softskill_Report Writing-E6sAk-KuPXA.txt 47.5 KB
Newer Older
Vandan Mujadia's avatar
Vandan Mujadia committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176
    1. శుభోదయం! సాఫ్ట్‌స్కిల్స్ ఆన్ లైన్ ఉపన్యాసాలకు పున స్వాగతం.
    2. మీకు గుర్తుండే ఉంటుంది, మనం ప్రస్తుతం రచన వ్రాసే విభాగం గురించి నేర్చుకుంటున్నాం.
    3. పూర్వపు ఉపన్యాసంలో ఒక వ్యక్తి తన రోజువారీ జీవితంలో, ఉద్యోగంలో ఉపయోగించే వివిధ రకాల రచనల గురించి చర్చించాం.
    4. ఇవాళ మనం రచనలో ముఖ్య అంశమైన నివేదిక వ్రాయడం గురించి నేర్చుకుందాం. అదే రిపోర్ట్ రైటింగ్.
    5. ప్రోఫెషనల్ గా మీరు నివేదికలు వ్రాయడం ఎందుకు నేర్చుకోవాలో,నివేదికలంటే ఏమిటి, వాటిని ఎలా వ్రాయాలని ఆలోచిస్తూ ఉండవచ్చు మన రోజువారీ జీవితంలో నివేదికలను చూస్తాం.
    6. ఒక వర్డ్ రిపోర్ట్ మీకు వస్తే వాటిని మనం విని లేదా చదివి ఇలాంటి అనేక నివేదికల గురించి ఆలోచించడం ప్రారంభించండి.
    7. ఊహించుకోండి, మీరు ఒక కారు కొనాలన్నా, ఒక కోర్సులో చేరాలన్నా, లేదా సంస్ధలలో పనిచేస్తూ పదోన్నతి లేదా ఇంక్రిమెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. 
    8. ఉద్యోగం కోసం అప్లై  చేసి ఇంటర్వ్యూ కోసం వేచి ఉన్నారు. అందరికీ ఒక నివేదిక అవసరం.
    9. ఒకోసారి కొత్త ఉత్పత్తి విడుదలైనా సరే, ఈ విషయాలకు సంబంధించిన చర్చలన్నీ నిర్ణయాలు తీసుకోడానికి తోడ్పడిన నివేదికలపై ఆధారపడతాయి. 
    10. నివేదికలంటే ఏమిటి, ఆ పదం ఎలా వచ్చింది,నివేదిక యొక్క నిర్దిష్ట అంశాలేంటి, ఈ విషయాలన్నీ మనం చాలా సూక్ష్మంగా, కూలంకషంగా చర్చిద్దాం.
    11. 'రిపోర్ట్ ' అనే పదం లాటిన్ పదం రిపోర్టేర్  ('reportaire)' నుంచి తీసుకోబడింది.
    12. ఈ పద నివేదికను విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం.
    13. దీని అర్ధంతెలుసుకుంటే మనం నివేదిక ఏంటో అర్ధం చేసుకుంటాం 'రిపోర్ట్' లో రెండు భాగాలున్నాయి.
    14. 'రిపోర్ట్ ' అనే పదానికి మూలాలు లాటిన్ పదం రిపోర్టేర్ లో ఉన్నాయి. ఇది రి మరియు పోర్టైర్ అనే రెండు పదాల కలయిక.
    15. రి అంటే పంపటం,  పోర్టైర్ అంటే మోసే వ్యక్తి అని అర్ధం.
    16. ఈ పదం యొక్క ఖచ్చితమైన అర్ధం ఏదైనా నిర్ధిష్ట సమయంలో లేని వ్యక్తి దగ్గరికి ఏదైనా పంపటం అని అర్ధం.
    17. ఒక రిపోర్ట్ సమాచారాన్ని వ్యక్తులకు చేరవేస్తుంది. కాబట్టి ఇది ఒక సమాచార ప్రసాధనం.
    18. మనం కమ్యూనికేషన్ గురించి వివరంగా చర్చించాం.
    19. అంటే నివేదిక ద్వారా సమాచారం కలిగిన వ్యక్తి, సమాచారం అవసరమైన వ్యక్తికి దాన్ని అందించటం జరుగుతుంది.
    20. మనమంతా సమాచార పూరిత ప్రపంచంలో నివసిస్తున్నాం. ఇక్కడ విషయాలు, విధానాలు మారుతూ ఉంటాయి. కొత్త విధానాలు, కొత్త ఉత్పత్తులు మార్కెట్లో విడుదల అవుతుంటాయి.
    21. మార్కెట్లో అప్పటికి లభించే వస్తువుల కంటే భిన్నమైనవి మనకి కావాలి. 
    22. ఆ మార్పులు నివేదికల సిఫార్సులపై ఆధారపడి ఉంటాయి.
    23. ఏ కొత్త విధానాన్ని అమలు పరిచినా, అది ఒక కమిటీ లేదా బృందం జరిపిన విస్తృత చర్చల తరువాతే సాధ్యమౌతుంది.
    24. ఆ బృందం ఏం చేస్తుంది? వారు ముఖ్యమైన సమాచారాన్నంతా పరిగణనలోకి తీసుకొని, లాభనష్టాలను బేరీజు వేసి చివరగా ఒక నిర్ణయానికి వచ్చి ముగిస్తారు.
    25. ఇపుడు ఒక నివేదిక యొక్క నిర్ధిష్ట ప్రమాణాలేంటో తెలుసుకుందాం.
    26. ఒక నివేదికని ఎలా నిర్వచించాలో మీకు మీరే చాలాసార్లు అడవవచ్చు.
    27. మీకుటుంబంలో ఒకరికి అనారోగ్యంగా ఉంది, వ్యాధి కారణం తెలుసుకోవడానికి డాక్టరు వద్దకు వెళతారు. ఆ అనారోగ్యానికి కారణం తెలుసుకోవడం కోసం.
    28. వైద్యుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని వైద్య పరీక్షల కోసం పంపిస్తాడు. ఎక్స్రరే (X-ray) ఇంకా ఇతర పరీక్షల కోసం పంపిస్తాడు. ఆ పరీక్షల నివేదికలు వచ్చిన తరువాత మీ వ్యాధికి కారణాన్ని వివరిస్తాడు.
    29. నేను చెప్పేదేమిటంటే నివేదిక అనేది ఒకరకమైన దర్యాప్తు లేదా పరీక్ష . ఆ పరీక్ష ఆధారంగా వచ్చిన ఫలితం మనకు ఒక నిర్ణయం లేదా పరిష్కారం తీసుకునే వీలు కల్పిస్తుంది.
    30. కాబట్టి నివేదిక లేదా రిపోర్ట్  అనేది ఒక నిర్ధిష్ట ఉద్దేశంతో వ్రాసిన కమ్యూనికేషన్.
    31. ఎవరైనా జబ్బుచేస్తే దాని కారణాలు తెలుసుకోవడానికి, ప్రత్యేక సిబ్బంది వద్దకు వెళ్తారు.వారు డాక్టరు లేదా నర్స్ కావచ్చు. వారు నిజానికి వివిధ ప్రక్రియలు, సమాచారాల్ని పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తారు.
    32. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం వ్రాసినపుడు ఆ విధానాల వర్ణన ఉంటుంది.
    33. వైద్యులు లేదా ఇంకెవరైనా కూడా ఈ విధానాలన్నీ పాటిస్తారు, మరియు కొని సందర్బాలలో కూడా వైద్యులు సిపార్సు చేస్తారు.
    34. మీరు చదువుతున్న కోర్సు, వింటున్న ఉపన్యాసం ఇది కూడా ప్రక్రియల శ్రేణికి దారితీయవచ్చు.
    35. ఒక నివేదిక తరువాత ఆన్లైన్ ఉపన్యాసాలుండాలనే సిఫార్సు కావచ్చు.  వీటన్నింటిని  మీరు వింటున్నారు.
    36. నిర్ధిష్ట శ్రోతల కోసం, ఒక నిర్ధిష్ట ప్రయోజనంతో తీసుకున్న చర్యలో విధానాల వర్ణన, తరువాత సమాచార సేకరణ విశ్లేషణ ఉంటుంది.
    37. మీరు ఒక పరీక్ష నిర్వహించిన లేదా తీసుకున్న తరువాత అనేక విధానాల ద్వారా డేటా సేకరించే వీలు కలుగుతుంది.
    38. ఆ డేటా సమాచారాన్ని అర్ధం చేసుకోవటానికి, డాక్టరు వివిధ రకాల డేటాను విశ్లేషించి ఒక పరిష్కారం తెలుసుకోటానికి సమయం పడుతుంది.
    39. తరువాత మీరొక నిర్ణయానికి వస్తారు.
    40. అవసరమైతే ముగింపు నుండి  సిఫార్సులు నుండి తీర్మానాలు తీసుకోబడ్డాయి.
    41. వచ్చిన ఫలితం డాక్టర్ కి తృప్తి కలిగించక పోతే అతను తులనాత్మక ఫలితం లేదా తులనాత్మక విశ్లేషణ కోసం మిమ్మలి వేరొక డాక్టరు  వద్దకు లేదా ఇంకొక నిపుణుడి వద్దకు పంపి వారిచ్చిన సమాచారాన్ని ఆధారంగా తీసుకుంటాడు.
    42. అది అతనికి లభించే డేటాపై కూడా ఆధారపడి ఉంటుంది.
    43. కాబట్టి ఒక నివేదికలో అత్యంత ముఖ్యమైనది డేటా లేదా సమాచారం.
    44. మనం కొన్ని కీలక పదాలను గమనిస్తే అవి మనకు నివేదిక యొక్క ప్రధానాంశాలు లేదా గుణాలను వివరిస్తాయి.
    45. నివేదిక అనేది ఒక అధికారక రచనగా చెప్పవచ్చు.
    46. ఇక్కడ జాగ్రత్త పడాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మీరు అధికార మరియు అనధికార కమ్యూనికేషన్, రెండూ చేస్తుంటారు.
    47. ఉదాహరణకు ఇద్దరు స్నేహితులు ఒకరితో ఒకరు మాట్లాడితే అది అనధికారకం. కాని అదే ఒక ఉద్యోగి తన బాస్ తో మాట్లాడితే అది అధికారకం.
    48. అలాగే ఒక నిర్దిష్ట ప్రయోజనంతో వ్రాసే రచనలన్నీ అధికారికమే.
    49. ఒక కొత్త ఉత్పత్తి ప్రారంభించబడుతుంది.
    50. కాబట్టి ముందుగా మనం కస్టమర్ యొక్క సంతృప్తి స్ధాయి, అవసరాలు, మార్కెట్ లో లభించే ఇతర ఉత్పత్తులు, వాటి లక్షణాలు, మీ ఉత్పత్తిలో లోపాలు ఇవన్నీ అర్ధం చేసుకోవాలి.
    51. మీరు ఒక కొత్త ఉత్పత్తిని ఖచ్చితంగా ఇవ్వగలమనే నిర్దారణ కలిగి ఉండాలి. కాని ఈ నిర్ణయం మీరు విస్తత సమాచార విశ్లేషణ జరిపిన ఫలితంపై ఆధారపడి ఉంటాయి.
    52. ఈ విషయాలన్నీ చాలా అధికార పద్ధతిలో వ్రాయబడి ఉంటాయి.
    53. కాబట్టి నివేదిక యొక్క మొదటి గుణం అది ఒక అధికారిక రచన. 
    54. అంతేకాకుండా ఇది వాస్తవం.
    55. ఒక నివేదిక వాస్తవిక రచన. డేటా:  మీరు తప్పు డేటాను  అందించలేరు ఎందుకంటే నివేదిక ఒక సంస్థ యొక్క రొట్టె మరియు వెన్న అని చెప్పబడింది. 
    56. సంస్థ ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు.
    57. అందువల్ల, ఒక వ్యక్తి అతను లేదా ఆమె చేయవలసిన దాని గురించి ఒక నివేదిక రాయబోతున్నప్పుడు, వారు ప్రతిదీ చాలా నిర్దిష్టంగా చేసుకోవాలి, తద్వారా తీసుకున్న నిర్ణయం సంస్థను లేదా ఒక వ్యక్తి యొక్క విధిని గుర్తించగలదు.
    58. అందువల్ల, డేటా మరియు ప్రేక్షకులు కూడా చాలా ఆబ్జెక్టీవ్ గా ఉండాలి. 
    59. మీరు ఒక నివేదిక రాసేటప్పుడు, ప్రతి ఒక్కరూ నివేదికను ఆస్వాదించలేరు, ప్రతి ఒక్కరూ ఒక నివేదికను అర్థం చేసుకోలేరు.అందువల్ల ఎవరైనా ఒక నివేదిక రాయబోతున్నప్పుడు, ప్రేక్షకులు ఎవరో వారు తెలుసుకోవాలి.
    60. మీకుపాఠకుల గురించి తెలిసి ఉంటే, ఇద్దరు వ్యక్తులకు పరిచయం ఉంటే వారి మధ్య కమ్యూనికేషన్ చాలా మృదువుగా, సులువుగా సాగుతుంది.
    61. కానీ, ఇద్దరు వ్యక్తులు అపరిచితులైతే, వారి నేపధ్యాలు తెలియక పోతే, వ్యాపారం కోసం అధికారకంగా వ్రాసిన రచనలో చిక్కులు ఏర్పడుతాయి వ్యాపార రచనలో భాష చాలా ముఖ్యపాత్ర వహిస్తుంది.
    62. ఒకే సంస్ధలో పనిచేసే ఇద్దరు వ్యక్తులకు వారి నేపధ్యాలు అర్ధం అవుతాయి, అక్కడ వాడే భాష, పదజాలం వారికి పరిచయం ఉంటుంది. కాబట్టి అనేక సార్లు చెప్పినట్లుగా ఇద్దరు వైద్యుల మధ్య కమ్యూనికేషన్ సులువుగా ఉంటుంది.
    63. అదే ఒక డాక్టరు, ఇంజనీరు మధ్య సంభాషణలో వారు వృత్తికి సంబంధించిన, రోజూవారీ పనిలో వాడే పదాలు ఉపయోగిస్తే ఆ శైలి వేరుగా ఉంటుంది.
    64. మీకు ప్రేక్షకుల గురించి తెలిసిఉంటే మీ పని సులువౌతుంది.
    65. మీరు ఒక కంప్యూటర్ ప్రోఫెషనల్ అయితే ఇంకోక కంప్యూటర్ ప్రోఫెషనల్ మాట్లాడేటపుడు అన్ని విషయాలు వివరించ నక్కరలేదు.
    66. ఏదైనా సమస్య గురించి మాట్లాడటానికి మీరు ఎంపిక చేసిన పదాలు, వ్రాయటానికి ఉపయోగించినవి అన్నీ అతనికి అర్ధమౌతాయి.
    67. కానీ అదే మీరు ఒక నాన్ కంప్యూటర్ ప్రోఫషనల్ లేదా సాంకేతిక జ్ఞానం లేని వ్యక్తి కోసం వ్రాసేటపుడు చాలా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వారికి చాలా పదాలు అర్ధం కావు.
    68. తరువాత నిర్ధిష్ట ఉద్దేశం.
    69. ఒక నివేదిక వ్రాయటానికి ఒక ఉద్దేశం తప్పక ఉండాలి.
    70. ఎవరైనా వెనువెంటనే నిల్చున్న పళంగా నివేదిక వ్రాయాలని నిర్ణయించుకోరు. దాని గురించి తరువాత చర్చిస్తాము.
    71. అయితే ఇతర రచనలు, అంటే లేఖలు వ్రాసేటపుడు అలా జరగవచ్చు.
    72. లేఖలు వ్రాయాలని అనుకుంటాం కాని, అవసరమైతేనే, ముఖ్యం అనుకుంటేనే నివేదిక రాయాలని ఎందుకు అనుకుంటాము?
    73. తరువాత నివేదిక వ్రాసేటపుడు, మీరు అనధికారిక లేఖ రాసేటప్పుడు చాలాసార్లు మీ, స్నేహితులకి వ్రాసే లేఖ గురించి ఆలోచించవచ్చు.
    74. అందువల్ల, మీరు నిర్ణయించుకోవచ్చు, కానీ అవసరం వచ్చినప్పుడు తప్ప, మీరే ఒక నివేదిక రాయాలని మీరు నిర్ణయించుకోలేరు, కాబట్టి ఇక్కడ ఒక నివేదిక అవసరమైనప్పుడు మాత్రమే వ్రాయబడటం చాలా ముఖ్యం ఉంది.
    75. తరువాత నివేదిక వ్రాసేటపుడు అది కేవలం ఒక కాగితం అని భావించరాదు.
    76. ఇది ఒక కాగితం కే పరిమితం కాదు. ఒక పేజీ మాత్రమే వ్రాయడానికి ఉద్దేశించబడింది. మనం వ్రాసే విషయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, వ్రాసే తరచుదనాన్ని బట్టి, నివేదిక యొక్క నిడివి ఆధారపడి ఉంటుంది.
    77. నివేదిక క్రమబద్ధంగా ఉండాలి. ఎక్కడో మొదలు పెట్టి, ఎక్కడో ముగించకూడదు. మంచి అమరిక కలిగి ఉండాలి.
    78. ఒక పద్ధతి ప్రకారం మొదట ఏం ఉండాలి, తరువాత ఏం వ్రాయాలి, చర్చ ఎక్కడ ఎలా ముగించాలి, సిఫార్సులు ఇవ్వాలా లేదా అనేది తెలియాలి.
    79. ఎవరైనా నివేదిక వ్రాసేటపుడు తమను ఆ నివేదిక చదివే పాఠకుని స్ధానంలో ఊహించుకోవాలి.
    80. ఒక పాఠకుడిగా మీరు నివేదిక చదివేటపుడు, ఒకటి రెండు పేజీల తరువాత అకస్మాత్తుగా విషయం మారినట్లు కనుగొంటారు.
    81. అపుడు ఆ నివేదిక చదవటం వ్యర్ధం అనుకుంటారు ఎందుకంటే మీ పఠనాసక్తతని అది నిరోధించింది. మీ ఆలోచనా ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేసి ఆపి వేసింది.
    82. కాబట్టి నివేదిక ఒక రకమైన ఐక్యత, పొందికను కలిగి ఉండాలి.
    83. ఇక్కడ ఐక్యత, పొందిక అంటే, ఉదాహరణకు మీరు ఒక ప్రత్యేక అంశంతో వాక్యం వ్రాస్తే అది టాపిక్ వాక్యం అనుకుందాం. అపుడు మిగిలిన వాక్యాలన్నిటినీ దీనితో అనుసంధానించాలి.
    84. అపుడే ఆ వాక్యాలకి ఐక్యత ఏర్పడుతుంది. అలాగే ఒక పేరాతో మరొక పేరాకి అనుసంధానం ఉండాలి. లేకపోతే అవి విడివడిన ఖండాలుగా అనిపిస్తాయి.
    85. మనమే కాదు, ఎపరూ కూడా ఇలాంటి తూనకలుగా ఉన్న రచన చదవాలనుకోరు.
    86. ఎందుకంటే ప్రత్యేకంగా ఒక నివేదిక చదువుతున్నప్పుడు నివేదిక ఒక సమస్యకి పరిష్కారాన్ని చూపించే నిర్ధిష్ట ఉద్దేశ్యంతో వ్రాయబడుతుంది.
    87. కాబట్టి సహజంగా ఒక పాఠకుడిగా ఎవరైనా నివేదిక చాలా మృదువైన పద్ధతిలో సాగాలని అనుకుంటారు.
    88. ఒకోసారి నివేదిక క్లిష్టంగా, భారీగా, గజిబిజిగా, కష్టతరంగా ఉంటే, నివేదిక వ్రాసే వ్యక్తి దాన్ని సులభతరంగా, అందరికీ అర్ధమయేలా వివరించడానికి, కొన్ని దృష్టాంతాలను ఉపయోగిస్తారు.
    89. ఈ దృష్టాంతాలు వివిధ రూపాల్లో ఉండవచ్చు. అంటే చార్ట్, గ్రాఫ్, పై చార్ట్(pie chart) లేదా టేబుల్ వంటిని ఉపయోగించి ఎలా స్పష్టంగా వివరించాలి అనే విషయాన్ని నివేదిక రూపాన్ని చర్చించినపుడు తెలుసుకుందాం.
    90. అయితే గ్రాఫిక్సి ని వాడటం వలన చాలా వివరణాత్మకత పెరుగుతుంది. కాబట్టి వీటిని నివేదికలో తప్పక వాడాలి.
    91. అంతేకాకుండా నివేదికని చక్కగా బైండ్ చేయించడం చాలా ముఖ్యం. లేకపోతే పేజీలు చిందర వందరగా విడిపోయి అల్లాడుతూ ఉంటాయి.
    92. బైండింగ్ వలన పేజీలు ఒక క్రమ పద్ధతిలో, వరుసలో ఉంటాయి.
    93. అలాగే నివేదిక అమరికలో మొదట ఒక కవర్ పేజీ ఉండాలి. దానిపై నివేదిక యొక్క శీర్షిక ఉండాలి. తరువాత వరుస క్రమంలో ఇతర పేజీలు వస్తాయి.
    94. కాబట్టి ఇవన్నీ నివేదిక యొక్క ప్రత్యేక, నిర్ధిష్ట అంశాలు.
    95. మనకు తరుచూ కలిగే ప్రశ్న, నివేదిక యొక్క ఉద్దేశ్యం. 
    96. నివేదిక ఏం చేయగలదు? ఒక సంస్ధలో పనిచేస్తున్న వారు లేదా ఒక సంస్ధలో ప్రవేశంచటానికి ప్రయత్నిస్తూ దరఖాస్తుచేసేవారు ఉంటారని మీకు తెలుసు. 
    97. ఇంటర్వూకు వెళ్లేముందు ఆ సంస్ధ గురించి సమాచారం తెలుసుకోవాలనుకుంటే, మీకు ఎలా తెలుస్తుంది. 
    98. వారి వెబ్ సైట్ లో నివేదికల రూపంలో వివరాలన్నీ పొందు పరచబడి ఉంటాయి.
    99. మీరు వాస్తవానికి ఈ వివరాలన్నింటిని కమ్యూనికేషన్ గా కాకుండా నివేదికగా ఉంచారు.
    100. ఈ నివేదికలలో ఉన్న సమాచారం మీకు ఎలాంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది? ఆ నివేదిక సంస్ధ సాధించిన పురోగతిని తెలుపుతుంది.
    101. కాబట్టి నివేదిక యొక్క ముఖ్యోద్దేశం సంస్ధ పురోగతిని ఎప్పటికప్పడు తెలియజేయటం.
    102. మీకు తెలిసిన పురోగతిని నవీకరించండి.ఇది సంస్థలకు మాత్రమే పరిమితం కాదని మీకు తెలుసు.
    103. మీరు స్వంత పురోగతిని చూడాలనుకుంటే అది నివేదిక ద్వారా కూడా జరగవచ్చు. అంటే మనని మనం అంచనా వేసుకోవచ్చు.
    104. నివేదిక యొక్క మరోక లక్ష్యం విశ్లేషించడం.
    105. ఉదాహరణకు ఐదు సంవత్సరాల డేటా తీసుకొని, అందులో 2011 లో పురోగతిని తెలుసుకోవాలనుకుంటున్నారు. మరియు ఈ రోజే తెలుసుకోవాలనుకుంటున్నారు.  
    106. కాబట్టి మీరు మిగిలిన నాలుగేళ్ల డేటాని తులనాత్మక విశ్లేషణ చేయాలి.
    107. కాబట్టి, ఇది మీకు ఒక రకమైన, తులనాత్మక విశ్లేషణను మాత్రమే అందించదు, ఇది తులనాత్మక విశ్లేషణను అందించడంలో మీకు సహాయపడుతుంది.
    108. అంతే కాకుండా ఉద్యోగాలు, వ్యక్తుల పోకడలను తెలుసుకొవాలంటే, సంస్ధలో ఏవైనా విధానపరమైన మార్పులు తీసుకురావాలంటే ఈ విశ్లేషణ ఆధారంగానే చేయగలుగుతారు.
    109. మన జీవితంలో ఇంకా సంస్ధలలో ఒకోసారి తప్పలు జరుగుతాయి.
    110. వాటిని సరి చేయడానికి, సరైన దారిలో పెట్టడానికి కొన్ని గడువులుంటాయి.
    111. అయితే ప్రతిసారీ గడువుల వల్ల సాధ్యం కాకపోవచ్చు. అపుడు సంస్ధలలో అనేక మంది వ్యక్తుల కూటమితో `కమిటీ' ని ఏర్పాటు చేసి వారిని ఈ సమస్యను పరిశీలించమని కోరుతారు.
    112. ఆ సమస్యను అర్ధం చేసుకోవడానికి కమిటీ వారు డేటాను పరిశీలించి ఒక ముగింపుకి వస్తారు.
    113. వారిచ్చిన సిపార్సుల ఆధారంగా సంస్ధలు చర్యలను చేపడతారు.
    114. కాబట్టి నివేదిక యొక్క నిర్ధిష్ట ఉద్దేశ్యం సంస్ధను సరియైన దారిలో నడిపించడం.
    115. ఎందుకంటే క్లిష్ట పరిస్ధితులలో సమస్యను అర్ధం చేసుకొని చర్యల ద్వారా ఏరకమైన అవాంచనీయ సంఘటనలు జరగకుండా నివారించడం అత్యవసరం.
    116. ఒక సంస్ధ సభ్యుడిగా మీకు తెలిసిన విషయాలకంటే ఇంకా సమగ్రంగా తెలుసుకోవాల్సిన అన్ని విషయాలను నివేదిక తెలియజేస్తుంది.
    117. ఇతర వ్యక్తులకు కూడా సంస్ధకు సంబంధించిన అన్ని విషయాలు నివేదికల ద్వారానే తేలుస్తాయి.
    118. కాబట్టి నివేదికల ద్వారా సంస్ధ అంతర్గతంగా మరియు బహిర్గతంగా కూడా సమాచారాన్ని వ్యాపింప జేయవచ్చు.
    119. ప్రతి సంస్ధలో ఉండే వాటాదారులు మరియు షేర్ హొల్డర్స్  ఉంటారు. 
    120. వారు ఎప్పటికప్పడు సంస్ధ పురోగతి గురించి తెలుసుకోవాలంటే అది నివేదిక వలననే సాధ్యపడుతుంది.
    121. అలాగే నివేదిక వ్రాసేటపుడు అవి ఎలా ఫలవంతం అవుతాయో తెలుస్తుంది.
    122. ఉదాహరణకు ఒక సంస్ధలో అగ్ని ప్రమాదం జరగవచ్చు, లేదా భారీ నష్టం రావచ్చు. అపుడు ఒక కమిటీని ఏర్పరచి, కారణాలు, అవసరమైన నివారణ చర్యల గురించి తెలుసుకోవడానికి తప్పక నివేదిక వ్రాయాల్సి ఉంటుంది.
    123. నివేదిక ఆధారంగా మన తార్కికతలో ఉన్న ఖాళీల గురించి కూడా తెలుసుకోవచ్చు.
    124. ఇవి మనం ఊహించలేం. మన ఆలోచనా ప్రక్రియలో మనం వినియోగదారుల అవసరాలు, మరియు అంచనాలను విశ్లేషించడంలో విఫలం అయితే, దాని ఆధారంగా తీసుకున్న నిర్ణయం వలన సంస్ధ పనితనం ప్రభావితమౌతుంది.
    125. కాబట్టి నివేదిక ముఖ్యద్దేశం పురోగతిని పోల్చిచూసి అవి ఆలోచనల ద్వారా ఎలా ఫలవంతం అవుతాయో తెలుసుకోవటం, మరియు ఈ నివేదికలన్నీ వ్రాతపూర్వకంగానే ఉన్నాయి.
    126. తరువాత విభిన్న రకాల నివేదికల గురించి తెలుసుకుందాం.
    127. నివేదిక లిఖిత రూపంలో అనేక విశేషాలను, సిపార్సులను నమోదు చేస్తుంది.నివేదిక యొక్క నిర్వచనంలో అది డేటాపై ఆధారపడి ఉంటుందని అన్నాం.
    128. అయితే డేటా ఏం చేస్తుంది? విశ్లేషణ ద్వారా ముగింపు చేరుకోడానికి సహాయపడ్తుంది.
    129. అయితే అందుబాటులో ఉన్నడేటా ప్రకారమే ముగింపు చెప్పగలం.
    130. కానీ ఒక తెలివైన, శ్రద్ధ, జాగ్రత గల నివేదిక రచయిత ఉన్నసమాచారం ఆధారంగా సిఫార్సులు చేస్తాడు. 
    131. అంతేకాకుండా, ఆటంకాలు విపత్తులు తొలగించటానికి ఏమి చేయవచ్చో ఆ సూచనలు కూడా తెలుపుతాడు.
    132. కాబట్టి ఒక నివేదిక అవగాహన సృష్టించటానికి కూడా తోడ్పడుతుంది. 
    133. మీ సంస్ధలో కొంతమంది సహొద్యోగులు చాలా త్వరగా పదోన్నతి పొందారు, మీకు పదోన్నతి రాలేదని తెలుస్తుంది.
    134. అపుడు మీరు మీ గురించి, మీ సహొద్యోగుల గురించి తులనాత్మక విశ్లేషణ చేసుకోవచ్చు.
    135. మీ ఇద్దరి పురోగతిని పోలిస్తే మీలో లోపాలేమిటో, అవతల వ్యక్తిలా ఎలా రాణించాలో తెలుస్తుంది.
    136. ఇది ప్రజలలో అవగాహనను నిర్ధారిస్తుంది. కాబట్టి మనకు స్వీయ అవగాహన ఇంకా స్వీయ అంచనా పోందే అవకాశం కలుగుతుంది.
    137. ఆ విశ్లేషణ ఆధారంగా మీరు పదోన్నతి పొందడానికి అవసరమైన చర్యలను తీసుకొని ఫలితాన్ని పొందాలి.
    138. అయితే నివేదిక రచన, ఇతర రచనలకంటే ఏ విధంగా భిన్నంగా ఉంటుంది ? 
    139. లేఖలు వ్రాయడం గురించి నేర్చుకున్నాం.
    140. అయితే నివేదికలు సాహిత్యరచనల మధ్య ఉన్న భేదాన్ని గురించి తెలుసుకుందాం.
    141. కొందరు చేతన భగత్ వ్రాసిన పుస్తకాన్ని, కొందరు అశోక్ భ్యాంకర్ పుస్తకాన్ని లేదా ఇతర రచయితల పుస్తకాలను చదువుతారు.
    142. నివేదిక రచనతో సాహిత్యాన్ని పోల్చినట్లయితే చాలా తేడాలుంటాయి.
    143. సాహిత్యం లాగా, వ్రాయాలనే కోరిక వలన నివేదిక వ్రాయలేం.
    144. కేవలం డిమాండ్  వలన వ్రాయగలం.
    145. మన స్వంత చొరవ వలన సాహిత్యం వ్రాయగలం కాని డిమాండ్ వలన నివేదిక వ్రాయవచ్చు.
    146. మీరు ఉదయం నిద్రలేచి అందమైన నీలి మేఘాలు వర్షించేట్లు ఉన్న ఆకాశాన్ని చూసి స్పందించి రచనలు చేస్తారు.
    147. ఇది నిజంగా మీకు సాహిత్య అనుభూతిని కలిగిస్తుంది మరియు మీకు వ్రాసినట్లు అనిపిస్తుంది. కాని అలా నివేదిక వ్రాయలేం.
    148. అలాగే సాహిత్యరచనకి నిర్ధిష్టమైన పాఠకులు ఉండరు. ఆ పుస్తకాన్ని , మీస్నేహితులు, బంధువులు, తల్లితండ్రులు ఇలా ఎవరైనా చదవవచ్చు. నా ఉద్ద్యేశ్యం ప్రకారం ప్రేక్షకుల వర్గీకరణ లేదు.
    149. కాని నివేదికను నిర్ధిష్ట పాఠకుల కోసం, ప్రత్యేక ఉద్దేశంతో వ్రాస్తాము. ఎందుకంటే ఇది అవసరము. ఆధారితమైనది. దీనికి ఒక నిర్ధిష్ట ప్రయోజనం ఉన్నది. 
    150. కాబట్టి పాఠకులు, ప్రయోజనాలు మారుతాయి.కానీ లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి.
    151. సాహిత్య రచనకు నిర్ధిష్ట నిర్మాణత ఉండదు.
    152. ఒక పద్యంలో 14 పంక్తులు, వేరొక పద్యంలో 20 పక్తులు, ఒక పుస్తకంలో 100 పేజీలు లేదా 200 పేజీలు ఉండవచ్చు.
    153. కాని ఒక నివేదికకు నిర్ధిష్ట నిర్మాణత ఉంటుంది.
    154. అంటే ఒక సరియైన ప్రారంభం, సరియైన చర్చ ఇంకా సరియైన ముగింపు ఉండాలి.
    155. కనుగొన్న విషయాలు తార్కికంగా ఉండి, డేటాకు మద్దతు నిచ్చి,తీర్మానాలు చేయడంలో సహకరించాలి. కాబట్టి నివేదిక లక్ష్యపూరితంగా, సాహిత్యం విషయ పూరితంగా ఉంటాయి.
    156. ఇక భాష విషయానికొస్తే, చాలా ప్రత్యేకతలున్నాయి.
    157. నివేదిక వ్రాయడానికి ఉపయోగించే భాష చాలా సరళంగా, సులువుగా ఉండాలి. సాహిత్య ప్రక్రియలు, క్లిష్టమైన పదజాలం అలంకార పదాలు, అతిశయోక్తులు ఇవన్నీ సాహిత్యంలో తప్ప నివేదికలో ఉపయోగించలేము. నివేదిక చాలా సూటిగా, నిజాలతో నిండిన శైలిలో వ్రాయబడాలి.
    158. నివేదికను చదివే ముఖ్యోద్దేశం సమాచారం పొందడానికైతే, సాహిత్యాన్ని ఆనందం పొందడానికి చదువుతాం.
    159. ఒక నాటకాన్ని చదివినా, చూసినా, నవలచదివినా, సినిమా చూసినా ఒక సంతృప్తి పొందుతాము. అది మనకు నివేదిక చదవడం వలన కలగదు.
    160. ఇక్కడ మీకు సమాచారం మాత్రమే అవసరం...  వేదిక చదివితే ఒక విషయం ఎలా జరిగింది, దాని పై తీసుకోవాల్సిన చర్య ఇలాంటివి ఉంటాయి. సాహిత్య రచనకి ఇలాంటి విషయాలు అవసరం లేదు. 
    161. కాబట్టి లక్ష్యాలు వేరు.
    162. రెండు రకాల రచనలో ఉన్నవిబేధాల్ని తెలుసుకోవడం తప్పనిసరి. నివేదిక ఖచ్చితమైన నియమ నిబంధనలకు పరిమితమై ఉంటుంది. కాని సాహితీ రచనలకు కొంత స్వయం ప్రతిపత్తి ఉంటుంది, ఒక యాదృచ్ఛికత, ప్రవాహ శైలి ఉంటుంది. కాని నివేదికలో చాలా విభాగాలు ఉంటాయి.
    163. ఒక నివేదిక నిర్మాణం గురించి మాట్లాడేటప్పుడు, దాని నిర్మాణాత్మకత ఇతర రచనల కంటే భిన్నంగా ఉంటుంది.
    164. అధికారికత కూడా ముఖ్య లక్షణమే.
    165. ముగించే ముందు మనం గమనించవలసిందేంటంటే నివేదిక అనేది ఒక ప్రోఫెషనల్  యొక్క ఏకైక ప్రత్యక్ష ఉత్పత్తి.
    166. ఎందుకు ప్రత్యక్ష ఉత్పత్తి, ఎందుకంటే నివేదిక రచనల విచారణ, పరీక్షయే కాకుండా, ఒక వ్యక్తి సమస్యను ఎలా విశ్లేషించి, పోల్చిచూసి, పరిశోధన ద్వారా సాధించే ఫలితాలు, అతని ఉన్నతాధికారుల దృష్టిలో ఎలాంటి విలువ కలిగి ఉంటాయో తెలుపుతాయి.
    167. తరువాతి ఉపన్యాసాలలో మీరు వ్రాసిన నివేదికలను చదివి వివిధ పాఠకులు ఎలా భిన్నంగా స్పందిస్తారో తెలుసుకుందాం.  ఎందుకంటే మీ నివేదిక ప్రేక్షకులు లేదా మీకు నివేదించిన బ్యక్తులు వేర్వేరు ప్రతిస్పందనలను కలిగి ఉంటారు.
    168. ఇప్పడు ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం నివేదికవలన ఎలా ప్రభావిత మౌతుందో చూద్దాం. మీరు వ్రాసిన నివేదిక ఆధారంగా మీ సంస్ధలో ఉద్యోగుల పైన చర్య తీసుకో బడుతుంది, వారు ప్రభావిత మౌతారు.
    169. కాబట్టి నివేదిక రచయిత తను ఏం చేస్తాడో, ఎంచుకున్న పద్ధతి గురించి సృష్టతతో వ్రాయాలి. ఎందుకంటే స్పష్టత అనేది నివేదిక మరియు అన్ని వ్యాపార కమ్యూనికేషన్లకు నాణ్యతా ప్రమాణం.
    170. రచయిత తన నివేదిక యొక్క ప్రాముఖ్యతని తెలియజేయాలి.
    171. ఎందుకంటే ఒక ఉద్యోగి లేదా ఇంజనీర్ తన లిఖిత నివేదిక ద్వారానే మానేజ్మెంట్ తో పరిచయం కలిగి ఉంటాడు.
    172. కాబట్టి మీరు వ్రాసే నివేదిక మీ భాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా మీ తార్కికత, శాస్త్రీయవైఖరి, చొరవ, తెలివితేటలు తెలియజేయాలి.
    173. మిత్రులారా, తరువాతి ఉపన్యాసంలో నివేదికలో రకాల గురించి తెలుసుకుందాం.
    174. ఈ ఉపన్యాసం మిమ్మల్ని నివేదిక వ్రాయడానికి తయారుచేసిందని అనుకుంటాను.ఎందుకంటే మీ యొక్క మరియు సంస్ధ యొక్క అదృష్టం, భవిష్యత్తు మీరు చక్కగా, జాగ్రత్తగా వ్రాసే నివేదికలపై ఆధారపడి ఉంటుంది.
    175. ధన్యవాదాలు!