగా కూడా నేర్చుకోబడుతుంది.
    49. కాబట్టి మనం మాతృభాష నుండి విదేశీ భాషలోకి అనువాదం చేసినపుడు కొన్ని లోపాలు, వైఫల్యాలు కలుగుతాయి.
    50. మనం వేరె దేశాల వారితో మాట్లాడేటపుడు వారి ఉచ్చారణ విభిన్నంగా ఉంటే మనం ఆశబ్దాలను సరిగ్గా విని అర్ధం చేసుకోవడం కష్టంగా ఉంటుంది.
    51. కాబట్టి కమ్యూనికేషన్‌లో ఒక లోపం ఏర్పడుతుంది.
    52. అయితే స్వరం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? ప్రతి మనిషి స్వరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది.
    53. మనం ప్రఖ్యాత స్వీకర్స్ ను అనుకరించాలని చూస్తాం.
    54. కాని అనుకరణల్లో విజయం సాధించలేం.
    55. మీరు చాలా ఉదాహరణలు చూసే ఉంటారు.
    56. లింకన్‌, చర్చిల్ కూడా తమ స్వరంతో సమస్యలు ఎదుర్కొన్నారు.
    57. వారి మాటలో స్పష్టత ఉండేది కాదు.
    58. కాని కొంత సాధన, శిక్షణ వలన ఈ లోపాల్ని అధిగమించారు.
    59. కాబట్టి స్వరం యొక్క లక్షణాలు ఏంటి? మొదటిది నాణ్యత.
    60. ప్రతి స్వరానికి ఇది విలక్షణంగా ఉంటుంది.
    61. మనం బిగ్గరగా, నెమ్మదిగా లేక నిదానంగా మాట్లాడుతాము.
    62. కొన్నిసార్లు అది ఇతరులకు అర్ధం కాదు.
    63. కాబట్టి ఒక ప్రసంగం లేదా ఉపన్యాసం ఇచ్చేముందు మనం ఖచ్చితంగా తనిఖీ చేసుకోవాల్సిన విషయం ఆడిబిలిటీ లేదా శ్రవణస్ధాయి.
    64. అది సరిగ్గా ఉందని నిర్ధారించుకోవాలి.
    65. మనం చాలా బిగ్గరగా కాని నెమ్మదిగా కాని మాట్లాడరాదు.
    66. కాని ఒక పెద్ద సమూహంతో మాట్లాడాలంటే చాలా శ్రద్ద వహించాలి.
    67. ఈ కాలంలో మైక్రోఫోన్లు ఉన్నాయి.
    68. అవి మన స్వరం నాణ్యతను పెంచుతాయి.
    69. అయితే సగం మాటలు మింగేసే అలవాటుంటే సంభాషణ సృష్టంగా ఉండదు.
    70. కాబట్టి మనలో కొందరు గొంతు సమస్యతో భాదపడుతున్నారు. 
    71. ఒక వ్యక్తి ఈ సమస్యతో భాదపడుతున్నపుడు, వారి స్వరం తక్కువ ప్రతిద్వనిని కలిగి ఉంటారు. 
    72. బహుశా కొన్నిసార్లు, అవతలి వ్యక్తిని అర్ధం చేసుకోవడం కష్టమవుతుంది.
    73. కొంతమంది స్వరంలో ఊపిరి బరువు వలన స్వర తంత్రులపై ఒత్తిడి కలిగి మాట బరువుగా వస్తుంది.
    74. ధ్వనిని ప్రసారం చేసినప్పుడు, నాసిక నుంచి గాలి వాయుమార్గం గుండా ఎలా వెళుతుందనే దాని గురించి మేము ఇప్పటికే మాట్లాడాము.
    75. ఇందువల్ల, ఎక్కువ గాలి వెళితే, అప్పుడు గొంతులో శ్వాస వస్తుంది.
    76. ఇది కొంతమందికి నాసిలైజేషన్ కలిగిస్తుంది.
    77. మరియు నాసిక నుంచి గాలి రావడం వలన ఈ సమస్య సంభవిస్తుంది.
    78. కొన్ని శబ్దాలు ముక్కు నుంది బయటకు వస్తాయి. అప్పుడు కొంతమంది దానిని ఉత్ప్తత్తి చేయలేక పోతారు.
    79. స్వరం యొక్క మరొక లక్షణం కఠినత్వం, ఇక్కడ గాలి ప్రవాహం భరించలేనిది మరియు శ్రోతలు లేదా వీక్షకులకు కూడా సమస్య కలిగిస్తుంది.
    80. కొంత మంది తమ పెదాలను దవడలను నెమ్మదిగా కదిలించటం వలన స్వరంలో మాటల్లో స్పష్టత లోపిస్తుంది.
    81. మనకు ఇలాంటి ఏ సమస్య ఉన్నా మనం దానికి ఏమీ పరిహారం లేదని బాధపడవద్దు. ప్రపంచంలో ప్రతి సమస్యకూ సమాధానం ఉంటుంది.
    82. ప్రపంచంలో ప్రతి సమస్యకూ సమాధానం ఉంటుంది. స్వరంలో ఎటువంటి సమస్య ఉన్న శిక్షణ తీసుకొని ప్రయత్నం చేస్తే తప్పకుండా మెరుగవుతుంది.
    83. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.
    84. ఈ సమస్యలతో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు, కాని శిక్షణ కారణంగా వారంతా తమ గొంతును సరిదిద్దుకుంటారు. చివరిది మొద్దుబారడం. మరియు ఇది స్వరపేటిక యొక్క వాపు వలన వస్తుంది, ఇది వాస్తవానికి వైద్య సమస్య యొక్క ఫలితం మరియు దీని కోసం మీరు వైద్యుడిని సంప్రదించాలి.
    85. ఇది వైద్య సమస్య కాబట్టి మందులు తీసుకొని స్పీచ్‌ థెరపిస్ట్‌  ని సంప్రదిస్తే ఉపశమనం కలుగుతుంది, పరిష్కారం దొరుకుతుంది.
    86. మనం మాట్లాడేటప్పుడు మన స్వర నాళాలు ఎలా కదులుతాయి. కొంత మంది చాలా వేగంగా మాటాడుతారు. దీని వలన వారు మాటలుమింగేస్తారు. ప్రేక్షకులకు సమస్యని సృష్టిస్తుంది.  
    87. కాబట్టి వారు నెమ్మదిగా స్పష్టంగా మాట్లాడితే ఈ సమస్యని మనం తగ్గించుకోవచ్చు. ఇది చాలా సులభం.
    88. మనం వేగంగా మాట్లాడితేనే విజయవంతమైన స్పీకర్‌ అవుతామని అనుకుంటే అది కేవలం భ్రమ మాత్రమే.
    89. మన మాటలు ప్రేక్షకులు అర్ధం చేసుకోలేకపోతే ఉపయోగం లేదు.
    90. కాబట్టి మీరు నెమ్మదిగా స్పష్టంగా మాట్లాడాలి. తద్వారా మీరు మాట్లాడుతున్న పదాలను ఇతరులు వినవచ్చు.
    91. 
    92. కొంత మంది మాట్లాడేటప్పుడు అనేక వ్యర్ధ శబ్దాలు ఆ,ఊ,ఉమ్‌ లాంటివి చేస్తుంటారు. వాటి వలన మన సంభాషణకి అంతరాయం కలుగుతుంది.
    93. మన స్వరాన్ని మనం మెరుగు పరుచుకోవాలి. ఇది శిక్షణ ద్వారా సాధ్యం. 
    94. విద్యార్ధులు అందరూ సెల్‌ఫోన్లు వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
    95. అయితే మీరు మీ సంభాషణ లేదా ప్రసంగాన్ని రికార్డు చేయడం మంచిది.
    96.  రికార్డు చేసినదాన్ని విని మీ స్వరంలోని లోపాలను మార్పు చేసుకోవచ్చు. 
    97. సంభాషణలోని సమస్యలను తెలుసుకొని వాటిని రిహార్సల్ ద్వారా మార్పు చేసుకోవచ్చు.
    98. మీరు మీ సంభాషణ లేదా ప్రసంగాన్ని రికార్డు చేయడం మంచిది.
    99. అయితే అన్ని పదాలు శబ్దాలు మనకు తెలిసినవి సులువుగా ఉండవు.
    100. మనకు పదాలు ఉఛ్చారణ తెలియకపోవటం వలన కష్టంగా ఉండవచ్చు.
    101. మనం నిఘంటువు, పదకోశం ఉపయోగించి ఉచ్ఛారణ తెలుసుకొని స్పష్టంగా పలకవచ్చు.
    102. మనం ఇబ్బందిగా గాని, పిరికిగా గాని అనుభూతి చెందరాదు.
    103. ఎందుకంటే మనం జీవితమంతా అభ్యసించవచ్చు.
    104. కొన్నిసార్లు గమనించినట్టయితే out to అనే పదం out అని, did not, didn't అని,  పలుకుతారు.
    105. ఇప్పుడు ఇది స్పీకర్లను కూడా అవమానిస్తుంది.
    106. ఇవి ఆర్టిక్యులేషన్‌ వల్ల వచ్చే సమస్యలు కాబట్టి మనం ప్రతి పదం స్పష్టంగా పలకాలి. తద్వారా ఎటువంటి సమస్య ఉండదు.
    107. మనలో చాలా మందికి వ్యక్తీకరణతో సమస్యలు ఉన్నాయి.
    108. మనకి ఉన్న ఆలోచనలను ఇతరులకి స్పష్టంగా తెలియచేస్తాము. 
    109. మీరు ఇతరుల ప్రయోజనం కోసం ఈ ఆలోచనను బాగా వ్యక్తీకరించవచ్చు.
    110. మన స్వరం స్థాయి అందరికి వినపడేలా స్పష్టంగా ఉండాలి. గంభీరంగా ఉండరాదు. ఆహ్లాదకరంగా ఉండాలి.
    111. వేగంగా లేదా కఠినంగా మాట్లాడితే అది చాలా అసహ్యంగా అనిపించవచ్చు.
    112. కాబట్టి, మీరు ఏమి చేయాలి, మీరు ఇతరులకు అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. మీ సంభాషణని అందరూ విని ఆనందించాలి.
    113. ఎందుకంటే మీరు ఏవరికోసమైతే ఇన్ని కష్పాలు పడి సమచారం సేకరించి ప్రసంగం తయారుచేసుకొన్నారో అది నిరుపయోగం అవ్వకుండా ఉండాలి.
    114. మేము వాల్యూం కు వచ్చాము.
    115. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా, మీరు ఏదో చెప్పినప్పుడు లేదా మరొక వైపు ఏదైనా చెప్పినప్పుడు, మీరు దానిని వినాలి, మన మాటల శబ్ద స్థాయిని ఆడిబిలిటీ అంటాము.
    116. మీరు వినగలగాలి. వాల్యూమ్ మన గొంతులోని శబ్దం లేదా మృదుత్వానికి సంబంధించినది.
    117. కొంతమంది స్వరం ఎంతో ఆకర్షణీయంగా ప్రభావ వంతంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటుంది.
    118. వారు తమ స్వరాన్ని ఉపయోగించే విధానం మిమ్మల్ని ఆకర్షిస్తుంది.
    119. చాలా మంది మిమ్మల్ని వారి మనీహరమైన స్వరమ్లో బంధిస్తారు.
    120. పూర్వకాలంలో టెలివిజన్‌ లేనప్పుడు అందరు రేడియో వినేవారు. వారి స్వరం విని అందరూ సమ్మోహితులయేవారు.
    121. ఉదాహరణకి మనం బిబిసి ఇంగ్లీష్ లేదా బిబిసి హిందీ లేదా బిబిసి బాంగ్లా ప్రసారాలు విన్నప్పుడు ఒక అందమైన ఆహ్లాదకరమైన స్వరం ఉంటుంది.
    122. అందమైన ఆహ్లాదకరమైన స్వరం కోసం  మనం ఎన్ని మైళ్లైనా ప్రయాణం చేయవచ్చు.
    123. మిత్రులారా మనంకూడా ఇలాంటి స్వరం పొందవచ్చు. 
    124. మన శబ్దస్థాయిని సరిగ్గా ఉపయోగించాలి.
    125. మన స్వరస్థాయి ప్రేక్షకులను బట్టి ఉంటుంది. కేవలం 20 లేదా 30 మంది ఉంటే మనం అరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు.
    126. ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు.
    127. అదే 100 లేదా 150 మంది ఉంటే పెద్దగా మాట్లాడాలి. కానీ ప్రస్తుత కాలంలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి.కాబట్టి సమస్య లేదు.
    128. మనం ప్రసంగం ఇచ్చే రూమ్ని బట్టి, శబ్ద ప్రసారాన్ని బట్టి తగిన ఏర్పాట్లు చేసుకోవచ్చు. స్వరాన్ని నియంత్రించుకోవచ్చు.
    129. పెద్దగా మాట్లాడితే మన స్వరం గరగర మంటుంది.
    130. కాబట్టి ఒక స్థాయిని మనం అనుసరించాలి, కొంతమంది ప్రఖ్యాత వక్తలు మొదట నెమ్మదిగా మాట్లాడినా తరువాత కొంత బిగ్గరగా మధ్యమ స్థాయిలో మాట్లాడుతారు.
    131. కానీ అవి కదులుతున్నప్పుడు, అవి వాటి స్థాయిని పెంచుతాయి.
    132. కొంతమంది వక్తలు తమ ప్రసంగమంతా ఒకే స్వరస్థాయిలో మాట్లాడుతారు. వారు మార్పులేనిదిగా కనిపించడం లేదా? అవి మార్పులేనివిగా మారతాయి. 
    133. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్వరంలో హెచ్చు తగ్గులు ఉంటాయి.
    134. దానినే మనం 'ఇన్‌టోనేషన్‌'  అంటాము.
    135. కాబట్టి మనం మన స్వరాన్ని సరిదిద్దుకుంటూ మన ప్రేక్షకులకు అర్ధం అయేలా, మరీకఠినంగా, గంభీరంగా లేకుండా మాట్లాడాలి. మీ వాయిస్ ఎప్పుడూ ఆకర్షణీయంగా లేదని మరియు చాలా కఠినంగా అనిపించదని చూడండి.
    136. మనం సంభాషించేటప్పుడు లేదా ప్రజా ప్రసంగం ఇచ్చేటప్పుడు మన స్వరస్థాయి, వేగం వేరేగా ఉండాలా? ఎలా మాట్లాడాలి. మీరు చాలా వేగంగా మాట్లాడితే లేదా చాలా నెమ్మదిగా మాట్లాడితే డెలివరీ తరచుగా లోపంగా మారుతుందని మీరు కనుగొంటారు.
    137. మనం నెమ్మదిగా మాట్లాడితే చివరి వరుసలో ఖాళీగా కూర్చున్న వారికి ప్రసంగం అర్ధం అవదు. 
    138. కాని అలా అని గటిగా మాట్లాడితే అది చివరి వరుసల వారికి వినిపించినా, ముందు వరుసల వారికి భరించలేనట్లుగా ఉంటుంది.
    139. రెండు పద్దతులు ప్రమాదకరమైనవి.
    140. కాబట్టి మధ్యస్థాయిలో స్వరం ఉండాలి.
    141. సమతుల్యం చేయడానికి ప్రయత్నించే ఒక రకమైన సంబంధాన్ని సృష్టించడానికి ప్రయత్నించాలి.
    142. మీరు చాలా బిగ్గరగా లేదా చాలా నెమ్మదిగా మాట్లాడలేదు.
    143. మీ స్వరస్థాయిని మీరు ప్రేక్షకుల సంఖ్య, నేపధ్యాన్ని బట్టి సంతులనం చేయాలి.
    144. అయితే ప్రజా సమావేశానికి వచ్చే అందరు ప్రేక్షకుల నేపధ్యం మనం తెలుసుకోలేము.
    145. వారందరు మనకు తెలియదు కాబట్టి వారిని మామూలు స్థాయి వారిగా తీసుకోవాలి.
    146. వారికి కొంత చదువు, అర్ధం చేసుకునే తెలివి ఉన్నాయని భావించాలి.
    147. మీరు ఈ ఆలోచనతో ముందుకు వెళితే ప్రసంగాన్ని విజయవంతంగా ఇవ్వగలరు.
    148. మనం ఒక పుస్తకం చదివేటపుడు మీరు మీ మనస్సు ప్రకారం ఆపవచ్చు. కానీ మీరు ఒక సమూహం లేదా ప్రజల సమూహంతో మాట్లాడుతున్నప్పుడు, అది అక్కడ జరగదు.
    149. అక్కడ వెనక్కి వెళ్లటానికి, వెనక్కి తీసుకోవటానికి ఏ బటన్‌ ఉండదు. మీ అందరికి మరియు శ్రోతలకు కూడా ప్రయోజనకరంగా ఉండేలా మనం సమతుల్యం చేసుకోవాలని మనమందరం జాగ్రత్తగా ఉండాలి.
    150. అప్పుడే మనకి ప్రేక్షకులకి మధ్య ఒక అవగాహన ఏర్పడి లాభకరంగా ఉంటుంది.
    151. ఇది మీకు ఎలా ఉపయోగకరంగా ఉంటుందని మీరు అడగవచ్చు.
    152. ఎలాగంటే మీరు వేగంగా మాట్లాడితే 20-30 నిమిషాల వరకు ఉండాల్సిన సమాచారం ముందే అయిపోతుంది.
    153. కొందమంది నేను 10-15 నిమిషాలు మాట్లాడిన తరువాత ఏం చెప్పాలో తెలియదని అనటం వింటూ ఉంటాం.
    154. ఈ సమస్య మన ప్రిపరేషన్ సరిగ్గా లేకపోవడం ఇంకా మన అంచానాలు విఫలమవటం వలన వస్తుంది.
    155. మనం సమయ నిర్వాహణ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సమయ నిర్వాహణ కమ్యూనికేషన్ ని ఏలా సమర్ధవంతంగా ప్రభావితం చెస్తుందో తెలుసుకుందాం.     
    156. తరువాత మనం టైం మానేజ్‌మెంట్‌ కమ్యూనికేషన్‌ ని ఏలా సమర్ధవంతంగా చెస్తుందో తెలుసుకుందాం. తన 
    157. ఒక ఉపాధ్యాయుడు లేదా స్పీకర్ ఒకే స్వరం శబ్దస్థాయిలో ప్రసంగం చేస్తేటప్పుడు అక్కడ మీరే ఉన్నట్లు ఉహించుకొండి.  
    158. అతను కదలడు.
    159. అతను తన స్వరాన్ని మార్చడు.
    160. అతను తన శబ్దస్థాయి మార్చకుండా హెచ్చుతగ్గులు లేకుండా మాట్లాడుతుంటే అందరికీ విసుగు కలుగుతుంది, నిద్రవస్తుంది బల్లపై తల ఉంచి నిద్రపోతారు.
    161. ఇది ఆ స్పీకర్‌ యొక్క విఫలత తెలియచేస్తుంది. కాబట్టి మీ ప్రసంగంలో వైవిధ్యత ఉండాలి.
    162. ప్రసంగంలో వైవిధ్యత ఉంటే అది నిద్రపోయేవాళ్లను కూడా తట్టి లేపుతుంది. 
    163. అది మన స్వరంతోనే సాధ్యమౌతుంది.
    164. మీ ప్రసంగం మధ్యలో మాట్లాడే విషయాలు క్లిష్టతరమైతే, మీరు నిదానంగా ఆలోచించి అర్ధం చేసుకుంటే మీకూ ప్రేక్షకులకు కూడా సులభంగా ఉంటుంది.
    165. మనం స్వరం, ఇంకా పిచ్‌  ను సరిగ్గా ఉపయోగించాలి.
    166. పిచ్‌ వైవిధ్యాలు ఏమిటి? నిమిషానికి ఎన్ని పదాలు మట్లాడాలి అని కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు.
    167. వాస్తవానికి, ఇది మీ మూలాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది మరియు సమూహం నుండి సమూహానికి మారుతుంది. మనం నిమిషానికి సుమారు 140-150 పదాలు మాట్లాడితే అందరికీ అర్ధం అవుతుంది.
    168. ఉన్నత స్థాయి సమూహంతో మాట్లాడేటప్పుడు మనం ఎక్కువ వేగం పెరుగుతుంది. కానీ ఇది అన్ని పరిస్థితులలో నిజం కాదు.  
    169. ఆ సందర్భం లో సరాసరి 130-150 పదాలు మాట్లాడవచ్చు.
    170. మనం లెక్కపెట్టుకోక పోయినా నిరంతరం సాధన చేయటం వలన మీకు జనంతో మాట్లాడటం కష్టతరం కాదు. 
    171. మనం సరియైన సంఖ్యలో పదాలు వాడి ప్రసంగం ఆహ్లాదకరం చేయవచ్చు.
    172. మీరు పిచ్ వైవిధ్యాల గురించి మాట్లాడేటప్పుడు, పిచ్ లో ఖచ్చితంగా వైవిధ్యం ఉంటుంది.
    173. మీరు మాట్లాడేవన్ని పూర్తి వాక్యాలు.
    174. మరియు పదాలను చేర్చడం ద్వారా వాక్యాలు ఏర్పడుతాయి.
    175. మనం ఒక వాక్యాన్ని మాట్లాడినప్పుడు అందులో ప్రతీ పదానికి ఒక భావం ఉంటుంది.
    176. మీరు ఒక వాక్యాన్ని మాట్లాడినప్పుడు మీరు అన్న్నిరకాల వాక్యాలను మాట్లాడుతారు. 
    177. కొన్నిసార్లు మీరు అడగాలనుకుంటున్నారు, కొన్నిసార్లు మీరు సలహా ఇవ్వాలనుకుంటున్నారు, కొన్నిసార్లు మీరు ఒక ప్రకటన చేయాలనుకుంటున్నారు,  కొన్నిసార్లు మీరు అభ్యర్థన చేయాలనుకుంటున్నారు.
    178. కొన్నిసార్లు మనం అభిప్రాయాలు తెలపటానికి  ఉపయోగించినప్పుడు మన టోన్‌లో మార్పువస్తుంది.
    179. మనం మాట్లాడేటప్పుడు మన స్వరతంత్రులు  శబ్దోత్పత్తికి  ఉత్పత్తిలో కంపిస్తాయి. 
    180. మనం మాట్లాడేటప్పుడు మన స్వరతంత్రులు  శబ్దోత్పత్తికి  ప్రకంపనం చెందటాన్ని 'ఇన్‌ఫ్లెక్షన్స్‌' అని అంటారు. 
    181. ఉదాహరణకు మీరు ఇక్కడికిరా, అటువెళ్లు, కొంచెం టీ తీసుకురా అనే వాక్యాలు మాట్లాడినపుడు ఒత్తిడి స్థాయి‌ మారుతుంది.
    182. కొన్నిసార్లు మీరు సమయం ఎంత అని ఒక ప్రశ్న అడుగుతారు. మన స్వరాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే, దాని వలన మన చెప్పాలనుకున్న భావం సరిగ్గా పలుకదు.  
    183. కనుక మన భావాలను ప్రదర్శించడానికి పిచ్‌ వేరియేషన్స్  అవసరం.
    184. ఈ పిచ్‌ వైవిధ్యాలు భావోద్వేగాలను వ్యక్తపరుస్తాయి. మరియు పిచ్‌ వైవిధ్యాలను ఉపయోగించినప్పుడు భావోద్వేగాలను వ్యక్తీకరించవచ్చు.
    185. మనం గాయకులు పాటలను సాధన చేసేటపుడు ఈ విషయాన్ని గమనించగలం.
    186. వారు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, దానిని రికార్డ్ చేస్తే వారి పిచ్  వైవిధ్యాలను ఒక స్థాయిలో కొలవవచ్చు.
    187. ప్రస్తుతం ఇవన్నీ యంత్ర పరికరాలలో కోలవవచ్చు. 
    188. ఈ భేదాన్ని మనం పైకి, క్రిందికి కదులుతుంటే చూడగలం.
    189. వైవిధ్యాలు మరియు ఈ వైవిధ్యాలు కనిపిస్తాయి.
    190. కాబట్టి స్వరంలో పిచ్ భేదం లేకపోతే ప్రసంగం విసుగు కలిగిస్తుంది. అర్ధం ఉండదు.
    191. కవితా పఠనంలో మనం కొన్ని పదాలను ఒత్తి పలుకుతాం.
    192. మనం సినిమాలు, నాటాకాల్లో వివిధ పాత్రలను పోషించేవారు  ఈ సూక్ష్మ నైపుణ్యాలను మరియు వైవిధ్యాలను తెచ్చి ఒక రకమైన ముద్ర ను సృష్టించడానికి ఈ స్ట్రెస్‌ వేరియేషన్‌ వాడుతారు.
    193. అది ప్రేక్షకులపై ప్రభావం చూపిస్తుంది.
    194. మిత్రులారా, మన స్వరంలో చాలా అవకాశాలు, లక్షణాలు ఉన్నాయి. వాటిని మనం సరిగ్గా ఉపయోగించుకొని, మన ప్రసంగంలో వైవిధ్యం ఉత్సాహం ఉండేలా చేసుకోవాలి.
    195. మీరు దీన్ని చేస్తున్నప్పుడు, మీ స్వరాలు గురించి మీరు తెలుసుకోవాలి.
    196. మేము ఆసియన్లము, ముఖ్యంగా భారతీయులలో అనేక రాష్ట్రాలు అనేక వాతావరణాల నుండి వచ్చినవారు ఉంటారు.
    197. ప్రతి 5 మైళ్లకు ఉచ్చారణ, ప్రతి 5 మైళ్లకు భాష మారుతూ ఉంటుంది.
    198. మనమంతా ఆంగ్లభాష రెండవ భాషగా నేర్చుకుంటున్నాం. మాతృభాష యొక్క ప్రభావం ఆంగ్లభాష పై ఎక్కువగా ఉంది.
    199. అందువల్లనే మనం మాట్లాడేటపుడు కొన్ని పదాలు సరిగ్గా పలకలేం. ఉచ్చారణ మారిపోతుంది. అయితే మనం ఈ సమస్య గురించి బాధ పడవద్దు.
    200. మన ముఖ్య ఉద్దేశము మన భావాలని తెలియజేయటమే. అది స్పష్టంగా ఉండాలి.
    201. దీనికై మనం అమెరికన్లను అనుసరించక్కరలేదు. కానీ మనము అనుసరిస్తున్న ఉచ్చారణను అనుసరించగలమో లేదో చూడాలి.
    202. మనం పాశ్చాత్య స్థానికుల లాగా మాట్లాడలేక పోయినా మన సంభాషణ అందరికీ అర్ధమయ్యేలా ఉండాలి.
    203. దీని కోసం సరైన ఉచ్చారణను అనుసరించండి.
    204. ఈ ఉచ్చారణను అనుసరిస్తున్నప్పుడు పదాలపై స్ట్రెస్‌ వివిధ రకాలుగా ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి.
    205. అవి నామ వాచకము, క్రియా పదము, విశేషణము, క్రియా విశేషణము, వీటన్నిటికీ స్ట్రెస్‌ వేరుగా ఉంటుంది. 
    206. ఈ స్ట్రెస్ ని   స్పీకర్‌ ఎలా ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది.    
    207. వాక్యాలలో కూడా స్ట్రెస్‌ ఉంటుంది. 
    208. స్ట్రెస్‌ మన భావాలు ప్రదర్శించడానికి తోడ్పడుతుంది. ఉదాహరణకి మనం ఆదివారం సెలవు అని చేప్పేటపుడు సెలవు అనే పదాన్ని స్ట్రెస్ చేస్తే వారి సంతోషం అందులో వ్యక్తమౌతుంది. మనం చెప్పాలనుకున్న అర్ధం తెలుస్తుంది.
    209. అయితే ఇది కేవలం సాధనతోనే వస్తుంది.
    210. మనం సాధన లేకుండా పదాలలో వాక్యాలలో సరైన స్థానంలో స్ట్రెస్‌ ఉంచలేము. కనుక సరైన పదాలను నొక్కి చెప్పాల్సిఉంటుంది.
    211. ప్రతి పదంలో కొన్నిఅక్షరాలు వస్తాయి. 
    212. ప్రతి పదాన్ని కొన్ని అక్షరాలుగా విభజించవచ్చు.
    213. మనం ఏ అక్షరం పై స్ట్రెస్‌ ఉంచాలో ఒక మంచి నిఘంటువు మీకు చెపుతుంది.
    214. వాక్యాలకు కూడా ఇదే పద్దతి పాటించాలి. మీరు ఈ విషయాన్ని నిఘంటువు ద్వారా తెలుసుకోలేక పోతే, కొన్ని టివి  ఛానెల్స్‌ లో విని నేర్చుకోవచ్చు.
    215. టివి  ఛానెల్స్‌ లో వారు స్ట్రెస్‌ మరియు శబ్దాలను చక్కగా ఉపయోగిస్తారు.
    216. ఉదాహరణకు మీరు ఎన్డిటివి, 'టైమ్స్‌ నౌ' ఛానెల్స్‌ చూస్తే అందులో చాలా ప్రఖ్యాత ఆంకర్లు ఉన్నారు. మంచి స్పీకర్సు కూడా ఉంటారు. వారి మాట్లాడే పద్దతి విని నేర్చుకోవడం ఒక అలవాటుగా చేసుకోవాలి.
    217. వినటం అనే ప్రక్రియ కేవలం శబ్దగ్రహణం కాదు.
    218. అది చక్కని వాతావరణం ఉంటేనే సాధ్యం. మనం సరియైన శబ్దాలు, పదాలు, వాక్యాల ఉచ్ఛారణ నేర్చుకోవాలి. 
    219. స్వరంలో వైవిధ్యం ద్వారా మనం అనుకున్న భావాల్ని, అర్ధాల్ని తెలియ చెప్పాలి.
    220. ఒక విద్యార్ధి తరగతికి ఆలస్యంగా వచ్చినపుడు ఎంతో వినయంతో 'నేను లోపలికి రావచ్చా? నాకు ఆలస్యం అయింది' అని ఉపాధ్యాయుని వద్ద అనుమతి తీసుకుంటాడు.
    221. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక అర్ధాన్ని వ్యక్తపరుస్తారు.
    222. అలాగే ప్రశ్నలు అడిగినప్పుడు ఒక అర్ధం అవ్యక్తంగా దాగి ఉంటుంది.
    223. సలహాలు ఇచ్చినప్పుడు వాటిలో కూడా ఒక అర్ధం అవ్యక్తంగా దాగి ఉంటుంది.
    224. సాయంత్రం అయింది జాగ్రత్తగా ఉండండి, త్వరపడండి వెళ్లే సమయం అయింది, మీ ఉపన్యాసం ముగించండి, మీరు ఇచ్చిన సమయాన్ని మించారు ఇలాంటి వాక్యాలు.
    225. ఈ విషయాలన్ని మాట్లాడేటప్పుడు దానిలో ఇప్పటికే కొన్ని అర్ధాలు ఉన్నాయని తెలుసుకుంటారు.
    226. కాబట్టి మీరు మీ స్వరాన్ని మాడ్యులేట్‌ చేసి అర్ధాన్ని సరిగ్గా చెప్పవచ్చు.
    227. ఉదాహరణకు ఆర్టికల్స్‌ a, an, the ప్రెపోజిషన్స్‌ కంజంక్షన్స్‌, ఆక్సిలరీ వర్బ్స్‌మొదలైన వాటిపై స్ట్రెస్ ఉండదు.
    228. మేము ది ని నొక్కిచెప్పమని ఎప్పుడూ చెప్పలేదు. అలాగే నామ వాచకము, క్రియా పదము, విశేషణము, క్రియా విశేషణము, వీటన్నిటికీ స్ట్రెస్‌ ఎక్కువగా తీసుకోకండి. 
    229. మన ధ్వని వ్యవస్ధ అంతా క్లిష్టతరంగా అనిపించినా, మనం సాధనతో మన స్వరంలో పిచ్‌,  వాల్యూమ్‌ సరి చేసుకొని స్పష్టంగా మంచి ఉచ్ఛారణతో మాట్లాడవచ్చు. అప్పుడు మీరు భిన్నంగా కనిపిస్తారు.
    230. మనలో ప్రతి ఒక్కరి స్వరం విభిన్నంగా ఉంటుంది. 
    231. ఒక సాధారణ వ్యక్తి మాట్లాడుతుంటే మరియు మీరు మాట్లాడితే, ప్రతి పదం మీద ఎంత ఒత్తిడి ఉంచాలో మీకు తెలుసు, సహజంగానే మీరు మరింత నిర్దిష్టంగా కనిపిస్తారు మరియు మీరు మరింత తెలివిగా కనిపిస్తారు మరియు మీరు కూడా మీ భావాలను వ్యక్తపరచగలరు. .
    232. మనం పడిపోయే అచ్చును ఉపయోగించి ఆదేశాలు ఇచ్చినప్పుడు.
    233. కనుక పడిపోయే స్వరం ఉందని తెలుసుకున్నాము. 
    234. మనం అభ్యర్ధనలు చేయటానికి రైజింగ్‌ టోన్ వాడతాము. ఉదాహరణకు నాకొక కప్‌ టీ ఇవ్వండి, మీరు ఎక్కడకు వెళ్లారు వంటి వాక్యాలు లో ఉంటాయి.
    235. మీరు నాతో ఒక కప్‌ టీ తాగుతారా? ఇప్పుడు టైమ్‌ ఎంత? ఇలాంటి వాక్యాలు కొన్ని సార్లు మనం 'టాగ్స్‌ కూడా ఉపయోగిస్తాము.
    236. అలాంటి సందర్బాలలో మీ స్వరం అకస్మాత్తుగా లేస్తుంది.
    237. మిత్రులారా మన ప్రసంగంలో నిశ్శబ్దం, విరామం కూడా ఒక ముఖ్య పాత్ర వహిస్తాయి.
    238. విరామం అంటే ఏమిటి? ఒక వ్యక్తి చాలా వేగంగా, నిరంతరంగా మాట్లాడుతుంటే అందరికీ చిరాకుగా ఉంటుంది. కాబట్టి విరామం  ప్రసంగంలో అవసరం. వచ్చే చిన్న నిశ్శబ్దం.
    239. ఉదాహరణకు నేను చెప్పేది ముఖ్యం, కానీ మీరు చెప్పేది కూడా తిరస్కరించబడదు.
    240. మనం మాట్లాడే వాక్యంలోని పదాల మధ్య ఖాళీ ఉంచితే అది విరామం అవుతుంది. అదే మనం మాట్లాడే వాక్యాల మధ్య, మనం ఇచ్చే అభిప్రాయాలు అర్ధం అవడానికి ఇచ్చే సుదీర్ఘ విరామాల్ని నిశ్శబ్దం అంటాము.
    241. ఉదాహరణకి ఎవరైనా చనిపోతారు అయ్యో' అతను మరణించాడు అని మీరు అంటారు.
    242. ఈ వాక్యం తరువాత నిశ్శబ్దం ఉంటే అది అర్ధవంతంగా ఉంటుంది.
    243. మన ప్రసంగం అనేక ఆలోచనల, అభిప్రాయాల సమాహారం. ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు మీ మొత్తం ప్రసంగం వాస్తవానికి చాలా విషయాల కలయిక.
    244. మనం ఒక అభిప్రాయం నుంచి ఇంకో అభిప్రాయానికి వెళ్లే ప్రక్రియలో విరామం ఇవ్వాల్సి ఉంటుంది.
    245. మనం ప్రసంగం చివరికి వచ్చేటప్పటికి మన స్వరంలో ఆ సంకేతం వస్తుంది. మరియు నెమ్మదిస్తారు.
    246. మనం పదాల ద్వారా కూడా ఈ సంకేతాన్ని ఇవ్వవచ్చు. ప్రసంగం మొదట్లో మరియు చివర్లో కూడా మనం ఈ విరామం ఇవ్వాలి.
    247. ఉదాహరణకి మనం మొదలు పెట్టినపుడు హలో! ఫ్రెండ్స్‌, ఇవాళ నేను స్వర లక్షణాల గురించి మాట్లాడటానికి ఇక్కడ ఉన్నాను. 
    248. అలాగే ప్రసంగం చివర్లో, ఈ చర్చ ముగించబోతున్నాను అని విరామం ఇవ్వాలి.
    249. అపుడు అది ప్రేక్షకులపైన మంచి ప్రభావం చూపుతుంది. మీరు విరామాలను సరిగ్గా ఉపయోగిస్తునారని తెలుస్తుంది.
    250. ఇక్కడ మనం మార్క్‌ ట్వైన్‌ చెప్పిన విషయం ఉద్ఘాటించాలి. సరియైన పదాలు సమర్ధవంతంగా ఉంటాయి, కాని ఎప్పుడైతే వాటిని విరామంతో పాటు సరిగ్గా ఉపయోగిస్తే ఇంకా సమర్ధవంత మౌతాయి.
    251. అయితే విరామం చిన్నగా ఉంటేనే విరామం. అది దీర్ఘంగా ఉంటే నిశ్శబ్దం అవుతుంది.
    252. అయితే మన ప్రసంగంలో నిశ్శబ్దం కూడా చాలా ముఖ్యం.
    253. మనం మన స్వరాన్ని మాడ్యులేట్‌ చేసినపుడు, మార్చినపుడు కొంత ఆగుతాం.
    254. ఆ నిశ్శబ్దాన్ని కూడా అందరూ అనువాదం చేస్తారు. నిశ్శబం అనేది అశాబ్దిక సంకేతం. దానికి ఒక అర్ధం ఉంటుంది. కొన్ని సంస్కృతులలో నిశ్శబ్దం అంటే 'ఒప్పుకోవడం' లేదా 'ఒప్పుకోకపోవడం' అనే అర్ధాలు ఉంటాయి. 
    255. మనం ప్రసంగంలో నిశ్శబ్దం ఉపయోగిస్తే, ఆ సమయంలో మనం మాట్లాడిన వాక్యాలని పునశ్చరణ చేసుకోవచ్చు.
    256. ఒక ప్రేక్షకుడిగా కూడా మన నిశ్శబ్దం మనం విన్న విషయాలు అర్ధం చేసుకోడానికి, జీర్ణించు కోడానికి ఉపయోగపడుతుంది.
    257. నిశ్శబ్దం మన ఆలోచనా ప్రక్రియకి దోహదం చేస్తుంది. మనం ఒకరితో మాట్లాడి నిశ్శబ్దం పాటిస్తే, మనం వారి ప్రతిచర్యను అర్ధం చేసుకోవచ్చు.
    258. నిశ్శబ్దం మనకి స్వీయ అవలోకనం చేసుకోవడానికి ఉపకరిస్తుంది.
    259. మన ఆలోచనలు మన గురించి, అవలోకనం చేసుకొని ఇతరుల గురించి ఆలోచించాలి.
    260. ప్రతి నిశ్శబ్దం వల్ల మనకు లాభం ఉంటుంది. మనం నిశ్శబ్దం తరువాత ఒక నిర్ణయం తీసుకోగలము. అయితే మన ప్రసంగంలో చేసే విరామం, నిశ్శబ్దం అనేది ఉద్దేశపూర్వకం. మనం ఎక్కువ మాట్లాడి తక్కువ అర్ధం చేసుకున్న దానికంటే నిశ్శబ్దంగా ఉండటం మంచిది.
    261. మనం ఈ ఉపన్యాసాన్ని పైథాగరస్ చెప్పిన నిశ్శబ్దం అర్ధం లేని మాటల కంటే మంచిది కొటేషన్‌తో ముగిద్దాం.
    262. ప్రతి నిశ్శబ్దం తరువాత కొత్త ఆరంభం ఉంటుంది. ఒక ఆలోచనా ప్రక్రియ మొదలౌతుంది. కొత్త తరం ఉంటుంది.
    263. నేను ఈ ప్రసంగాన్ని ముగించబోతున్నాను.
    264. కానీ ఈ నిశ్శబ్దం నన్ను తిరిగి తీసుకువస్తుంది మరియు మిమ్మల్ని తిరిగి తీసుకువస్తుంది మరియు నిశ్శబ్దం జోడించినట్లుగా పని చేస్తుంది. మనం అందరం కూడా ఈ నిశ్శబ్దం తరువాత మళ్ళీ కలుద్దాం.
    265. ధన్యవాదాలు!